పురిటి పాపకు వెంటనే పుట్టు బిడ్డ , చేపలన్ని నింగి కెగురు చెరువు నుంచి, కుక్క గడ్డిని మాంసమున్ గోవు దినును" జరుగు కలియుగ మందని జనతతోడ, పోతులూరివారు నుడివె ఖ్యాతి బడసి
సందర్భము:-కుమార జననము -- త్రిలోచనుడు ఒక కంటితో(సూర్యుడు) పార్వతిని క్రీగంట చూసినపుడు ఆమె సూర్య కాంతితో వెలిగిందని భావము. AIR Hyderabad samasyaku nedu chadivina naapooranamu
పురిటి పాపకు వెంటనే పుట్టు బిడ్డ ,
రిప్లయితొలగించండిచేపలన్ని నింగి కెగురు చెరువు నుంచి,
కుక్క గడ్డిని మాంసమున్ గోవు దినును"
జరుగు కలియుగ మందని జనతతోడ,
పోతులూరివారు నుడివె ఖ్యాతి బడసి
పూసపాటి వారూ,
తొలగించండికాలజ్ఞాన ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వారు నుడివిరి' అనడం సాధువు కదా? "పోతులూరి వచించెను ఖ్యాతి బడసి" అందామా?
రిప్లయితొలగించండితిక్క సన్నాసి ! చదివి మతియు చెదరెనొ
కొ? తల లో గడ్డి యెక్కెనకొ?పలు మార్లు
నేర్చు కొంటివి గదరా దినేశ! యెట్లు
కుక్క గడ్డిని, మాంసమున్ గోవు, దినును?
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండితిక్కసన్నాసితో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
జిలేబీ గారూ!
తొలగించండిచదువుకున్న వారు అలాగే చెప్పాలనీ, కీకరకాయ అనాలనీ పెద్దలు చెప్పారండీ..
🤣🤣🙏🏻🙏🏻
తొలగించండివిట్టు బాబు గారి విట్టు వేటు :)
జిలేబి
చక్కనయ్యలు ప్రభువులు చిక్కులేక
రిప్లయితొలగించండిదక్కకుండను ప్రజలకు మెక్కుచుండ
దిక్కు లేనిచో పౌరుడు వెక్కి వెక్కి
కుక్క, గడ్డిని, మాంసమున్,గోవు,దినును
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ విలక్షణమైన విరుపులతో ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏
తొలగించండి
తొలగించండిఅదురహో "విరుపేశ్వరా" :)
జిలేబి
🙏
తొలగించండిఎన్ని క,క్కలో
తొలగించండి😀👌🏻👏🏻🙏🏻
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఅక్కట ! రాజకీయ విపినాంతర జంతులు నేతలెల్ల ! వా
రెక్కడికక్కడే తినుటయే పరమావధిగా దలంచి చే...
జిక్కినదెల్ల బొక్కెదరు ! చిత్రము కేసరి యెండుగడ్డినిన్
కుక్కలు పచ్చగడ్డిఁ దిను , గోవులు మ్రింగును పచ్చి మాంసమున్!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండిసూపర్ "జూ లోని" నేతలు !
జిలేబి
కలియు గంబున వెలయును కధలు వెతలు
రిప్లయితొలగించండివెఱ్ఱి గంతులు వేయును వేయి తలలు
స్త్రీలు పురుషులు గామారు స్వేఛ కోరి
కుక్క గడ్డిని మాంసమున్ గోవు దినును
రిప్లయితొలగించండిచక్కగ యింటికాపు తను చల్లగ బిస్కతు లెల్ల మ్రింగునా
కుక్కలు, పచ్చగడ్డిఁ దిను గోవులు, మ్రింగును పచ్చి మాంసమున్
మిక్కిలి మోదమానముగ మెక్కొని వ్యాఘ్రము లెల్ల సోదరీ
చక్కిల ముల్ జిలేబుల పచారము వెళ్లి బిరాన తెమ్మరో
మెక్కెద మింక పూరణను మిక్కిలి చక్కగ చేయ పట్టు గా!
