20, జనవరి 2019, ఆదివారం

దత్తపది - 152 (సంధి-సమాస-కారక-క్రియ)

సంధి - సమాస - కారక - క్రియ
పై పదాలను ప్రయోగిస్తూ
భారతార్థంలో 
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

79 కామెంట్‌లు:

 1. సంధి యేమేలుబంధునాశనమువలదు
  మాకును సమాస మునకునుమంచిగోరి
  వంచనాధః క్రియ లమర్చి వారువీరు
  మనగ శుభ కారకా శౌరిమనసుబెట్టు

  రిప్లయితొలగించండి
 2. ( ధర్మరాజు శ్రీకృష్ణునితో )
  సమరకారక ద్వేషమ్ము సమయజేసి
  సంధి సలుపుము మామధ్య సన్నుతాంగ !
  రాయబారిగ క్రియనిక రమ్ము చేయ ;
  ద్వంద్వపు సమాసమగును నద్వంద్వమయ్య !

  రిప్లయితొలగించండి
 3. రిప్లయిలు
  1. బంధులుసంధిజేయుమనిబావనుబంపుచుబల్కిరివ్విధిన్
   యంధుడుధార్తరాష్ట్రుడనియంతమునెర్గకదుష్క్రియాప్తులౌ
   సింధునరాధమాదితతిజెప్పెడుగారకమున్ దలంచు మా
   బంధుజనమ్ముగౌరవులబాగు,సమాసముమేలొనర్చుమా

   తొలగించండి
  2. శంకర్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. సంధి జేసిన మేలగు సకల శుభము
  సమర కారక ద్వేషమ్ము విమల మనదు
  మోస గించిన సమాస క్లేశ మగును
  రాయ బారిగ నామాట క్రియను జూపు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. నాల్గవ పాదంలో ప్రాసయతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
 5. మైలవరపు వారి పూరణ

  సంధియె మేలు నీకు , నిల శాంతిని నిల్పు , హితమ్ము గల్గు , రా...
  జ్యాంధత దోసమాస బలమై స్వజనమ్ముల జంపు , నద్ది ని...
  ర్బంధము గాదు ., యుద్ధమనివార్యమె యందువొ నాశకారకం...
  బంధనృపాత్మజా ! గెలువనైంద్రిని నీ క్రియలెల్ల రిత్తలౌ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. మైలవరపు వారు కీచకుడి వృత్తాంతంతో రాస్తారనుకున్నా నే ! ప్చ్ :)

   హమారీ ఫర్మాయిష్ హై కి ఆప్ కీచక్ కీ కథా సే ఔర్ ఏక్ లిఖియే :)


   జిలేబి

   తొలగించండి
  2. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  3. జిలేబి గారి కోరిక:

   *సంధి - సమాస - కారక - క్రియ*
   పై పదాలను ప్రయోగిస్తూ
   *భారతార్థంలో*
   మీకు *నచ్చిన ఛందంలో* పద్యాన్ని వ్రాయండి.

   ఎదకెద *సంధి* యయ్యెనదియే యనురాగపు సింధువయ్యె ! నే...
   మది దరహా *సమా* !
   *స* ముదయంబగు శారద చంద్రతేజమా !
   వదనసరోజ ! మారశరవర్షమనన్ పెనుతాప *కారకం* ...
   బది ! విడనాడి తక్కిన *క్రియల్* నిశి నర్తనశాలఁ జేరుమా !

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  4. "సరస పూరణ మారశరవర్ష పాతం నిశిని చేరమనడం కృష్ణశాస్త్రిగారు చెప్పారా అన్నట్టు....చక్కని అంత్యప్రాసలు వాడి సహజపదవిరాజితమైయున్నది.అభినందనలు-దాన""

   ...కిలపర్తి దాలినాయుడు


   ***********************

   "ప్రతి శబ్దమూ మనోహరమే. 👌🙏"

   ...చిటితోటి విజయకుమార్

   తొలగించండి
  5. "జిలేబిజీ ! ప్రణామ్.
   హమారే గుౙారిష్ యే హై కీ ఆప్ కే ఫర్మాయిష్ కూ పూరీ కర్నేమే జో కామ్యాప్ హుయీ జనాబ్ మురళీకృష్ణ సాహెబ్ కో ఫర్మానా కర్నేకా ఆప్ కా హుకూమత్ అమల్ కర్ దీజియే""

   ...గౌరీభట్ల బాలముకుంద శర్మ

   తొలగించండి

  6. వాహ్ వాహ్ జనాబ్ మైలవరపు సాహెబ్ !
   షుక్రియాదా యహీ హై జనాబ్ !

   గౌరీభట్ల సాహెబ్ జీ

   సాదర్ ప్రణామ్

   మురళీ సాహెబ్ లాజవాబ్ జనాబ్ హై !


