17, జనవరి 2019, గురువారం

సమస్య - 2904 (వడఁకెను మేడసాని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వధాన మన మేడసాని వడవడ వడఁకెన్"
(లేదా...)
"వడఁకెను మేడసాని కవివర్యుఁడు సేయు మనన్ వధానమున్"
(13-1-2019 నాడు తిరుపతిలో పాలడుగు శ్రీచరణ్ గారి అవధానంలో నేనిచ్చిన సమస్య)

65 కామెంట్‌లు: 1. సెల్ఫ డబ్బా :)


  విధవిధముల కందమ్ముల
  ను ధగధగ యనుచు తృటిని‌ పనుపడు జిలేబిన్,
  సధవయె నప్రస్తుమనగ
  వధాన మన మేడసాని వడవడ వడఁకెన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. విధవిధముల కందమ్ముల
   ను ధగధగ యనుచు తృటిని‌ పనుపడు జిలేబిన్,
   సధవయె నప్రస్తుముగ న
   వధాన మన మేడసాని వడవడ వడఁకెన్!


   జిలేబి

   తొలగించండి
 2. వధజేయగ పృచ్ఛకులను
  నధికపు చప్పట్లను వినినందున తానే
  బధిరుండౌనని కలలో
  వధాన మన మేడసాని వడవడ వడఁకెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాస్త్రి గారు మీరొక సారి వృత్తము లన్నింటిలో పాదాంతాక్షరము గురువే యెందు కగు నని యడిగినారు. గుర్తున్నదా?
   ఇప్పుడు కొంత సమాచారము తెలిసినది.
   తెలుఁగున నున్న 26 చందము లందున మొత్తము 13, 42, 17, 726 సమవృత్తములలో సగము గుర్వంతములు, సగము లఘ్వంతములు.
   అయితే తెలుఁగు ఛంధః కర్త లెవ్వరు లఘ్వంత వృత్తములు గ్రహించ లేదు- లక్షణ శిరోమణి పీఠిక.

   తొలగించండి
  2. 🙏🙏🙏

   మీది ఏనుగు జ్ఞాపక శక్తి...ఉడుము పట్టుదల...అని కంది వారే అన్నారు చాలా సార్లు. మీకు మీరే సాటి...

   తొలగించండి
 3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మేడసాని అనుఇంటిపేరు గల పిల్లవాడిని బడిలోకి పంపగా పిల్లలను కదలనీయక చదువు చెప్పు చుండ ఆపుకోలేక మూత్రము కూర్చున్న చోటనే విసర్జిం,చెను చివరిలో అందరిని నిలబెట్టి సావధాన్ అనగా తడిసిన లాగును చూపలేక మేడసాని గజగజ వణికేను అను భావన


   ప్రథమ. దినమందు బడిలో
   కదలక కూర్చుండ బెట్ట కార్చెను స్రవమున్
   విధిలేక నేలపై సా
   వధానమన మేడసాని వడవడ వడఁకెన్"

   తొలగించండి
 4. మైలవరపు వారి పూరణ

  అడుగగనందమైన మనవైన తెనుంగు పదాలు లేవె ? మీ..
  రడిగినదెల్ల చెప్పుమననద్ది సమస్యయె కాదు., కాని నే...
  నడిగెద నీవుచెప్పుమనినంత వినంగనె ప్రాశ్నికుండె తా
  వడఁకెను ., మేడసాని కవివర్యుఁడు సేయు మనన్ వధానమున్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 5. సుధలను గురిపించుచు బహు
  మధురము గా పద్యమల్లు మాన్యులు వారే
  విధి పృచ్ఛకులకు జడియుచు
  వధాన మన మేడసాని వడవడ వడఁకెన్.

  రిప్లయితొలగించండి
 6. మధురపు పలుకులు పలుకుచు
  నధిక ప్రసంగమును దాటి యానంద ముగన్
  వధియిం చగపృచ్చ కులను
  వధాన మన మేడసాని వడవడ వడకెన్

  రిప్లయితొలగించండి
 7. సుధ లన్ గురి పించె న న గ
  కు ధ రము లల్లాడు భంగి కూర్చి న కవితా
  నిధుల న్ బొగ డి న వేళ న్
  వధాన మన మేడ సాని వడ వడ వ ణ కెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అడగినలేదులేదనకనాశువుగానొకపద్యరత్నమున్
   వడివడిగూర్చెధీవరుడువాణిసుపుత్రుడునేలగుందెనో
   పడవలుబండ్లుబండ్లును ప్లవం గములయ్యెమరీచివీచికన్
   "వడఁకెను; మేడసాని కవివర్యుఁడు సేయు మనన్ వధానమున్"

   తొలగించండి
  2. అధములుమధ్యములుత్తము
   లధమాధములెవ్వరన్ననధములజెప్పన్
   విధిలేకజెప్పబూనుచు
   "వధాన మన మేడసాని వడవడ వడఁకెన్

   తొలగించండి
 8. ( సాని అంటే భార్య అనికూడా అర్థం . భర్త గొప్ప భావుకు
  డైన కవి . మేడకింద భర్త . మేడమీద భార్య . ఆమె మెల్ల
  మెల్లగా మల్లెమొగ్గల గుత్తులను గురిచూచి ఆయన మీదకు సరసంగా విసరుతున్నది . )

  సడలని పద్యసంపదకు
  చక్కని వారసుడైన సత్కవీం
  ద్రుడొకడు మల్లెగుత్తులను
  రువ్వెడి శ్రీమతితోడ " నో సఖీ !
  యెడనెడ రాలి నా యెడద
  నెవ్వి స్పృశింప " వటంచు బల్కగా
  వడకెను మేడ ; సాని ; కవి
  వర్యుడు " సేయు " మనన్ వధానమున్ .
  (వధానము - ఏకాగ్రత )

  రిప్లయితొలగించండి
 9. కం॥

  విధిగా పద్యములల్లును

  బుధకోటిని మెప్పునొందు, పొంగల్ చలిలో

  బుధవారముదయ సమయము

  "వధాన మన మేడసాని వడవడ వడఁకెన్"

  రిప్లయితొలగించండి
 10. బుధులున్ మెచ్చెడిదెయ్యది?
  అధరామృతమందజేయునల్పులకైనన్!
  మధుజిత్తన? రాక్షసుడట
  వధానమన;మేడసాని;వడవడవడికెన్!

  రిప్లయితొలగించండి

 11. సందర్భము - మేడసాని వారి చంద్రగిరి, నారావారి చంద్రగిరి కి బాలకిట్టులవారు వచ్చిరి ! వారి అమోఘమైన "వాగ్ధాటి", తొడలు గొట్టి మరీ పలకడం, " ధారణా శక్తి" కి అబ్బుర పడి మేడసాని వారు, వారిని యవధాన విద్యకై పిలిచిరి :)


  ఈ మధ్య మన కోట రాజశేఖరుల వారి సందర్భపు‌ ముచ్చటలు చదివి చాన్నాళ్లయింది :) కాబట్టి యిది వారికే అంకితం :(  తొడలను గొట్టి గొట్టి పలు తూరులు చేసితి వయ్య చిత్రముల్
  హడలగ, బాలకృష్ణ, జను లందరు !రమ్ము వధాన విద్యకై
  గడగడ నేర్చు కొమ్మ యనగా భళి యాతడు మూర్ఛబోవుచున్
  వడఁకెను, మేడసాని కవివర్యుఁడు సేయు మనన్ వధానమున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కోటవారు ప్రస్తుతం సమస్యాపూరణలకు శలవిచ్చి,సీతారామ కల్యాణం కావ్యరచనలో మగ్నులై ఉన్నారు.మీకు తెలియజేయమన్నారు!

   తొలగించండి
  2. డా. సీతా దేవి గారు సీతారామ కళ్యాణ కావ్యరచనా నిమగ్న కవి దిక్కరి కోట వారికి నా యీ యభిప్రాయమును దెలుపఁ గలరు.
   సమస్యాపూరణమునకు కేవల మర గంట కేటాయించిన గ్రంథ రచనకు నాటంకముగాఁ గాక యాట విడుపుగా నుండును.
   నేను గూడ శతకములు, పద్మావతీ శ్రీనివాసము, శ్రీమదాంధ్ర సుందర కాండ, శ్రీకృష్ణ సూక్తి సుధాకరము, ప్రస్తుతము సాగుచున్న శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము మున్నగునవి సమస్యాపూరణములు చేయుచునే వ్రాసితిని.

