27, జనవరి 2019, ఆదివారం

సమస్య - 2913 (వరమది భక్తులను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వరమది భక్తులను మిగుల వంచించెఁ గదా"
(లేదా...)
"వరమది దేవుఁ డిచ్చినది వంచన సేసెను భక్తసంఘమున్"

114 కామెంట్‌లు:

  1. నిరతము సుఖములఁ గోరుచుఁ
    బరతత్త్వము నెఱుఁగలేక పలు దారులలోఁ
    బరుగెత్తుచుండుఁ గద రఘు
    వర! మది భక్తులను మిగుల వంచించెఁ గదా!

    రిప్లయితొలగించండి
  2. వరముల నొసగెడి యధిపతి
    తరచుగ తెలగాణమందు దండింపంగన్
    కరచెడి మాటలలో కా
    వరమది భక్తులను మిగుల వంచించెఁ గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      కావరముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇంతకూ ఎవరా అధిపతి?

      తొలగించండి
    2. శంకరాభరణం సమస్య - 2647

      "ఒక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే"

      పెక్కులు యాగముల్ సలిపి ప్రేమను పంచుచు భాగ్యనగ్రిలో
      ముక్కుకు సూటిగా నడచి పూవులు త్రిప్పుచు నార నాసికన్
      చుక్కల లోన చందురుడు సుందర రూపుడు గుండు ముక్కుడౌ
      నొక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే

      (కంది శంకరయ్య గారి సౌజన్యంతో)

      తొలగించండి
    3. 🙏

      దయజేసి ఇది సమూహములో ప్రకటించకండి బాబూ!

      తొలగించండి
  3. తి రమగు భక్తిని గల్గియు
    సుర వంద్యుని భుజగ శయను సురుచిర రూపున్
    మర చిన నే మందు ను ధీ
    వర ! మది భక్తుల ను మిగుల వంచించె గదా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      ధీవర అన్న సంబోధనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. అరయగ తన యుదరమ్మున
    స్థిరవాసము జేయమనుచు తెలివిగఁ గోరన్
    హరుడా దనుజున కొసగిన
    వరమది భక్తులను మిగుల వంచించెఁ గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..జేయుమనుచు' అనండి.

      తొలగించండి
  5. డా. పిట్టా సత్యనారాయణ
    కర చరణాల్ మస్తిష్కము
    స్థిరతయె గనలేని మనసు త్రిప్పును నరులే
    పరమోత్కృష్టపు మృగముల్
    వరమది భక్తులను మిగుల వంచించె గదా!

    రిప్లయితొలగించండి
  6. ( హిరణ్యాక్షుడు భూదేవిని సాగరంలోకి విసరివేస్తే శ్రీహరి
    శ్వేతవరాహరూపుడై వాణ్ణి వధించాడు . భూదేవిని చేపట్టి
    నరకుణ్ణి అనుగ్రహించాడు . భక్తులందరికీ బాధాకరుడైన
    నరకాసుర సంహారం కృష్ణావతారంలో కానీ కుదరలేదు. )
    చరచర వచ్చి భూరమణి
    జయ్యన సాగరమందు వైచు నా
    దురుసు హిరణ్యు ; దైత్యు ; గడు
    దుర్మదు జంపి వరాహమూర్తియే
    నరకుని బుత్రుగా నొసగె
    నర్మిలి నమ్మిన భూమిదేవికిన్ ;
    వరమది దేవు డిచ్చినది
    వంచన సేసెను భక్తసంఘమున్ .
    ( నర్మిలి - ప్రేమతో )

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. రాకుమార గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం మూడగ గణం భగణమయింది. అక్కడ జగణం కాని నలం కాని ఉండాలి. "స్థిరమగు నాచారము లవి చెలగుచు..." అందామా?