   షుక్రియాదా !


   జిలేబి

   తొలగించండి
  7. శ్రీమతి జిలేబీ గారికి ధన్యవాదాలు 🙏

   మైలారపు మురళీకృష్ణ

   తొలగించండి


 6. క్రియగొను మయ్య కిరీటీ!
  భయమేలన్? కారకుడను! పని నీదయ్యా
  నియతి,దెస, మా సతద గా
  పయనము సాగించు, సంధి, పరిధిని దాటెన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. (ధృతరాష్ట్రుడు పుత్రునితో)
  సంధి లేకయె రాజ్యము శాంతి లేక
  మనునె ? కురుకుల మణిపూస ! మాసమైన?
  కాకుమయ్య!నీవు వినాశ కారకమ్మె !
  యనుసరింపుము మనచక్రి యనెడి మాట!
  **)()(**
  (ప్రయాణంలో ఉండి బస్ టికెట్ పై వ్రాసినాను.)

  రిప్లయితొలగించండి
 8. శ్రీకృష్ణ డు దుర్యోధను ని తో ---_---
  సమర మును మాని సంధి కి స హ క రించి
  సామ ర స్య పు కారక సౌమ్యుడగు చు
  క్రియ కు పూనిన మేలౌను కీలకంపు
  దో స మాసము తొలగును తూర్ణ ముగను

  రిప్లయితొలగించండి

 9. ధర్మరాజు శ్రీ కృష్ణునితో ఇలా.....


  రక్త మేరులై పారును రణము జేయ

  దుఃఖ కారకమగు బావ దురములన్ని

  శాంతి నిడునయ్య మా సమాసక్తి
  మిగుల

  చక్రి!యటులైన యత్నించు సంధి జేయ!


  🍀 ఆకుల శాంతి భూషణ్ 🌿

              🌷 వనపర్తి 🌷


  రిప్లయితొలగించండి
 10. గంధగజమ్ములే గదర కవ్వడి భీములటంచెఱంగు క
  ర్కంధువు కీవు కారకము కావలదోయి సుయోధనా భువిన్
  బంధువులైన మీకిక వివాదము లేల సమాసముల్ గదా
  సంధియె మేలొసంగునదె సత్క్రియ శాంతికి మూలమౌగదా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కీచ *కా రక* రకములింకేలవలపు
   నే *క్రియా* భి *సంధి* బొసగునీవురేయి
   నర్తనమున *సమాస* మునగుదువేని
   జూపుదమరసుఖంబునోసోకురాయ

   (ద్రౌపది కీచకునితో..)

   తొలగించండి
  2. ద్యూత *కారకా* శకుని దుర్యోదనాంత
   మై *సమాస* మైతివి *గ్రియ* మానుమింక
   *సంధి* బొసగనీయూర్కొమ్ము సింధురరథ
   ఘోటకభటబలతతులుగూలు నాజి

   (భీష్ముడు శకునిని వారిస్తూ....)

   తొలగించండి
  3. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   *********
   శంకర్ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 11. రిప్లయిలు
  1. సవరించిన పూరణ
   సవరించిన పూరణ
   సంధి జేసిన మేలగు సకల శుభము
   సమర కారక ద్వేషమ్ము విమల మనదు
   మోస గించెగాన సమాస క్లేశ మగును
   రాయ బారిగ నామాట రక్ష జేయు

   తొలగించండి
  2. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సమాస క్లేశ' మన్నపుడు 'స' గురువై గణదోషం.

   తొలగించండి
 12. గురుదేవులకు వినమ్రవందనములు
  =============*********==========
  తండ్రి తో దుర్యోధనుడు

  జన్మకారక! భయమేల?సమరమౌను,
  మా సమాసక్తి కిన్ తావు మదిని లేదు
  సంధియని వచ్చి వాడెపో సరగునేగె,
  నక్రియుడు కాడు యువరాజు,నక్కజుండు!

  రిప్లయితొలగించండి

 13. కుంతీదేవి తో కర్ణుడు


  ఓ యమ్మ సమాసక్తి క
  లాయె! యపక్రియను చేయ! లక్ష్యము పార్థుం
  డే యితరుల తాకను! నే
  నై యపకారకము గాను యభిసంధియిదే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 14. కురుక్షేత్ర యుద్ధములో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో ..

