14, జనవరి 2019, సోమవారం

సమస్య - 2902 (అజగరమును మ్రింగె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్"
(లేదా...)
"అజగరమున్ గుటుక్కుమని యచ్చెరువందఁగ మ్రింగెఁ జీమయే"

71 కామెంట్‌లు:



  1. భజరంగ భళీయనుచున్
    తజల్లి గాహ్ మాంత్రికుండు తంత్రము చేయన్
    గజ గజ యని వణికెడు నా
    నజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. అజితుండాదిత్యుండను
    ద్విజుడా! గ్రహణమున హిముడు తీరున మ్రింగున్
    నిజముగ నిదియెట్లన్నన్:👇
    అజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్!

    రిప్లయితొలగించండి
  3. నిజగర్వమునను వ్రీగెడి
    యజమానిని నెదిరిగెల్వ వ్యాజ్యమునందున్
    ప్రజలనిరి యిట్లు, యౌరా!
    యజగరమును మ్రింగెజీమ యాశ్చర్యముగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు
      'ఇట్లు + ఔరా' అన్నపుడు సంధి నిత్యం యడాగమం రాదు. "...యిట్టు లౌరా" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా,సవరిస్తాను!

      తొలగించండి
  4. శుభోదయం!

    మీ మనుమరాలికి అమెరికాలో భోగిపళ్ళు పోసారా?

    http://gpsastry.blogspot.com/2014/01/bhogi-pallu-4.html?m=0


    రిప్లయితొలగించండి


  5. మజ! వేరుసెనగ గాంచెన్
    సజగ్ధి గానంగ దాని జాలిక నొలిచెన్
    పజదొర యిచ్చిన తెలివి, ద
    య, జగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. సీతాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు
    'ఇట్లు + ఔరా' అన్నపుడు సంధి నిత్యం యడాగమం రాదు. "...యిట్టు లౌరా" అనండి.

    రిప్లయితొలగించండి
  7. గజ బల గర్వం బు న జనుల
    గజగజ నొ ణికిం చు నొక ని కయ్యము నం దా
    గజ మును నోడిoపనని రి
    అజగరము ను మ్రింగెజీమ యాశ్చర్యము గన్

    రిప్లయితొలగించండి
  8. ప్రజలనుజీమలచందము
    యజమానుండ్రగుబ్రిటీషులారడిబెట్టన్
    ప్రజకిడెగాంధీస్వేచ్ఛను
    అజగరమునుమ్రింగెజీమ యాశ్చర్యముగన్

    రిప్లయితొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    సాహితీ మిత్రమండలికి భోగిపర్వదినశుభాకాంక్షలు💐💐🙏

    గజగజలాడజేయు చలి గాంచ భుజంగము , *భోగి* పండుగన్
    ప్రజలిల మంటవేయనది భాసిలె చిన్న పిపీలికమ్ముగా !
    నిజమిది మ్రింగెనా చలిని , నేర్పున దోచెను భావసీమలో
    నజగరమున్ గుటుక్కుమని యచ్చెరువందఁగ మ్రింగెఁ జీమయే !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. మైలవరపు వారి పూరణ యమ
      హో యమహ !

      చాలా బాగున్నది !


      జిలేబి

      తొలగించండి
    2. శ్రీమతి జిలేబీ గారికి.. మీకు కూడా ధన్యవాదాలండీ 🙏

      మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    3. రెండవ పూరణ..

      భుజబలమెంత ? యెంచగను బుద్ధిబలమ్మది మిన్న ! చక్కెరన్
      భుజగముఁ జేసి నిల్పిరట బొమ్మలకొల్వున ! పంచదారపుం..
      రజముల చుట్టు చేరి , తల లాగుచు లాగుచు చేర్చి పుట్టలో
      నజగరమున్ గుటుక్కుమని యచ్చెరువందఁగ మ్రింగెఁ జీమయే !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి


    4. అదురహో అదురహో !


      భుజగపు చక్కెరబుగడను
      మజలాగుచు బిలమునన్ సమారాధన జే
      సి జమను పంచుకొని భళా
      నజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్!


