డా.పిట్టా సత్యనారాయణ పులియ భార్య యీ స్త్రీవాద పురము నందు సింహములు నైటి (IT),సీబియై(CBI)స్థిరము గాను లేళ్ళు నాశలు జామాత లేనుగులగు వనమునన్ సంచరింప వైభవము దక్కు
"కోశ ఓద బేకు దేశ తిరుగ బేకు " అని ఒక కన్నడ సామెత ! యౌవనమొక వనము వంటిది. అగమ్య గోచరము. పైగా ప్రమాద భరితము.జ్ఞాన దీపిక చేబట్టి ముందుకరుగ వలయు.దాని కొఱకు నిత్యము జ్ఞానార్థియై ఆ వనమున సంచరింప వలయును.అపుడే కీర్తి,వైభవము దక్కును. "..................................... లోకే2స్మిన్ న హ్యనర్థ వ్రజకుల భవనం యౌవనాదన్యదస్తి" అని కదా భర్తృహరి హెచ్చరిక ! ****)()(**** దేశ కోశములనెపుడు తెలియ వలయు నన్ని దశలందు ముఖ్యము యౌవనమ్ము దానిని వృథా పరుచకుండ తరచు నట్టి వనమునన్ సంచరింప వైభవము దక్కు !
"And this our life, exempt from public haunt, finds tongues in trees, books in the running brooks, sermons in stones, and good in everything. I would not change it."
వానప్రస్థ ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ఎటువంటి ఒత్తిడులు లేక, ప్రశాంతంగా ఎక్కువ సమయాన్ని శంకరాభరణానికి వినియోగించడానికే నేను వానప్రస్థాశ్రమంలో అడుగుపెట్టాను.
రిప్లయితొలగించండివనమునన్ సంచరింప వైభవము దక్కు,
మానసము సేద దీరును మహిని రమణి,
జవనము వలె కలుగు ధృతి చక్క గాను
జబ్బు లేమియె భాగ్యము జనుల కెల్ల !
జిలేబి
జిలేబి గారూ,
రిప్లయితొలగించండివనంలో సంచరిస్తే శారీరక మానసిక స్వాస్థ్యప్రాప్తి అంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
వనమ యూరపు నృత్యము ఘన మటంచు
రిప్లయితొలగించండిమనసు వీణను సరిజేయు మల్లె సౌరు
గాన గంధర్వ మందున లీన మగుచు
వనమునన్ సంచరింప వైభవము దక్కు
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఘనమగు తలపులను కూర్చి గారవమున
రిప్లయితొలగించండితనువు పులకరించు వహిని తన్మయమున
మనము దోచు పద్యములందు మైమరచు క
వనమునన్ సంచరింప వైభవము దక్కు
కంద పద్యమివ్వ గూడదా సార్! తేటగీతి బోరు :)
తొలగించండి
తొలగించండితేటగీతి బోరు ! త్రేన్పులారగ వ్రాయ
కంద పద్య మేను గట్టి దయ్య
కంది శంకరార్య కవనపు వీధిని
కంద పాద మిమ్మ కైపదముగ :)
జిలేబి
ఆటవెలది :)
తొలగించండిపూరించుడీ :)
వనమున కేగ సుజన విభవము కలుగు సుమా
జిలేబి
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చాలా ఇష్టమని రోజూ వంకాయ కూర తినం కదా?
🙏
తొలగించండిసార్!
నేను బ్రహ్మచారిగా ఖరగ్పూరు వనమున సంచరించుచుండగా వంకాయ కూరనే వండుకొని తినే వాడిని రోజు రోజు:
http://gpsastry.blogspot.com/2013/12/eggplant.html?m=0
కనలేదెప్పుడు తరచుగ
తొలగించండివినలేదెప్పుడు బృహత్కవితలన్నీతీ
రున మును, బుధులనునట్లు క
వనమున కేగ సుజన విభవము కలుగు సుమా!!
--------యెనిశెట్టి గంగా ప్రసాద్
జిలేబి గారిచ్చిన కందపద్య పాదానికి పూరణ.
మనమున మోక్ష సంపదకు
రిప్లయితొలగించండిమౌనముగా దపియించు వారికిన్
వనమున సంచరింప దగు ;
వైభవముల్ మదిగోరు వారికిన్
నెనరగు రాజ్యలక్ష్మియును ,
నిండగు సైన్యము , రాణివాసమున్ ,
ఘనమగు నేన్గు , లశ్వములు ,
గాంచనరత్నచయంబు గావలెన్ .