జిలేబి
కుక్కుటముల్ దినున్ గ్రిములఁ గోరికతోడను ధాన్యమున్; నరుం
రిప్లయితొలగించండిడొక్కట శాకహారిగను నొక్కట మాంసము మెక్కుచుండఁగా
బొక్కలకై నిరంతరముఁ బోరునుగా తమలోనె తామె యా
కుక్కలు; పచ్చగడ్డిఁ దిను గోవులు; మ్రింగును పచ్చి మాంసమున్
నక్కలు; బాలు ద్రాగును మనం బలరారఁగఁ జిన్నిపాపఁడే.
👌
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిశంకరాభరణం... .
19/01/2019 సోమవారం
నేటి సమస్య :
******* *** *
"కుక్క గడ్డిని మాంసమున్ గోవు దినును"
నా పూరణ:. తే.గీ.
**** **** **** **** ***
న్యాయధర్మములు భువిన నడవ నపుడు
కలుగు వింతలు కలియుగ కాలమందు
మొలచు పగలు చుక్కలు, మేక సలమునందు;
కుక్క గడ్డిని ,మాంసమున్ గోవు దినును;
🍀 ☘ ఆకుల శాంతి భూషణ్ 🌿🌱
🌷 వనపర్తి 🌷
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'భువిని' అనండి. 'మేక సలమునందు'?
( లోకంలో ముఖ్యంగా మూడు స్వభావాలవారు
తొలగించండికనబడతారు . ధర్మపాలనమే మనజీవితధ్యేయం . )
నిక్కము గాంచినన్ జగము
నిండ విధేయులు - దాతలు - స్వార్థులేకదా !
కుక్కలు - పచ్చిగడ్డి దిను
గోవులు - మ్రింగును పచ్చిమాంసమున్
నక్క లనంగవచ్చు ; నిక
నవ్వక నొవ్వక జీవితమ్మునే -
దిక్కుగ ధర్మమున్ దలచి
తిన్నగ మిన్నగ దిద్దుకోవలెన్ .
మొదటి పాదం
తొలగించండి"నిక్కము గాంచినన్ జగతి
నిష్ఠులు - దాతలు - స్వార్థులేకదా ! "
అని చదువ మనవి .
గృహమునేజీవి కాచును ,కుతప మేమి
రిప్లయితొలగించండితినును,పులి తిను నేమది, దేని పాలు
శ్రేష్టము, ఫలమిడగ నేమి చేయు శుకము,
కుక్క, గడ్డిని ,మాంసమున్, గోవు ,దినును"
పూసపాటి వారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తే: దిక్కులేనిచోట తినును తృప్తితోడ
రిప్లయితొలగించండికుక్క గడ్డిని మాంసమున్, గోవు దినును
కడుముదముఁ బచ్చి మరి యెండుగడ్డి, నిచ్చ
సేవ చేయుచు రైతులఁ గావ భువిని
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఓగిరమ్ములు లేకుండ ను ర్వియ oదు
రిప్లయితొలగించండిజీవులే వియు బ్రతుక వు చిత్ర ము గను
కుక్క గడ్డిని మాంసము న్ గోవు తినును
ప్రకృతి విపరీత ములు పుట్టి పర గ వచ్చు
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిప్రక్కకు దొల్గి బోవగ నపారము న్యాయము నీతి ధర్మముల్
మిక్కిలి గాను వింతలును మేదిన గల్గును విస్మయమ్ముగా!
చుక్కలు మొల్చు వాసరము ,శూరము బుట్టును పింగళమ్ముకున్,
కుక్కలు పచ్చగడ్డి దిను, గోవులు మ్రింగును పచ్చి మాంసమున్!
🍀 ☘ ఆకుల శాంతి భూషణ్ 🌿🌱
🌷 వనపర్తి 🌷
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మేదిని' అనండి.
హా! శంకరా! గురువరా! నమోనమః! పాహిమాం!!
రిప్లయితొలగించండిచిక్కులఁ బెట్టగాను దమ శిష్యుల కిట్టుల నీయవచ్చునా!?
యక్కట! యేమి చేతుమిక! హా!యని హాయిగ నుండలేక నే
ప్రక్కకొ పోయి యేడ్చెదము వాసిగ పూరణఁ జేయలేక! నే
*"కుక్కలు పచ్చగడ్డిఁ దిను గోవులు మ్రింగును పచ్చి మాంసమున్"*
😭😭😭
🙏🏻🙏🏻🙏🏻
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ అధిక్షేపాత్మక పూరణ బాగున్నది. అభినందనలు.
తోడుగ నీకు వచ్చెదను తోరము నేడ్చెద విట్టుబాబయా!
తొలగించండిధన్యవాదాలు గురువుగారూ
తొలగించండి🙏🏻🙏🏻
😄
తొలగించండిస్వాగతమందు నేనునయ శాంతియె భూషణమై వెలుంగగా!
🙏🏻🙏🏻
అన్నట్టు ప్రాస చూడాలి కదా...😄
తొలగించండివేడెద మిమ్ము రమ్మనుచు వెల్గును శాంతియె భూషణమ్ముగా
🙏🏻🙏🏻
నాకుఁ దోచిన సవరణలు గమనించండి:
తొలగించండియేమి చేయుదుము
నుండలేక యే
లేక యే / కుక్కలు
నేడు గోముఖ వ్యాఘ్రాలె నేత లవగ
రిప్లయితొలగించండిప్రజల ధనమును దిగమ్రింగు పథక మందు
ఖర్చు పద్దుల వివరాలు గాంచినంత
కుక్క గడ్డిని, మాంసమున్ గోవు దినును.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సరసంబున నొక నేత్రము
రిప్లయితొలగించండిమరలించెను శంకరుండు మదనాంతకుడే
పురహరు డమరుడు,వెస,--శాం
కరి నిను డాక్రమణ జేసె--కాంక్షలు హెచ్చన్.
సందర్భము:-కుమార జననము -- త్రిలోచనుడు ఒక కంటితో(సూర్యుడు) పార్వతిని క్రీగంట
చూసినపుడు ఆమె సూర్య కాంతితో వెలిగిందని భావము.
AIR Hyderabad samasyaku nedu chadivina naapooranamu
మనగ్రూపులో ఎవరెవరి పద్యాలు చదివారు? వచ్చేవారం సమస్య తెలుపగలరు
తొలగించండిమురిపెమునన్ సంక్రమణం
రిప్లయితొలగించండిబిరవుగ నేర్పడెను గాన నెప్పటి వలెనే
తిరిగెను దినమణి దిశయు,మ
కరి,నిను డాక్రమణ జేసె కాంక్షలు హెచ్చన్.
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
స్వామి భక్తిని చాటంగ సాటి ఎవరు?
రిప్లయితొలగించండిజంతుజాలపు ఆహార చక్ర మేమి?
పచ్చ గడ్డిని నెమరంగ పార్శ్వ మేమి?
కుక్క,గడ్డిని మాంసమున్, గోవు దినును
కొరుప్రోలు రాధాకృష్ణా రావు
రాదాకృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిక్కమిద్దియె గమనింప నెట్టివేయు
రిప్లయితొలగించండికుక్క గడ్డిని,మాంసమున్ గోవు,దినును
మక్కువను గోవుగడ్డిని, కుక్కపలము
చక్కగా వాని పనులను చక్కబెట్ట!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తొలగించండిచిక్కులు దీర్తువీవెనట చింతలు బెంచునదీవె గాదె, నీ
రిప్లయితొలగించండిలేక్కకు రాని మిక్కుటపు లీలల నెంచగ నెంత వాడ నే
యక్కజ మేమి నీదయిన యద్భుత మాయలు జూపదల్చినన్
కుక్కలు పచ్చగడ్డిఁ దిను గోవులు మ్రింగును పచ్చి మాంసమున్.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దీర్తు వీవె యట.. నే। నక్కజ మేమి...' అనండి.
ముట్ట మన్నను ముట్టదు పెట్టినంత ;
రిప్లయితొలగించండిక్రూర మృగములు వేటాడి యారగించు ;
కోరి తినిపింప వరితౌడు కొసరి కొసరి ;
కుక్క గడ్డిని ; మాంసమున్ ; గోవు దినును.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
ఆకాశవాణి ,హైదరాబాద్ కేంద్రంలో..
రిప్లయితొలగించండిసమస్యాపూరణ కార్యక్రమంలో...
19/01/2018 ఈ రోజు శనివారం ప్రసారమైన నా పూరణ......
******* *** ** **** **** ***
కరినిను డాక్రమణ జేసె కాంక్షలు హెచ్చన్
నా పూరణ : కం
**** **** **** **** *** *** ***
హరి రక్షించెను దేనిని?
ఖరకరు నేమందురు? దశకంఠుడు ధరణీ
ధరసుత నేమియు జేసెను?
కరి ,నిను, డాక్రమణ జేసె కాంక్షలు హెచ్చన్
--- ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జంతువులతోను బోల్చగ జనులనదియె
రిప్లయితొలగించండిపశువుల గుణములే మిన్న పరమ నిజము
మానవులు డబ్బు గడ్డిని మరుఁగు చూడ
కుక్క గడ్డిని మాంసమున్ గోవు దినును?
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిచక్కఁగ మెక్కుఁ గప్పలను సర్పము; చిక్కిన బొక్కఁ గంకెడిన్
గుక్కలు; పచ్చగడ్డిఁ దిను గోవులు; మ్రింగును పచ్చి మాంసమున్
రక్కసి మూఁక; ప్రాణు లిటు బ్రహ్మ విధించిన భోజనమ్మిలన్
దక్కిన దాని మెక్కుచును దద్దయు సౌఖ్యము లందు నెప్పుడున్!
బొక్కలనుమెక్కునెయ్యది ?చక్కగాను
తొలగించండినావుమేయునేది?బులికిడు నశనమేది?
బూరిదినునేది?కోడిగ్రిములనుగొరికి
*కుక్క ;గడ్డిని; మాంసమున్; గోవు; దినును"*
చక్కనిచిక్కనైనవ్యవసాయముదక్కెసమస్యరూపమై
తొలగించండిబొక్కలు,పచ్చిమాంసమును,బూరియు,కుక్కలు,నాలు-- బొక్కలన్
*గుక్కలు;పచ్చగడ్డిఁ దిను గోవులు; మ్రింగును పచ్చి మాంసమున్* నక్కజమౌమెకంబులు,సభాధిపు లీసుగుణాణిముత్తెముల్
చక్కనియీసమస్యగనెచక్షువువాయియెరుంగదయ్యె దా
తొలగించండిమెక్కియెడందనాల్కనిజమేమిటొనేరదు మెక్కుకోళ్లనే
*కుక్కలు; పచ్చగడ్డిఁ దిను గోవులు ;మ్రింగును పచ్చి మాంసము*
న్నక్కలురేచుకుక్కలువనంపుమెకంబులుమిక్కుటంబుగన్
అక్కజమౌవనంబది,యొయారపునందన,మందుబోవుచో
తొలగించండిజుక్కమగాడునౌ,నరుడుసుందరియౌ,సురభుల్ వృకారులౌ
గుక్కలెగిడ్డులౌ,జనినగోవులుగుక్కలునిట్లువర్తిలున్
*కుక్కలు పచ్చగడ్డిఁ దిను గోవులు మ్రింగును పచ్చి మాంసమున్*
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
శంకర్ గారూ,
తొలగించండిమీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండికనగ లేదిట జగమున దినగ నెపుడు
రిప్లయితొలగించండికుక్క గడ్డిని; మాంసమున్ గోవు; దినును
రుచికరం బైన వంటల శుచిగ జేసి
మంచి యాహారముం గ్రోలు మనుజు లెపుడు!
శిష్ట్లా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండితిక్క సాముల దేశము తీరు తెన్ను
లేని నగరము చూడగ లెస్స గాను
కుక్క గడ్డిని మాంసమున్ గోవు దినును
దారి తప్పి వెళ్ళవలదు తమ్మికంటి !
జిలేబి
రిప్లయితొలగించండిమురిపెపు ణిసిధాత్వర్థము
ను రతగురువు కోరగాను నునుసిగ్గుల నా
పరిగృహ్య మెయికొనగ, శం
కరి నినుడాక్రమణ జేసె కాంక్షలు హెచ్చన్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కుక్క గడ్డిని మాంసమున్గోవు దినును
రిప్లయితొలగించండినేమి యాయెనోజగమున నిటులజరుగ
వీరబ్రహ్మముచెప్పిన విధము గాను
జరుగు చున్నవి యన్నియు వెరగు గలుగ
ఈవారం ఆకాశవాణివారి సమస్య తెలుపగలరు
రిప్లయితొలగించండి
తొలగించండిసుబ్బారావు గారు
మీ పద్యము చదివినారు (పదముల విడదీసి :))
రాబోవు వారపు సమస్య
మూడును మూడు మూడునని మూర్ఖుల చిత్తము నొచ్చు నట్లుగా
జిలేబి
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
""మూడును మూడు మూడు ననె మూర్ఖుల చిత్తము నొచ్చునట్లుగా" ?
తొలగించండి
తొలగించండికోడలు పిల్ల చూడగను, కొత్తడి లేమల కెవ్వుకేకలన్
తేడరిలంగ బుద్ధులు కుదేలుమనంగ వివేకమున్, భళా
బోడల బోలు వేడుకల, బ్రువ్వను బ్రువ్వను కైపు మాటలన్
మూడును మూడు మూడు ననె మూర్ఖుల చిత్తము నొచ్చునట్లుగా!
జిలేబి
జంత్వశనముల నచ్చటి జతలు గాంచ
రిప్లయితొలగించండిమొదలిటికి సరియగు రెండవది తలంచ
నపరమునకు నాదియ యగు నరసి చూడ
కుక్క గడ్డిని మాంసమున్ గోవు దినును
అక్కట యక్కుశేశయజు నక్కజపుం బని నొక్కి చెప్పరే
యక్కసు మిక్కుటం బవఁగ నక్కడ నిక్కి చెలంగి గ్రక్కునన్
వ్రక్కలు వాపి భీకరముఁ బ్రక్కన నుండఁగ వీడి భీతినిం
గుక్కలు, పచ్చగడ్డిఁ దిను గోవులు, మ్రింగును పచ్చి మాంసమున్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
నేటి తాజా కబురు:👇
చక్కగ జేర నేతలట చాకలి రేవున వంగభూమిలో
తుక్కుగ గెల్వనెంచుచును తోకలు కోయుచు భాజపానహా
గ్రక్కున వీరలొల్లగను కాటులు వేయక శాశ్వతమ్ముగా...
ప్రక్కన చేరి చూడనిక పట్టగ దయ్యము కాళిఘాటులో
కుక్కలు పచ్చగడ్డిఁ దిను గోవులు మ్రింగును పచ్చి మాంసమున్!
