21, జనవరి 2019, సోమవారం

సమస్య - 2907 (పాపము లేకున్న...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పాపము లేకున్న జగము పాడైపోవున్"
(లేదా...)
"పాపము లేనిచో జగము పాడయిపోవును నిశ్చయమ్ముగన్"

103 కామెంట్‌లు: 1. ఓపిక తోవిను రమణీ
  తాపము కోపము పిరియము తమతమ పరిధిన్,
  లాపము మదమత్సరములు
  పాపము, లేకున్న, జగము పాడైపోవున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. కోపము వీడుచు ప్రొద్దునె
  సాపాటుకు తరుగ వలెను సతమత మౌచున్
  దాపున కత్తిని దోసలు
  పాపము! లేకున్న జగము పాడైపోవున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పాపముపంకిలమందురు
   పాపముశమియించహరిని బ్రార్ధింతురుగా
   పాపమునింద్యంబన నే
   పాపము లేకున్న జగము పాడైపోవున్?

   తొలగించండి
  2. పాపిని పాపసంభవుడ పాపహరాశివపాహిపాహిమాం
   పాపములెన్నిజేసితినొ,ప్రజ్ఞవిమూఢత తెల్సితెల్యకన్
   శాపముతాపముల్శుభముశాంతినొసంగవునింటిపాములే
   పాపములేనిచో జగముపాడయిపోవును నిశ్చయమ్ముగన్

   తొలగించండి
  3. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   **************
   శంకర్ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 3. తాపమున మునులు పొరబడి
  శాపమ్ముల నిడగ జనులు శాంతము లేకన్
  భీపత్సము లందు మునుగుచు
  పాపము లేకున్న జగము పాడై పోవున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. 'భీపత్సము'?

   తొలగించండి
 4. మైలవరపు వారి పూరణ

  ఆపద గూర్చు జాతికి మతాంధులు , వారికి మంచిమాటలన్
  లేపనముల్ రచించినను లేదు ఫలమ్ము ., ప్రపంచశాంతిసం...
  స్థాపనదృష్టి దుష్టులను జంపి, యొనర్చవలెన్ దృఢమ్ముగా
  పాపము., లేనిచో జగము పాడయిపోవును నిశ్చయమ్ముగన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 5. ఆపద మునిగిన జనుల ను
  కాపాడగ కొన్ని యెడల కష్టం బైనన్
  ప్రాపు గ నిలిచి నొ నర్చె డు
  పాపము లేకున్న జగము పాడై పోవు న్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పాపముపాపమేమనియెపజ్జకురమ్మనిస్వాగతించెనా
   యోపికసత్కరించెనొకొయొంటరిదంచునుజౌకయంచునీ
   పాపముతోచరించిచెడిపాపహరాశివగుందనేల నీ
   పాపములేనిచో జగముపాడయిపోవును నిశ్చయంబుగన్
   పాపముతోడునీడయగు పాపభయంబునమేలుమీకగున్

   తొలగించండి
  2. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నిలిచి యొనర్చెడు' అనండి.
   *******
   శంకర్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   పదాల మధ్య వ్యవధానం ఉంచండి.
   మీరు ఇతరుల ప్రాంగణంలో పూరణలు పెడుతున్నారు. 'ప్రత్యుత్తరం' క్లిక్ చేయక ఈ పేజీ అట్టడుగున ఉన్న 'మీ వ్యాఖ్యను జోడించండి' అన్నదానిని క్లిక్ చేసి అక్కడ మీ పద్యాలను ప్రకటించండి.