జంధ్యాల వారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ !
తొలగించండి
రిప్లయితొలగించండివిను! తనివాఱు నమ్మ మది! వీనుల విందగు కూజితమ్ములున్
తనరు సుగంధపుష్పముల తావియు మీదు సమీరఢింభముల్
మనసును దోచు పచ్చదనమా వన వాటిక సొత్తు! మాలినీ
వనమున సంచరింపఁ దగు వైభవముల్ మదిఁ గోరు వారికిన్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఘనమగు పూల తోట యది గాంచిన చాలును మేను జల్లనన్
రిప్లయితొలగించండిమనమున పొంగు భావములు మౌనము నందున తేలి పోవగా
వనితల కోరికల్ విరియు భాసుర మొప్పగ సంత సంబునన్
వనమున సంచరింపఁ దగు వైభవముల్ మదిఁ గోరు వారికిన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సవనమున్ సంచరింపగ దివిజు లెసగు
రిప్లయితొలగించండికవనమున్ సంచరింపగ ఘనత గల్గు
పవనమున్ పీల్చినన్ ప్రాణ వాయు వబ్బు
వనమునన్ సంచరింప వైభవము దక్కు.
ప్రసాద రావు గారూ,
తొలగించండిమనోహరమైన పూరణ. అభినందనలు.
ధన్య వాదములు
తొలగించండిగురువు గారికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు నమస్సులు.
రిప్లయితొలగించండిగరికిపాటి వుపాయము గరిమ చూప
మనసున వికారముల శ్రేణి మాసి పోవ
వాణి పలుకుల నింపగు వరుస కావ్య
వనమునన్ సంచరిప వైభవము దక్క.
పంచరత్నం వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వుపాయము' సాధువు కాదు. "గరికిపాటి యుపాయము..." అనండి.
చక్క నైన ట్టి భావాలు సంత రించి
రిప్లయితొలగించండిపాఠకుల మనముల దోచు పావనం పు
పద్య కావ్యము పఠియించి భాగ్య దివ్య
వనమున న్ సంచ రింప వైభవ ము దక్కు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
తొలగించండిధనమతిచంచలంబనియు, ధర్మమె నిశ్చలమైనదంచు, నె
మ్మనమునఁదల్చుచున్ దురభిమానము కూడదటంచుఁ,బూని పా
వనమును గూర్చు కార్యములఁ బన్నుగఁ జేసి, పరోపకారజీ
వనమున సంచరింపఁదగు వైభవమున్ మదిఁ గోరు వారికిన్.
కంజర్ల రామాచార్య.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిప్రజల సంతత ముత్తేజ పరచునట్టి
రిప్లయితొలగించండిపద్యములను లిఖించుచునుద్యమముగ
పదుగురి మనసులను ని లువగను కవన
వనమునన్ సంచరింప వైభవము దక్కు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఒకప్పటిమాట
రిప్లయితొలగించండిఘనమగు శాలువల్ విరుల గంధపుమాలలు హేమకంకణాల్
మనసుకునింపగున్ నుతులు మాన్యపుభూముల దానపత్రముల్
తనియగ శాశ్వతమ్మగు ప్రథన్ ప్రభుమెచ్చెడురీతి సాహితీ
వనమున సంచరింపదగు వైభవముల్ మదిగోరువారికిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిసాహితీ మిత్రమండలికి...
*గణతంత్ర దినోత్సవశుభాకాంక్షలు*💐💐💐🙏🙏
అనుపమసస్యవృద్ధి , భువనైకమహోజ్జ్వలసైన్యశక్తి , సా..
ధనకన యోగబుద్ధి , ఘనధార్మికసంస్కృతి , శాంతిమార్గమున్
ధనముగ గల్గినట్టి గణతంత్రమహోన్నతభారతీయజీ...
వనమున సంచరింపఁ దగు వైభవముల్ మదిఁ గోరు వారికిన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిపులియ భార్య యీ స్త్రీవాద పురము నందు
సింహములు నైటి (IT),సీబియై(CBI)స్థిరము గాను
లేళ్ళు నాశలు జామాత లేనుగులగు
వనమునన్ సంచరింప వైభవము దక్కు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభావ జలధిని మదియించి భావకులిల
రిప్లయితొలగించండినమృత తుల్యమౌ కావ్యమ్ములందజేసి
జాతి జాగృత మొనరించు సత్కవికి క
వనమునన్ సంచరింప వైభవము దక్కు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిమన దగు రాజకీయమున మాన్యతకై పలు వోట్లనున్ గొనన్
మనికియె రాజ యోగమని;మౌనిగ నిక్కడ నాశ్రమంబునున్
గని యొక సాధువై ప్రబల గౌరవ మందడె వింత లోకపున్
వనమున;సంచరింప దగు వైభవమున్ మది గోరు వారికిన్!