   వారి రచనా నైపుణ్యము నందఱకు మార్గదర్శకముగాఁ బంచిన నపూర్వ సాహిత్య సేవయే యగునని నాయభిప్రాయము. తదుపరి వారి యభీష్టము.

   తొలగించండి
  3. నాపై ఆదరాభిమానములతో నా పద్యముల గుఱించి నేను వ్రాసే సందర్భములను గుఱించి ప్రశంస చేసి నన్ను ప్రోత్సహిస్తున్న శ్రేయోభిలాషులు సర్వశ్రీ జిలేబి గారికి , సీతాదేవి గారికి , పోచిరాజు కామేశ్వర రావు గారికి హృదయపూర్వక ప్రణామాలు. భవదీయుడు కోట రాజశేఖర్ .

   తొలగించండి
 12. ఎడనెడఁ బద్య మల్లుట నొకించుక నేర్చి కవిత్వలేఖనం
  బెడపక చేసి తానొక కవీంద్రుఁడ నంచు వధాన మన్నచో
  కడు సులభమ్ము గాదె యని కారులు ప్రేలినవాఁడు వేదిపై
  వడఁకెను; మేడసాని కవివర్యుఁడు సేయు మనన్ వధానమున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. ఇదేదో జిలేబి పై యెక్కుపెట్టిన పద్య మల్లే వుంది :)


   ( గుమ్మడి కాయ దొంగ కథ :)   జిలేబి

   తొలగించండి
 13. అధికపు కోతల రాయుడ
  వధానములు మించె వేయి పై నావి యనన్
  "బుధకోటి జూడ సేయుమ
  వధాన మన" మేడసాని, వడవడ వడఁకెన్

  రిప్లయితొలగించండి

 14. వడిగల కొండ వాగు వలె వచ్చును కైతలు పూనుకొన్నచో
  నడిగిన వెంటనే కవిత లాశువుగా నుడునంగ నేర్పరే
  కడువడి నేతగాని వలె కైతల సూత్రము లెన్నియో భళా!
  "వడఁకెను మేడసాని కవివర్యుఁడు సేయు మనన్ వధానమున్"

  రిప్లయితొలగించండి
 15. ఈరోజు అందరూ "వధా"నులే!!

  విధివశమున పద్యమ్ముల
  గుదిగుచ్చెడు విద్యనేర్వ గుర్రము సీతన్
  నెదిజూపు నీ ప్రతిభనిట
  వధానమన మేడసాని,వడవడ వణికెన్

  రిప్లయితొలగించండి


 16. సుధలొల్కగచే యుమికన
  వధానమన మేడసాని, వడవడ వడఁకెన్,
  సధవ జిలేబియు పసలే
  ని ధంధణమను పని కాదని తెలుసుకొనగా :)


  జిలేబి

  రిప్లయితొలగించండి


 17. మధురిమ లొల్కంగవలె న
  వధానమన మేడసాని, వడవడ వడఁకెన్,
  దధివడ యనుకొన్న జిలే
  బి, ధిగుల్లున కందివారు వేదిని నెక్కన్ :)


  జిలేబి

  రిప్లయితొలగించండి


 18. మధురిమ లొల్కంగవలె న
  వధానమన మేడసాని, వడవడ, వడ, కెం
  పు,ధన, జిలేబుల దత్తప
  ది, ధంధణగ శ్రీచరణుడదియె పూరించెన్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మధురమెగదయవధానము
   వధానమున్జేయగలరు ప్రాఙ్ఞులు ధరణిన్
   వధానము జేయగలిగియు
   వధానమన మేడసాని వడవడ వడకెన్

   తొలగించండి
 20. బుధకోటిన్ యాదిత్యా
  వధానమునకు చనగను యవధరించగ యే
  విధి జనులేతెంచుదురిట
  వధాన మన మేడసాని వడవడ వడఁకెన్

  రిప్లయితొలగించండి
 21. చంపకమాల
  ఎడపెడ జ్ఞాపికల్ నొసఁగి యింపుగ గప్పిన శాలువాలతో
  జడిసితి నిల్లు నిండ, నిక చాలదు నియ్యది కొత్త యింటినే
  వడివడి కొన్న మేలనఁగ భార్యయె జీయసుటీని దల్చుచున్
  వడఁకెను మేడసాని కవివర్యుఁడు సేయు మనన్ వధానమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. “జీయసుటీని” అర్థము కాలేదండి సహదేవుఁడు గారు.

   తొలగించండి
  2. గురు తుల్యులు కామేస్వర రావు గారికి సహదేవుని గారి పూరణలో భావము కొత్త అపార్ట్మెంట్ కొంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాక .GST అదనము. సుమారుగా నలభై లక్షల ఇల్లు ఖరీదు అనుకొంటే ఐదారు లక్షలు ఎగస్ట్రా కట్టాలి రిజిస్ట్రేషన్ కాక . అది వారి భావన

   తొలగించండి
  3. వివరించి నందులకు పూసపాటి వారికి ధన్యవాదములు

   తొలగించండి
 22. అధికారము సాధించిన
  వధాని గద మేడసాని వర్యుండిలలో
  బధిరులె పలుక గలరిటుల
  "వధాన మన మేడసాని వడవడ వడఁకెన్"

  రిప్లయితొలగించండి


 23. విధవిధముల వేదికల న
  వధానమును చూడనేమి, పసలేకయు సా
  గు ధణధణమను జిలేబి య
  వధానమన మేడసాని వడవడ వడకెన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 24. అధికుడనన చేయుము నీ
  వధాన మన మేడసాని , వడవడ వడఁకె
  న్నధముడ నేనని యొకడన
  మధురమ్మగు కవిత నిడక మరుగున దాగెన్

  రిప్లయితొలగించండి
 25. కందం
  అధికమయె జ్ఞాపికల్ నిక
  బుధవర! కొనుమంచు నిల్లు బూన్చఁగ సతియే
  వ్యధఁబడి జీయసుటిఁ దలఁచి
  వధాన మన మేడసాని వడవడ వడఁకెన్

  రిప్లయితొలగించండి

 26. With due apologies no harsh feelings


  బుధజనులే బిల్వంగ న
  వధానమని, సర్ది కండువాను సభని తా
  బధిరులను చూపి చేయుడ
  వధానమన మేడసాని వడవడ వడకెన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 27. తడబడు టింత లేదు , త్వరితమ్ముగ ప్రశ్నలకున్ కడుం
  గడసరి రీతి పద్యముల కమ్మగ జెప్పెను ప్రశ్నలేవియున్
  గడబిడగా దలంపక సుఖమ్ముగ దూదిని దారమట్లుగా
  "వడఁకెను మేడసాని కవివర్యుఁడు సేయు మనన్ వధానమున్"

  రిప్లయితొలగించండి
 28. అధమకవి యొకడు తానే
  "వధానముల జేసితి" నని వాగుచు నుండున్
  "బుధుడా ! పాల్గొను మిట నా
  వధాన" మన మేడసాని - వడవడ వడఁకెన్
  (మేడసాని వణక లేదు. దానిలో పాల్గొనమంటే ఆ కవి వణికిపోయాడు)

  రిప్లయితొలగించండి
 29. అధిక కరుణ కలుగగ మా
  త ధవళ కలువ నిడె తానె తరలెన్ భువికిన్
  మధురముగ సమస్యలిడ య
  వధాన మన మేడసాని వడవడ వడఁకెన్

  రిప్లయితొలగించండి


 30. బుధజనులకు వలయున్ సమ
  వధానమన మేడసాని, వడవడ వడకెన్
  బుధిలుడ నేనను కొన్న
  ట్టి ధిషణహీనుడు తనదు పటిమ తెలవారన్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 31. వడకెను మేడసాని కవివర్యుడుసేయుమనన్ నవధానమున్
  వడకుటగాదు సుమ్మది సభాంగణ వేదిక జూడ గామదిన్
  దొదరెను సంతసంబులె యితోధికనుత్సహ మబ్బగా దనున్
  వడకుట గల్గెగాని యది పద్యము జెప్పగలేక కాదుగా

  రిప్లయితొలగించండి
 32. సుధలు గురిపింప నోపు వ
  సుధ వాక్దేవీ ప్రియతర సూతి కురియ నా
  విధముగ హిమ మవిదితము వ్య
  వధాన మన మేడసాని వడవడ వడఁకెన్