   తొలగించండి
 6. ఆపగలేనివైన యమ
  రాపగ , కృష్ణమ , గౌతమీనదుల్
  శ్రీపదపద్మరాజితులు
  శీనయ , మల్లయ , రామభద్రులున్
  ఆపద బాపు నమ్మలగు
  నంబిక , రాధిక ,భారతీసతుల్
  కోపము లేకనే సిలువ
  కోతను మోసిన దైవపుత్రుడున్
  పాపము ! లేనిచో ; జగము
  పాడయిపోవును నిశ్చయమ్ముగన్ .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పాపముజేసిరీరనియుపాడివధించగబుట్టెనిద్ధరన్
   శాపముపాపమున్గడగజక్రియెముద్దగుమీనమైఢులీ
   యోపికపందివర్ణినరభారియురాములునయ్యె బుట్టునా
   పాపములేనిచో;జగముపాడయిపోవును నిశ్చయంబుగన్

   తొలగించండి
  2. జంధ్యాల వారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   "రామభద్రు లా। యాపద..." అంటే బాగుంటుందేమో?
   *************
   శంకర్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. సాపాటుకుఁ గావలెను గ
  దా పంటల వృద్ధి; నీటి తడితో సస్యం
  బేపుగఁ బండును; మేఘ కృ
  పాపము లేకున్న జగము పాడైపోవున్.
  (కృప + ఆపము = దయాజల సమూహము)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 👏👏🙏🙏

   "కృపాపము" పోచిరాజు వారి కాపీ రైటు కదా!

   తొలగించండి
  2. కచ్చితంగా...
   ఈ సమస్యను పోచిరాజు కామేశ్వర రావు గారు ఎలా పూరిస్తారా అని ఆలోచించాను... ఆ ఆలోచనలో పుట్టినదే ఇది. పూరణ పద్యం వ్రాస్తున్నంత సేపూ నా మదిలో వారే మెదిలారు.. సరిగ్గా ఊహించారు. ధన్యవాదాలు!

   తొలగించండి
  3. 🙏

   ప్రభాకర శాస్త్రి గారిలా ఎప్పుడు పూరిస్తారు?

   తొలగించండి

  4. అబ్బే !

   పోచిరాజు వారు పోచిరాజు వారే.

   ప్రభాకరులు ప్రభాకరులే.

   అలాగే వుండాలి అప్పుడే సొబగు సొగసు.

   లేకుంటే మూస అయిపోతుందనుకుంటా శంకరాభరణము


   జిలేబి

   తొలగించండి
  5. సమస్య నిచ్చు నప్పుడు గురువు గారు నన్నే తలఁచుకున్నా రంటే ధన్యుఁడ నయ్యాను.
   పద విభజనకుఁ బ్రయత్నించాను కాని యిది తట్ట లేదండి. మీకు వ్రాసి పెట్టి యుంటే నాకెలా తడుతుంది!
   బాదరాయణ కృష్ణులే మదిలోఁ దట్టి గట్టెంక్కించారు.

   తొలగించండి
  6. jileabijee!

   If you want to write like Sri Kameswara Rao garu, you should learn a whole lot; if you want to write like gps, you should unlearn a whole lot; but nobody can write like you!

   తొలగించండి
 8. పాపపు పుణ్యపు విభజన
  యే పశువును జేయదు కద ! యీ నరజన్మన్
  చూపక విజ్ఞత , పుణ్యము
  "పాపము లేకున్న జగము పాడైపోవున్"
  (వాడికి పాపము పుణ్యము లేదు అని ఒక జాతీయం గా వాడుతుంటారు . ఆ పదాన్ని అలాగే వాడేశాను)

  రిప్లయితొలగించండి
 9. కోపము తాపముబెంచగ
  తాపము నత్యాసలందు తారసబడగా!
  శాపము!"నీతియునిలుపని
  పాపములేకున్న?జగతిపాడైపోవున్"

  రిప్లయితొలగించండి
 10. పాపము , పుణ్యమన్ మృషలు , భౌతికవాదమె మార్గదర్శి యన్
  చీ పలు తర్కముల్ పెరిగె , నిట్టివి ధర్మము నిల్ప జాలునే !
  ఏ పరమార్థమున్ దెలుపకే వికసించునె నీతి ? పుణ్యమున్
  "పాపము లేనిచో జగము పాడయిపోవును నిశ్చయమ్ముగన్"
  (పాపము, పుణ్యము అని చెప్పే తత్వాలని భౌతిక వాదులు వ్యతిరేకిస్తారు కానీ అక్కడ ఏదో పరమార్థం ఉన్నదనే భావం లేక పోతే మనుషులు నీతిగా ఉండరు )