      జిలేబి

      తొలగించండి
    5. చక్కని పూరణ అవధానిగారూ!"ఎలుకలు తమకలుగులోని కేనుగుదీసెన్" సమస్య గుర్తొచ్చింది.

      తొలగించండి
    6. శ్రీమతి సీతాదేవి గారికి.. మీకు ధన్యవాదాలు 🙏

      మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    7. రెండవ పూరణ..చిరుసవరణ.. మన్నించండి 🙏

      శంకరాభరణం.. సమస్యాపూరణం..

      అజగరమున్ గుటుక్కుమని యచ్చెరువందఁగ మ్రింగెఁ జీమయే !!

      భుజబలమెంత ? యెంచగను బుద్ధిబలమ్మది మిన్న ! చక్కెరన్
      భుజగముఁ జేసి నిల్పిరట బొమ్మలకొల్వున ! పంచదారవౌ
      రజముల చుట్టు చేరి , తల లాగుచు లాగుచు చేర్చి పుట్టలో
      నజగరమున్ గుటుక్కుమని యచ్చెరువందఁగ మ్రింగెఁ జీమయే !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  10. నిజమే పలికిరి విజ్ఞులు
    గజమును మకరము పట్టె కలకల లాడన్
    భజనల సాముల దొంగలు
    అజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్

    రిప్లయితొలగించండి
  11. కవిమిత్రులారా,
    నమస్కృతులు!
    తిరుపతి నుండి శ్రీకాళహస్తి బయలుదేరాను. ఈరోజు అక్కడ ఆముదాల మురళి గారి అష్టావధానం ఉంది. రేపటికి హైదరాబాద్ చేరుకుంటాను.
    అప్పటి దాక మన్నించండి.

    రిప్లయితొలగించండి


  12. రజనము కోరి మాంత్రికుడు రక్తప మంత్రము వేయ ప్రాంగమున్
    వజవజ కొంకుపాటుగన, వాజిని వేగము జోరు జోరుగా
    నిజమని పించు రీతి తను నిబ్బరగించుచు గాంచి, శీవమా
    యజగరమున్ గుటుక్కుమని యచ్చెరువందఁగ మ్రింగెఁ జీమయే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  13. నిజకరబల్మివానరుడునేడుదశాననుసూతుజంపెయా
    జి ,జనకజాత్మజన్గనియె ,జేసెనశోకవనాంతమున్ గటా
    గజగజలాడెనేడుదశకంథరులంకవిచిత్రమైవిథిన్
    *అజగరమున్ గుటుక్కుమని యచ్చెరువందఁగ మ్రింగెఁ జీమయే*

    రిప్లయితొలగించండి
  14. నిజబలసంపన్నుండగు
    నజేయదాశరథియశ్వమామునిపుత్రుల్
    గజరిపులైబట్ట,ననిరి
    "యజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్

    రిప్లయితొలగించండి

  15. సజనులు పాండవు లోరడి

    విజయము నొందక ప్రభువగు విరటుని మిగులన్

    భజిరించి రిదెట్లనగా

    నజగరమును మ్రింగె జీమ యాశ్చర్యముగన్



    🍀 ☘ ఆకుల శాంతి భూషణ్ 🌿🌱

                        🌷 వనపర్తి 🌷


    రిప్లయితొలగించండి
  16. ప్రజలనొకగారడీడును
    నిజయైంద్రపుజాలగరిమనిల్పి సృజించెన్
    అజగరము ,జీమ నటుపై
    *యజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్*

    రిప్లయితొలగించండి
  17. త్రిజగమ్ముల జడిపించిన
    కుజనుండౌ తారకుడను గూల్చిన స్కందున్
    విజయచరితఁ విని తలచితి
    అజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్.