  సడలని యట్టి పట్టుదల చక్కని ధారణ మర్థ శబ్దముల్
  బడయ విశుద్ధభావములు పన్నుగఁ గావలె దీనిఁ గెల్వ న
  ప్పుడమిని నున్న పండిత సమూహము నందలి యల్ప కోటియే
  వడఁకెను మేడసాని కవివర్యుఁడు సేయు మనన్ వధానమున్

  రిప్లయితొలగించండి
 33. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  తడబడకుండ సింహపురి దారుల నెల్లను క్రిక్కిరించుచున్
  నడచుచు వచ్చు జాణలను నందన మొందుచు చూచుచుండగా
  పడతి జిలేబి రాకగని వందల శ్రోతలు నీలలూదగా
  వడఁకెను మేడసాని కవివర్యుఁడు సేయు మనన్ వధానమున్!

  జిలేబి = అప్రస్తుత ప్రసంగి :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డాక్టర్ మునిగోటి సుందరరామ శర్మ:

   వహ్వా శాస్త్రిగారూ!👏👏👏నమామి.

   భలేగున్నది జిలేబీ లేబిలు👏✌🙏

   తొలగించండి

  2. మదనపల్లె బ్యాంకయ్యవారికి నమోవాకాలు :)


   జిలేబి

   తొలగించండి
  3. తమ సుహృద్భావనకభినుతులు.👏✌🤝🙏🌞

   ...డా. మునిగోటి

   తొలగించండి
 34. విడువని వానతో మిగుల భీకర శీతల గాలివీచగన్
  వడవడమంచు జీవులట ప్రాణమలే యరచేత బట్టుకున్
  వడకెను, మేడసాని కవివర్యుడు సేయమనన్ వధానమున్
  గడు ముదమందుచున్ గదిలె కౌశల మున్న కవీంద్రుడప్పుడే.

  రిప్లయితొలగించండి


 35. నారదా :)


  అధరముల కింక వలదు వ్య
  వధాన మన మేడసాని, వడవడ వడఁకెన్
  బుధజనుడు బడుద్దాయి, స
  మధికంబుగ పొంగగా సుమధురపు కొసరుల్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 36. సుధలను చిలికెడు పద్యము
  విధముగ జెప్పుచు వధాన విబుధుం డగుచున్,
  విధమున్ దప్పుచు నుండెడి
  వధాన మన మేడసాని వడవడ వడఁకెన్"
  కొరుప్రోలు రాధాకృష్ణా రావు

  రిప్లయితొలగించండి
 37. గురువు గారికి నమస్సులు
  విధిగా పొగడెద హితుడగు
  వధాన మన మేడసాని వడవడ వడికెన్
  మధుమతి పద్యం బల్కక
  వధానము తికమక మాయె వలపుల రాజా !

  రిప్లయితొలగించండి
 38. [1/17, 5:28 PM] Kandi Shankaraiah: 👌
  [1/17, 7:50 PM] Dr Umadevi B: డా.బల్లూరి ఉమాదేవి.

  బుధజన నుతుండెవరన న
  వధానమన మేడసాని;వడవడ వణకెన్
  విధవిధ రీతుల నెరుగక
  వధానమొనరింతు ననుచు పలికిన వాడే

  రిప్లయితొలగించండి
 39. ఇదిగో యవధానమనుచు"

  విధాన మెఱుగకయె సలుపు విద్వాంసునితో

  "ముదమును గొనదీ యష్టా

  వధాన మన" మేడసాని, వడవడ వడకెన్!

  రిప్లయితొలగించండి
 40. డా. పిట్టా సత్యనారాయణ
  ప్రధాన కవియని పొగడన్
  బంధాలను బ్రక్క బెట్టి పచ్చిక బయలున్
  సంధిసమయమున చలిలో
  వధానమన "మేడసాని" వడవడ వడకెన్

  రిప్లయితొలగించండి
 41. డా. పిట్టా సత్యనారాయణ
  బడబడ గీతమున్ వచన భాతిని మౌఖిక సాకి పాటలన్
  తడబడకుండ "గద్దర"న దండిగ బాడిన గద్య విద్యమై
  చెడమడ దిట్టులే కవుల చీటికి మాటికి తానె గొప్పగా
  నుడివితి నన్న గర్వమున నూగును త్రాగినవాని మాడ్కి పో,
  వడకెను "మేడసాని కవి వర్యుడు":"సేయుమనన్ వధానమున్"

  రిప్లయితొలగించండి