      తొలగించండి
    2. ధరపై నన్ని మతమ్ముల
      స్థిరమగు నాచారములవి చెలగుచు నుండెన్!
      త్వరపడి పరిమార్చెడు కా
      వరమది భక్తులను మిగుల వంచించెఁ గదా

      తొలగించండి
    3. తొందరపాటున జరిగిన పొరపాటు..
      ధన్యవాదాలు కందిశంకరయ్య గారు

      తొలగించండి
  8. డా.పిట్టా సత్యనారాయణ
    శరమది యేడు లోకముల చయ్యన జుట్టియు జేరు చెంగిటన్
    ధర నొక యోగమున్ గొనగ దప్పితి "వద్ద"ని యెంత జెప్పినన్
    మరుగుమనస్సు శోధనల మైల బడంగ గడంగు; సత్యమే
    వరమది దేవుడిచ్చినది వంచన జేసెను భక్త సంఘమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చెంగటన్' అనండి.

      తొలగించండి
  9. తిరుమల నాథునిఁ గొల్వగ
    నరుగుచు నుండగిరిపైకి నానందముతో
    విరిగిన కొండ చరియ వి
    డ్వరమది భక్తులను మిగుల వంచించెఁ గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  10. పరిణతి లేకయె లోకపు
    తిరకాసుల పాలు పడ్డ తిక్కేశ్వరుడా!
    సరిజూడుమురా!సంపద్
    వర!మది భక్తులను మిగుల వంచించె గదా!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తిక్కేశ్వరుడు' ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి
  11. మిత్రులందఱకు నమస్సులు!

    [రావణునితో యుద్ధమొనర్చి సంహరించుటకు శ్రీరాముఁడు రాఁగాఁ గనిన రాక్షసులు, "చావు రాకుండ వరమడిగిన రావణునకు, బ్రహ్మ వర మిచ్చియు, నీ రాముని ద్వారమునఁ జావు నిచ్చుచున్నాఁడు గదా! ఇటుల నీయఁబడిన వరములే భక్తులైన రావణాదులను వంచించుచున్నవి గదా!" యని దైవాన్ని దూషించుచున్న సందర్భము]

    తఱచి తపస్సు సేయఁగనె దబ్బున దైవమె వచ్చి యిచ్చెఁ బో
    వరమునుఁ, జావకుండ! నరవానర వర్గము చేతఁ దక్క, నే
    యరి కరమందుఁ జావఁడని, యా రఘురాముని నంపెఁ జంప! దు
    ర్వర మది దేవుఁ డిచ్చినది! వంచన సేసెను భక్తసంఘమున్!

    రిప్లయితొలగించండి


  12. అరకొర తెలివిని నడిగిన
    వరమది భక్తులను మిగుల వంచించెఁ గదా,
    శరణాగతియే సరి యని
    కరుణాకర మార్చరాద గతి భక్తులదౌ ?

    జిలేబి

    రిప్లయితొలగించండి
  13. హరినామమ్మును తలచిన
    హరియించెను ప్రాణములనె, హాటక గర్భున్
    వరమును పొందితి నను కా
    వరమది, భక్తులను మిగుల వంచించెఁ గదా.

    రిప్లయితొలగించండి
  14. గురువని నమ్మిన వారిని
    బురిడీగొట్టించె దొంగ బోధలతోడన్
    మరిమరి తననే నమ్ముట
    వరమది ; భక్తులను మిగుల వంచించెఁ గదా"

    రిప్లయితొలగించండి
  15. అరయగ నా యంచ రవుతు
    హిరణ్య కశిపుడను మెచ్చి యిచ్చెను గాదే
    మరణము నకు పరిమితి గల
    వరమది భక్తులను మిగుల వంచించెఁ గదా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హిరణ్యకశిపుని కరుణించి...' అనండి.

      తొలగించండి


  16. అరకొర బుద్ధి తోడుగ సనాతన ధర్మపు నీమమెల్ల తో
    సి రగులు కోరికల్ మదిని చిత్రము గాగొని మీదు చంద్రశే
    ఖరుడిని ధ్యానమున్ సలిపి కానగ కోరగ తీర్చినట్టి యా
    వరమది దేవుఁ డిచ్చినది వంచన సేసెను భక్తసంఘమున్


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలోని యతి సందేహం.