శాస్త్రి గారూ,
తొలగించండికలకత్తా నేపథ్యంతో మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
చిక్కిన వన్నియున్ దినుచు చేరును రాత్రికి దాలి గుంటలో
రిప్లయితొలగించండికుక్కలు, పచ్చగడ్డిఁ దిను గోవులు, మ్రింగును పచ్చి మాంసమున్
మక్కువతోడ చంపుచు నమానుషరీతిని క్రూర జంతువుల్
నక్కలు చాటుగా సతము నక్కుచు మెక్కును శేష నంజుడున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
అక్కట యేమియీ పలుకు లార్యులవారివె? నమ్మశక్యమే
రిప్లయితొలగించండికుక్కలు పచ్చగడ్డిదిను గోవులుమ్రింగును పచ్చిమాంసమున్
కుక్కలు మాంసమున్దినును గోవులు గడ్డిని నాహరించుగా
నక్కజ మాయెనేనిదియ యబ్బుర మందితి జూచిచూడగన్
తొలగించండిసుబ్బారావు గారు సుబ్బారావు గారే :)
జిలేబి
ఎక్కడివాడ వీ విచట నెవ్వరు చెప్పిరి మా గృహమ్మునం
రిప్లయితొలగించండిగుక్కలు పచ్చగడ్డిఁ దిను గోవులు మ్రింగును పచ్చి మాంసము
న్నిక్కమటంచు కల్ల యది నీవిదె చూడుము వాస్తవము మా
కుక్కలు, పచ్చగడ్డిఁ దిను గోవులు, మ్రింగును పచ్చి మాంసమున్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చక్కటి పండువెన్నెలన?సంబరమట్లుగనూత్నజంటకున్
రిప్లయితొలగించండి"పట్టియు కోడిపుంజుదిన?పండుగెనన్నియు సంతసించులే
కుక్కలు!పచ్చిగడ్డిదినుగోవులు!మ్రింగునుపచ్చిమాంసమున్
నక్కలు,సింహ్మముల్,పులులు నైజమెలోకమునందుజూడగా
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పండుగె యన్నియు' అనాలనుకుంటాను.
నా ప్రయత్నం :
రిప్లయితొలగించండితేటగీతి
నియమ నిష్టలు పాటించు నిరతి వీడి
శాకములమాని మాంసము గైకొనంగఁ
గొందరున్ వారు వీరైరి కూర్మి ననఁగ
కుక్క గడ్డిని మాంసమున్ గోవు దినును!
ఉత్పలమాల
చక్కఁగఁ జెప్పిరయ్య భువి శాకములన్ దిను వారు మారుచున్
మెక్కుచు నుండ మాంసమును, మేలని శాకము శాష్కులందునన్
మక్కువ మీరె కొందరికి, మారఁగ ముందటి సాంప్రదాయముల్
కుక్కలు పచ్చగడ్డిఁ దిను గోవులు మ్రింగును పచ్చి మాంసమున్
(ఎవరినైనా నొప్పించి యుంటే మన్నించ మనవి)
సహదేవుడు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినిక్కము నొక్కి చెప్పదగు నేటి యుగమ్మున నాయకోత్తముల్
రిప్లయితొలగించండికుక్కల వోలె నమ్మకముఁ గూర్చి, యమాయకగోవులట్లుగా
చక్కని వర్తనన్ జెలగి, చాపకుఁ గ్రిందుగ నీరులౌచు నా
కుక్కలు పచ్చిగడ్డిఁ దిను గోవులు మెక్కును పచ్చిమాంసమున్.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జంతువుల యోగిరము గన వింత గొలుపు!
రిప్లయితొలగించండిదేనినైన నరుని వోలె తినవు! తినదు
కుక్క గడ్డిని, మాంసమున్ గోవు; తినును
శాకముల నావు, పలలమున్ శ్వానము దిను!
గురువర్యులకు నమస్సులు.నిన్నటి నా పూరణను కూడా పరిశీలింప ప్రార్థన.
మరగించు వెతల బాపుచు
మురిపించు వెలుగుల మగని మోమున నింపన్
విరితేనె లొలుకు త్యాగయ
చరణముతో భర్తృ సేవ సతి యొనరించెన్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
చక్కగ మెక్కునే చిలుక జామను,బొక్కల బ్రీతినొందుచున్
రిప్లయితొలగించండికుక్కలు,పచ్చగడ్డిదిను గోవులు,మ్రింగును పచ్చిమాంసమున్
మక్కువమీరగా పులులె,మానవు డాకలిదీర్చుకొందుకై
చక్కగ నారగించుగద షడ్రససంయుత శాకపాకముల్ !
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని కుక్కలు జొన్నలు తినడం?
రిప్లయితొలగించండివినగ లేదిల యందునీ విషయ మెపుడు
కుక్క గడ్డిని మాంసమున్ గోవు దినును
ననెడి మాటను వినినంత నక్కజమగు
స్వప్నమందైనను నిదియు జరుగ బోదు.
డా. ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.