28, జనవరి 2019, సోమవారం

సమస్య - 2914 (సాధువుగ గ్రహింతుము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సాధువుగ గ్రహింతుము దురాచారు నెపుడు"
(లేదా...)
"సాధుశ్రేష్ఠునిగా గ్రహింతుము దురాచారున్ జనుల్ మెచ్చఁగన్"

87 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. మంచి చెడులను కనలేని మైక మందు
      నీతి యవినీతి యనునవి కోత లేను
      పాప భీతిని మరచిన ప్రముఖు లందు
      సాధు వని మెత్తుమే దురాచారు నౌర

      తొలగించండి
    2. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. డా.పిట్టా సత్యనారాయణ
    శిక్ష దప్పించుకొను దీక్ష; శివుడొ, హరుడొ
    పూర్వ సంచిత పాపపు పొడను నమ్మి
    ఏవగించము;వేషాని కెంత విలువొ!
    సాధువని మెత్తుమే దురాచారు నౌర!

    రిప్లయితొలగించండి
  3. స్వార్థరహితుడై నిరతమ్ము జనుల మేలు
    కొరకు యోచించునట్టి యా పురుషు లిలను
    సాధువుగ గ్రహింతుము, దురా చారు నెపుడు
    విషము గలపాము లట్లుభావింప దగును.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పురుషు నిలను' అనండి.

      తొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    హిరణ్యకశిపుని ఆదేశమును అనాసక్తిగా అశక్తతతో ప్రకటించుచున్న సేవకులు...

    గాధాంశమ్ములు మా హిరణ్యకశిపాఖ్యానమ్ములే కావలెన్
    బోధల్ మా విభుదివ్యనామగుణసందోహమ్ములే కావలెన్
    యోధుండాతడెయంచు దెల్పనగు , నా యొజ్జన్ ముదంబొప్పగా
    సాధుశ్రేష్ఠునిగా గ్రహింతుము దురాచారున్ జనుల్ మెచ్చఁగన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. బాధల్ పెట్టెడివాడు , స్త్రీల గని నిర్బంధించువా , డాస్తులన్
      స్వాధీనమ్మొనరించుకొంచు , తన ద్రవ్యమ్మాశ చూపించి , తా...
      నాధిక్యమ్ముగ గెల్వనెన్నికలలో నంత్యమ్ముగా వానినే
      సాధుశ్రేష్ఠునిగా గ్రహింతుము దురాచారున్ జనుల్ మెచ్చఁగన్ !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  5. మంచి చెడు లను గ్రహియించి మానవాళి
    బాగు కోరు చు సతతము పరగెనేని
    సాధు వని మెత్తుమే ; దు రా చారు నౌ ర
    నీ స డించుచు దరి జేర నిష్ట పడరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  6. స్వాములగుచు కాషాయ వస్త్రముల దాల్చి

    సంఘపు వినాశ కార్యాలు సలుపుచు కడు

    మేక వన్నె పులివలెను మెలుగుచుంద్రు

    సాధువని మెత్తుమే దురాచారు నౌర


    🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  7. మేక తోలు కప్పిన వ్యాఘ్ర మెపుడు తిరుగు
    ఛాగి గుంపులోన కలసి, చంపు చుండు
    నదును చూసి వాటిని కడుముదము తోడ,
    భరత భూమిలో జనుల దౌర్భా గ్యముగద
    సాధువని మెత్తుమే దురాచారు నౌర
    దొరికినంతనే పలుకును దొంగ లనుచు
    దొరక కున్న పిలుతురుగా దొరలనిచట




    రిప్లయితొలగించండి


  8. చేయు పనులెల్ల కలిగించె చేటునమ్మ
    చూడ గా నాశ్రమునవసించు మునివలె! దు
    రాగతముల కంతేలేదు! రాలుగాయి!
    సాధువని మెత్తుమే దురాచారు నౌర ?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చూడ నాశ్రమమున వసించు మునివలె దు' అనండి.