      తొలగించండి
  17. అరయగ నరజన్మ మదియె
    వరమది, భక్తులను మిగుల వంచించెఁ గదా
    ధరణిని నిత్యా నందుడు
    దరిజేరిన వారినెల్ల తాపసి ననుచున్.

    రిప్లయితొలగించండి
  18. మైలవరపు వారి పూరణ

    సరసిజగర్భు పాదజలజాతములన్ భజియించి , కోరగా
    వరమును, " మృత్యువన్నదనివార్యము కావున సర్వసంపదల్
    స్థిరతరకీర్తి పొందుడని తెల్పెడు మాటలనిచ్చునట్టిదౌ
    వరమది దేవుఁ డిచ్చినది వంచన సేసెను భక్తసంఘమున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధరణిని నిత్యానందుడు
      పరవనితల పొందు కోరు భ్రష్టుండగుటన్
      తరుణులకు సుతులనిచ్చెడి
      వరమది భక్తులను మిగుల వంచించె గదా !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  19. వరమది మూడడుగుల నా
    నరవరుడీయంగ వామనాకారుండే
    వరవిక్రముడై బలిగొనె
    వరమది భక్తులను మిగుల వంచించెగదా

    రిప్లయితొలగించండి


  20. అరె! వాక్కు! ప్రకృతి యొసగిన
    వరమది! భక్తులను మిగుల వంచించెఁ గదా
    సరియైన సమయమున శం
    కర! మాయని త్రోసి వేసి ఖాతికని బడన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి


  21. పరిణయ మాడితి బతుకిక
    నరకంబాయె ననుకొనకు నరుడా! లెమ్మా!
    అరరే! వగచగకు విభుని
    వరమది! భక్తులను మిగుల వంచించెఁ గదా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  22. తరితీపులచూపు రమణు
    ల రతగురువుగ మనుజుడ కలని గాంచితి వీ
    వు రయముగా లెమ్మా నర
    వర! మది భక్తులను మిగుల వంచించెఁ గదా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. వరమును బడసియు భస్మా
    సురుడును హరుని శిరంబున చోద్యము గాదే!
    కరముంచెద నని యనె కా
    వరమది భక్తులను మిగుల వంచించెగదా!
    ఆకులశివరాజలింగం. వనపర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శివరాజ లింగం గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. లేదండి శంకర్జీ. Unknown గారికి ప్రత్యుత్తర మిచ్చునట్లు ముద్రిత మైనది. ఆయన వ్యాఖ్యకు క్రింద sub-para గా ఉంది చూడండి.

      మీరు ప్రత్యుత్తరము మీద నొక్కకండి.

      దాని క్రింద గడిలో (మీ వ్యాఖ్యను నమోదు చేయండి .. . అని ఉన్నది) కర్సర్ ఉంచి నొక్కి ప్రచురించండి. అప్పుడు మీకు ప్రత్యేకముగా వ్యాఖ్య అవుతుంది.

      తొలగించండి
  24. వరమును బడసియు భస్మా
    సురుడును హరుని తలపైన చోద్యముగాదే!
    కరముంచెదనని యనె కా
    వరమది భక్తులను మిగుల వంచించెగదా!
    ఆకుల శివరాజలింగం
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  25. చెరగని దీక్షను తపమున
    సురుడొకడా చరణ జేసి శుష్మము బొందెన్
    వెరపు గలిగించు నా కా
    వరమది భక్తులను మిగుల వంచించెఁ గదా !

    రిప్లయితొలగించండి
  26. అరయగ భక్తుల కొల్లగ
    వరముల నిచ్చుచు అణచగ బంపిరి వెనుకన్
    హరిహరులిద్దరు నొకటే
    "వరమది భక్తులను మిగుల వంచించెఁ గదా"

    రిప్లయితొలగించండి
  27. అరవిందాక్షా!నిను నే
    స్థిరముగఁ గొలువన్, హృదయము నిల్చునె?మోక్షం
    బరయగ వచ్చునె?అను కల
    వరమది భక్తులను మిగుల వంచించెఁ గదా

    రిప్లయితొలగించండి
  28. హరిహరులు వరము లీయగ
    వరగర్వముతోడ సురల బాధించంగా
    భీరులులై వేడగ హరి
    వరమది భక్తులను మిగుల వంచించెగదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భీరువులై' అనండి.

      తొలగించండి
  29. బరువు గదా ధన గర్వము
    బరువు గదా బంధనములు బరువౌ సిరి నా
    బరువు తులసి సమమా న
    శ్వరమది భక్తులను మిగుల వంచించెఁ గదా

    రిప్లయితొలగించండి
  30. వరములుగలవన వాలియు
    దురితంబులు మాన్పనెంచి తొందరయందున్
    పరువముగలరాముడు "కా
    వరమదిభక్తులను" మిగుల వంచించెగదా

    రిప్లయితొలగించండి
  31. సుర వరుల ననఁగ నేలం
    బురాణములఁ గాంచమే విపులముగ మన మా
    పరఁగిన వర బలపుం గా
    వర మది భక్తులను మిగుల వంచించెఁ గదా


    గురుబల రావణాసురునకుం బరమేష్ఠి యొసంగి నట్టిదౌ
    వరకరి దైత్యనాథునకు భర్గుఁడు ప్రీతి నొసంగి నట్టిదౌ
    స్థిరముగ భస్మ దైత్యునకు శీలి యొసంగిన యట్టి మేటిదౌ
    వరమది దేవుఁ డిచ్చినది వంచన సేసెను భక్తసంఘమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  32. హరుని నమాయకత్వమది యాసరకాగను రాక్షసాధముల్
    సురనరు లందరిన్ తమ యశుద్ధపు చేష్టల క్రుంగ జేయగా
    స్థిరమగు దీక్ష బూనిరి విశేషపు శక్తులబొంది రెందరో!
    వరమది దేవుఁ డిచ్చినది వంచన సేసెను భక్తసంఘమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాకుమార గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హరుని యమాయకత్వమది..' అనండి.

      తొలగించండి
  33. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    జ్వరములు దగ్గు కక్కులును జారెడు చీమిడి ముక్కు చీదుటల్
    చురచుర మండు బొబ్బలును చుక్కల వోలెడి నాటలమ్మలన్
    మరచుట చంటిపాపలకు మైమరపించెడి బోసి నవ్వులన్
    వరమది దేవుఁ డిచ్చినది వంచన సేసెను భక్తసంఘమున్

    రిప్లయితొలగించండి
  34. వరమును గోరి భూమిజుడు ప్రాణము వీడెను దుష్టబుద్ధితో
    వరమును బొంది భస్మసురవైరి మృతింగనె నట్టి దాననే,
    స్థిరమగుఁ గీర్తిశక్తులు నశించగ ప్రాణవిఘాతహేతువౌ
    వరమది దేవుడిచ్చినది వంచన సేసెను భక్తసంఘమున్.

    కంజర్ల రామాచార్య.
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  35. హరుని గటాక్షమున్గలిగియద్భుతరీతిని జేరెసంపదల్
    వరమది దేవుడిచ్చినది, వంచనసేసెను భక్తసంఘమున్
    సురవరవంశజుండొకడు చూపుదు వేంకటనాయకుండిటన్
    నిరవుగరండిమీరలని నెత్తుకు పోయెను వారలందఱిన్

    రిప్లయితొలగించండి


  36. జీపీయెస్ వారి వృత్త దానికి


    జ్వరమును దగ్గును కక్కును
    చురచుర పితకాటము సయి చుక్కల నమ్మో
    రరయగ జిలేబి మేలగు
    వర మది! భక్తులను మిగుల వంచించెఁ గదా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. కొరకగ జామకాయలను కోరలు నుండిన యౌవనమ్మునున్
      కరచెడి యత్తగారికహ కంపము లేపెడి కర్రనెత్తుటన్
      మరచుట వృద్ధులందరికి మబ్బుల చాటున చందమామగా
      వరమది దేవుఁ డిచ్చినది వంచన సేసెను భక్తసంఘమున్

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      శాస్త్రి గారూ,
      ఇద్దరూ పోటాపోటీగా వ్రాసిన పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  37. వరమొందుచు మరణమ్మది
    సురు లసురుల వలన రాక జూడు మటన్నన్
    నరునే సృష్టించెను విధి
    వరమది భక్తులను మిగుల వంచించెఁ గదా

    నిన్నటి సమస్యకు నా పూరణ

    భాగవత రామ కధలను భారతమును
    భక్తి భావము దనరంగ పఠనజేసి
    నిత్య సంగీత సభమున్గి నియతినట క
    వనమునన్ సంచరింప వైభవము దక్కు

    రిప్లయితొలగించండి
  38. నా ప్రయత్నం :

    దొంగ బాబాల మాయా జాలం...

