డా.పిట్టా సత్యనారాయణ నుండి ఆర్యా,"ఛంద చాయ"అంటే సంధి దోషము బట్టకుండు గదా.కృతజ్ఞతలు.కౌశికుడు-కొంగ మసి ఉదంతము ధర్మ వ్యాధుని వృత్తాంతములు మనసులో మెదిలినా వివిధత పేరిట పద్య పక్షమును స్వీకరించితిని.ధన్యవాదాలు.
ఇది భారతములో కధ పూర్వము కౌశికుడను విప్రుడు వేద వేదాంగములు చదివి తన తల్లి తండ్రుల సేవ మరచి పోతాడు. ఒకనాడు చెట్టు క్రింద అతను కూర్చొని ఉండగా ఒక కొంగ అతనిపై రెట్ట వేస్తుంది. కోపముతో దానిని కౌశికుడు చూడగా అది చచ్చి పోతుంది . దాని తర్వాత అతను బిక్షాటనకు వెడలి పోతాడు. ఒక చోట ఒక స్త్రీని బిక్షము అడుగుతాడు అప్పుడు ఆవిడ లోపలికి వెళ్ళి తన యొక్క భర్తకు ఆహారము పెట్టి చాలాసేపు తర్వాత వచ్చి అతనికి బిక్ష వేస్తుంది దానికి ఆ కౌశికుడు కోపోద్రేకముతో ఊగుతూ ఇది క్షమించరాని నేరము అంటాడు. అప్పుడు ఆ పతివ్రత నీ కోపమునకు భయపడేటి కొంగను కాను నీవు చదువుకున్న పామరుడివి ఏ స్త్రీకైనా పతిసేవ ముఖ్యము దాని తర్వాత ఇతరుల సేవ. నీకు తగిన సలహా చెప్పు వాడు ధర్మవ్యాధుడు. అతని దగ్గిరకెళ్ళి వారి సలహా తీసుకో అని చెబుతుంది. కౌసికుడు అతని చిరునామా కనుక్కొని అతని ఇంటికి వెళతాడు. అతను కౌసికుని చూచి నిన్ను నా వద్దకు పంపిన ఆ పతివ్రత కుశలమేనా అనిఅడుగుతాడు. కౌసికుడుదిగ్భ్రాoతి చెంది తను వచ్చిన పని వివరిస్తాడు. కౌసికుని కూర్చుండ బెట్టి ఆ కటిక వాడు తన తల్లితండ్రుల సేవ చేసి వచ్చి అతనికి నీతి బోధ చేయు సందర్భము
కోపముతో నీవు కొంగను చంపినావుగ బ్రాహ్మ ణోత్తమా, జగతి లోన పతి సేవయే గొప్ప సతికి ననవరతము , ననుచు నిన్ పంపిన నాతి సుఖము గానుండెనా? యని కౌసికుతో ధర్మ వ్యాధుడు పలుకగా నద్భు తమ్మ ని తలచి తనపనిని తెలుపగ నతనితో పల్కె,.నో సర్వ తో ముఖుoడ పాఠముల్ చదువక పండితుఁడగు, మఱి చదివి మొఱఁకు నౌను జగతి లోన
తల్లి తండ్రుల సేవయే ధర్మ మౌను మరువ వలదు, నీ కులవృత్తి మాన బోకు కోపమువిడువ కలుగు ను కూర్మి యనుచు బలికె కటిక కౌసికుని తో భక్తి బడసి
పదుగురు మెచ్చు నవలలను
రిప్లయితొలగించండిముదిరిన బూతు కలిగినవి ముచ్చట మీరన్
కుదురుగ కూర్చొని యువకుడు
చదువక పండితుఁడగు మఱి చదివి మొఱఁకునౌ
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ముచ్చట దీరన్' అంటే బాగుంటుందేమో?
(అలా సవరించిన పూరణనే వాట్సప్ లో ప్రకటించాను)
🙏
తొలగించండిచదువులు గాంచిన నేడిల
రిప్లయితొలగించండిపదములు పలుకంగ లేరు పామరుల వలెన్
మెదడుకు పదునే లేకను
చదువక పండితుఁడగు మఱి చదివి మొఱఁకునౌ .
---------------------------
రాక్షస రాజుల వధించ
తక్షణమే యవత రించి తప్తము జేసెన్
రక్షణ జేయగ జనులను
రాక్షస గర్భమ్మున , రఘురాముడు పుట్టెన్
నిన్నటి సమస్య
అక్కయ్యా,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'మెదడునకు పదును లేకయె' అనండి.
చదువులు గాంచిన నేడిల
తొలగించండిపదములు పలుకంగ లేరు పామరుల వలెన్
మెదడునకు పదును లేకయె
చదువక పండితుఁడగు మఱి చదివి మొఱఁకునౌ .
రిప్లయితొలగించండిచదివిన చదువులు వ్యర్థము !
చదువక పండితుఁడగు! మఱి చదివి మొఱఁకునౌ
చు దవక లుపడెడు వారల
సదనంబందున గనుమిక! చదువును విడుమా !
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వదలక సంస్కృత మాంగ్లము
రిప్లయితొలగించండిచదవక పండితుఁడగు మఱి చదివి మొఱఁకునౌ
ముదమగు సంస్కారము విడి
చెదపురుగై జాతినెల్ల చెఱచును సుమ్మీ.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిహృదయము లోన ప్రేమ యను హృత్వుడు వెల్గు జిలేబి యై సదా
మదిని మధించి నాతని నిమంత్రణ గైకొనగా దగున్ సదా !
అదియిది యేల! జ్ఞానమున కావల చూడుము, దేహవంతులన్
చదువనివాఁడు, పండితుఁడు శాస్త్రము నేర్చినవాఁడు మూర్ఖుఁడౌ!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మధించి యాతని...' అనండి.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిచదివియు వచన కవిత విను(వినును కాని ఆచరణను కనడు,కాన మూర్ఖుడు)
చదువని వాడేమొ పద్య(వేమన,బద్దెన పద్యములు)ఛాయల మెలగున్(ఆచరమలో పెట్టును; ఇతడే పండితుడు)
చెదరదు పద్యము వరుసన్
చదువక పండితుడగు మరి చదివి మొరకు నౌ
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పద్య + ఛాయ = పద్యచ్ఛాయ' అవుతుంది.
డా.పిట్టా సత్యనారాయణ నుండి
తొలగించండిఆర్యా,"ఛంద చాయ"అంటే సంధి దోషము బట్టకుండు గదా.కృతజ్ఞతలు.కౌశికుడు-కొంగ మసి ఉదంతము ధర్మ వ్యాధుని వృత్తాంతములు మనసులో మెదిలినా వివిధత పేరిట పద్య పక్షమును స్వీకరించితిని.ధన్యవాదాలు.
చదువుల సారమొక్కటియ చాలదు నేటి యుగమ్మునందునన్
రిప్లయితొలగించండిసదమలకీర్తి నొందగఁ,బ్రశంసలఁ దేల్చుచు నీ బ్రభుత్వమున్,
పదనుగఁ బీఠమందుఁ గలవారిఁ బొగడ్తలఁ దేల్చ, నత్తరిన్
జదువని వాడు పండితుండగును, శాస్త్రము నేర్చిన వాడు మూర్ఖుడౌ.
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిచదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక లేకపోగ నా
పదునగు పద్యమే మరుగుపాలయె;నాడిట లేవె నాటకాల్
ఒదిగెను పద్య మజ్ఞునకు నోలలనాడగ జేసె;పద్యమే
చదువని వాడు పండితుడు శాస్త్రము(ఛందస్సు)నేర్చినవాడు మూర్ఖుడౌ
మది"తను దిట్టి పోసె"నను;మాన్యత"నింగిలిపీసు"(ఇంగ్లీషు)కిచ్చియున్
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిమదిని చిలుకంగ చాలును
చదువక పండితుఁడగు! మఱి చదివి మొఱఁకునౌ
చు దెసచెడుటేల ! నరుడా
హృదయము లో రహిని నింపి హృత్వుని గనుమా!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చదువది వివేకమొసగును
రిప్లయితొలగించండినదిసత్యముసుందరంబు నదిగంభీరం
బదిశక్తిచేతనము; జెడు
*చదువక, పండితుఁడగు మఱి చదివి మొఱఁకునౌ*
పదుగురి వచనమె పాడియ
రిప్లయితొలగించండిపదుగురు నడిచినను దారి పరదేశములో
చదువు హితంబన నెయ్యది
*చదువక పండితుఁడగు మఱి చదివి మొఱఁకునౌ?*
శంకర్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'చదువది వివేకము నొసగు।నది...' అనండి. బాగుంటుంది.