      తొలగించండి


  9. మేధాజీవి యొనర్చు కార్యములు సుమ్మీ బమ్మి మారున్ వెసన్
    సాధారణ్యపు తిమ్మిగాను మనమైసై పోవుచున్ వారినే
    సాధుశ్రేష్ఠునిగా గ్రహింతుము! దురాచారున్ జనుల్ మెచ్చఁగన్
    రాధావల్లభ! కీడుమూడు భువిలో రాడ్వంశుడైవెల్గు తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. స్వార్థపర తత్వ భావ విష ప్రయుక్త
    చింతనాసక్తుడై యుండి వింతవింత
    చేష్థలను జేసి జపమాల చేతగొనగ
    సాధువుగ గ్రహింతుము దురాచారు నెపుడు

    రిప్లయితొలగించండి
  11. కల్లలాడుచు, నిరతమ్ము గల్లుఁ ద్రాగి
    జూద మాడుచు వేశ్యల చుట్టుఁ దిరుగు
    నట్టి వానిఁ బహిష్కృతు నఖిల విముఖ
    సాధువుగ గ్రహింతుము దురాచారు నెపుడు

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా సత్యనారాయణ
    బాధల్ గాననినాడు యన్యుల క్రియల్ పర్కింతు మా కష్టపుం
    గాధల్ పైబడ దోషులై మనెదమే గంభీరతన్ మాని తత్
    మేధాశక్తిని వేషగాని వలెనే మీసంబు గడ్డంబులన్
    రాధా కృష్ణ యటంచు దిర్గగ విరాట్యోగ(వరాడ్యోఢ)మై చెల్లగా
    సాధుశ్రేష్ఠునిగా గ్రహింతుము దురాచారున్ వితర్కింపగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నాడు + అన్యుల' అన్నపుడు యడాగమం రాదు. 'పరికించు'ను 'పర్కించు' అనడం సాధువు కాదు. 'విరాడ్యోగమై/వరాడ్యోఢమై' అన్నచోట గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. డా. పిట్టా సత్యనారాయణ
      బాధల్ గాననినాడు నన్యుల క్రియల్ పాటింప మా కష్టపుం
      గాధల్ పై బడ దోషులై మనెదమే గంభీరతన్ మాని తత్
      మేధాశక్తిని వేషగాని వలెనే మీసంబు గడ్డంబులన్
      రాధాకృష్ణ యటంచు దిర్గగ మరో రాయంచయై చెల్లగా
      సాధుశ్రేష్ఠునిగా గ్రహింతుము దురాచారున్ వితర్కింపగన్

      తొలగించండి
  13. డా.పిట్టా నుండి
    ఆర్యా,()లో విరాడ్యోగ గా చదువ మనవి.

    రిప్లయితొలగించండి
  14. (ఆషాడభూతి వంటి ఒక సన్న్యాసిబ్రువుడు)
    క్రోధం బింతయు జూపకుండ ప్రజ క
    క్రూరుండుగా నుండుచున్;
    మేధావిం బలె నేర్పుమీర నొక స
    న్మిత్రుండుగా మెల్గుచున్;
    వేధ న్నేనని నమ్మబల్కగల వే
    వేసాల మాయావినే
    సాధుశ్రేష్ట్తునిగా గ్రహింతుము దురా
    చారున్ వితర్కింపగన్.


    రిప్లయితొలగించండి
  15. కపట వర్తనమేగద కలికి ప్రియము
    తేనెలూరెడి పల్కుల తెలివిగల్గి
    మేకవన్నెల పులులవి వీకజూప
    సాధువుగ గ్రహింతుము దురాచారు నెపుడు

    రిప్లయితొలగించండి

  16. కైపదము మారి పోవగ
    నో పడతి మరియొక పూరణోత్సాహము గాంచెన్ :)


    జనుల కెల్ల మేలునుచేయు జంగమయ్య
    లకు జిలేబి వందనమిడి లక్షణముగ
    సాధువుగ గ్రహింతుము! దురాచారు నెపుడు
    దూరముగ నుంచడము మేలు తోయజాక్షి!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  17. ధర్మ దేవత నడచును దయను మాలి
    కుటిల కలికాల మందున కుంటి నడక
    శీల మునకీక మన్నన చాలి నంత
    సాధువుగ గ్రహింతుము దురాచారు నెపుడు !

    రిప్లయితొలగించండి
  18. సాధువుల మంటు కావి వస్త్రాలు గట్టి
    కపట బోధలచే ప్రజ కళ్ళు గప్పి
    విత్తమార్జన గావించు విఃత ఢోంగి
    సాధువంగ గ్రహింతుము దురాచారు నెపుడు
    ఢోంగి=మోసగాడు
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  19. వరములను బడసి వాతాపి యిల్వలుల్ పరిమార్చు చుంటిరి బ్రాహ్మణులను,
    కాననమున తిరుగాడు నగస్త్యముని వరుని కాంచిన కవుచు మేప
    రులు మార్చితిరి తమ రూపమును , మునులై పిలచి నారతనిని చెలిమి తోడ
    తమ యింట విందుకు, తపసి వారి మనము ముందుగా నూహించి విందు బడసి
    పొట్ట లోపలే చంపెను పొలసు దిండి
    నపుడు ,వాతాపి కై చూచు నసురు మనము
    నెరిగి బలికె నతనితో మునివరు డిటుల
    సాధువుగ గ్రహింతుము దురాచారు నెపుడు

    రిప్లయితొలగించండి
  20. మనసు దోచెడి రీతిగ మాటలాడి
    తొలగ జేసెద జాతక దోషమనుచు
    పైకము గొని పరుగు దీయు వాని నిలను
    సాధువుగ గ్రహింతుము దురాచారు నెపుడు

    రిప్లయితొలగించండి
  21. శ్రీ దత్తాత్రేయుల వారితో విష్ణుదత్తుడిట్లనె....

    కటిక వానివలె తిరిగె కల్లు తాగె
    అంగనల కూడె కటకట నందరావె
    ఎరుక నీయర స్వామి నిన్నెటుల నయ్య
    సాధువుగ గ్రహింతుము దురాచారు నెపుడు?

    రిప్లయితొలగించండి
  22. నిండు కాషాయ వస్త్రమ్ము మెండుగను ధ
    రించి , నీతులెన్నొనుడివి నాచ రించ
    కున్న, నియమ నిష్టలుగల్గియు నతనిని న
    "సాధువుగ గ్రహింతుము దురాచారు నెపుడు"

    రిప్లయితొలగించండి
  23. రిప్లయిలు
    1. మనిషి యున్నను లేకున్న మనును కీర్తి
      నాక సుఖమన్న దది యున్న నాళ్ళు దక్కు
      సాధువని నెంచెదము సదాచారు నిల న
      సాధువుగ గ్రహింతుము దురాచారు నెపుడు

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సాధువని యెంచెదము' అనండి.

      తొలగించండి
  24. కనగ ధర్మార్థకామమోక్షాల లోన
    ధర్మ మడుగంటె మోక్ష పథమ్ము చెదిరె
    నర్థకామాల కాలమై నట్టి కలిన
    సాధువుగ గ్రహింతుము దురాచారు నెపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వ్యాధుండైనను వ్రాసి రామ కథయే వాల్మీకి పేరొందెగా!
      క్రోధంబున్నను తా మహర్షి భృగువే క్షోణిన్ ప్రకాశించెగా!
      గాధేయుండిల జేసె నెన్ని దొసగుల్ కాంతిల్లె బ్రహ్మర్షిగా!
      సాధుశ్రేష్ఠునిగా గ్రహింతుము దురాచారున్ జనుల్ మెచ్చఁగన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి అభినందనలు.

      తొలగించండి
  25. మంచి చెడ్డలు గ్రహియించి మసలునతని
    సాధువుగ గ్రహింతుము,దురాచారునెపుడు
    దూరముగ నుంచవలయును దురముగాను
    లేని యెడలను గీడును నొనరజేయు
    (దురము=యుద్ధము,వేగము)

    రిప్లయితొలగించండి
  26. నీ ధర్మమ్మును వీడబోకుమను చున్ నిత్యమ్ము భక్తాళికిన్
    బోధల్ జేసెడు వారు సేవకనుచున్ భోగార్థులై స్త్రీలకే
    ప్రాధాన్యమ్మునొసంగెడిన్ గపట బాబానే గనన్ ధాత్రిలో
    సాధుశ్రేష్ఠునిగా గ్రహింతుము దురాచారున్ జనుల్ మెచ్చగన్