  రిప్లయితొలగించండి
 11. తాప ముపశమించు మదిని
  పాపము లేకున్న; జగము పాడైపోవున్
  పాపముపెరిగిన,నరకపు
  కూపంబుగ దోచుచుండు క్రూరత్వమునన్

  రిప్లయితొలగించండి


 12. Today's parents and teachers on students  పాపలు బాలురెల్లరును భావితరమ్మున మేలుగాంచగా
  నోపిక లేకపోయినను నొప్పి భరించుచు పుస్తకమ్ములన్
  దోపుచు గంపెడంత తమ దోర్బలసాయము పోవలెన్ సుమా!
  పాపము! లేనిచో జగము పాడయిపోవును నిశ్చయమ్ముగన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 13. నేను వ్రాసిన పైఉత్పలమాలపూరణలో "పాపము, పుణ్యమున్ మృషలు అని గ్రహించ వలసినది. అక్కడ టైపింగ్ తప్పు పడినది)

  రిప్లయితొలగించండి
 14. నా ప్రయత్నం :

  కందం
  ద్రౌపది వలువల నూడ్చిన
  పాపము రారాజు తోడ వారించని వా
  రౌ పెద్దలఁ గూల్చె, విడుడు
  పాపము, లేకున్న జగము పాడైపోవున్.

  ఉత్పలమాల
  ఆపిన ద్వారపాలకుల నాముని వర్యులు కోపగించగన్
  శాపము వీడి శీఘ్రమె వృషాకపిఁ జేరఁగ వైరభక్తి తో
  పాపము నెంచెడున్ దలఁపుఁ బంచెననన్, హరి కూల్చు వేగమే
  పాపము, లేనిచో జగము పాడయిపోవును నిశ్చయమ్ముగన్

  రిప్లయితొలగించండి
 15. సవరించిన పూరణ
  తాపమున మునులు పొరబడి
  శాపమ్ముల నిడగ జనులు శాంతము లేకన్
  కోపము లందున రగులుచు
  పాపము లేకున్న జగము పాడై పోవున్

  రిప్లయితొలగించండి
 16. పాపమొనర్చి ప్రార్థనలఁ, బ్రస్తుతులన్ బఠియించఁ బోవునే?
  పాపఫలమ్మహో తదనివార్యముఁ భోజ్యము గాక తప్పునే?
  తాపముఁగూర్చ నయ్యదియు దల్చకు చేయకు మెట్టిదైననున్
  బాపము, లేనిచో జగము పాడయి పోవును నిశ్చయమ్ముగన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 17. ఆపుట తరమా పాపము!
  కాపురముల్ ధ్వ ంసమయ్యె--కలికాలమునన్
  వ్యాపించె కిల్బిషమ్ములు--
  పాపము లేకున్న జగము పాడై పోవున్.

  రిప్లయితొలగించండి
 18. ఈ రోజు శంకరాభరణము వారి సమస్య

  పాపము లేకున్న జగము పాడైపోవున్

  ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో  ఊర్వసి అర్జునుని అమర లోకములో మోహించి పెళ్లాడమంటుంది ఇంద్రుడు తన తండ్రి, నీవు తల్లివంటి దానివి నీతో పొత్తు మహా పాపము యనుచు అర్జునుడు తెలుపు తాడు దేవలోకములో నియమ నిబంధనలు వేరు అవి తప్పుకావు అనుచు అర్జునినితో చెప్పి పరిణయము ఆడమని ఒత్తిడి తెస్తుంది అర్జునుడు తిరస్కరిస్తాడు. దానితో కోపగించి నపుంసకుడు గా ఉండమని శాపము ఇస్తుంది . ఆ శాపము గురించి బాధ పడుతుండగా కృష్ణుడు అర్జునునితో పలికినమాటలు  దల్మి భార్య తనకు తల్లితో సమమని తెల్పినను వినక దేవ కన్య
  యగు నూర్వసి వలచె నమర లోకములోన పార్దా!నీ మాటలు వ్యర్ధ మనుచు,
  దేవ లోకమున నీతి నియమములు వేరు నాకని , చేసె తన మనసుకు తె
  లిసియును పాపము, లేకున్న జగము పాడైపోవు నెపుడని శాపము నిడె

  నుగద ముందు జూపుగలిగి , వగచ వలదు
  నర్జునా ! పేడిగ విరాట నగరమందు
  నీవు మనుగడ సాగించి నెమ్మి బడయు
  వచ్చు నని కృష్ణుడు బలికె వనము లోన


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. అదురహో !