(మగవాడు తిరుగక చెడు(చెడిపోవును)!)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[మయసభను సందర్శింప నిచ్చగించిన దుర్యోధనుని మనోగతము]
"కురుకులాధీశు నను వారుఁ గోరి కోరి
దీని దర్శింపఁ బిల్చిరి! నేనుఁ గూడ
వేగముగఁ జని 'మయసభ' పేరుగల భ
వనమునన్ సంచరింప వైభవము దక్కు!"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభోగ భాగ్యాలఁ గోరెడిన్ బూరుషుడిల
రిప్లయితొలగించండినర్థ సాధనొక్కటె పర మార్థ మనుచు
పుడమిని బడిజీవించెడు మూర్ఖునకు, భ
వనమునన్ సంచరింప వైభవము దక్కు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండి"కోశ ఓద బేకు దేశ తిరుగ బేకు "
అని ఒక కన్నడ సామెత !
యౌవనమొక వనము వంటిది. అగమ్య గోచరము. పైగా ప్రమాద భరితము.జ్ఞాన దీపిక చేబట్టి ముందుకరుగ వలయు.దాని కొఱకు నిత్యము జ్ఞానార్థియై ఆ వనమున సంచరింప వలయును.అపుడే కీర్తి,వైభవము దక్కును.
".....................................
లోకే2స్మిన్ న హ్యనర్థ వ్రజకుల భవనం యౌవనాదన్యదస్తి"
అని కదా భర్తృహరి హెచ్చరిక !
****)()(****
దేశ కోశములనెపుడు తెలియ వలయు
నన్ని దశలందు ముఖ్యము యౌవనమ్ము
దానిని వృథా పరుచకుండ తరచు నట్టి
వనమునన్ సంచరింప వైభవము దక్కు !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిజనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వనగత ప్రాణి సంచయ మనయము సువి
రిప్లయితొలగించండికాస మొంద నక్షయ మౌచుఁ గడలి యందుఁ
దనర మణులు భృశమ్ము రత్నాకర వర
వనమునన్ సంచరింప వైభవము దక్కు
[వనము =జలము]
వనజదళాయతాక్ష ఘన వక్ష సమాశ్రయ పారవశ్యతం
దనరెడు భామినీమణి నితాంత వరార్థ సు కాములౌచుఁ బా
వనతర చిత్త సంస్థితినిఁ బన్నుగ శ్రీద రమార్చనాది భా
వనమున సంచరింపఁ దగు వైభవముల్ మదిఁ గోరు వారికిన్
మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబాగున్నదండీ!
తొలగించండిరెండో పాదంలో ...దాలిచి పితృ... అనండి. లేకుంటే ...గణభంగం...
ఆఱో పాదంలో ...సంకెల లిడి పెట్టిరి... అనండి. లేకుంటే ...వచన భంగం...
ధన్యవాదాలు మిత్రమా సరి చేశాను
తొలగించండిఆటవిడుపు సీరియస్ పూరణ:
రిప్లయితొలగించండి(సీతా దేవి గారికి అంకితం)
"And this our life, exempt from public haunt, finds tongues in trees, books in the running brooks, sermons in stones, and good in everything. I would not change it."
...William Shakespeare, in
As You Like It
ఘనమగు వృక్ష రాజములు కమ్మని పల్కుల నొల్కుచుండగా
దినమొక పండుగౌ వహిని తియ్యని నీతుల నేర్లు నేర్పగా
మనమును దోచు గాథలను మట్టియు రాళ్ళు వచించుచుండగా
వనమున సంచరింపఁ దగు వైభవముల్ మదిఁ గోరు వారికిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
కనుముర! గంట గంటకొక కమ్మని కున్కును తీయవచ్చురా
తనివిని తీర పద్యములు తైతకలాడుచు నల్లవచ్చురా
తినుటకు తిండి మందులును తియ్యగ నుండగ వానప్రస్థమౌ
వనమున సంచరింపఁ దగు వైభవముల్ మదిఁ గోరు వారికిన్
తొలగించండివానప్రస్థపు వనమున
మీనాక్షీ తొంగొనుచు సమీక్షించు సుమా
నానాటి కతల పద్యపు
దీనారముల విభవమ్ము తియ్యందనముల్ :)
జిలేబి
వానప్రస్థములో కడుంగడు కున్కులు తీయవలసిన కంది సారు శంకరాభరణ తీవ్రాతితీవ్ర సంసారములో ఆనందముగా ఇరుక్కు పోయారు :)
తొలగించండివానప్రస్థ ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎటువంటి ఒత్తిడులు లేక, ప్రశాంతంగా ఎక్కువ సమయాన్ని శంకరాభరణానికి వినియోగించడానికే నేను వానప్రస్థాశ్రమంలో అడుగుపెట్టాను.