  కందం
  నియతిన్ సంధిని గూర్చెడు
  ప్రయత్నఁపు సమాస మెఱుఁగ బంధువు లనెడున్
  దయ యపకారక, మనిలో
  గ్రియా పరత్వమ్ము నెంచఁ గ్రీడీ! జయమౌ

  రిప్లయితొలగించండి
 15. శ్రీకృష్ణునితో ద్రౌపది

  సంధి సంధింప వలదయ్య చక్రినీవు
  దుఃఖ కారకమైనట్టి దుష్క్రియలను
  మరువలేనయ్య మదిలోన మాననీయ
  యరిసమాసము నశియింప యానగొనుము

  రిప్లయితొలగించండి
 16. {దుర్యోధనునితో శ్రీకృష్ణుడు}
  సంధి గూర్పగ నికనైన సమ్మతింపు
  మిచ్చట సమాసములనుచు నెంచ బోకు
  పోరు సర్వజన వినాశ కారకమ్ము
  క్రియను బట్టి కదా మంచి,కీడు గలుగు !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 17. ఐదూళ్లివ్వక సంధిని
  కాదని కౌరవులు యుద్ధ కారకులై దా
  యాదులతో పోరు క్రియన
  ఖేదపడుటయే సమాస కేళిగద హరీ

  సమాస.... సంక్షిప్త?

  రిప్లయితొలగించండి
 18. దురిత కారకములుగద దురము లవియ
  యన్నదమ్ములు సమాస మగుటమేలు
  సంధి జేయుమ మామధ్య శౌరి!నీవ
  యేక్రి యనుజేతు వోచేయు మిపుడు సామి!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. యన్నదమ్ములిట
   గా సవరించితిని
   సర్

   తొలగించండి
 19. ఈ రోజశంకరా భరణము సమస్య సంధి - సమాస - కారక - క్రియ
  అన్న పదములు ఉపయోగించి భారత అర్ధములో పద్యము
  ఉత్తరాగోగ్రహణము చేయు సమయమున అర్జునుడు ఉత్తరుని తోరధము పైకి ఎదురు రాగ అర్జునుడు అజ్ఞాతవాస నియమము తప్పి దొరికి పోయాడు మరల పాండవులకు 12 సంవత్సరములు వనవాసము ఒక ఏడు అజ్ఞాత వాసము అని దుర్యోధనుడు తన వారలకు చెబుతాడు సంతోషముగా అతిశయముతో అన్నపలుకులకు భీష్ముడు దుర్యోధనుని వారించినీ దుష్టబుద్ది మానుకొనుము అనుచు పలికిన పలుకులు

  నీ భావనము తప్పు నీకిది నడియా(స,
  మాస)ములంధిక మాసములను

  గుణనము చేయక కోపము తోబల్క
  నేల, ముగిసెనుగా నేటి తోడ


  వారల కజ్ఞాత వా(సం,ధి) షణమతో
  భావనమును జేయ ఫలము కల్గు,

  ధి(క్రియ) ధోరణి తెచ్చు నాశనమును,
  కపట మనో (కారక) మురియ వల


  దయ్య దుర్యోధనా, వారు ధర్మమునకు
  మారుపేరు, తప్పులు చేయ బోరు నెపుడు,
  ననుచు భీష్ముడు దుర్యోధనుని కు తంత్ర
  బుద్ది పైన వేటున్వేసె గద్దఱించి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వాసం' అనడం వ్యావహారికం.

   తొలగించండి
 20. సంధింపఁ బరమ శాంతి ప
  రంధాముఁడు రా నొసఁగి సుర సమాసన మ
  య్యంధపతి చక్రి యడిగిన
  సంధి యతని కారక యగు సరణిని నుండెన్

  [..యతనికి + ఆరక = యతని కారక; ఆరు = కులుగు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   ప్రశస్తంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 21. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  సందర్భం: కలకత్తా కూటమి

  బంధులు సక్రియమ్మునగు బంగలు కన్నియ కన్నుగీటగా
  సంధిని కోరుచున్ వడిగ సందడి జేయుచు జేరిరచ్చటన్
  రంధియె కారకమ్ముగద రచ్చను మోడిని పాతిపెట్టు దు
  ర్గంధ సమాసకమ్మునగు
  "గందర గోళపు గొంతుచించుటన్"

  సక్రియము = చురుకుతనము కలది
  కారకము = చేయునది
  సమాసకము = శుద్ధాంధ్ర పదముల సమాసము

  (ఆంధ్రభారతి)

  **************************

  "సహజంగా సమస్యలన్నింటికీ పూరణలకు మహాభారతం అనువుగా ఉంటుందని ఆర్యోక్తి.... మీకు కూడా అదే... అయితే...మన భారతం"

  ...మైలవరపు మురళీకృష్ణ
  02.01.2019

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పద్య తుర గాభిగమన ప్రభాక రాభ శాస్త్రాశాస్త్ర పరీత కవన గమన శంక రాభర ణాధ్వ చిత్ర గమన కారణ తెనాలి రామాఖ్య గణనా కొనుమా మా కయివారముల్.

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   నవీన భారతాంశంతో మీ సరదా పూరణ విశిష్టంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  3. వేవేల నమస్సులు అందరు మహానుభావులకు!