   మీరే పాదంబిచ్చిన
   నౌరా గురుశంకరార్య నాకేమయ్యా
   మా రాసి సీసమున సా
   హోరే యని పూసగుచ్చి హోరెత్తింతున్ :)


   జిలేబి

   తొలగించండి

  2. *వారాశి సీసమున అంటే యింకా apt గా వుంటుందనుకుంటా :)

   జిలేబి

   తొలగించండి


  3. మీరే పాదంబివ్వగ
   నౌరా గురుశంకరార్య నాకేమయ్యా
   వారాశి సీసమున సా
   హోరే యని పూసగుచ్చి హోరెత్తింతున్!

   తొలగించండి
  4. సులువుగ పదములు దొరకక
   జిలేబి , శంకరుని కొరకు చిలిపిగ సీస
   మ్ముల సాయమ్మును కోరితి,
   తలవంపనకున్ననేను ధన్యుడ సుమతీ

   తొలగించండి
  5. పూసపాటి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  6. సూర్యకుమార్ గారు కృష్ణుఁడు కాదు. ఇంద్రుఁ డని యంటే యసత్యము కాకుండును.

   తొలగించండి
 19. పాపము జృంభించినచో
  నీపృథివి యనర్థములవి యెచ్చును గదరా!
  యూపున దొలంగ జేయుము
  పాపము ; లేకున్న జగము పాడై పోవున్

  రిప్లయితొలగించండి
 20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 21. ఆపద నొందిన వారిని
  గాపాడక యుండు నతడు కాపురుషుండే
  కాపాడకుండ యుండుట
  పాపము,లేకున్న జగము పాడై పోవున్

  రిప్లయితొలగించండి
 22. కాపాడి మానవుల సత
  మీ పుడమిని పాపభీతి యింపును గూర్చున్
  చూపును దారుల పుణ్యము
  పాపము, లేకున్న జగము పాడైపోవున్

  రిప్లయితొలగించండి
 23. కాపాడవయ్య హరిహరి
  పాపపు జన్మ వలదనుచు పతియున్ భక్తిన్
  నా పరమేశుడి కొల్వన్
  ప్రాపంచ విముఖత నొంది, పలికెను సతియే

  2
  నా పాలి దైవమ పతీ
  కోపింపగనేల వినుము కొమరులు లేకన్
  నీ పూజలేల జీకటి
  పాపము లేకున్న జగము పాడైపోవున్

  రిప్లయితొలగించండి
 24. పాపులు ఘోరావమతిని
  నేపునఁ జేయ సభయందు నింద్రానుజుఁడే
  ద్రౌపదినిఁ గాచె నయ్యో
  పాపము, లేకున్న జగము పాడైపోవున్


  బ్రహ్మాస్త్రమును బ్రయోగించిన యశ్వత్థామతో బాదరాయణుని పలుకులు:

  రూపరి విశ్వ మంతను విరూపిగఁ జేసెడి యస్త్ర మాపవే
  యాపుమ నీదు రోషపు ఘనాంధము వే వెలిగించి చిత్తు పెం
  దీపము లేదు దీనికిల నిష్కృతి యెన్నఁడు వీడు మిమ్మహా
  పాపము, లేనిచో జగము పాడయిపోవును నిశ్చయమ్ముగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 25. రిప్లయిలు
  1. సీతా దేవి గారి సూచనపై ఈ పూరణ తొలగించబడినది.

   ధన్యవాదములు!

   తొలగించబడిన పూరణను చూడదలచినచో ఇచ్చట క్లిక్ చేయగలరు:

   http://gpsastry.blogspot.com/2019/01/2907.html?m=0

   తొలగించండి
  2. అయ్యా, శాస్త్రి గారూ,
   చూశాను. నో కాంమెంట్!