🙏
తొలగించండి
తొలగించండి*తొంగొనక
లేళ్ళు దుప్పులు సింగముల్ ముళ్ళపందు
రిప్లయితొలగించండిలెన్నియో గనబడు గంటికింపుగాను
వనమునన్సంచరింప,వైభవము దక్కు
నున్న తంబగు పదవిని నుండునెడల
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివనమన?మనుగడ ధనమే!ఘనమది!గన
రిప్లయితొలగించండిఅనవరతము హాయినిడెడివై మనకవిబహు
మతుల నొసగు!సమ్మతియగు!హితముబంచు
వనమునన్ సంచరింప?వైభవముదక్కు!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపుత్ర వాత్సల్యముప్పొంగ పూని కైక
రిప్లయితొలగించండినల్లచీర చుట్టి నడిగె నా భరతుడు
రాజు గావలె నందుకు రాముడేగి
వనమునన్ సంచరింప వైభవము దక్కు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబూడిదను శరీరము పైన పులిమి చర్మ
రిప్లయితొలగించండిధారణము చేసి, శూలము దాలిచి పితృ
వనమునన్ సంచరింప వైభవము దక్కు
శివుని వోలె యని తలపోసి తిరిగె శివ
భక్తు డొక్కడు ,రక్షక భటులు కాంచి
సంకెల నిడి పెట్టిరి చెరసాలలోన
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅనయము బచ్చగోరెడు మహాత్ములు దాముగ బోయి హాయిగా
రిప్లయితొలగించండివనమున సంచరింపదగు, వైభవముల్ మదిగోరువారికిన్
నినకులనాధు పూజల ననేకపు రీతులజేయ భక్తితో
బనిగొని యిచ్చు సంపదలపారముగాగను దప్పకుండగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅనయము రామనామ మధురామృత పానమొనర్చుచున్ మహా
రిప్లయితొలగించండిఘనమగు భక్తిమార్గమున కాలమునంతయు వెల్లబుచ్చుచున్
అనుచిత భోగ భాగ్యముల నన్నియు రోసియు మోక్షచింతనా
వనమున సంచరింపదగు వైభవముల్ మదిగోరువారికిన్
ఆకులళివరాజలింగం
వనపర్తి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిశివరాజ లింగం గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చెంగు చెంగున గంతులేసెడుహరిణము
రిప్లయితొలగించండిఅందమైననెమలినాట్య మదరిపోవ
రంగు రంగుల పిచ్చుకల్ రాగ మంద
వనమునన్ సంచరింప వైభవము దక్కు"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅనయము రామరామ యని హాయిగ తారక నామ మెంచుచున్
రిప్లయితొలగించండిఘనమగు రామచంద్ర పదకంజములే గతి యంచు మించుచున్
దినమణి వంశదీపకుని దివ్య మహత్వ శుభాప్త సత్కృపా
వనమున సంచరింపఁ దగు వైభవముల్ మదిఁ గోరు వారికిన్"
అద్భుతమైన పూరణ. అభినందనలు.
తొలగించండి🙏🙏🙏
తొలగించండిధనమది చేయలేని పని తల్లి సరస్వతి దీవెనున్నచో
రిప్లయితొలగించండిఘనమగు కీర్తిచంద్రికల కాంతులలో విహరించగల్గునే
జన హృదయమ్ములో నిలుచు సత్కవితల్ సృజియింప సాహితీ
వనమున సంచరింపదగు వైభవముల్ మదిఁ గోరువారికిన్
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిఊర సిరులుండ జనులకు గూరు సుఖము
రిప్లయితొలగించండిపచ్చ నౌనేల మోదము పసరములకు
ఆత్మ ఘోషయె మృగముల కడవి వీడ
వనమునన్ సంచరింప వైభవము దక్కు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధనమున గూరు సౌఖ్యము సదా యనుమోదము కాదు చూడగన్
రిప్లయితొలగించండిఘనతన వచ్చు పేరును జగమ్మున మాయును కాల వాహినిన్
మనసుకు శాంతి నిచ్చు ఘన మార్గ ముముక్తి పథమ్మె యందుకై
వనమున సంచరింపఁ దగు వైభవముల్ మదిఁ గోరు వారికిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఘనతను' అనండి.
రిప్లయితొలగించండిశాంతయుతముగ బ్రతుకంగ జగతి యందు
మనసు మెచ్చెడి తావిది మానుగాను
నట్టియాహ్లాదమునపొందు నట్టి పూల
వనమునన్ సంచరింప వైభవము దక్కు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
వనమునన్ సంచరింప వైభవము దక్కు
సందర్భము: సులభము
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఎపుడు నాధ్యాత్మి కోన్నతియే విభవము..
పోతనామాత్యు సుకవితన్ బోలె స్వచ్ఛ
కీర్తిదమ్మయి భగవ దంకితమయిన క
వనమునన్ సంచరింప వైభవము దక్కు
✒~డా.వెలుదండ సత్యనారాయణ
26.1.19
-----------------------------------------------------------
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఎదవనము దుర్గమాగమ్య సదువనంగ
తొలగించండిదారి తెన్నెర్గలేక విధాత తలపు
నెరుగమి గురూపదేశాత్మ దరిసెనంపు
"వనమునన్ సంచరింప వైభవము దక్కు"
కనకహరిణము గొరకునై గాననమున
తొలగించండిమూఢుడోయన దిరిగె దామోదరుండు
నా కథామృత పాన మన్నాది కావ్య
వనమునన్ సంచరింప వైభవము దక్కు
నా ప్రయత్నం :
రిప్లయితొలగించండితేటగీతి
మమ్ము వెడలి మామా! యట మయసభా భ
వనమునన్ సంచరింప వైభవము దక్కు
ననిరి, జారగ పాంచాలి యపహసించె
కనక మణిమయ శోభిలు కానివయ్యె!
చంపకమాల
మనమును నిగ్రహించి మన మౌనులు మాన్యులు వేల వత్సరాల్
ఘనముగ నంకితంబగుచు గాంచ నిదర్శనముల్ తపంబునన్
ప్రణతుల జేయఁగన్ బొరలె వాఙ్మయమెంతయొ యట్టి ధ్యాన జీ
వనమున సంచరింపఁ దగు వైభవముల్ మదిఁ గోరు వారికిన్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిమొదటి పద్యం నాల్గవ పాదంలో టైపాటును సవరించి..
శకునితో రారాజు సుయోధనుని వగపు...
తేటగీతి
"మమ్ము వెడలి మామా! యట మయసభా భ
వనమునన్ సంచరింప వైభవము దక్కు"
ననిరి, జారగ పాంచాలి యపహసించె
కనక మణిమయ శోభలు కానివయ్యె!
సర్ ఈవారం ఆకాశవాణివారి
రిప్లయితొలగించండిసమస్య తెలియజేయగలరు
ఆర్యా! గణతంత్రదినోత్సవ సంధర్భమని ఈ రోజు ఆకాశవాణి వారు సదరు కార్యక్రమమును ప్రసారముచేయలేదు.
రిప్లయితొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
వనమునన్ సంచరింప వైభవము దక్కు
సందర్భము: స్వర్గంమీదకు దండెత్తి వెళ్ళి పారిజాత పుష్పాన్ని తీసుకురావా లని చెబుతూ సత్యభామ కృష్ణునితో ఇలా అంటున్నది.
"పారిజాతంతో వుండేదే వైభవం. (మిగతా వన్నీ కావు.) ఎందుకంటే అది దివినుంచి భువి మీదకు దిగి వస్తుంది కదా!
అటువంటి అందమైన పూవుకోసం స్వర్గంలోని నందనవనంలో సంచరించడంవల్ల మనకు నూత్న వైభవం దక్కుతుంది. (ఎవరూ చేయలేని పని గదా!)"
~~~~~~~~~~~~~~~~~~~~~~~
" పారిజాతమ్ముతోడిదే వైభవమ్ము..
దివిని విడనాడి భువిమీద దిగిన కతన..
సుందరమగు నా విరి కయి నందనంపు
వనమునన్ సంచరింప వైభవము దక్కు"
✒~డా.వెలుదండ సత్యనారాయణ
26.1.19
-----------------------------------------------------------