చదువులుమువ్విధంబులగు స త్వరజోతమ, మందుతామసం
రిప్లయితొలగించండిబదియ ప్రమాదహేతువగు ప్రజ్ఞమరీచికి నీలిమేఘమౌ
మది మమతానురక్తి పెరిమన్న సుగంధమునీయనట్టిదే
*"చదువనివాఁడు పండితుఁడు శాస్త్రము నేర్చినవాఁడు మూర్ఖుఁడౌ*"
శంకర్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిమదమున బల్కితివా ? బు
ద్ధి దప్పడంబాయెనా? చెదిరెనా జ్ఞానం
బు? దడబుడలేల శిష్యా!
చదువక పండితుఁడగు? మఱి చదివి మొఱఁకునౌ?
జిలేబి
ఇవ్వాళ యింకెన్ని వస్తాయో :)
అక్షర లక్షలు
తొలగించండి🙏
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిచదివియు జ్ఞాన మొందియు దశానను డేగతి నొందె ధారుణిన్?
చదువలు రాని కన్నడును సద్గతి నొందలె దైవ భక్తిచే!
కుదురుగ వీక్షజేయగను గోచరమవ్వదె యివ్విధంబుగన్!
చదువనివాడు పండితుడు శాస్త్రము నేర్చినవాడు మూర్ఖుడౌ
🍀 ☘ ఆకుల శాంతి భూషణ్ 🌿🌱
🌷 వనపర్తి 🌷
చదువులు రాని...
తొలగించండిశాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సద్గతి నొందడె' అనండి.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండివదనము మందహాసపు నివాసముగా , దయకాలవాలమౌ
హృదయము గల్గి , తాను వచియించెడి పల్కు సుధారసమ్ముగా
పదుగురి మేలుకోరుటయె పద్ధతి , దీనికి భిన్నమై చనన్
చదువనివాఁడు , పండితుఁడు , శాస్త్రము నేర్చినవాఁడు , మూర్ఖుఁడౌ!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచదువులలో మర్మంబులు
తొలగించండిపదిలముగా దెలియవలయుఁ బంక్తులవేలా ?
చదువరి యతడే , పొత్తము
చదువక పండితుడగు , మరి చదివిన మొరకౌ !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
పదిలమటంచు దెల్పె గద బ్రహ్మము నాడు కలిప్రభావమున్
రిప్లయితొలగించండిసదమల చిత్తముల్ విమల సన్నుత వర్తన లీధరాస్థలిన్
ముదమును గూర్చబో వటులె మోటగు ధర్మము లెందు జూచినన్
చదువనివాఁడు పండితుఁడు శాస్త్రము నేర్చినవాఁడు మూర్ఖుఁడౌ
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఎదిగీ యెదగని వయసున
రిప్లయితొలగించండిపదిలముగా నుండవలెను పదుగురు మెచ్చన్
మెదడు జెఱచు సాహిత్యము
"చదువక పండితుఁడగు మఱి చదివి మొఱఁకునౌ"
**)()(**
(యువతను తప్పుదోవ పట్టించే క్రైమ్,శృంగార మొ౹౹ సాహిత్యము చదువ వలదని సందేశము)
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఎదిగీ' అనడం వ్యావహారికం. అక్కడ "ఎదిగియు నెదుగని..." అనండి.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిచదువని రామకృష్ణుఁ డట శాంకరిచేఁ జదువుల్ గ్రహింపఁగాఁ,
జదివిన తాతయార్యుఁ డిట స్వామినిఁ గొల్చుట మాని, యాతనిన్
జిదుమగఁ జూచిచూచి యలసెన్ గద! యెంచఁగ నిట్లు తోచు, నా
చదువనివాఁడు పండితుఁడు; శాస్త్రము నేర్చినవాఁడు మూర్ఖుఁడౌ!
చిన్న సవరణతో...[మూఁడవ పాదమున...తోచులో...అరసున్న]
తొలగించండిచదువని రామకృష్ణుఁ డట శాంకరిచేఁ జదువుల్ గ్రహింపఁగాఁ,
జదివిన తాతయార్యుఁ డిట స్వామినిఁ గొల్చుట మాని, యాతనిన్
జిదుమగఁ జూచిచూచి యలసెన్ గద! యెంచఁగ నిట్లు తోఁచు, నా
చదువనివాఁడు పండితుఁడు; శాస్త్రము నేర్చినవాఁడు మూర్ఖుఁడౌ!
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండిఎదలో మదనాంతకుగని
రిప్లయితొలగించండిచదవనివాడు పండితుడగు;మరి చదివి మొరకుడౌ
పదిలమ్మగు పథముదొలగి
బ్రదుకగ సమదర్శనమ్ము బాటించకనే
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...బాటించకయే' అనండి.
ధన్యవాదములు గురువుగారూ! సవరిస్తాను!
తొలగించండిసదసద్వివేకము కలిగి
రిప్లయితొలగించండిచదువక పండితుఁడగు; మఱి చదివి మొఱఁకునౌ
మదమున్న వదరుబోతును
చదువని వాల్మీకి కథను చదివితిమెల్లా
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చదివితి మెటులో/మెల్లన్' అనండి.
సమస్య :-
రిప్లయితొలగించండి"చదువక పండితుఁడగు మఱి చదివి మొఱఁకునౌ"
*కందం**
కదిలి సమాజము దిరిగిన
చదువక పండితుఁడగు; మఱి చదివి మొఱఁకునౌ
పదుగురితో యేరీతిన
మెదలవలయునో దెలియక మిగిలెడు వాడున్
....................✍చక్రి
చక్రపాణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పదుగురితో నేరీతిని' అనండి.
ఈ నాటి శంకరాభరణము సమస్య
రిప్లయితొలగించండిచదువక పండితుఁడగు, మఱి చదివి మొఱఁకు నౌ
ఇచ్చిన సమస్య కంద పాదములోనిది నాపూరణము సీసములో
ఇది భారతములో కధ పూర్వము కౌశికుడను విప్రుడు వేద వేదాంగములు చదివి తన తల్లి తండ్రుల సేవ మరచి పోతాడు. ఒకనాడు చెట్టు క్రింద అతను కూర్చొని ఉండగా ఒక కొంగ అతనిపై రెట్ట వేస్తుంది. కోపముతో దానిని కౌశికుడు చూడగా అది చచ్చి పోతుంది . దాని తర్వాత అతను బిక్షాటనకు వెడలి పోతాడు. ఒక చోట ఒక స్త్రీని బిక్షము అడుగుతాడు అప్పుడు ఆవిడ లోపలికి వెళ్ళి తన యొక్క భర్తకు ఆహారము పెట్టి చాలాసేపు తర్వాత వచ్చి అతనికి బిక్ష వేస్తుంది దానికి ఆ కౌశికుడు కోపోద్రేకముతో ఊగుతూ ఇది క్షమించరాని నేరము అంటాడు. అప్పుడు ఆ పతివ్రత నీ కోపమునకు భయపడేటి కొంగను కాను నీవు చదువుకున్న పామరుడివి ఏ స్త్రీకైనా పతిసేవ ముఖ్యము దాని తర్వాత ఇతరుల సేవ. నీకు తగిన సలహా చెప్పు వాడు ధర్మవ్యాధుడు. అతని దగ్గిరకెళ్ళి వారి సలహా తీసుకో అని చెబుతుంది. కౌసికుడు అతని చిరునామా కనుక్కొని అతని ఇంటికి వెళతాడు. అతను కౌసికుని చూచి నిన్ను నా వద్దకు పంపిన ఆ పతివ్రత కుశలమేనా అనిఅడుగుతాడు. కౌసికుడుదిగ్భ్రాoతి చెంది తను వచ్చిన పని వివరిస్తాడు. కౌసికుని కూర్చుండ బెట్టి ఆ కటిక వాడు తన తల్లితండ్రుల సేవ చేసి వచ్చి అతనికి నీతి బోధ చేయు సందర్భము
కోపముతో నీవు కొంగను చంపినావుగ బ్రాహ్మ ణోత్తమా, జగతి లోన
పతి సేవయే గొప్ప సతికి ననవరతము , ననుచు నిన్ పంపిన నాతి సుఖము
గానుండెనా? యని కౌసికుతో ధర్మ వ్యాధుడు పలుకగా నద్భు తమ్మ
ని తలచి తనపనిని తెలుపగ నతనితో పల్కె,.నో సర్వ తో ముఖుoడ
పాఠముల్ చదువక పండితుఁడగు, మఱి చదివి మొఱఁకు నౌను జగతి లోన
తల్లి తండ్రుల సేవయే ధర్మ మౌను
మరువ వలదు, నీ కులవృత్తి మాన బోకు
కోపమువిడువ కలుగు ను కూర్మి యనుచు
బలికె కటిక కౌసికుని తో భక్తి బడసి
తొలగించండివాక్యాలకు వాక్యాలే సీసంలో రాసేయడం మీకేచెల్లు !!!! అద్భుతః
"కోపముతో నీవు కొంగను చంపినావుగ బ్రాహ్మ ణోత్తమా, జగతి లోన
పతి సేవయే గొప్ప సతికి ననవరతము"
జిలేబి
పూసపాటి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సీసం రెండవ పాదంలో గణదోషం. సవరించండి.
పూరణ బాగున్నదండీ పూసపాటివారూ! అభినందనలు!
తొలగించండిరెండో పాదంలో... సతికనవరతమ్ము...అంటే సరి!
ప్రహ్లాదుడు విష్ణుభక్తిని వీడునట్లు చేయమని హిరణ్యకశిపుడు చండామార్కులను గురువులను ఆదేశించు సందర్భము.
రిప్లయితొలగించండిచంపకమాల
వదలక శ్రీహరిన్ మిగుల పాటలఁ బద్యము లందుఁ బాడి మా
మదికి వినంగ జాలని సమాదరణంబున సూనుడాడునే
విదురత గూర్చి వైరినిల వీడగ జెప్పుడు వాని భావనన్
జదువని వాడు పండితుఁడు శాస్త్రము నేర్చినవాఁడు మూర్ఖుడౌ
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిమదమాత్సర్య గుణమ్ముల
నొదుగుగ జూపెడి కొదవగు నొడుగుల కథలన్
మది జొనుపు కొనుచు నజ్ఞుడు
చదువక పండితుడగు మఱి చదివి మొఱకునౌ.
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎదుగుట నేర్వనట్టి ప్రజ లిబ్బడి ముబ్బడి యైన రాజ్యమున్
రిప్లయితొలగించండివదలని యక్రమార్జనల వైఖరితో యధికారులున్నచో
చదువుల సారమే యెఱుగు శక్తియె లేని నృపాలురున్నచో
"చదువనివాఁడు పండితుఁడు శాస్త్రము నేర్చినవాఁడు మూర్ఖుఁడౌ"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రహ్లాదుడు విష్ణుభక్తిని వీడునట్లు చేయమని హిరణ్యకశిపుడు చండామార్కులను గురువులను ఆదేశించు సందర్భము.
రిప్లయితొలగించండికందం
చదువులఁ బ్రహ్లాదుడు హరి
ముదమ్మున భజించ కుండు బోధనములతోఁ
గుదియించుడు వైరులపై
చదువక పండితుఁడగు మఱి చదివి మొఱఁకునౌ
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచదువక కాకరకాయని
తొలగించండివద కీకరకాయను చదవ తెలివిగనదే
చదువులు నేడీరీతిన
చదువక పండితుఁడగు మఱి చదివి మొఱఁకునౌ! ?
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చదివిన మూర్ఖుoడవని ని
రిప్లయితొలగించండిసదమల చిత్తం బు లేక చవట గ మారున్
పదుగురు మెచ్చె డు విధము గ
చదువ క పండి తు డ గు ; మఱి చదివి మొర కు నౌ !
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అదవదలైన సంఘమున
రిప్లయితొలగించండినాత్రుత -హంకృతి - హుంకరింతలున్
వదలని దాస్యభావుకత -
వక్రత - మాంద్యత - లక్ష్యశూన్యతల్
మెదడుల నింపుకొంచు మన
మేలిమి సంస్కృతిగ్రంథసంపదన్
జదువనివాడు పండితుడు ;
శాస్త్రము నేర్చినవాడు మూర్ఖుడౌ .
జంధ్యాల వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ !
తొలగించండిచాల బాగున్నదండీ!
తొలగించండివదలక సంస్కృతాంధ్రముల వాసిగ నేర్చిపరాయి భాషలన్
రిప్లయితొలగించండిచదవని వాడు పండితుడు, శాస్త్రము నేర్చిన వాడు మూర్ఖుడౌ
ముదమగు సంస్కృతిన్ విడిచి మోహము తోడ పరానువర్తనులై
పదుగురు చీదరించెడు ప్రవర్తన గల్గి చరించుచుండినన్.
విరించి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చదువులసారమా పరమసన్నిధిఁ జేరుటె, పాపహేతువౌ
రిప్లయితొలగించండిజదువు నిర్థకమ్మగును, సంసృతిలోఁ బడద్రోయుఁ, గావునన్
దదితరకేవలార్థసుఖదాయకమోక్షవిఘాతవిద్యలన్
జదువని వాడు పండితుడు, శాస్త్రము నేర్చిన వాడు మూర్ఖుడౌ.
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
చదువుల తల్లి దీవెనలు సత్కవి గోరును, భోగభాగ్యముల్
రిప్లయితొలగించండిపదవులఁ బొందగోరుచును భాషను మర్చిచరించు వాడిలన్
చదవని వాడు, పండితుఁడు శాస్త్రము నేర్చిన వాడు, మూర్ఖుఁడౌ
పదుగురు ఛీత్కరించిన బ్రవర్తన మారని వాడె కాదుటే.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మృదువుగఁ జెప్పరె బుధవరు
రిప్లయితొలగించండిలిది దైవపు మాయ చేత,నెల్ల జనులకున్
విదితం బగు నిశ్చయముగఁ,
జదువక పండితుఁడగు మఱి చదివి మొఱఁకునౌ
పదిలము నీక వ్యర్థ మగుఁ బల్కిన భీషణ మైన వాక్కులుం
దదితర భాషణమ్ములును, దైవ బలమ్మున, నెద్దియుం గొనం
డెద మఱి యెంత చెప్పినను, నెవ్విధి, యేఁగిన నేమి, వాని నొం
చదు వని వాఁడు పండితుఁడు శాస్త్రము నేర్చినవాఁడు మూర్ఖుఁడౌ
[యేగిన నేమి వని దైవ బలమ్మున నెవ్విధి (ఏ దైవము) వాని నొంచదు. యెద్దియుం గొనం డెద యెంత చెప్పినను .. మూర్ఖుఁడౌ ]
కుదురుగ చదువని వాడే
రిప్లయితొలగించండిపది యూర్లను బరఁగ జూచు పండితు డనఁగన్
వదరుటకు జ్ఞాని బెదరును
చదువక పండితుఁడగు మఱి చదివి మొఱఁకునౌ
పదములుబూతివియైనవి
రిప్లయితొలగించండిచదువకపండితుడగు,మఱిచదివిమొఱకునౌ
మెదడునకందనిజదువులు
చదువన్గన్వలయునీతిశాస్త్రపుజదువుల్
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
పది "యభిసారిక"ల్ గొనుచు పండుగ జేయుచు ముద్దులాడుచున్
చదువనివాఁడు పండితుఁడు;..శాస్త్రము నేర్చినవాఁడు మూర్ఖుఁడౌ
ముదిరిన "కామసూత్రము"ల పూర్తిగ నేర్చుచు విర్రవీగుచున్
తదుపరి సన్యసించుచును తాళను జాలక పెండ్లిచూపులన్
రిప్లయితొలగించండిశంకరాభరణం... .