   శంకరాభరణానందములో క్షణ క్షణం మునిగి తేలుట దినచర్యగా నున్నది. 👇

   ****************************

   శంకరాభరణం సమస్య - 2619

   "హనుమంతుం డదె లంక కేగి విడిచెన్ హా సోదరా ప్రాణమున్"

   భవిష్య పురాణం: 👇

   కనుమా! సోదర! కాల్చెరా భవనముల్ కాకుత్స విఖ్యాతికై
   హనుమంతుం డదె లంక కేగి;...విడిచెన్ హా సోదరా! ప్రాణమున్
   ఘనమౌ ప్రీతిని శంకరాభరణమున్ గాఢమ్ముగా హత్తుచున్
   దినమున్ రాత్రి ప్రభాకరుండలయకే దీర్ఘంపు శ్వాసమ్ముతో :)

   (కంది శంకరయ్య గారి సౌజన్యంతో)

   తొలగించండి

 22. శ్రీకృష్ణ ఉవాచ :

  ఉత్సాహంబది దోసమాసయని నయ్యోయంచు బీభత్సుడా
  తాత్సర్యంబును జేయకయ్య! క్రియగా ధైర్యంబుగా యుద్ధమున్
  మాత్సర్యంబును వీడి కారకపు కర్మాంగమ్ముగా జూడు మీ!
  యుత్సాదించుము శత్రు కూటమిని నీ వ్యూహంబుతో సంధియై!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 23. సంధి గోరిరి జ్ఞాతులు శాంతి నిలుప
  హాని కారక యుద్ధము మానదగును
  మీస మా సములకు జూప మేలు రాజ !
  నీదు క్రియ శూన్య పదములు నిలుపమయ్య

  నిన్నటి సమస్యకు నా పూరణ

  పిచ్చి బట్టిన కవి తాను పృచ్ఛకునని
  బల్కి యవధానమందున పండితునకు
  చక్కనగు సమస్య నిడె నజ్ఞాని గాగ
  కుక్క గడ్డిని మాంసమున్ గోవు దినును

  రిప్లయితొలగించండి
 24. మిత్రులందఱకు నమస్సులు!

  [బృహన్నల, తా నర్జునునిగా మాఱిన పిదప నుత్తరునితో మాటలాడు సందర్భము]

  "సంధిలిన వనవాసమ్ము సమసినంత,
  వేస మాసరా యయె నాకు విరటుఁ గొల్వఁ,
  గౌరవుల దోష కారక కర్మచేత
  నిట్టి యుద్ధక్రియ యిటఁ బ్రాప్తించె వత్స!"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మధుసూదన్ గారూ
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు.
   'అయె' ప్రయోగం సాధువు కాదంటారు?

   తొలగించండి
  2. ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
   రెండో పాదాన్ని
   "వేస మాసరా యాయెను విరటుఁ గొల్వఁ" అని పఠించగలరు...

   తొలగించండి
 25. సంధికి బిల్చి పాండవుల సఖ్యత జూపుము రాజరాజ యా
  మంధరమైన లొంగు తగు మాల్మిని జూపిన నిట్టి సత్క్రియన్
  బంధులు నీదు తల్లియును భ్రాతలు మిత్ర సమాస మెల్ల జా
  త్యంధుడు నీదు తండ్రియును హాయికి కారక మంచు మెచ్చగా.

  రిప్లయితొలగించండి
 26. కృష్ణరాయభారం
  సంధియిది సమాసక్రియ సర్వులకును
  కారకంబగు భాగంబు లారగించ!
  అన్నదమ్ముల సంధిని విన్నవింతు
  వినగ మేలౌను ప్రక్రియమనుటకొరకు

  రిప్లయితొలగించండి
 27. గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ ....

  బాణమ్మును సంధించగ
  రాణువ భయపడి చెదిరె గురంగములక్రియన్
  ప్రాణులకు భీతి కారక
  ద్రోణుని సమాసము గలిగిన దోర్భలు లరుదే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లక్ష్మినారాయణ గారూ
   మీ పూరణ బాగున్నది అభినందనలు.
   చివరి పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
 28. సంధి ప్రయత్నమంతయును సర్వము నాశము జేసెవాడు గ
  ర్వాంధుడు కౌరవేంద్రుడనివార్యము యుద్ధము దుస్సమాసమా
  బంధుగణంబు దానినిక బాపగ చక్రియ నుజ్ఞతో జరా
  సంధుల మృత్యుకారకపు శంఖము నూదిరి పాడునందనుల్

  రిప్లయితొలగించండి
 29. బాణములను *సంధిం*చ బవరమునందు
  విజయుఁ డ*సమాన* ప్రతిభతో పిచ్చలించి
  ద్యూత*కారక* శకునియు భీతి నొంద
  *క్రియ* లుడిగి పరుగిడిరి వైరి చదలమ్ము

  రిప్లయితొలగించండి