    రిప్లయితొలగించండి
  18. డా. పిట్టా సత్యనారాయణ
    ప్రజవచనములున్ రోమా
    లజుడొసగు వరాలు పేదలన నెవరయ్యా(మాటలకు వెంట్రుకలకు పేదరికము లేదు.ప్రజ్ఞలు బల్కుటలో పేద,ధనిక భేదాలు లేవను తెలంగాణా సామెత గలదు)
    నిజమౌనె యతిశయోక్తుల
    నజగరమును మ్రింగె జీమ యాశ్చర్యముగన్

    రిప్లయితొలగించండి
  19. గజబలులౌప్రజాపతులుగారడితోప్రజయోటుబొంది యం
    గజపుసమాజసామజముగారలగ్రుక్కిననొక్కయోజనన్
    బ్రజలకుగైతదారిగనపర్చినవేమనవారవాణమై
    *యజగరమున్ గుటుక్కుమని యచ్చెరువందఁగ మ్రింగెఁ జీమయే*

    రిప్లయితొలగించండి
  20. డా.పిట్టా సత్యనారాయణ
    నిజముగ మాటలాడితివొ నిక్కపు శన్గల పిండి గారెలే
    వజ వజ వణ్కు నీచలికి వత్తులు(మెత్తనివి)పంటికి గాని, దానిలో
    రజమును బోలు నావరిని రాపిడి జేసిన పిండి గల్పగా
    గజ గజ దంత వాద్యమున గాసిలదే చలి యతిశయోక్తినిన్
    "అజగరమున్ గుటుక్కుమని యచ్చెరువందగ మ్రింగె జీమయే

    రిప్లయితొలగించండి
  21. అజగరపు చుట్ట వలె ను
    న్న జిలేబిన్ సుతుని కొరకు నాన్న యె దాచన్
    నిజక్షుద్బాధను దీర్పగ
    "నజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్"




    రిప్లయితొలగించండి

  22. భోగ భాగ్యములు గలుగు భోగి నాడు
    సిరియు సంపద లువిరియు శివుని గృపను
    పెద్ద పండుగ రోజున , నిధ్ధరణి ని
    పాడి పంటల వృద్ధియు బాగు గాను
    కనుము దినమున మొదలిడు ననుట నిజము .

    సంక్రాంతి శుభా కాంక్షలు
    సంక్ర మణము మీకు నొసగు సంతస మెపుడున్
    సంక్రాంతి మూడు రోజులు
    ‘సంక్రందననుతుఁడు శివుఁడు సత్కృపతోడన్

    రిప్లయితొలగించండి
  23. ఋజువర్తనుడౌ నేతను
    కుజనుడయిన భృత్యుడొకడు కూల్చెను గదరా !
    నిజమిది!విధినే మననెద
    నజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్ !

    రిప్లయితొలగించండి
  24. భుజగశయనుడిని కొలిచెను
    గజము మకరిని గెలిచె; గజగజలాడెనుపో
    అజమున హరి తలవక నా
    అజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్

    రిప్లయితొలగించండి
  25. ఈ రోజు శంకరా భరణము వారి సమస్య

    అజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్

    ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో



    పెద్ద కొండ చిలువను ఒక సామాన్యమైన చీమ మింగినది అని . ఇది ప్రకృతి విరుద్దము . నా పూరణము సీతను వెతుకుతూ హనుమంతుడు సంద్రము పై నుంచి వెడలు సమయాన సింహిక అను రాక్షసి (ఒక చీమ లాంటింది) హనుమంతుని (పెనుబాము వంటివాడు ) మింగినది అని నాభావన




    సీతకై వెతుకుచు సింధువు పైనుంచి పయనించు సమయాన పవన సుతుని
    వేగము ఘనముగా వెలితిపడ, జలము లోకాంచె పాతాళ లోక మంత
    నోటితో సింహికను, జలధిలో పెనుబామును మింగెడు ప్రఘనులు గల
    రని బలికిన కపి రాజు మాటలు గుర్తు కొచ్చి కాయము పెంచె కొసరి కొసరి,
    సింహిక నోటిని శీఘ్ర గతిని పెంచ చిరు రూపు డాయెను చెట్టుముట్టు,
    ముదముగ (నజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగ ) నపుడు, క్షణము లోన

    కపివరుండు సింహిక యొక్క కడుపు లోన
    తిరిగి దాని నాయువు పట్టు నెరిగి చిదుమ
    బాధ తోడ నోరు తెరువ, బయట పడిన
    కపి వరుండు వెడలెను లంకా నగరికి

    చెట్టుముట్టు =కోతి అంధ్రబారతి ఉవాచ
    పూసపాటి గుంటూరు

    రిప్లయితొలగించండి


  26. అజగరముగ కుండలిని మ
    నుజులందు నిదురను గాంచును వెసన్ తా నం
    గజముగ బ్రాకన్ శక్తిగ
    నజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  27. గజగజ లాడె కోట్ల సిరి కమ్మగ మ్రింగగ ముఖ్యమంత్రి అ
    క్కజముగ చిన్న నాయకుడె గట్టిగ గుంజెను కోట్లు లక్షలున్
    గజసముడైన నాయకుడు గడ్డిని , నాకుల మ్రింగుచుండగా
    "అజగరమున్ గుటుక్కుమని యచ్చెరువందఁగ మ్రింగెఁ జీమయే"

    రిప్లయితొలగించండి
  28. అజమున నాకేమని యస
    హజమున బలుకంగ వలదు హాని గనుమ యీ
    నిజము తెలిపె బద్దెన పో
    అజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్

    రిప్లయితొలగించండి
  29. గజరిపుడాకలి గొనగను
    నజగరమును మ్రింగె,జీమయాశ్చర్యముగన్
    గజముఖము నందు గనబడె
    నజరామర జీవియగుచునట్టిటుదిరిగీ

    రిప్లయితొలగించండి
  30. సృజియించె జీవులను దో
    యజగర్భుఁడు లీలగఁ బరమాన్నపుఁ గణమున్
    గజిబిజి చెందక దాటుచు
    నజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్


    అజుఁడు గిరీశుఁ డీయ వర మర్మిలి సింధు ధవుండు కౌరవా
    గ్రజ వర బాంధవుం డట ప్రగాఢపుఁ గోపము ప్రజ్వలించగన్
    సుజనులు పాండ వాత్మజులఁ జోద్యము మీఱఁగ నాజి నిల్పెనే
    యజగరమున్ గుటుక్కుమని యచ్చెరువందఁగ మ్రింగెఁ జీమయే!

    రిప్లయితొలగించండి
  31. చంపకమాల
    అజగరమైన చీకటి భయమ్మునుఁ గొల్పుచు సాచి కోరలన్
    గజగజలాడఁ జేయఁ జలి! గాఢ సుషుప్తికి తూర్పు నింగిలో
    సృజనన భోగిమంటలొక చిల్లు పిపీలిక మంత బెట్టగా
    నజగరమున్ గుటుక్కుమని యచ్చెరు వందగ మ్రింగెఁ జీమయే

    రిప్లయితొలగించండి
  32. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    విజయము జేసి లోకమును విందును జేయుచు విర్రవీగుచున్
    భుజముల నెత్తి భూమినిట ముద్దుగ మోసిన నాంగ్ల భోగమే
    గజగజ కంప మొందుచును గాంధిని జూడగ నంతమొందెగా:👇
    "అజగరమున్ గుటుక్కుమని యచ్చెరువందఁగ మ్రింగెఁ జీమయే"

    రిప్లయితొలగించండి
  33. ప్రజలోటమినిడి నేతకు
    విజయమును ఘటిల్ల జేయ పెరవారలకున్
    నిజమును కాంచి జనులని
    రజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్

    రిప్లయితొలగించండి
  34. కందం
    భుజబల సంపన్నుడు బలి
    నజుడై పాతాళమంప నట వామనుడున్
    స్వజనుఁ డసుర బాలుండనె
    "నజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్"

    రిప్లయితొలగించండి
  35. భుజగము కంఠమందుగల ముక్కను సామి శిరమ్మునుండి భూ
    రిజమును జేరి పారెడుతరిన్ ముని జాహ్నుడు మ్రింగెనంచు నా
    సుజనులు చెప్పినంత విని చోద్యము గానుదలంచితిన్ గదే
    యజగరమున్ గుటుక్కుమని యచ్చెరువందగ మ్రింగెఁ జీమయే.

    రిప్లయితొలగించండి
  36. అజకులదివ్యసంభవుడునై తుహినాద్రిని నుద్ధరించె, త
    ద్భుజబలశౌర్యమ ట్లొనర, పూని దశాస్యుడుఁ గామమోహియై
    కుజను బలాత్కరించగఁ రఘూత్తమమానుషుఁ జేత నీల్గె, న
    య్యజగరమున్ గుటుక్కుమని యచ్చెరువందగ మ్రింగెఁ జీమయే.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  37. ప్రజలనువారలు వోట్లను
    నిజమును నాశించువారు నిలువగ వేయన్
    "ఋజువులు జూపిన నాడే
    అజగరమును మ్రింగె జీమయాశ్చర్యముగన్"

    రిప్లయితొలగించండి
  38. అజగరమున్గుటుక్కుమనియచ్చెరువందగమ్రింగెచీమయే
    గజిబిజియౌటపూరణకుకష్టముగాగనుజేయబోతినే
    నిజమునుజెప్పుచుంటినదినేరముకాదుగసామి!చెప్పుడీ
    యజగరమున్జటుక్కునహారముజేయుటవింతయేగదా

    రిప్లయితొలగించండి

  39. శంకరాభరణం... .
    14/01/2019 సోమవారం

    నేటి సమస్య :
    ******* *** *

    నజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్

    నా పూరణ: కం
    **** **** **** **** ***
    సుజనుడు వసుదేవుడు కక

    ష్ణు జనకుడు మిగుల ఖరమును నుతిజేసె

    నిజమిది!యేమని జెప్పెద

    నజగరమును మ్రింగె జీమ యాశ్చర్యముగన్



    🍀 ☘ ఆకుల శాంతి భూషణ్ 🌿🌱

                        🌷 వనపర్తి 🌷


    రిప్లయితొలగించండి

  40. శంకరాభరణం... .
    14/01/2019 సోమవారం

    నేటి సమస్య :
    ******* *** *

    నజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్

    నా పూరణ: కం
    **** **** **** **** ***
    సుజనుడు వసుదేవుడు కృ

    ష్ణు జనకుడు మిగుల ఖరమును నుతిజేసె నయో!

    నిజమిది!యేమని జెప్పెద

    నజగరమును మ్రింగె జీమ యాశ్చర్యముగన్



    🍀 ☘ ఆకుల శాంతి భూషణ్ 🌿🌱

                        🌷 వనపర్తి 🌷


    రిప్లయితొలగించండి
  41. గుజరాతెన్నిక లందున
    విజయము గొన నొక నలుపుడె వీరుని పైనే
    ప్రజలందఱు పలికిరిటుల
    "అజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్"

    రిప్లయితొలగించండి
  42. ప్రజలకు దెలియదులెమ్మని
    స్వజనంబులకొరకుమంత్రి స్వాహాజేయన్
    నిజమును భృత్యుడు దెలుపగ
    అజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్"

    విజయకు నల్లికలందున
    నిజమని భ్రమియింపజేయు నేర్పును గలిగెన్
    ఋజువుగ గర్టెను నల్లెను
    అజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్"

    రిప్లయితొలగించండి
  43. కం.
    గజబలసమ "బాహుబలి"ని
    నిజముగ కట్టప్ప చంపె నేర్పున, చూడన్
    ప్రజలనుకొనుచుండిరిటుల
    అజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్

    రిప్లయితొలగించండి
  44. అజరామరమైయొప్పును
    నిజగర్వమువీ డినపుడు నిశ్చయముగనే
    నిజమెప్పుడు కాబోదిల
    *"అజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్"*

    రిప్లయితొలగించండి
  45. భుజబలము తోడ మకరము
    నజగరమును మ్రింగె,జీమయాశ్చర్యంబుగన్
    గజముచెవిలోన దూరుచు
    గజిబిజి చేయుచు తిరుగుడు కరి యట క్రుంగెన్

    రిప్లయితొలగించండి