    కందం
    కరమున విబూది జార్చుచు
    పరమేశ్వరు లింగమొకటి బళ్లున గ్రక్కన్
    దొరకొను గారడి స్వామికి
    వరమది! భక్తులను మిగుల వంచించెఁ గదా?

    చంపకమాల
    ధరణిని పాపులెల్లరిని ధన్యుల జేయఁగ రూపమెత్తితిన్
    తిరముగ నీ విబూది మిముఁ దీర్చు పునీతమటంచు చేతఁ జా
    ర్చి రయమునన్ గళమ్ము నొక లింగమె స్వామియె గ్రక్కు! గారడీ
    వరమది దేవుఁ డిచ్చినది వంచన సేసెను భక్తసంఘమున్


    రిప్లయితొలగించండి
  39. హరి యన్నను హరు డన్నను
    పరమాత్ముం డొకడె యన్న పరమ సత్యమున్
    మరచెను వక్త కటా స
    త్వరమది భక్తులను మిగుల వంచించెఁ గదా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర గణదోషం. 'పరమగు నిజమున్' అందామా?

      తొలగించండి


  40. గిరిజాపతిని కొలిచి తా
    వరమును వేడెనొక యసుర వరుడచ్చోటన్
    కరమది యుంచినకూలెడి
    వరమది!భక్తులను మిగుల వంచించె గదా!

    రిప్లయితొలగించండి
  41. తిరుమల నాథునిన్ గొలువ తీరగు భక్తిని కొండ నెక్కగా
    బిరబిర వర్షముల్ గురిచి పెల్లుగ రాలె మహీంద్ర శల్కముల్
    మరణము నొందె భక్తతతి మార్గమునందున మృత్యు దూత య
    ధ్వరమది దేవుఁ డిచ్చినది వంచన సేసెను భక్తసంఘమున్

    రిప్లయితొలగించండి
  42. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    వర మది భక్తులను మిగుల వంచించెఁ గదా!

    సందర్భము: ఒక ఎఱ్ఱ చీమ తాను కరిచిన వెంటనే ఎదుటి వారు చనిపోవా లని కోరి శ్రీ మహావిష్ణువుగురించి తపస్సు చేసిం దట! స్వామి ప్రత్యక్షమై వరం కోరుకో మన్నాడు. "నేను కరిచిన తక్షణం మరణించా" లన్నది చీమ. "తథాస్తు" అన్నా డట శ్రీ హరి.
    అప్పటినుంచి చీమ కరువగానే అబ్బా.. అంటూ చప్పున చరుస్తాడు నరుడు. ఠపీ మని చచ్చి ఊరుకుంటుంది ఎఱ్ఱ చీమ. ఎందుకంటే కరిచిన మరుక్షణం మరణించా లని కోరింది గాని కరిచిన తానా కరువబడిన వాడా ఎవరు చనిపోవాలో కోరడం మాత్రం
    మరచిపోయింది చీమ. ఇదొక జానపద గాథ.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఎర జీమ కోరెఁ గరిచిన
    మరణింప "సరే!" యనె హరి..
    మరణ మెవరికో!
    కరిచి కనుమూసె తానే!
    వర మది భక్తులను మిగుల వంచించెఁ గదా!

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    27.1.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  43. వరమనుచు న్యాయమూర్తి శ
    బరిమలలో సంప్రదాయభంగ మొనర్పన్
    సరియగు చింతన చేయని
    "వరమది భక్తులను మిగుల వంచించెఁ గదా !

    రిప్లయితొలగించండి