24, జనవరి 2019, గురువారం

సమస్య - 2910 (దీపముపై నొక్క యీఁగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్"
(లేదా...)
"దీపముపైన నీఁగ కడు ధీరత వ్రాలె సురక్షితమ్ముగా"

103 కామెంట్‌లు:

  1. దీపము చిత్రము నెన్నిన
    కాపుల నాయకుని యింట గడబడ లోనన్
    దాపున పోస్టరున గనిన
    దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దీపంబునీగసినిమన్
      శాపమువలెవెంబడించు చర్వణనొంపన్
      దాపునహీరోయిడ నా
      దీపముపై నొక్క యీగ ధీరత వ్రాలెన్

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      పోస్టర్ మీది దీపంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ************
      శంకర్ గారూ,
      ఈ పూరణపై వాట్సప్ లో పెట్టిన వ్యాఖ్యను గమనించండి.

      తొలగించండి
  2. పాపఁడు సూచి సంతసిల వర్ణసుశోభితమైన రీతినే
    చూపుచుఁ గాగితమ్మునను జొక్కఁపుఁ బ్రజ్ఞను జిత్రకారుఁడే
    చేపను, వెల్గు దీపమును, జీమను గీచెను బొమ్మ; లందులో
    దీపముపైన నీఁగ గడు ధీరత వ్రాలె సురక్షితమ్ముగా

    రిప్లయితొలగించండి
  3. కోపము పెరుగుట తగదని
    శాపము గాపరిగ ణించి శలభము వోలెన్
    పాపము మాడెను కనుకని
    దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పాపము మూడెను కనుకన్' అనండి.

      తొలగించండి
    2. కోపము పెరుగుట తగదని
      శాపము గాపరిగ ణించి శలభము వోలెన్
      పాపము మూడెను కనుకన్
      దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్

      తొలగించండి


  4. ఆపుకొన లేక శలభము
    దీపమున పడి మృతి నొందె దిగ్గు నెగయుచున్
    దీపంబణగారగ నా
    దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. మిఠాయిలు తయారు చేయునప్పుడు చక్కర పాకము పట్టుతారు .అరిసెలు మున్నగు పిండి వంటలకు తీగ పాకము వచ్చిన దాక పంచదార ద్రవమును మరిగిస్తారు మరుగుతున్న పాకమును కొద్దిగా నీటిలో వేసి చూస్తే అది తీగల
    సాగు తుంది అప్పుడు దానిని దించి దానిలో పిండి కలుపుతారు దీపమునకు తీగ అనిఅర్ధము కలదు దీప పాకము
    కొంత నేలపై దొర్లగ చల్లపడిన ఆ తీగపై ఒక ఈగ వాలినదని భావన. (పక్తి = వంట దీప పాకము తీగ పాకము)

    దీపావళి నాడు చక్కెర
    తో పక్తిని చేయు చుండ దొరలెను మహిపై
    దీపపు పాకము, నపుడా
    దీపము పై నొక్క యీఁగ ధీరత వ్రాలె న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  6. కందం
    చూపించె బుద్ధి కుశలత
    నాపకు యజ్ఞాశ్వమునను నా రామునితో
    నూపున కుశుడు! కుజ మనో
    దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్

    రిప్లయితొలగించండి

  7. ఇవ్వాళ్టి 'ఆడ' విడుపు :)


    కోపము తోడు పెన్మిటిని కోమల వళ్లి జిలేబి త్రోయగా
    తాపము వీడ లేని పతి తంకము తంకము గాను చేరగా
    సీపెపు ముత్తెమై వెలుగు శ్రీమతి చువ్వన వేడి గాన నా
    దీపముపైన నీఁగ కడు ధీరత వ్రాలె సురక్షితమ్ముగా!


    జిలేబి పరార్

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా సత్యనారాయణ
    హీరో ఆఫ్ హార్లెమ్ కథనములో నొక బాలుడు నగరము దాపున గల ఆనకట్టకు రంధ్రము పడగా గమనించి అందులో తన వ్రేలిని దూర్చి రాత్రి అంతా మేల్కొని ఆ హార్లెమ్ నగరమును ముంపు(జల ప్రళయము)నుండి కాపాడినాడు.
    దాపున జలనిధి కట్టకు
    ఏపగు నొక రంధ్రమరసె యీడుకు పిన్నై
    ప్రాపయె హార్లెము ప్రజలకు
    దీపముపై నొక్క యీగ ధీరత వ్రాలెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆపముపైనప్పముపై
      దాపుననున్నట్టియాపదార్థములముపై
      యోపికవ్రాలుచు జిత్రక
      *"దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్"*

      (చిత్రకదీపము=అందమైనఆముదపుచెట్టు)

      తొలగించండి
    2. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *********
      శంకర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      దీనిపై నా వ్యాఖ్యను వాట్సప్ లో చూడండి.

      తొలగించండి
  9. ( శిష్టులలో విశిష్టుడైన వశిష్టునిపై ఈగ వ్రాలింది )
    కోపము లేనివాడు ; ఘన
    గుంభితకారుణికస్వభావుడున్ ;
    శాపము నీనివాడు ; నతి
    శాంతుడు ; భవ్యుడు ; ధర్మపత్నికిన్
    దాపము దీర్చువాడు ; సహ
    తాపసశిష్టవశిష్టుడన్ మహా
    దీపము పైన నీగ ; కడు
    ధీరత వ్రాలె సురక్షితమ్ముగా .

    రిప్లయితొలగించండి

  10. చూపరులచ్చెరు వొందగ
    దీపపు బొమ్మను రచింప దీరుగ నొకడే
    యా పటమున నగుపడు నా
    దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్

    రిప్లయితొలగించండి
  11. డా. పిట్టా సత్యనారాయణ
    పాపలు రంగవళ్ళులను పచ్చని "చిప్ప"(దీపపు ప్రమిద)ను దించి, దానిపై
    రూపును దిద్ది రెర్రగను రొప్పిన రంగుల దీప రూపమే
    వ్యాపకమైన దా లవణ వాటిక నాకలిగొన్న జీవియై
    దీపము పైన నీగ కడు ధీరత వ్రాలె సురక్షితమ్ముగా!

    రిప్లయితొలగించండి
  12. చేపల కూరచేయ మనె చిక్కుడు జేసితి వేలనే సఖీ
    మాపటి కైనగాని మరి మాటను దప్పక వండకున్న చో
    రేపటి నాదుకోప మున రెక్కలు రాలిన శలభ మౌదువే
    దీపము పైన నీఁగ , కడు ధీరత వ్రాలె సురక్షి తమ్ముగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదం చివర గణభంగం. సవరించండి.

      తొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    పాపము! తెల్లవారగనె భౌతికశాస్త్రపరీక్ష , దానికై
    మాపటివేళ *కాంతి ఋజుమార్గమునన్ జను* బొమ్మ గీయగా
    *దీపము నట్టముక్కలను* దిద్దుచు బాలుడు , గాంచి యత్తరిన్
    దీపముపైన నీఁగ కడు ధీరత వ్రాలె సురక్షితమ్ముగా !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  14. దీపము వెలిగించి పిదప
    ధూపము వేయ గుడిలోన తుష్టిని హరికిన్
    బాపఁ జలిని కొండెక్కిన
    దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దీపమువెల్గుచున్ప్రజకుతేజమనేయొకదివ్యమార్గమున్
      జూప,నసత్తుమిథ్యమదుసూదననీదెసజిత్తముండనీ
      పాపముబుణ్యమన్మధువుపై జనునెడ్దనునీగయెర్కతన్
      *"దీపముపైన నీఁగ కడు ధీరత వ్రాలె సురక్షితమ్ముగా"*
      పాపహరుండుదారినిడబ్రజ్ఞకువెల్గగుధీప్రదీపమై

      తొలగించండి
    2. ఓపికజేకొనిమలిగిన
      *"దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్"*
      తాపముపాపముశాపము
      కోపముశమియించనెడ్దకోవెలయగుగా

      తొలగించండి
    3. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ************
      శంకర్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  15. రూపున కంతుడు నాతని
    ప్రాపున వర్ధిల్లి రింటి వారు,నూరున్
    పాపము గతించె,నా కుల
    దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. రూపున కంతుడు నాతని
      ప్రాపున వర్ధిల్లి రింటి వారలు,నూరున్
      పాపము గతించె,నా కుల
      దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్!

      తొలగించండి
  16. దీపము,చాపము మొదలగు
    రూపముల మిఠాయిలు కడు రుచిగా జేయన్
    మాపటి వేళ లెగురుచును
    దీపముపై నొక్క యీగ ధీరత వ్రాలెన్

    ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాపీయెయీగయైనరకపాలుసభాస్థలివెల్గుదీపమై
      తాపముశాపపాపములదండనకైగొనిరాగపాపమా
      పాపినినిల్పిరక్కడసభాసదులిట్లనిరక్కజంబుగా
      *"దీపముపైన నీఁగ కడు ధీరత వ్రాలె సురక్షితమ్ముగా"*

      తొలగించండి
    2. పాపారిహరివచించెను
      పాపాంతంబగుననలముపైబడినంతన్
      తాపసిపల్కులువినియా
      *"దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్"*

      తొలగించండి
    3. దీపముమూలనక్కెనవదీపములెన్నియొరాణకెక్కగా
      దీపముపాతదయ్యెమణిదీపముబ్యాటరిధీప్రదీపముల్
      దీపములెన్నొవచ్చినవి,దీపమునుష్ణముశీతలంబు నే
      *"దీపముపైన నీఁగ కడు ధీరత వ్రాలె సురక్షితమ్ముగా"*

      తొలగించండి
    4. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *********
      శంకర్ గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      వాట్సప్ లో నా వ్యాఖ్యలను గమనించండి.

      తొలగించండి


  17. దీపము బెట్టుకొనెను తా
    నా పడతుక బుగ్గ చిదిమి నచ్చగ పెండ్లా
    మై పక్కన రాగా, నా
    దీపముపై నొక్క యీగ ధీరత వ్రాలెన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. ఆపద నెఱుఁగ ని జీవిగ
    దా పున కాంతుల ను జి మ్మి ధగధగ మెరియన్
    పాపము పుణ్య ము లేoచక
    దీప ము పై నొక్క యీ గ ధీరత వ్రాలేన్

    రిప్లయితొలగించండి
  19. పాపగ కౌశికుని ఋణము
    పాపము! సత్యవ్రతుండు వనముల కేగన్
    నేపగ నక్షత్రకుడట
    దీపముపై నొక్కయీగ ధీరతవ్రాలెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. తాపసు లిద్దరున్ దమదు దంభము జూపుచు వాగ్వివాదమున్
      భూపతి సత్యవాదినట పోడుల దారుల బట్టజేసిరే!
      యేపగ తోడుబంపెనయొ!యీగనుబోలెడు ఛాత్రమాత్రునిన్!
      దీపముపై నీగ కడుధీరత వ్రాలెను సురక్షితమ్ముగా!

      తొలగించండి
    3. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  20. చేపలను వండలేదని
    పాపయె కోపమ్ముతోడ పాత్రను విసరన్
    సూపమ్మొలుకగఁ దడిసిన
    దీపము పై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్

    రిప్లయితొలగించండి


  21. నీ పద చింతన యే మే
    లౌ పుడమిని వేంకటేశ! లగ్గగు పొలియున్
    నాపద మొక్కుల రాయుని
    దీపముపై నొక్క యీగ ధీరత వ్రాలెన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. దీపపు కాంతుల జూచుచు
    దాపునజేరెను మిణుగురు ధైర్యము మీరన్
    తాపనమునొంది విద్యు
    ద్దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్!!

    రిప్లయితొలగించండి
  23. గోపస్త్రీ పరివేష్టిత
    తాపస మందారుడు వెడ తావనమునకున్
    వీపడఁచు వాడి గని వన
    దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్

    రిప్లయితొలగించండి
  24. పాపలు బొమ్మలు వేయుచు
    నాపద మ్రొక్కుళ్ళపతిని ,నాతని దరినిన్
    దీపపు బొమ్మను నిడనా
    దీపముపై నొక్కయీగ ధీరత వ్రాలెన్

    రిప్లయితొలగించండి
  25. ఉత్పలమాల
    పాపయె పేరనన్ 'రమణి' పాటవమొప్పెడు వాచకమ్ముతో
    చూపఁగఁ భక్తితో నటన చోద్యమటంచు భుజంబు జేర్చుచున్
    మోపఁగ నా హిరణ్యకశిపున్ హృది శోభిలు హార బింబమౌ
    దీపము పైన నీఁగ కడు ధీరత వ్రాలె సురక్షితమ్ముగా

    రిప్లయితొలగించండి

  26. కృష్ణుని చంపుటకు కంసుడు అనేక మంది రక్కసులను పంపాడు వారందురు చిన్నవాడే అని తలచి ముద్దు పెట్టుకొనగా ఆ కృష్ణ దీపకాంతిలో మాడిపోయారు కాబట్టి ఆబాలుడిని నేనె చంపుతాను అని అనుకొను సందర్భము


    పూతన రక్కసి బుజ్జి దీపమ్మని తలచి తాకగ నాయువులు వహమున
    కలిసెన్గదా, ధేను కాసుర, డజగాసుర,బకాసుర, తృణావర్త పులకమ్ము
    లన్నియు మాడె గిలగిల కొట్టుకొనుచు, శంకరా !నిజమిది, శంక లేదు ,
    వ్రజవరు (దీపము పై నొక్క యీఁగ ధీ రత వ్రాలె) నేల నో రాజ సింహ

    మా యనుచు నొకపరి తల పోయకెటుల
    పంపితిని వారల నటకు ,బాల కుడను
    తాను చంపుదునని పిల్చె తనదు రాజ్య
    సీమ కున్ కంస భూపతి చింత కలిగి

    రిప్లయితొలగించండి
  27. యేపార నారగించి క
    ణాపమ్ములు కడుపు నిండ నాహ్లాదముగం
    దాపమ్ముడిగిన యాఱిన
    దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్


    హా పదిలంపు నీ పఱచి నట్టి కడిందిగ రమ్య మైన యీ
    చాప పయిం దమిం దిరుగఁ జాలవె వ్రాలుట వీటి నింటి లో
    నాప తరమ్మె పుస్తకపు టక్షర సంచయ మందు చూడుమా
    దీప! “ము” పైన నీఁగ కడు ధీరత వ్రాలె సురక్షితమ్ముగా

    [నల్లటి యక్షరములపై నల్లని యీఁగ కనిపించుట కష్టము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      మొదటి పూరణను యడాగమంతో ప్రారంభించారు. 'కణాపము'?

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
      అవునండి యే యెలా వచ్చిందో తెలియలేదు! సవరించెదను.
      కణములు (భక్ష్య కణములు) నీళ్ళ నని నా భావమండి.

      తొలగించండి
  28. చూపరుల కద్భుతంబుగ
    పేపరుపై ముచ్చియొకడు వేడుకతోడన్
    దీపపు బొమ్మను గీయగ
    దీపముపై నొక్కయీగ ధీరత వ్రాలెన్
    ఆకులశివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  29. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పాప పరీక్ష కోసమొక పండుగ పూటను ప్రొద్దుగ్రుంకకే
    రాపిడి బెట్టుచున్ చదువ,... వ్రాలగ గోకుచు నీగ ముక్కుపై...
    కోపము తోడుతన్ తరుమ కొండొక చల్లని నూరు వాట్లదౌ
    దీపముపైన నీఁగ కడు ధీరత వ్రాలె సురక్షితమ్ముగా

    రిప్లయితొలగించండి
  30. దాపులలో తా దిరుగుచు
    కోపము తెప్పించు చుండె,కొట్టగ జూడన్
    గీపెడుచు నెగిరి నా కుల
    దీపముపై నొక్క ఈగ ధీరత వ్రాలెన్!!!

    ఆపద నెరుగక పాపము
    దీపము చుట్టూత తాను దిరుగుచు తుదకున్
    పాపాయి కొప్పులో వన
    దీపము పై నొక్క ఈగ ధీరత వ్రాలెన్!!!

    వనదీపము = సంపెంగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'చుట్టూత' అనడం సాధువు కాదు.

      తొలగించండి
  31. దీపము బొమ్మవేయ నిజదీపపు భ్రాంతిని నుత్సుకంబుతో
    దీపముపైననీగ కడుధీరత వ్రాలె సురక్షితమ్ముగా
    దీపపువెల్గులన్గనిన దీరని సంతస మొందుచున్దగన్
    బ్రాపును బొందగోరుచును వ్రాలును వెల్గులు గల్గుచోటనన్

    రిప్లయితొలగించండి
  32. కోపము నేర డీతడు రఘూద్వహు డన్న దయామయుండు సం
    తాపము బాపు భక్తులకు ధన్యులమౌదుము చూపుసోకినన్
    పాపడ రమ్మనంగ తన బాబును మక్క్షికమాత రామసం
    దీపము పైన నీఁగ కడు ధీరత వ్రాలె సురక్షితమ్ముగా.

    రిప్లయితొలగించండి
  33. దీపము కాంతికారకము దీపము కీటకమృత్యుకారియౌ
    దీపము జ్ఞానరూపకము దీపము వాంఛల దృశ్యరూపమౌ
    దీపము వెల్గులీను నెడ తీరిది, వెల్గని వేళ నట్టియా
    దీపముపైన నీగ కడు ధీరత వ్రాలె సురక్షితంబుగన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  34. ఓపక లేకన్ నీలపు
    దీపంబును బెట్టె నరుడు దెలివిడి గనుడో!
    పాపము చావును దెలియక
    *"దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్"*

    రిప్లయితొలగించండి
  35. ఓపరి యల్లాయుద్ధీన్
    దీపమునొకచోటనుండ?తీయగబోవన్
    పాపకు తేటియగనబడ
    దీపముపై నొక్కయీగ ధీరతవ్రాలెన్

    రిప్లయితొలగించండి


  36. ఆ పోలీసుల బండిని
    దీపమ్మే యెర్రగాను దీప్తిని చేయన్
    నోపిక తాళక బిరబిర
    దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  37. పాపయు సంతోషముతో
    తీపిని తినుచుండచూచి తీరుగ నచ్చో
    తాపీగా తిరుగుచు గానక
    దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్


    దీపపు కాంతిని గాంచుచు
    నాపద యౌనని యెరుగక యనవరతంబున్
    దాపున చేరి తటాలున
    దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  38. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్

    సందర్భము: సులభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    చూపుల కెఱ్ఱగ బుఱ్ఱగఁ
    దోపగ నొక ముద్దుఁ బెట్టుదు నటంచు నయో
    పాపము! పడుచు వయసు గద!
    దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    24.1.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  39. రేపటి యెన్నికల కొరకు
    దీపము గుర్తును ధరించి తిరిగుచునుండన్
    తీపి భుజించుచు ధ్వజమున
    దీపముపై నొక్క యీ(గ ధీరత వ్రాలెన్

    రిప్లయితొలగించండి
  40. గోపతివాహనన్ గొలువ గొమ్మయొకర్తె శివాలయంబునన్
    దీపము వెల్గజేసి కడుదీక్షను పూజలొనర్చె భక్తితో
    దాపుననుండి వచ్చియు పదంపడి దీపమునార్ప బిల్లియున్
    దీపము పైన నీగ కడుధీరత వ్రాలె సురక్షితమ్మగా
    ఆకులశివరాజలింగం
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  41. ఓపగ లేని తాపమున యోషిత యొక్కతి హద్దుమీరుచున్
    బాపపు కార్యమున్ సలియి వాంఛను దీర్చుకొనంగ నెంచుచున్
    జూపుల లోన కామమును చూపుచు బిల్వగ జేరె భృంగుడే
    దీపముపైననీఁగ కడు ధీరత వ్రాలెసురక్షితమ్ముగా.

    రిప్లయితొలగించండి
  42. కం.
    ఆపర్వత శిఖరములో
    నాపొద్దుయె గ్రుంకుచుండ నగుపడె నాకున్
    ఙ్ఞాపకము వచ్చె నిట్టుల
    "దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్"

    రిప్లయితొలగించండి
  43. సవరించిన పూరణ .
    చేపల కూరచేయ మనె చిక్కుడు జేసితి వేలనే సఖీ
    మాపటి కైనగాని మరి మాటను దప్పక వండకున్న చో
    రేపటి నాదుకోప మున రెక్కలు రాలిన పక్షివౌ దువే
    దీపము పైన నీఁగ , కడు ధీరత వ్రాలె సురక్షి తమ్ముగా

    రిప్లయితొలగించండి
  44. నిన్నటి పూరణ

    శాపవశమ్ము తోడ నర జన్మము నెత్తిన చిత్ర కారుడే
    పాపయ శాస్త్రి బాపు రవి వర్మల మించిన వాడు గీసెనే
    చేపల వంటి కండ్లుగల చిన్నది దీపము చేతబట్టి యా
    దీపము పైన నీఁగ కడు ధీరత వ్రాలె సురక్షితమ్ముగా.

    రిప్లయితొలగించండి
  45. భల్లూకమె పుట్టు నెపుడు
    భల్లూకపు పొట్టలోన,భానుడు పొడిచెన్
    తెల్లగ తెలవారకనే
    యెల్లెడ జిమ్ముచు వెలుతురు నిలలో గనుమా!


    2: పిల్లడు గీచెను చిత్రము
    తెల్లని కాగితముపైన తీరుగ నెలుగున్
    భల్లారే! చక్కగ గను మీ
    భల్లూకము కడుపులోన భానుడు పొడిచెన్

    రిప్లయితొలగించండి