10/01/2019 గురువారం
నేటి సమస్య :
******* *** *
చదువక పండితుఁడగు మఱి చదివి మొఱఁకునౌ
నాపూరణ
చదువుల దేవత దయచే
చదువక పండితుఁడగు, మఱి చదివి మొఱఁకునౌ
మదమాత్సర్యము లుడవక
పదివముగా మెలగకున్న పండితు డైనన్
ఆకుల శివరాజలింగం
వనపర్తి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచం. పొదలునదాగిబాటలనబోయెడువారలకొల్లగొట్టిబల్
రిప్లయితొలగించండిపదునగుబాణఘాతముతొపక్షులజంటనునేలగూల్చవా
నెదనుద్రవించు సంఘటననెవ్విధిబోయమహర్షి గయ్యెనో
ముదమున బ్రహ్మయస్త్రమునుముందుగనేర్పగముప్పునివ్వనే
విధముగనర్జునుండుభువివేదనమాన్పెనొచూచిరెల్లరున్
చదువనివాఁడు పండితుఁడు,శాస్త్రమునేర్చినవాఁడు, మూర్ఖుఁడౌ!
note :ఏమిచదువని బోయడు మహర్షిగా మారాడు,శాస్త్రం చదివిన అశ్వద్ధామ మూర్ఖుడై లోకానికి ముప్పుతెచ్చాడు
అన్న ధోరణిలో వ్రాసిన పద్యము
చదువనివాడు పండితుడుశాస్త్రమునేర్చినవాడుమూర్ఖుడౌ
రిప్లయితొలగించండిచదువులుసేయయున్నతిగ,సత్కవులట్లుగబల్కచోద్యమే
చదివిననబ్బు సౌమ్యతలు,శాంతము దోటివారకున్
సదయనుమేలుజేయునునశాస్త్రముమార్గమునుండబోదుగా
హృదయము భానూదయముగ
రిప్లయితొలగించండిగదల మదిశశివెలుగిడు, నకమణచు,నెఱుకౌ
హృదయాత్మాంతర మౌనిది
*జదువక పండితుడగు మఱి చదివి మొఱకునౌ*
మదురిపు గీతిగీతియగు మాధవు బూజయ బూజయౌ సదా
రిప్లయితొలగించండియదువరు నాటనాటయగు నాతని కీర్తనె కీర్తనౌ హరిన్
మదిగను జూపుజూపగు నమానుష గృత్యము గృత్యమౌ నిటుల్
*జదువనివాఁడు పండితుఁడు శాస్త్రము నేర్చినవాఁడు మూర్ఖుఁడౌ*
నిదురను మానుచు నొక్కడు
రిప్లయితొలగించండిచదువునిట చదువు వివేక చతురత లేకన్,
సదసద్వివేక లేమిన
చదవక పండితుడగు మరి చదివి మొరకునౌ
కొరుప్రోలు రాధాకృష్ణా రావు
పదవులకోసమైప్రజల బాగును గోరక వంచనాత్మ సం
రిప్లయితొలగించండిపదల వరించ నెన్నిక నెపంబున నోటుకు నోట్ల ధాటితో
బదిలపు సీటుఖాయమయె వాయినెరుంగని మాయిమాయలన్
*జదువనివాఁడు పండితుఁడు శాస్త్రము నేర్చినవాఁడు మూర్ఖుఁడౌ*"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపదవుల పందేరమ్మున
రిప్లయితొలగించండిచదువరులందరు వెడలగ చాందసవాదుల్
వెదుకగ యెన్నిరి కొందరు
*"చదువక పండితుఁడగు మఱి చదివి మొఱఁకునౌ"*
కందం
రిప్లయితొలగించండిఅదె యుగ్రవాదము ముదిరె
కుదురు నిరుద్యోగులైన గూర్చఁగ నంచున్
వదలెడు సాహిత్యమ్మున్
చదవక పండితుఁడగు మఱి చదివి మొఱఁకునౌ
(మొఱకు = క్రూరుడు)
వదలకచదువరి జతతో
రిప్లయితొలగించండిచదువక పండితుడగు!మరిచదివిమొరకునౌ
వదలక మత్తునమునుగగ
పదములతడబాటు చేతపలుకుటగాంచన్
చదువరివే మహేశ పద సక్తుడవే వినవే దశాననా
రిప్లయితొలగించండిముదితను జానకీ సతిని మ్రుచ్చిలి దెచ్చుట పాడి యౌనె నీ
కిది తగదంచు నేరును వచింపరె చూడగ నీదు కొల్వులో
చదువనివాఁడు పండితుఁడు, శాస్త్రము నేర్చినవాఁడు మూర్ఖుఁడౌ.