    రిప్లయితొలగించండి
  27. దుర్యోధనుని జన్మమునఁ బెక్కు దుర్నిమిత్తములు పుట్టెను, జన సంక్షయ జననుఁ డగును గులము నఖిల లోకములకు నపాయము సేయు పురుషాధముఁ డగును, వీని దూషించి జగమును కులమును రక్షించుట తగు నని పలికిన భీష్మ సహిత విదురుని తో ధృతరాష్ట్రుఁ డనిన పలుకులు:

    విదుర తగవే యిటు లనంగ విడువ మంచుఁ
    బాడియే దుష్టుడంచును వీడ సుతునిఁ
    జెప్పి సుద్దుల నింపుగఁ జేసి యితని
    సాధువుగ గ్రహింతుము దురాచారు నెపుడు


    వేధించుం గడు భృత్యవర్గమును వే భీభత్సుఁడై నిత్యమున్
    సాధించుం దన వారి మీఱ నిజ వాచ్యశ్రేణి యైనన్ దయన్
    గోధాన్యాదిగ విత్తరాశులను దాఁ గోపమ్ము వో నీయఁగా
    సాధుశ్రేష్ఠునిగా గ్రహింతుము దురాచారున్ జనుల్ మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  28. అందరిఁ గలుపుకొనిపోవు నట్టివాని
    సాధువుగ గ్రహింతుము, దురాచారు నెపుడు
    దరికి చేరనీయరెవరు, తమ బ్రతుకులు
    శాంతితోడ గడుపుకొన సంతతమ్ము

    రిప్లయితొలగించండి
  29. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    రిసర్చి స్కాలరువాచ:👇

    బాధల్ బెట్టుచు డబ్బులివ్వకయె తా ప్రాజెక్టు గ్రాంట్లందునన్
    బోధల్ జేయక కాళ్లు పట్ట మనుచున్ పొర్లాడి దొర్లాడుచున్
    ప్రాధేయమ్ముల కొప్పుచున్ వడివడిన్ పట్టమ్ము నిప్పించుచో...
    సాధుశ్రేష్ఠునిగా గ్రహింతుము దురాచారున్ జనుల్ మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  30. చెడునువిడనాడి మంచినే సాకువాడె
    సాధువుగ గ్రహింతుము!"దురాచారునెపుడు
    మూర్ఖచిత్తుల మాటలేమూటలనగ
    పరులుజెప్పినవినడు!సంపదలునమ్మి

    రిప్లయితొలగించండి
  31. రెండవపూరణ
    పరుల మేలును గోరెడి వాని నెపుడు
    సాధువుగ గ్రహింతుము, దురాచారు నెపుడు
    దూరముంచిన మేలగు తోడ హాని
    తప్పు నందురు విబుధులు ధరణి యందు.

    రిప్లయితొలగించండి
  32. సాధించన్ సులువంచు వంచనలతో సామీప్యమున్ చేరుచున్
    బాధన్ పొందెడి పేదవారికిట సంప్రాప్తించు మేలంచు సం
    బోధన్ చేయుచు నాశ్రమమ్ముల సదా మోసమ్ముకావించినన్
    సాధుశ్రేష్ఠునిగా గ్రహింతుము దురాచారున్ జనుల్ మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  33. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తన్మోహమ్ములన్" అనండి.

      తొలగించండి
    2. శార్దూలవిక్రీడితము
      సాధారణ్యము లేని వేమనయె వేశ్యాలోలుడై విశ్వదే
      బోధల్జేయఁగ సత్యమే దెలిసి తన్మోహమ్ములన్ వీడుచున్
      మేథాజీవిగ నీతి నాటవెలదుల్ మేల్కొల్ప వ్రాయంగనే
      సాధుశ్రేష్ఠునిగా గ్రహింతుము దురాచారున్ జనుల్ మెచ్చఁగన్

      తొలగించండి
  34. తేటగీతి
    భోగమున్ వీడి వేమన్న యోగి యౌచు
    ఆటవెలదుల శతకమ్ము నంద జేయ,
    సాధువుగ గ్రహింతుము దురాచారు నెపు డ
    టన్న తప్పు పశ్చాత్తాపమందు కడుగ

    రిప్లయితొలగించండి