   తొలగించండి
 26. వన సంరక్షణోద్దేశ్యంతో....

  ఏపుగ బెరిగిన చెట్ల స్వ
  రూపాలను ద్రుంచి హరిత రోచీ తతులన్
  బ్రాపుగ జూడవు పోదా
  పాపము?; లేకున్న జగము పాడై పోవున్!

  రిప్లయితొలగించండి
 27. శ్రీభగవానువాచ:
  యధాయధాహి ధర్మస్య... సంభవామి యుగేయుగే

  కాపురుషాధముల్ బ్రబలి కాలనురాయగ ధర్మమార్గమున్
  నేపుగ సాధులన్ బుధులనేడ్వగ జేయగ దుష్కుృతమ్ములన్
  కాపుగ నేగుదెంచెదను కారణజన్ముడనౌచు, ద్రుంచగా
  పాపము,లేనిచో జగము పాడయిపోవును నిశ్చయమ్ముగన్

  రిప్లయితొలగించండి
 28. పాపమను బూచి జూపిన
  పాపియె భీతిల్లి పాప పరిహారముకై
  చేపట్టు సత్క్రియలఁ గన
  పాపము లేకున్న జగము పాడై పోవున్

  రిప్లయితొలగించండి
 29. సాపాటు లేనిజనులిల
  యేపాటులనైనబడుదురిలలో నెరుగన్
  పాపాలకేమి లోటిక
  *"పాపము లేకున్న జగము పాడైపోవున్"*!!

  **వ్యంగ్యాత్మక పూరణ.

  రిప్లయితొలగించండి
 30. చూపుచు ప్రీతి నిత్యమును చోర పథమ్మునసంచరించుచున్
  దోపిడి చేసినన్ ప్రజల దుడ్డు నధర్మపు మార్గ మందునన్
  తాపము గల్గ జేయును సతమ్మును కూళులకున్ స్వకీయ మౌ
  పాపము, లేనిచో జగము పాడయిపోవును నిశ్చయమ్ముగన్

  రిప్లయితొలగించండి
 31. ఆపద నొందు వారలను నాదుకొనంగను బూనకుండుచో
  బాపము,లేనిచో జగము పాడైపోవునునిశ్చయమ్ముగన్
  బాపుల మార్చగా వలయు బాపపు కర్మల జోలికెన్నడున్
  దాపునకైన బోకునికి తద్దయుజేయగా ముఖ్యమిప్పుడున్

  రిప్లయితొలగించండి
 32. 4వపాదంచివర
  జేయగ
  గా చదువవలసినది

  రిప్లయితొలగించండి
 33. పాపను తల్లి యే గతిని బాయక గాచుచు సాకుచుండునో
  యా పగిది న్పరాత్పరుడె యన్ని జగమ్ముల రక్షసేయు క
  న్పాపవలె న్నిరంతరము బాధల దీర్చుచు మాల్మి జూపుచున్
  పాపము! లేనిచో జగము పాడయిపోవును నిశ్చయమ్ముగన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పాపపు పంకిలంబు హరియర్చ న నీరము చేహరించు, హృ
   త్తాపము శాపముల్ సమయు
   ధ్యాన సమాధి గురూపదేశమ
   న్నాపముచేత,హంసవలెనాప
   సుధాంతరమెర్గ,ధీజడం
   పాపములేనిచో జగముపాడ యి పోవును నిశ్చయంబుగన్

   తొలగించండి
  2. మిస్సన్న గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   *****
   శంకర్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 34. పాపిగఁ బుట్టడెవ్వడిల భౌతిక బంధము నందు మున్గి తా
  బాపమొనర్చుచుండు గద, పాపహరమ్మని దానధర్మముల్
  తా పనిగట్టుకన్ సలుపు ధాత్రిన మానవ కోటినే గనన్
  బాపము లేనిచో జగము పాడయిపోవును నిశ్చయమ్ముగన్

  రిప్లయితొలగించండి
 35. పాపుల రక్షించుటకై
  ఏపరమాత్ముడవతరించునొ యనుచున్
  చూపులు జూచెడువారికి
  పాపము లేకున్న జగము పాడైపోవున్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. "ఏ పరమాత్ము డిపు డవతరించునొ..." అనండి.

   తొలగించండి


 36. పాపాత్ము లుండ బోరిల
  పాపము లేకున్న..జగము పాడయిపోవున్
  కోపము ద్వేషము పెరుగగ
  పాపములేచేయుచున్న వసుమతి యందున్.

  రిప్లయితొలగించండి
 37. ౘాపము లేనిచో శరము జాణయె! దూసుకుఁ బోవులే భళా!
  దీపము లేనిచో నిశియు దీప్తుల వెల్గును నిశ్చయంబుగాఁ!
  గోపము లేనిచో నరుడు కొంచెము శాంతినిఁ బొందలేడులే
  తాపము లేనిచో తనువు దాహము దీరును దానుగా హహా!
  *"పాపము లేనిచో జగము పాడయిపోవును నిశ్చయమ్ముగన్"*

  రిప్లయితొలగించండి
 38. కోపము కలిగిన వేళల
  శాపము లిడుటయు త్వరపడి చంపుటయు మహా
  పాపమె , పగతో హింసయు
  పాపము; లేకున్న జగము పాడైపోవున్

  రిప్లయితొలగించండి
 39. శ్రీ పరమేశ్వర ధామపు
  సోపానములెక్క చిత్తశుద్ధిగ మనుజుల్
  ఓపికతో కడుగగ వలె
  పాపము,లేకున్న జగము పాడయి పోవున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. Unknown గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నరులే యోపికతో...' అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
  2. దీపము వై పం చవెలుగు
   నోపిక తో,సర్వ జనుల కూరట యగుగా!
   నాపద లోగా వవలెన్
   పాపము,లేకున్న జగము పాడయి పోవున్

   తొలగించండి
 40. డా. పిట్టా సత్యనారాయణ
  ఏ పైచదువులు జదివిన
  ప్రాపగు పాండిత్యమున్న పతి సతి ప్రేమ
  ల్లేపుగ సాగవు;కించిత్
  పాపము లేకున్న జగము పాడై పోవున్

  రిప్లయితొలగించండి
 41. డా.పిట్టా సత్యనారాయణ
  ప్రాపున శిష్యునొక్కరుని బట్టిరి దొంగ"సాధు"వాటిక
  న్నేపుగ బంపి వేయుమన నెన్నియొ మారులు, వాడు మారడే
  "ఈ పయి మేమె వెళ్ళెదము"నిట్లన సాధువు "పొండి మీర"నెన్
  "మీపయి నింద లేదితని మెచ్చెడి వారలు లేక శిక్షలౌ"1
  పాపము లేనిచో జగము పాడయి పోవును నిశ్చయమ్మునన్
  (1.అని సాధువైన గురువు క్షమా గుణము చాటునట్లు ఆ దొంగ శిష్యుని మాత్రము వదులుకోనంటాడు.మీరందరునూ కినుకతో వెళ్ళినా సరే అని చెప్తాడు.)

  రిప్లయితొలగించండి
 42. డా. పిట్టా నుండి
  ఆర్యా ,మొదటి పాదంలో"దొంగగ" పడలేదు,టైపాటు

  రిప్లయితొలగించండి
 43. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  పాపము లేకున్న జగము పాడైపోవున్

  సందర్భము: పుణ్యంకొద్దీ పురుషు డంటారు. ఏమరుపాటు చూపకం డన్నా! పుణ్యం చేసుకోండి. (దాన ధర్మాలు దేవ తారాధనలు మొదలైనవి) అంటే వినిపించుకోరే!
  ఓపిక లేదు తీరిక లేదు..అంటారు. (ఇదే ముచ్చట..) అవి లేకపోతే లోకమే పాడైపోతుంది కదా!
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "చూపకు డేమరుపా ట
  న్నా! పుణ్యము చేసికొనుడి"
  యంటిని.. వినరే!
  "ఓపిక లే" దని... రయ్యో
  పాపము..! లేకున్న జగము పాడై పోవున్

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  21.1.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి