16, జనవరి 2019, బుధవారం

సమస్య - 2903 (సిగరెట్ సిగపట్లు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్"
(లేదా...)
"సిగరెట్లున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్"

149 కామెంట్‌లు:

 1. వగలన్ దీర్చును రెండును
  నగవుల్ దెచ్చుచు మొగముకు నానా రీతుల్
  పగలున్ రాతిరి శంకర!
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్

  రిప్లయితొలగించండి
 2. ప్రభాకర శాస్త్రి గారూ,
  మనోరంజకమైన భావంతో చక్కని పూరణ చెప్పి శుభారంభం చేశారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 'మొగమునకు' అనడం సాధువు. అక్కడ "మొగమున" అనవచ్చు.

   తొలగించండి
  2. 🙏

   పద్యాల సంగతి తెలియదు అంతగా, కానీ సిగరెట్లపై నేను శ్రీనాథుడను...

   తొలగించండి
  3. ఇప్పుడు కూడానా? నేనూ విపరీతంగా సిగరెట్లు త్రాగేవాణ్ణి. మానేసి ఇరవై సంవత్సరాలయింది.

   తొలగించండి
  4. పెండ్లాము వచ్చి సిగరెట్లు మాన్పించి నలభై ఏండ్లు అవుతోంది. ఆపె వెడలిపోయి ఆరెండ్లు దాటింది...అయినా మాటంటే మాటే. ఇక సిగపట్లకి జిలేబి గారు, సీతా దేవి గారూ, పోచిరాజు వారూ ఇచ్చట సహకరిస్తున్నారుగా :)

   తొలగించండి
  5. "Any addiction is less of a sin and more of punishment"

   ...Oliver Wendell Holmes

   "Execept Sankarabharanam"

   ...Prabhakara Sastry

   తొలగించండి


  6. అగొ! వ్యసనమ్ములను జిలే
   బి, గుడ్డిగా పాపములని భీతిలకమ్మా
   తగినట్టి శిక్షయె సుమా !
   సిగరెట్, సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్!


   జిలేబి

   తొలగించండి
 3. వగపు ను కల్గించు నెపుడు
  సిగరెట్ సి గ పట్లు ; మనకు శ్రేయ ము గూర్చున్
  పగ మరచి మిత్ర భావము
  తగు విధము గ వృద్ది యగు చు తన రెడు వేళ న్

  రిప్లయితొలగించండి
 4. పొగ హృద్రోగముఁ గల్గఁ జేసి యుసురున్ బోగొట్టు శీఘ్రమ్ముగన్,
  దగవుల్ పెంచును ద్వేషమున్ శమము వధ్వంసంబగున్ సర్వదా
  తగ దీరీతినిఁ బల్కు టెవ్విధమునం దర్కించి చూడంగ నీ
  సిగరెట్లున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్.

  రిప్లయితొలగించండి
 5. రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి, మూడవ పాదాలలో గణదోషం. "దృష్టి నిలిపి.... సామ్రాజ్ఞి సతికి..." అనండి.

   తొలగించండి
  2. గగనము పైదృష్టి నిలిపి
   పొగలన్ రింగులు గచుట్టి పొంకము నందున్
   జగతికి సామ్రాజ్ఞి సతికి
   సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్


   తొలగించండి
  3. పొగ రింగులపై fluid dynamics లో చాలా research జరిగినదండీ...అద్భుతమైన topic!

   తొలగించండి
 6. ( శిష్యుడు వెంకటేశానికి గిరీశం బోధిస్తున్న బుద్ధిసూక్ష్మాలు )
  వగవక వినుమా ! రెండిటి ;
  సొగసుల గురిసెడి మగువల సొంపుగ రప్పిం
  పగ ; వారకుల నెదర్పగ ;

  సిగరెట్ , సిగపట్లు - మనకు శ్రేయము గూర్చున్ .

  రిప్లయితొలగించండి
 7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ రోజు శంకరాభరణము వారి సమస్య
   సిగరెట్ సిగపట్లు, మనకు శ్రేయముఁ గూర్చున్

   ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో


   పెరుగు చుండిరి మన పిల్లలు, నిత్యము త్రాగి మైకము లోన తన్ను చున్న
   నుపయోగ మేమి, తనువు కల వాటయ్యె, పిల్లలకు విరక్తి పెరుగు చుండె,
   రోగములు పెరిగె, భోగము నాశనమగుచుండె, వినుమయ్య మాట,వదలు
   మ సిగరెట్ సిగపట్లు, మనకు శ్రేయముఁ గూర్చు నెపుడు గృహములోన నీదు మార్పు,
   తనువుపై దెబ్బ తగిలిన తగ్గి పోవు,
   మనసు పై దెబ్బ తగిలిన మాన బోదు,
   కాళ్లు మ్రొక్కి కన్నీటితో కడుగుచుంటి
   నేనని పతితో బల్కెను నెలత యొకతె

   తొలగించండి
  2. పూసపాటి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. పొగయున్ బోరులు వలదని
  మగువయె వారించినంత మానిన చాలున్
  మగడే దైవము భార్యకు
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాని సమస్య సమర్థంగా పరిష్కరించినట్లు లేదు.

   తొలగించండి
 9. ఈ రోజు శంకరా భరణము వారి సమస్య
  గురువు గారు పాట సమస్య మీ వీక్షణకు నోచుకోలేదు
  అజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్

  ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో  పెద్ద కొండ చిలువను ఒక సామాన్యమైన చీమ మింగినది అని . ఇది ప్రకృతి విరుద్దము . నా పూరణము సీతను వెతుకుతూ హనుమంతుడు సంద్రము పై నుంచి వెడలు సమయాన సింహిక అను రాక్షసి (ఒక చీమ లాంటింది) హనుమంతుని (పెనుబాము వంటివాడు ) మింగినది అని నాభావన
  సీతకై వెతుకుచు సింధువు పైనుంచి పయనించు సమయాన పవన సుతుని
  వేగము ఘనముగా వెలితిపడ, జలము లోకాంచె పాతాళ లోక మంత
  నోటితో సింహికను, జలధిలో పెనుబామును మింగెడు ప్రఘనులు గల
  రని బలికిన కపి రాజు మాటలు గుర్తు కొచ్చి కాయము పెంచె కొసరి కొసరి,
  సింహిక నోటిని శీఘ్ర గతిని పెంచ చిరు రూపు డాయెను చెట్టుముట్టు,
  ముదముగ (నజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగ ) నపుడు, క్షణము లోన

  కపివరుండు సింహిక యొక్క కడుపు లోన
  తిరిగి దాని నాయువు పట్టు నెరిగి చిదుమ
  బాధ తోడ నోరు తెరువ, బయట పడిన
  కపి వరుండు వెడలెను లంకా నగరికి

  చెట్టుముట్టు =కోతి అంధ్రబారతి ఉవాచ
  పూసపాటి గుంటూరు

  రిప్లయితొలగించండి
 10. కలసి మెలసి జీవిద్దామను భార్య ప్రతిపాదన..

  కందం
  మగరాయుడనని పంతము
  నగచాట్లనుదెచ్చె నాకు నాపని పొగతో
  నిగ మీరు నేను మానిన
  సిగరెట్, సిగపట్లు; మనకు శ్రేయము గూర్చున్

  రిప్లయితొలగించండి
 11. పొగఁబీల్చి జేర బోకుడు
  బిగి కౌగిలి వేళనాకు వెగటుయె కలుగున్
  మగడా! యికపై మానిన
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయము గూర్చున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 🌹🌹🌹

   సార్! మా కాలనీలో మగువలిద్దరు పొగత్రాగువారలు:

   పొగఁబీల్చి జేర బోకుము
   బిగి కౌగిలి వేళనాకు వెగటుయె కలుగున్
   మగువా! యికపై మానిన
   సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయము గూర్చున్.

   తొలగించండి
  2. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వెగటు + ఎ = వెగటె' అవుతుంది. యడాగమం రాదు. అక్కడ "వెగటే కలుగున్" అనండి.

   తొలగించండి
 12. మైలవరపు వారి పూరణ

  మగువా ! నే పొగత్రాగుచుంటినన దుర్మార్గంబుగా దోచెనా ?
  సిగరెట్లన్ మరి తాకబోవనికపై ., ఛీత్కారమున్ మాని యీ
  సిగపట్లన్ విడనాడుమా ! పొలతిరో ! చింతింప దూరంబుగాన్
  సిగరెట్లున్ సిగపట్లు రెండు., మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పగలనక రాత్రి యనకను
   నగలను చీరలను కోరి నసఁ బెట్టునెడన్
   మగువల దృష్టి మరల్చగ
   సిగరెట్ సిగపట్లు *మనకు* శ్రేయమ్మునిడున్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. మైలవరపు వారి రెండు పూరణలు మనోరంజకంగా ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి


 13. పగవారికైన వలదోయ్
  సిగరెట్ సిగపట్లు; మనకు శ్రేయము గూర్చున్,
  మొగదల జీవముపోయుచు
  దగదగ భూతాత్మ స్వచ్ఛత సుమీ రమణీ!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 14. సమస్య :-
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్

  *కందం**

  సిగరెట్టారోగ్యములను
  సిగపట్టుయు జూడ చీర సింగారములన్
  తెగ జెరచివేయు నేలా
  సిగరెట్,సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్?
  ....................✍చక్రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చక్రపాణి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సిగపట్టును... వేయు నట్టుల...' అనండి.

   తొలగించండి


 15. పొగ త్రాగుట హానికరము!
  జగడము లాడుట చెలులకు సరికాదు కదా!
  తిగకంటి!యెటుల సుమ్మీ
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్?


  జిలేబి

  రిప్లయితొలగించండి


 16. భుగభుగ పొగలు సుడులు సుడు
  లుగ తిరుగుచు పక్కన చెలులుగ తిరుగగ నా
  జగణపు జిలేబులు, భువిని
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 17. డా. పిట్టా సత్యనారాయణ
  తెగ కుతి(మరల మరల చేయవలెనను ఇచ్ఛ)బీడీ సిగరెట్
  బిగి నిచ్చెడి కైత లల్లు బీరము గదురన్
  నెగలము(గెలువలేము) పండిత దూషణ
  సిరెట్-సిగపట్లు మనకు శ్రేయము గూర్చున్

  రిప్లయితొలగించండి


 18. జీ పీ యెస్ వారి పలుకు :)


  సిగపట్లకు గలరు జిలే
  బి గారు సీతమ్మ చెల్లి విదురుల్, సొబగై
  సిగరెట్టుకు గలరు కవులు
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 19. డా. పిట్టా సత్యనారాయణ
  సిగరెట్లన్ విదిలించబోయి నొకచో జేకొంటి పద్యంబునే
  తెగ మైకంబున నేను;గాని సతికిన్ దీపించు హేయంబె పో
  వగయై ప్రేమను బెంపు జేయ కలహ వ్రాతంబె యింటింట నీ
  సిగరెట్లున్ సిగ పట్లు రెండు మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్

  రిప్లయితొలగించండి
 20. మిత్రులందఱకు నమస్సులు!

  [సిగరెట్లు ధారాళంగా త్రాగే భర్త... చీటికీ మాటికీ యిరుగు పొరుగులతో సిగపట్లుపట్టే భార్య... ఇద్దరూ వీటిని మానాలనుకొంటున్న సందర్భము]

  "సిగరెట్లన్ దగఁ బీల్చుచో గళమునన్ శీఘ్రమ్మె ఛిద్రం బిడున్;
  సిగపట్లన్ దగఁ బట్టుచుండ నొదవున్ ఛీత్కారముల్ ద్వేషముల్;
  వగపున్ గల్గఁగఁజేయు వీని నిపుడున్ బల్మిన్ దగన్ వీడ, నీ
  సిగరెట్లున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్!"

  రిప్లయితొలగించండి
 21. కం.
  పొగబారూపిరితిత్తులు
  నగుబాటగుదురు మనుజులు నలుగురిలోనన్
  సుగమే!,మానుము రెంటిని
  "సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మల్లేశ్వర్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పొగబారి + ఊపిరి' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. 'సుగమే'...?

   తొలగించండి


 22. ( నారదుడు నాతో వచించె నిటులన్......)

  సిగరెట్ శాంతికి శాంతిని
  నగవు నొసంగు సిగపట్లు నారదమునికిన్
  తగును మనకు నవి మిత్రమ!
  సిగరెట్ ,సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్!


  🍀 ☘ ఆకుల శాంతి భూషణ్ 🌿🌱

                      🌷 వనపర్తి 🌷


  రిప్లయితొలగించండి


 23. కాయ్ రాజా కాయ్ ! ఇవ్వాళ శంకరాభరణం డమాలే డమాలు :)


  మగువల తోడున్, భుగభుగ
  ల గుంజనం బెడతెగని విలాసమ్ముగ తా
  నగజాతంబుగ కోరగ
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మగువలకున్ సిగపట్లే
   మగవారికిని సిగరెట్లె మస్తు మజాయే!
   అగునిది నిజము జిలేబీ!
   సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్!

   తొలగించండి
  2. జిలేబి, శాంతిభూషణ్ గారల రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి


  3. ఆకుల శాంతి భూషణ్ గారు


   జిలేబీయముగా వున్నది ంంంంంంంంంంంంంం

   మీ కందము :)


   జిలేబి

   తొలగించండి


 24. సిగరెట్ హానినె జేయును
  సిగపట్లు బ్రతుకు బతనము జేయదె మనసా?
  తగునా యిట్లు వచించుట!
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్


  🍀 ☘ ఆకుల శాంతి భూషణ్ 🌿🌱

                      🌷 వనపర్తి 🌷


  రిప్లయితొలగించండి
 25. పొగతోప్రాణముబోవుద్రాగకుడుగంపున్ద్రవ్యనాశంబగున్
  సిగపట్లెన్నడుసర్దుబాటునిడకన్ జింతాగ్నికిన్నాజ్యమౌ
  నిగనేతీరుగరెండుమేలొసగు?మన్నింపందగున్నెట్లగున్
  "సిగరెట్లున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్"

  రిప్లయితొలగించండి
 26. ప్రగతిన్గోరిన యాంగ్లభాషచదువే ప్రజ్ఞానమందించులే
  పగవారైనను మిత్రులైనధృతితో పాశ్చాత్యభావోద్ధతిన్
  "సిగరెట్లున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్"
  బొగతో,గయ్యముతో నవీనులనె నోబుణ్యాత్ముడుద్వేగుడై

  రిప్లయితొలగించండి
 27. నెగులున్గూర్చెడుగీడొనర్చెడు మహానీచంపుటభ్యాసముల్
  "సిగరెట్లున్ సిగపట్లు రెండు మనకున్ ,శ్రేయంబులన్ గూర్చెడిన్"
  బగతోగానిదిప్రేమతోనగు దురభ్యాసంబుసత్యంబుతో
  దెగునార్యోక్తి సనాతనాచరణ సద్విద్యాత్మజర్చింపగన్

  రిప్లయితొలగించండి
 28. నెగులురగిల్చునునరులకు
  సిగరెట్ సిగపట్లు;మనకు శ్రేయము గూర్చున్
  పొగయనపామున్నగృహము
  సిగరెట్ వల్మీకసమము చెడువర్జింపన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకర్ గారూ,
   మీ నాలుగు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 29. పొగబీల్చిన క్షయవచ్చును
  సిగపట్లవి చేటుదెచ్చు సిగ్గుకుచోటౌ
  యెగతాళికాదె పలుకగ
  సిగరెట్లు,సిగపట్లు మనకు శ్రేయముగూర్చున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొగ త్రాగని యత్తయ్యే
   తగు క్షయతో బాధపడెను తగవుల సీతా!
   పొగ త్రాగిన యల్లుండే
   వగలేకయె వ్రాసె వ్రాసె బహుపద్యమ్ముల్ :)

   తొలగించండి
  2. తగవులు తగవని గురువులు
   తగుసూచన జేసినారు తలపగమేలౌ!
   నగుబాటు గూర్చునవియే
   తగినట్లు నడువగమేలు తలతిక్కన్నా!

   తొలగించండి
  3. For Maggie has written a letter to give me my choice between
   The wee little whimpering Love and the great god Nick o' Teen

   And a woman is only a woman, but a good cigar is a Smoke.
   Light me another Cuba - I hold to my first-sworn vows,
   If Maggie will have no rival, I'll have no Maggie for Spouse!

   ...Rudyard Kipling (Nobel Laureate)

   https://en.m.wikipedia.org/wiki/The_Betrothed_(poem)

   తొలగించండి
  4. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   అన్నట్టు మీ అన్నాచెల్లెళ్ళు చిన్నప్పుడూ ఇలాగే తగవు లాడుకునేవారు కాబోలు!

   తొలగించండి
  5. లేదు లేదు సార్! ఆవిడ నాకన్నా పండ్రెండేండ్లు చిన్న. నేను పదమూడేండ్ల వయసులోనే ఇల్లు విడిచి పై చదువులకు విశాఖకూ, తరువాత బెంగాలుకూ వెళ్ళిపోయాను. మా తగవులు శంకరాభరణంలోనే...నాకు 62 వయసులో ఆంధ్రకు తిరిగి రావడం Culture Shock... తప్పు నాదే :)

   తొలగించండి


 30. అగజాతంబగు రీతు లాయె కద వయ్యారంబుగా పెన్మిటిన్
  మొగమాటంబున త్రోసి, దోచి మదినే మోహమ్ము లో దేల్చగా
  తగునమ్మా సఖియా జిలేబి! జడకందంబైన సుళ్లేను, వా
  సిగ, రెట్లున్ సిగ, పట్లు రెండు, మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 31. "తగువిధమగు మూర్ఖునకే
  సిగరెట్ సిగపట్లు" శ్రేయము గూర్చున్
  తగదనువాటిని వీడుచు
  పగయేలేనట్టి బ్రతుకుబాటన నడువన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   సమస్యలోని 'మనకు' టైప్ కాలేదు.

   తొలగించండి
 32. మగనికి ననె విసిగిన నొక
  మగువయె "యీచెడలవాటు మానుము మగడా!
  తగునే నీకిది ? యెట్టుల
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్?"

  రిప్లయితొలగించండి
 33. పొగయేయాగపుటోగిరంబుసురకున్బూజించులేయాజియై
  సిగపట్లేయగుమంచిచెడ్డలకుసచ్ఛీలంబువర్ధిల్లగా
  పగవారెవ్వరుజూపుసవ్యమయినన్ ,బ్రహ్మానుసంధానికిన్
  "సిగరెట్లున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్"
  (సరదాపూరణముగా భావించ మనవి)

  రిప్లయితొలగించండి


 34. జీపీయెస్ వారి పలుకు

  సిగరెట్లకు శ్రీనాథుడ!
  తగినట్టి మగడను సతికి తవమొనరిచి గాం
  చెగదా పెన్మిటిగా! గన
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్!  జిలేబి

  రిప్లయితొలగించండి


 35. తగురీతిగా పురుషులకు
  సిగరెట్, సిగపట్లు మనకు, శ్రేయముఁ గూర్చున్
  మగువా! యెక్కువగా మరి
  పొగబెట్టక బతుకు సాగి పోవలె నెపుడున్ :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగు బాగు!

   అతి సర్వత్ర వర్జయేత్! రోజుకు రెండే పేకట్లు, రెండే జుట్పట్లు :)

   తొలగించండి


 36. భుగభుగ తా పీల్చగ నా
  సిగరెట్, సిగపట్లు మనకు, శ్రేయముఁ గూర్చున్
  మగడిని ముకుదాడున క
  ట్టి గట్టి గాను పెనవేసి టెక్కును నాపన్ :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
 37. సిగలో మల్లెల ఘుమఘుమ
  ల గను మగడ నీ కదేల లంపటముల జి
  క్కగయని కలహించ యువిద
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాలకృష్ణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కలహించ నువిద' అనండి.

   తొలగించండి

 38. హడ్తాల్ కరో బంద్ కరావో :)

  మగ వారలు మన మాటల
  తగదని చెప్పుచు జిలేబి, తకరారు గనన్,
  జిగజిగలాడింపగ నా
  సిగరెట్, సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 39. జగతికి హానులు సేయును
  సిగరెట్ సిగపట్లు,మనకు శ్రేయముగూర్చున్
  ఖగపతి సేవలు మాత్రమె
  సిగపట్టులవలన దొలగు చెలుములు గదరా

  రిప్లయితొలగించండి
 40. పొగ చూరెను దేశంబని
  పొగాకు పంట వలదనుచు పోరాటములన్
  తెగ సేయగ ధీమతులున్
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్

  రిప్లయితొలగించండి


 41. వగచకు వగచకు వలదని
  సిగరెట్ సిగపట్లు; మనకు శ్రేయముఁ గూర్చున్
  జగతిని బుర్రనవియె వే
  డిగచేయును పనుల చేయ డింకగ దిటమున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 42. పొగతోడ చెఱుపు నెయ్యది?
  తగవుల నేమి కలుగు? నవి దరిచేరనిచో?
  జగతిని మనకేమి యమరు?
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 43. మగరాజ! వలదు సుమ్మీ
  సిగరెట్ సిగపట్లు; మనకు శ్రేయముఁ గూర్చున్
  భగవంతుని ధ్యానమయా!
  జగదాంబపలుకుల నీవు చక్కగ వినుమోయ్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   వినుమోయ్.. అనడం వ్యావహారికం. "వినుమా" అనండి.

   తొలగించండి
 44. సిగరెట్ ద్రాగుట హానియు
  సిగపట్లును బగను బెంచు జింతన జేయన్!
  తగునివి వీడుట;నెవ్విధి
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అజ్ఞాత గారూ,
   అధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 45. పొగరెక్కిన సిగరెట్టును
  సిగ (ఫిల్టర్)బట్టుక బీల్చువాడు జెడిపోవునులే
  జగమును గాల్చుచునుండిన
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్"

  పగబట్టుము సిగరెట్టును
  సిగబట్టుకు దన్నవలయు ఛీఛీయనుచు
  న్నగణిత ఛీత్కారములన్
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముగూర్చున్.

  మిరియాల ప్రసాదరావు, కాకినాడ

  రిప్లయితొలగించండి
 46. మగువా! కనుగొన మనకును
  తగుదారులు ప్రేమ క్షమయు ధరణిన రెండే
  తగనివి వీడుద మవియే
  సిగరెట్ సిగపట్లు; మనకు శ్రేయముఁ గూర్చున్

  రిప్లయితొలగించండి


 47. దిగులేలనకో ? వలదోయ్
  సిగరెట్; సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్
  దగని పలుకు! పడతిని నీ
  బిగి కౌగిలినిడుమయా లభించు జిలేబీ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దిగులేలనొకో' అనండి.

   తొలగించండి
 48. సిగరెట్టున్ వ్యసనమ్ము వోలె మిగులన్ సేవించ రోగార్తుడౌ,
  సిగపట్లున్ మహిళాశిరోమణియశశ్ఛిద్రమ్ముఁ గావించెడిన్,
  దగునా శంకరసత్కవీంద్ర? నుడువన్, దద్వాక్క పాస్తంబగున్
  సిగరెట్టున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయమ్ముఁ జేకూర్చెడిన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి


 49. జగడాలమారి! లాగకు
  సిగరెట్! సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్,
  తగువుల చేయ విడాకుల
  గు! గవనముగొనుము జిలేబి గుబ్బెత పో పో !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 50. వగవక యించుక యైనను
  నెగతాళికి నింటను సఖియె తడఁబడుచు నా
  యిగురాకుఁబోణి యట్లనె
  సిగ రెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్

  [రెట్టునకు రెట్ పర భాషా వనిత మాట; సిగ రెట్టు = కొప్పునకు చుట్టుకొను ముతక బట్ట]


  తగ దీ యందము లిచ్చెడిం బులక రింతల్ నీకు నెన్నండునుం
  దగునే వాడఁగ నెత్తి కింతటి రుజాత్తంబైన ద్రవ్యమ్ములన్
  మగువా చెప్పెద వీవు వింతగ నసంబంధంబ వేయేల యో
  సి గ రెట్లున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్?

  [గరు+ఎట్లున్ = గరెట్లున్ ; గరు = గగుర్పాటు; పులకరింత, జుట్టు పూఁతలు రెండు నెట్లు శ్రేయములు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 51. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  ఖగరాజుండిడ కాల్చరా! యనుచు తా కవ్వించి బీడీలనున్
  తగవుల్ రాజగు విష్ణుభక్తుడతడే తాకట్లు పెట్టంగ హా
  నగవుల్ రాజులు చంద్రులిద్దరును భల్ నవ్వించి కాట్లాడగా
  సిగరెట్లున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
   'తగవుల్ గోరెడి' అనండి.

   తొలగించండి
 52. ఒక సినీ దర్శకుడు నిర్మాతతో.....

  మత్తేభవిక్రీడితము
  పొగరాయున్ వగలాడిఁగూర్చి జత భావోద్వేగముల్ రేపెడున్
  తగవుల్ జేరిచి నాటకీయముగ చిత్రంబందు హాస్యమ్ముతోఁ
  దగు సద్బోధల మంగళంబనిన మోదంబందగన్ బ్రేక్షకుల్
  సిగరెట్లున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇంకొంచెం మెరుగ్గా ఉంటుందని...

   ఒక సినీ దర్శకుడు నిర్మాతతో.....

   మత్తేభవిక్రీడితము
   పొగరాయున్ వగలాడిఁగూర్చి జత భావోద్వేగముల్ రేపెడున్
   తగవుల్ జేరిచి నాటకీయముగ చిత్రంబందు హాస్యమ్ముతోఁ
   దగు సద్బోధల మంగళంబన వినోదంబందగన్ బ్రేక్షకుల్
   సిగరెట్లున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్


   తొలగించండి
  2. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 53. వెగటున్ గలిగించు గదా!
  సిగరెట్, సిగపట్లు; మనకు శ్రేయము గూర్చున్,
  యొగియును సంసారంబున
  తెగద్రుంచగ వీని నెపుడు తొడఁకు సుఖంబుల్!

  రిప్లయితొలగించండి
 54. తెగబడి సిగరెట్ కాల్చుచు
  సిగపట్లను పట్టు కొఱకు చిందులు వేసే
  మృగసముడు బలికె నొకపరి
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్

  నిన్నటి దత్తపది కి నా పూరణ

  కరము భక్తిని మకర సంక్రమణ మందు
  కరములను మోడ్చి దలచి శ్రీ కరుని మది , త్రి
  కరణ శుద్ధిగ ప్రాంర్ధించ గలుగును దిన
  కర శుభాశీస్సు లనుటడి కఠిన నిజము

  రిప్లయితొలగించండి
 55. జగతిన్నింద్యముగాదలంచు బొగరాజార్హంబు నేవస్తువో?

  బుగులున్నిద్రవినాశకారకము సమ్మోదాంతమెభ్భంగినౌ?
  సగుణాత్మ్యంబునునిర్గుణాత్మకపునీశావాస్యమేమిచ్చునో?

  "సిగరెట్లున్ ;సిగపట్లు; రెండు మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్"

  రిప్లయితొలగించండి
 56. రగులన్ చల్లని వాయువుల్, పొగగొనన్ ప్రాప్తించు సంతృప్తి వే
  మగువన్ కూడి గృహమ్ములో చెలఁగునున్మాదంపుకాలమ్మునన్
  తగవేయౌ సిగపట్లు సమ్ముదమిడున్ తధ్యమ్ముగా నాతఱిన్
  సిగరెట్లున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్

  రిప్లయితొలగించండి
 57. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 58. అగజా! వింటివె కీడుజేయునుగ నాయావేళలందెంచగన్
  సిగరెట్టున్సిగపట్లురెండునుమనకున్ శ్రేయంబున్గూర్చెడిన్
  లగనంబొందుచునారమాపతినినుల్లాసంబుబూజించగా
  సిగపట్లందుచునుండుచోగరిమ నిస్తేజంబునొందున్గదా

  రిప్లయితొలగించండి
 59. పొగనే త్రాగిన యాయు క్షీణ మనుచున్ మున్నెందరో చెప్పిరే
  మొగుడా వద్దని చెప్పఁ గొట్టెదవు నీ మూర్ఖత్వ మీపాటిదౌ
  మగువన్ జెప్పెద నాలకింపుమిక నామాటల్, మానినన్
  సిగరెట్లున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్

  రిప్లయితొలగించండి
 60. గన్నవరం లలిత్ ఆదిత్య అష్టావధానంలో సమస్యాపృచ్ఛకుడుగా పాల్గొనడానికి బయలుదేరాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. మా అబ్బోడిని కాస్త జాగ్రత్తగా చూసుకోండి మరీ
   కనాకష్ట పెట్టకుండా :)   జిలేబి

   తొలగించండి
 61. కందం:
  సిగరెట్ హరించు తనువును
  సిగపట్ల వలన పెరుగును చిక్కులు నిత్యం
  తగువే లేకయు మరిచిన
  "సిగరెట్ సిగపట్లు,మనకు శ్రేయముఁ గూర్చున్"

  గొర్రె రాజేందర్
  సిద్ధిపేట

  రిప్లయితొలగించండి


 62. అగొ! బ్రెక్జిటు! కాలెన్ పో
  సిగరెట్, సిగపట్లు; మనకు శ్రేయముఁ గూర్చున్
  జగతిని యని థెరెసా మే
  ప్రగతిని కోరగ జిలేబి ఫ్లాప్ షో అయెనే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 63. పనులు భర్తలకు అప్పజెప్పి..ముచ్చట్లలో మునిగిన ఇద్దరి భార్యల గురించి వారి భర్తలు...ఒకరితో..మరొకరు...

  మొగమాటంబును వీడి యన్న!సతులే ముచ్చట్లలో మున్గిరే
  నగవుల్ వారికి చాకిరా మనకు పన్నాగంబు సూచింతునా
  పగలన్ బెంచియు వారిమధ్య హహహా పాలించుటేమిన్న *వా*
  *సిగ,రెట్లున్! సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి