23, జనవరి 2019, బుధవారం

సమస్య - 2909 (పదములు లేకుండ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పదములు లేకుండఁ గవిత వ్రాసినఁ గవియౌ"
(లేదా...)
"పదములు లేక సత్కవిత వ్రాసినవాఁడె కవీశ్వరుం డగున్"

124 కామెంట్‌లు:

  1. చదువ మది కడు మురియవలె
    కద పండిత పామరులకు కవనములనగన్!
    హృది మరువక నిది కఠినపు
    పదములు లేకుండ గవిత వ్రాసిన కవియౌ

    రిప్లయితొలగించండి
  2. బెదరక దుర్కర ప్రాసను
    కుదురుగ సొంపైన విధము కూర్చుచు యతులన్
    సదమల రీతిని నాంగ్లపు
    పదములు లేకుండఁ గవిత వ్రాసినఁ గవియౌ

    రిప్లయితొలగించండి


  3. సదనమున శంకరులు కై
    పదమివ్వగ నా జిలేబి ప్రత్నపు శతక
    మ్ము దయ పదముల జొనిపి తన
    పదములు లేకుండఁ గవిత వ్రాసినఁ గవియౌ!

    :)

    జిలేబి
    (కొట్టు రమణి :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రత్నపు'... ఎక్కడ దొరుకుతాయండీ ఈ పదాలు మీకు?
      *****
      శంకర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శంకర్ గారూ,
      మీరు ఇతరుల పూరణల క్రింద ఉన్న 'ప్రత్యుత్తరం'ను క్లిక్ చేయకుండా, ఈ పేజీ అట్టడుగున ఉన్న 'మీ వ్యాఖ్యను నమోదు చేయండి' అన్న బాక్సులో మీ పద్యాలను పెట్టండి.

      తొలగించండి
    3. హృదయముగంతులేయవలెయెవ్వరిడెందము గుందకుండ స
      త్పదమునుజూపుమాధవునిపాదసరోజముబాడుపద్యమే
      వదనపుభూషయౌనిజముభావసుధాపగగంతులేయ ని
      *ష్పదములు లేక సత్కవిత వ్రాసినవాఁడె కవీశ్వరుం డగున్*"

      తొలగించండి
    4. జిలేబీయములు:

      ఆకాశంబున నుండి వ్రాలు గదరా హైరాన జేయంగ నన్

      తొలగించండి
    5. శంకర్ గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
      'గంతులేయవలె నెవ్వరి...' అనండి. 'నిష్పదములు' అర్థం కాలేదు.

      తొలగించండి
    6. @జిలేబి
      పత్నపు పదమును బట్టిరి
      యత్నము లెటు కుదురు మీకు నాహా! ఓహో!
      🐒😄👏🏻👌🏻🙏🏻💐

      తొలగించండి

    7. విట్టుబాబు గారి విట్టున కేది దీటు :)


      జిలేబి

      తొలగించండి
  4. సదమల హృదయము తోడను
    నుదయమ్మున భక్తి మీర నుతియించి మదిన్
    చదువుల తల్లిని తలచుచు
    పదములు లేకుండఁ గవిత వ్రాసినఁ గవియౌ

    రిప్లయితొలగించండి
  5. ఊరకే! ఏమీ తోచక....నా కపిత్వం!
    🐵🐵🐵🐵🐵🐵🐵🐵🐵🐵🐵

    అదిగో! ఇదిగో! యెదిగో
    మది గోవదిగో చెదలగొ మాసిన దదిగో
    చదువరి! యిటు లర్థమవని
    *"పదములు లేకుండఁ గవిత వ్రాసినఁ గవియౌ"*

    రిప్లయితొలగించండి
  6. పదుగురు మెచ్చని, వారల
    హృదయమ్ముల గాయపఱచ హితదూరములై
    పొదలెడి సంస్కార రహిత
    పదములు లేకుండఁ గవిత వ్రాసినఁ గవియౌ.

    రిప్లయితొలగించండి
  7. చదువరు లందరున్ దలల
    జక్కగ నూపెడి భావసంపదల్ ;
    హృదయము నందు జేరగల
    స్మృత్యములౌ బహుపాత్రచిత్రణల్ ;
    సదమలమౌ రసంబులును ;
    శయ్య ; లలంకృతు ; లుంచి యెట్టి దు
    ష్పదములు లేక సత్కవిత
    వ్రాసినవాడె కవీశ్వరుండగున్ .

    రిప్లయితొలగించండి
  8. పదికాలమ్ములు పాఠక
    హృదయమున నిలిచు సమాజ హితకారకమై
    సదమలమై పర భాషా
    పదములు లేకుండఁ గవిత వ్రాసినఁ గవియౌ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిలుచు' టైపాటు.

      తొలగించండి
    2. విరించి వారు!
      మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

      తొలగించండి
  9. సవరించిన పూరణ
    సదమల హృదయము తోడను
    నుదయమ్మున భక్తి మీర నుతియించి మదిన్
    చదువుల తల్లిని కాదను
    పదములు లేకుండఁ గవిత వ్రాసినఁ గవియౌ

    రిప్లయితొలగించండి


  10. సదనపు కైపదమ్ములకు చక్కగ భారత గాధలన్ సదా
    మదిని మధించి వ్రాయవలె మాదిరి యై నిలువన్ జిలేబులూ
    ర! దవగడైన చెత్తయు, వరానన డాంబిక మున్ డమారమౌ
    పదములు లేక సత్కవిత వ్రాసినవాఁడె కవీశ్వరుం డగున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అదునుననాటినట్టిహృదయాంకురమోపదబీజమంచు శా
      రదవచనామృతంబునిడి బ్రహ్మపుటెర్కతలక్ష్యమైసదా
      పదములకంచెతోరసపుబంధనమున్నిడగాయు,బుర్వులన్
      "పదములు లేక, సత్కవిత వ్రాసినవాఁడె కవీశ్వరుం డగున్"
      సదమలతోటమాలిపదశారదయౌగదగాళిదాసునౌ

      తొలగించండి
    2. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ పద ప్రయోగ వైచిత్రికి నమస్సులు!
      ***********
      శంకర్ గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
      (మళ్ళీ జిలేబీ గారి పూరణ క్రింది 'ప్రత్యుత్తరం'లో పోస్ట్ చేసారు.)

      తొలగించండి
    3. సార్! చెప్పాను మొన్న:

      "Nobody can write like Zilebi!"

      తొలగించండి

    4. జీపీయెస్ వారు కంది వారు

      నమో నమః :)

      జిలేబి కి ఆది మూలము తాడిగడప అయ్యవారు :) వారి జిలేబీ శతకము enjoy మాడి :)


      లింకు

      http://funzilebi.blogspot.com/2013/02/blog-post.html


      జిలేబి

      తొలగించండి
  11. పదుగురు మెచ్చె డు విధముగ
    పదునగు భావాలు . నింపి పాండిత్య ము తో
    నె ద లను తాకుచు వ్యర్థ పు
    పదము లు లేకుండ కవిత వ్రాసిన కవి యౌ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  12. శంకరాభరణం..23/01/19

    సమస్య:

    "పదములు లేక సత్కవిత వ్రాసినవాఁడె కవీశ్వరుం డగున్"

    నా పూరణ. . చం.మా.
    *** **** **** **

    పదిలములైన భావనలు భాసురమౌ కడు న్యాయధర్మముల్

    మధురపు నీతి సూక్తులును మాధవ సన్నిధి జేర్చు భక్తియున్

    పదబడి జారువారుచును వ్యర్థ నిరర్థక హీన దుష్టమౌ

    పదములు లేక సత్కవిత వ్రాసినవాడె కవీశ్వరుం డగున్


    🌱ఆకుల శాంతి భూషణ్🌱
    🌷వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పదపదమున హృదయమునిడి
      గదిలెడునదివలె యెదసొదగరుగగ పదముల్
      గుదురుగబొదగగ వ్యర్థపు
      *పదములు లేకుండఁ గవిత వ్రాసినఁ గవియౌ*

      తొలగించండి
    3. శంకర్ గారూ,
      వృత్త్యనుప్రాసతో మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి

  13. చదువులమర్మముదెలుపుచు
    చదువరులనుమేలుగొల్పు చదువులనెల్లన్
    చదువరులనునొ ప్పించని
    పదములు లేకుండఁ గవిత వ్రాసినఁ గవియౌ !!!

    --మంద పీతాంబర్...

    రిప్లయితొలగించండి
  14. సమస్య :-
    "పదములు లేకుండఁ గవిత వ్రాసినఁ గవియౌ"

    *కందం**

    మెదడు వికాసముజెందెడు
    పదముల తోడను కవితను వ్రాసిన మేలున్
    చదవంగ దెలిసి దోషపు
    పదములు లేకుండఁ గవిత వ్రాసినఁ గవియౌ
    ........‌‌............✍చక్రి

    రిప్లయితొలగించండి
  15. డా. పిట్టా సత్యనారాయణ
    కదనము ద్రొక్కిరి కథకులు
    వదలరె రూపకము నెత్తి వచన కవితలన్
    "బదనిక " యై చనె నాంగ్లపు
    పదములు లేకుండ గవిత వ్రాసిన గవియౌ

    రిప్లయితొలగించండి
  16. సదమల మౌ బుద్ధి కలిగి
    చదువులతల్లి దయతోడ సాగును భువిపై
    హృదయము ద్రవించు, వ్యర్థపు
    పదములు లేకుండఁ, గవిత వ్రాసినఁ గవియౌ

    రిప్లయితొలగించండి
  17. డా.పిట్టా సత్యనారాయణ
    వదలిన జాలు పద్యమును వాడకె వంపుల దింపి మాటలన్
    ఇదియ కవిత్వమంచు జను లిప్పుడె యిక్కడె మోహరించగా
    గదియుడి నేటి సంచికల గ్రంథులు బాపగ నూకదంపుడౌ
    పదములు లేక సత్కవిత వ్రాసినవాడె కవీశ్వరుండగున్!

    రిప్లయితొలగించండి


  18. పోచిరాజు వారి ఝలక్ !
    జిలేబీయము లింకు

    http://varudhini.blogspot.com/2019/01/blog-post_23.html


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదములండి. మహానుభావులు శ్రీ పూతలపట్టు శ్రీ రాములు రెడ్డి గారు మనోహరముగఁ దెనిఁగించిరి.

      తొలగించండి
  19. సదమల భావంబులతో
    మృదు,లలితాద్భుతపు శైలి,మేలగు కృతులున్
    కదలించు మదిని.పలు చెడు
    పదములు లేకుండ కవిత వ్రాసిన కవియౌ.

    రిప్లయితొలగించండి
  20. మదిలో తుమ్మెదల వలెను
    కదలాడెడు భావములను కవనార్థములో
    హృదయము తాకి వివాదా
    స్పదములు లేకుండఁ గవిత వ్రాసినఁ గవియౌ

    రిప్లయితొలగించండి
  21. ఉదయపు కైపదపూరణ
    సదనమున గొనుచు రచించి సదమల మదినిన్
    కుదుపుల బెట్టెడు వ్యర్ధపు
    పదములు లేకుండ కవిత వ్రాసిన కవియౌ

    రిప్లయితొలగించండి


  22. పదరక త్రోసుకు చకచక
    పదండి ముందుకని తాను ప్రగతికి బాటై
    కదనపు శ్రీశ్రీ వేగపు
    పదములు లేకుండ కవిత వ్రాసిన కవియౌ?


    జిలేబి

    రిప్లయితొలగించండి


  23. కాయ్ రాజా కాయ్ :)


    చదరంగపు పావుల జరు
    పు దరువు వివిధముగ నడిపి, పూరణకై తు
    మ్మెద ఝంకృతి వలె తనరెడు
    పదములు లేకుండ కవిత వ్రాసిన కవియౌ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. మిత్రులందఱకు నమస్సులు!

    సదమలరీతిఁ బద్యములఁ జక్కఁగ నల్లుచు, నేర్చి వ్యాకృతిన్
    బదునగు సంప్రదాయ పరివర్తితమౌనటు, లేర్చి కూర్చియున్
    జదురగు నర్థ శబ్దముల సార, మలంకృతిఁ జేర్చి, నింద్య దు
    ష్పదములు లేక, సత్కవిత వ్రాసినవాఁడె "కవీశ్వరుం" డగున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా.పిట్టా సత్యనారాయణ
      ఆర్యా, "దుష్పదము"॥దుష్ట పదమేనా మరో అర్థమున్నదా? సందేహం.

      తొలగించండి
    2. మధుసూదన్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి


  25. కదనము తొక్కవలె జిలే
    బి! దగదగ మనవలె నమ్మ విస్తారముగా
    సదనమున నన్యదేశ్యపు
    పదములు లేకుండ కవిత వ్రాసిన కవియౌ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కదము త్రొక్కుట' విన్నాను కాని ఈ 'కదనము త్రొక్కుట'?

      తొలగించండి


  26. కుదురుగ నిలకడగ జనుల
    మది నిలచెడు విధముగ సయి మధురిమ లొలుకన్
    హృదయంగమముగ, డాంబిక
    పదములు లేకుండ, కవిత వ్రాసిన కవియౌ!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  27. బెదరకు! వణుకు భయమ్ము వ
    లదమ్మ రుచిరపు జిలేబులవి వృత్తంబుల్
    కుదురుగ దుష్టసమాసపు
    పదములు లేకుండ, కవిత వ్రాసిన కవియౌ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'వదలమ్మ' అనడం సాధువు కాదు.

      తొలగించండి
  28. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,
    .

    గు రు భ్యో న మః నిన్నటి పూరణ స్వీకరించ మనవి
    ......................... .................... .........................


    ( చిన్న పిల్లలు మైదానములో చక్కగా అటలాడు వేళ వాన గాలి వచ్చింది )


    కొండిక లెల్ల వేడుకగ గూడుచు నాడిరి చెల్మి నాటలన్

    బండుగ వేళ | నట్టి తరి బల్కెను రాధిక పద్మ తో , " నయో !

    దండుగ యయ్యె నాదు శ్రమ - దబ్బున వచ్చెడు నట్టి వానతో

    పండిన చెట్లు కూలె " ననె | వాడిన మోమున బద్మ " అబ్బ ! నీ

    వుండవె రాధికా ! మిగుల నోపికఁ జేసితి మట్టి తోడ నే

    కొండలు | గాలి తాకిడికి గొట్టుకపోయెను ; దొర్లుచున్ వడిన్

    గొండొక చోట రాలిపడె | గొందల మందెను నా మనం " బనెన్


    ( కొండిక = చిన్న బాలుడు లేదా చిన్న బాలిక )


    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

    రిప్లయితొలగించండి


  29. పదిలమ్ముగ నిలబడవలె
    పదికాలములవి జిలేబి పది మందికి చం
    దదిగాన ననౌచిత్యపు
    పదములు లేకుండ, కవిత వ్రాసిన కవియౌ!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  30. పదముల పొందిక గలుగుచు
    సదమల భావంబునొప్పి సద్గుణములతోన్
    జదువరులకుమఱి కఠినపు
    పదములు లేకుండ కవిత వ్రాసిన గవియౌ

    రిప్లయితొలగించండి
  31. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,


    పదములు రత్నరాశులయి భావసముద్రము నందు దాగి యుం

    డ దగు నటుల్ లిఖింప గవనం బగు | గాని , శిలా సమాన దు

    ష్పదముల బేర్చి కాననము వంటి కపిత్వము నేల ‌వ్రాయ ? స

    త్పదముల వాడుటే మిగుల పాడి | నిరర్థక శబ్ద పుష్టితో

    పదములు లేక సత్కవిత వ్రాసిన వాడె కవీశ్వరుం డగున్


    { చివరి పాదంలో " పదము " = పద్యచరణము }


    """"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

    రిప్లయితొలగించండి
  32. కందం
    మృదుమధురమ్మగు భావము
    నెద నూయల నూపు గమక మింపగు స్వరముల్
    పదపడి పునరావృతమౌ
    పదములు లేకుండఁ గవిత వ్రాసినఁ గవియౌ

    రిప్లయితొలగించండి
  33. పదపద గబగబ దబదబ
    ముదముద వలదే హరిపదములు గీర్తించన్
    పదవే నరాధముల చెడు
    పదములు లేకుండఁ గవిత వ్రాసినఁ గవియౌ

    రిప్లయితొలగించండి
  34. వదలక శబ్దార్థ పటిమఁ
    బదుగురు మెచ్చెడు విధ మధిపా బహు ముఖ కో
    విదుఁ డైనను బుధజన కో
    పదములు లేకుండఁ గవిత వ్రాసినఁ గవియౌ

    [కోపదము = కోపము నొసఁగునవి]


    ఉదయ దినేంద్ర వర్ణ సదృ శోత్పల కుట్మల సన్ని భాక్ష రాం
    బుదజ సుధార సైక పరిపూర్ణ వినిర్మల వాఙ్నిబద్ధమై
    సదమల భావ యుక్తముగ శౌరి గుణాలి సవర్ణనమ్ము దు
    ష్పదములు లేక సత్కవిత వ్రాసిన వాఁడె కవీశ్వరుం డగున్

    రిప్లయితొలగించండి
  35. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ముదమగు ఫ్రేజు క్లాజులను ముచ్చటి విట్టులు జోకులొల్కుచున్
    సదమల రీతి రైములను చక్కని స్లేంగులు వైజుక్రాకులున్
    కుదురుగ భేషు జార్గనులు కూర్చుచు పేర్చుచు;...నింగిలీషువౌ
    పదములు లేక:... సత్కవిత వ్రాసినవాఁడె కవీశ్వరుం డగున్

    రిప్లయితొలగించండి
  36. చదివిన సంస్కారంబును
    గదిలించెడిభావమున్న?కాంతియుమదికిన్
    మదికేయర్ధముగాకను
    పదములులేకుండ గవిత వ్రాసిన?గవియౌ
    గవి=కాంతిలేనిగుహ

    రిప్లయితొలగించండి
  37. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఉదుటెక్కిన దోహలమున
    పదురగు భావముల నెంచి పరిపాకముతో
    పదటును గూర్చెడి వ్యర్థపు
    పదములు లేకుండ గవిత వ్రాసిన గవియౌ.

    రిప్లయితొలగించండి
  38. సదమల మతితో సతతము
    సదయులమెప్పును బడయగ చక్కని తలపున్
    యెద నుంచుచు వ్యర్థంబౌ
    పదములు లేకుండ గవిత వ్రాసిన గవియౌ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సదమల సారస మితహిత
      పదముల మదుసూదను నుతి పదములెపదముల్
      పదవులకై భావరహిత
      పదములు లేకుండ గవిత వ్రాసిన గవియౌ

      తొలగించండి
    2. నదులు సదాగతిన్నుడువు, నారద నీరద సన్నినాదముల్
      బదములవాములేగద వివాదము వాదము లేల మోదమౌ
      పదకవితాపితామహులు పాడిన పాటల సార మెర్గుచున్
      పదసుమమాలికల్ప్రజల బాగుదలంచి వచించు మోఘమౌ
      "పదములు లేక సత్కవిత వ్రాసినవాఁడె కవీశ్వరుం డగున్"

      తొలగించండి
    3. మదనునిపూవుబాణముల మానినియుల్లము ఝల్లుమన్విధిన్
      కదనమునందుశూరునెద గర్వముతోనినదించు జందమున్
      వదనమునందువాణియెదవారిదమోయననక్షరాక్షతల్
      పదపదమందునిండిరసవార్ధియనంగమహత్వసారపుం
      "బదములు లేక సత్కవిత వ్రాసినవాఁడె కవీశ్వరుం డగున్"

      తొలగించండి
    4. అదునుననాటినట్టిహృదయాంకురమోపదబీజమంచు శా
      రదవచనామృతంబునిడి బ్రహ్మపుటెర్కతలక్ష్యమైసదా
      పదములకంచెతోరసపుబంధనమున్నిడగాయు,బుర్వులన్
      "పదములు లేక, సత్కవిత వ్రాసినవాఁడె కవీశ్వరుం డగున్"
      సదమలతోటమాలిపదశారదయౌగదగాళిదాసునౌ

      తొలగించండి
    5. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సమీక్షను వాట్సప్ సమూహంలో చూడండి.
      **********
      శంకర్ గారూ,
      ఈసారి కూడా పొరపాటే చేశారు. ఉమాదేవి గారి సామ్రాజ్యంలో ప్రవేశించారు. మీరు ఒకరి పూరణ క్రింద ఉన్న 'ప్రత్యుత్తరం' నొక్కి మీ పూరణలు పెడుతున్నారు.
      మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  39. కదిలిరి కవనముజేయగ
    చదువరు లనుగని నొకపరి చక్కగ వాటిన్
    చదవిరి కవితలకఠినపు
    "పదములు లేకుండఁ, గవిత వ్రాసినఁ గవియౌ"!

    రిప్లయితొలగించండి
  40. సదమల భావమొందుచు నసత్యముగాక జనాళి మెచ్చగా
    బదములగూర్పు టెల్లరకు భాసిత రీతిని నుండుచోదగన్
    బదుగురు మెచ్చుకొంచును షభాషను నట్లుగ నుండిదుష్టమౌ
    పదములు లేక సత్కవిత వ్రాసినవాడె కవీశ్వరుండగున్

    రిప్లయితొలగించండి
  41. మది దోచెడు కవిత కొఱకు
    పదముల నెమకంగదగును పద్యము వ్రాయన్
    చదువగ భావ రహితమగు
    పదములు లేకుండఁ గవిత వ్రాసినఁ గవియౌ

    రిప్లయితొలగించండి
  42. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పదురగు నీతివాక్యముల వర్థిలు జుండి మనోజ్ఞమై సదా
    కుదిరికతోడ నొప్పి తళుకొత్తు ప్రశస్తపు భావజాలము
    న్నొదవెడు తీరు చరించుచు నుత్తలమై తనరారు వట్టివౌ
    పదములు లేక సత్కవిత వ్రాసిన వాడె కవీశ్వరుండగున్.

    రిప్లయితొలగించండి
  43. మైలవరపు వారి పూరణ

    ముదమొనరించు భావపరిపుష్టిని కల్గి , మనోజ్ఞ కల్పనా
    స్పదమగు సత్కవిత్వము యశస్సును గూర్చు .,ననంతమైన సం...
    పదనిడు , సంస్కృతమ్మున
    *చ వై తు హి* వంటి నిరర్థకమ్ములౌ
    పదములు లేక సత్కవిత వ్రాసినవాఁడె కవీశ్వరుం డగున్ !!

    ( పాదపూరణమాత్రం యత్ తత్ నిరర్థకముచ్యతే )

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  44. అది కాదని యీ పద మని
    యిది కా దని కొట్టి వేసి యింకొక పదముం
    బదపడి మార్చక నీరస
    పదములు లేకుండఁ గవిత వ్రాసినఁ గవియౌ.

    రిప్లయితొలగించండి
  45. పదుగురి జీవితాలను ప్రభావితమున్ గలిగించు రీతిలో
    సదమలమై సమాజమును చక్కటి మార్గములోన పెట్టగన్
    ముదమగు మాతృభాషఁ గడు మోదము మీరగ వాడి క్లిష్టమౌ
    పదములు లేక సత్కవిత వ్రాసిన వాడెకవీశ్వరుండగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హృదయంబున కాహ్లాదము
      జదువరులకు గలుగునట్లు జక్కనికవితల్
      పదిలముగ మెలగి యనుచిత
      పదములు లేకుండ గవిత వ్రాసినగవియౌ
      రచయిత.. ఆకులశివరాజలింగము వనపర్తి

      తొలగించండి
    2. మొదటిది భావంపు పటిమ
      పిదపను దానిని తెలిపెడు విధమది చూడన్
      తదుపరి పునరుక్తమ్మౌ
      పదములు లేకుండ గవిత వ్రాసినగవియౌ

      తొలగించండి
    3. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ************
      శివరాజలింగం గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      **************
      రాకుమార గారూ,
      చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
  46. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పదురగు నీతి వాక్యముల ప్రబ్బుచు నుండి మనోజ్ఞమై సదా
    కుదిరికతోడ నొప్పి తళుకొత్తు ప్రశస్తపు భావజాలము
    న్నొదవెడు తీరు నందుకొని నుత్తలమై తనరారు వట్టివౌ
    పదములు లేక సత్కవిత వ్రాసిన వాడె కవీశ్వరుండగున్.

    రిప్లయితొలగించండి
  47. సదమల శబ్ద‌రత్నమంల సంపద గూర్చి రచించు పద్యముల్
    జదివినయంత పండితుల స్వాంతము మోదమునొందదే మరీ
    చదువును రానివారువిని సంతసమొందు విధాన వ్యర్థమౌ
    పదములు లేక సత్కవిత వ్రాసినవాడె కవీశ్వరుండగున్
    ఆకులశివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  48. చదువరులకు సులభముగా
    చదివించెడు నట్టి భాష సంధింప వలెన్
    ఎదుటి మదికి గష్టములగు
    పదములు లేకుండఁ గవిత వ్రాసినఁ గవియౌ"

    రిప్లయితొలగించండి
  49. సదనామయ రచనలలో
    హృదయంగమ భావములను హ్రీరమ్యముగా
    కదలంగ చేసి అనుచిత
    పదములు లేకుండ(గవిత వ్రాసిన కవియౌ

    రిప్లయితొలగించండి