మయసభలో జరిగిన పరాభవమునకు సుయోధనుడు కోపంతో రగిలి పోవుచుండ శకుని “సుయోధనా కోపము దూరముగా బెట్టుము సౌఖ్యము కలుగును మాలిమి చూపి పాండవులను నేలను కూల్చవలయను అలోచచించుము” అని పలుకుతాడు
ఆలోచన చేయుము కో పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్, మాలిమి తోడ సుయోధన, నేలను కూల్చుమనుచు శకుని బలికె నపుడున్
చాలా సుఖమ్ము బీడీ గ్రోలన్ మీకికను రావు రోగాలెపుడున్! చాలున్! జిలేబి! మీ శా పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్!
"As an example to others, and not that I care for moderation myself, it has always been my rule never to smoke when asleep and never to refrain when awake.
"The recent decision by the Food and Drug Administration to label cigarettes a nicotine delivery system has drawn cheers from many in the scientific community, including Colleen McBride, director of the cancer prevention, detection and control program at Duke University Medical Center. McBride says there is a growing body of evidence that nicotine actually relieves some symptoms of Parkinson's and Alzheimer's disease, and appears to help those with severe depression focus."
యతిమైత్రి కుదుర్చుకోవటం పూరించే వారి బాధ్యత గా భావించి యీవిధంగా పూరించినాను. ****)()(**** ఏలిన వారికి మనవిది బాలలెగా భవితలోన పౌరులనంగన్ బాలల కన్నులలో భా ష్పాలను దూరమున బెట్ట సౌఖ్యంబబ్బున్.
సందర్భము: సులభం. సమస్యను రెండవ నాల్గవ పాదాలలోను వుంచి పూరించడం విశేషం. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ లీలగ.. పాపాలను, లో పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్.. మే లగు.. కోపాలను, తా పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్
✒~డా.వెలుదండ సత్యనారాయణ 6.1.19 -----------------------------------------------------------
కవిమిత్రులు మన్నించాలి. ఉదయం పొరపాటున కందపాద సమస్య "పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్" అని ఇవ్వడం జరిగింది. పోచిరాజు సుబ్బారావు గారు పోను చేసి పొరపాటును తెలియజేసారు. వారికి ధన్యవాదాలతో సమస్యాపాదాన్ని సవరించాను.
రిప్లయితొలగించండిశంకరాభరణం... .
05/01/2019 శనివారం
నేటి సమస్య :
******* *** **
పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్
నా పూరణ : శార్ధూలము
**** **** **** **** *** *** ***
చాలున్!చాలిక! కోపతాపములు విస్తారంబు గల్గంగ! రో
గాలన్ మిక్కిలి గల్గజేసి తనువున్ గావించు నాశంబునే!
యేలన్ నాదగు మాటలన్ వినవు?నిన్నే రీతి నొప్పింతు? కో
పాలన్ దూరమునందు బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్
🍀 ☘ ఆకుల శాంతి భూషణ్ 🌿🌱
🌷 వనపర్తి 🌷
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాలన్ బొమ్మలు జెక్కినన్ పలుకవే బ్రాంతిన్ మహాభాగ్యమౌ
రిప్లయితొలగించండికాలున్ తన్నగ శంకరుండు వినయం బున్ సాగె సద్భక్తితో
హేలన్ మాటలు తూలనాడి నభువిన్ యెన్నెమ్మ పూనంగ కో
పాలన్ దూరము నందుఁ బెట్టినపుడే స్వాస్ధ్యంబు లభ్యం బగున్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'యెన్నెమ్మ'?
ఎన్నెమ్మ = ఒక భూత విశేషము , పురిటిలో పిల్లల్ని ఆవహించు దుష్ట శక్తి
తొలగించండిఅనుకున్నాను. కాని అక్కడ యడాగమం రాదు.
తొలగించండిపాలన్ గ్రోలెను వెన్న దోచెనట గోపాలుండు రేపల్లెలో
రిప్లయితొలగించండిపాలన్ బట్టిరి యుగ్గుగిన్నెలను మా పాపాయి కేరింతలన్
కాలం మారగ స్వచ్ఛభారతమునన్ కాలుష్యమొప్పారగా
పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కాలం' అనడ వ్యావహారికం. అక్కడ 'కాల మ్మేగగ...' అందామా?
🙏
తొలగించండి🙏
తొలగించండిఈ పూరణ ఏలనో ఆకాశవాణిలో జారిపోయినది. బహుశా వ్యావహారికమొకటి దొర్లిన కారణం కామోసు...ఇబ్బంది లేదు
😊
"ఎంత బాగుంది పాపాయి కేరింతలా! ""
తొలగించండి...చిటితోటి విజయకుమార్
ఔ లే, మా గురజాడ నాటకము కన్యాశుల్క, మందున్న వా
రిప్లయితొలగించండిచాలుండైన గిరీశమే తెలిపె "వత్సా! ధూమపానమ్ము మేల్
మే" లంచున్; దగనట్టి మాట యిది; సంభావింప బీడీల ధూ
పాలన్ దూరము నందు పెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యం బగున్!
🙏
తొలగించండినా సొత్తు...
'నా సొత్తు'... అర్థం కాలేదు!
తొలగించండిబీడీలు...
తొలగించండిబాలా చెప్పెద నొక్కమాట వినుమా పాటింపగన్ జాతికిన్
రిప్లయితొలగించండిమేలౌనంచును చెప్పిరే యవనిలో మేధావులే పూర్వ మే
వేళన్ శాంతిని వీడబోకుడనుచున్ విజ్ఞాపమున్ జేయ కో
పాలన్ దూరము నందు బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మయసభలో జరిగిన పరాభవమునకు సుయోధనుడు కోపంతో రగిలి పోవుచుండ శకుని “సుయోధనా కోపము దూరముగా బెట్టుము సౌఖ్యము కలుగును మాలిమి చూపి పాండవులను నేలను కూల్చవలయను అలోచచించుము” అని పలుకుతాడు
రిప్లయితొలగించండిఆలోచన చేయుము కో
పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్,
మాలిమి తోడ సుయోధన,
నేలను కూల్చుమనుచు శకుని బలికె నపుడున్
పూసపాటి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఏలన్ జెప్పెద నేటి ఘోరముల? నెన్నెన్నో విధంబుల్ సదా
పాలన్ జేసిరి కల్తి దుర్మతి తతుల్ పైకంబు నార్జించగన్!
మాలిన్యంబగు నట్టి క్షీరము కడున్ మానించు నారోగ్య; మా
పాలన్ దూరమునందు బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్
🍀 ☘ ఆకుల శాంతి భూషణ్ 🌿🌱
🌷 వనపర్తి 🌷
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిచాలోయ చేసిన చేష్టలు
వాలాయముగాను గలుగు వాసియు జాలున్
ఏలా తొందర నీ పా
పాలన్ దూరమునబెట్ట సౌఖ్యంబబ్బున్
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చాలయ' టైపాటు!
డా.పిట్టా నుండి
తొలగించండిఆర్యా, అది"చాలోయ్" అనే శబ్దము .టైపాటే జరిగినది.కృతజ్ఞతలు.
కృష్ణుడు సుయోధనుని తో ____
రిప్లయితొలగించండిఆల ము మానియు సంధికి
తాలిమి తో సమ్మతించి దైన్య ము మాన్ప న్
మేలగు కురు రాజా ! కో
పాలన్ దూరము బెట్ట సౌఖ్యం బబ్బున్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఆలోకింపగ నీకు సత్త్వమిడునీ యాహారముల్ , కాని శా...
పాలౌనీసునసూయలెన్నగను తాపక్రోధసంజాతముల్ !
నీలోనుండి దహించు నిన్ గలచుచున్ నిత్యంబునా కోపతా....
పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్"
మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచాలుం జాలును పెద్దవాడవు కదా జంజాట మో తండ్రి! నీ
రిప్లయితొలగించండికేలన్ హాయిగ నీ వయస్సున? సదా క్రీడించుచుం బౌత్రుతో
వేళం దిండియు నిద్ర జూచుకొనవో విత్తార్జనంబౌ కలా
పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఇదేదో నాగురించే వ్రాసినట్టున్నది!
ధన్యవాదాలు గురువు గారూ. మీకా ధనార్జన కార్యకలాపాలతో పనిలేదుగా. నిష్కామ కర్మ గడిపేస్తూన్నారు జీవితాన్ని.
తొలగించండిడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిమూలంబేదియొ సంకటంబులకు నీ మోమున్ గనన్ దెల్యదే
గోలల్, రోష, మసూయ,పోటి జెలగన్ గోప్యంబుగా రక్త లో
పాలే బెర్గగ శాంతి యుండదు నపారంబునౌ ద్వేష కో
పాలన్ దూరమునందు బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తెల్యదే' అన్న ప్రయోగం సాధువు కాదు.
రిప్లయితొలగించండివాలకపు పరిష్వంగము,
గోలల చెంత సుఖముల బుగులుబుగులు సరా
గాల నరుడ, హెచ్చగు తా
పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్ :)
జిలేబి
రిప్లయితొలగించండిచాలింపన్ దగు బాలసమ్ము సఖియా సౌఖ్యంబులన్గాన నీ
వీ లాలూచిని వీడి మంచి నడతన్ వెన్నంటి బోవన్ దగున్
కైలాసంబును వాంఛచేయ వినవే కాంతామణీ నీవు కో
పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[ఒక చూడఁ జక్కని నాట్యకత్తె సుతారముగ నాట్యము చేయుచు, మైమఱచి కొంచె మధికముగా కాలుసేతుల నాడించఁగా, నడుమునందు శూల యధికమై, భరింపరానిదయ్యెను. ఆమె వైద్యుని సంప్రదించఁగా, నాతఁడు "తల్పాలపై నిద్రించుట మాని, నెలపైఁ బరుండిన నిమ్మళించి, స్వాస్థ్యము చేకూరు" ననిన సందర్భము]
కేలుం ద్రిప్పుచుఁ గాలు ద్రొక్కుచు వెసన్ గీతాలకున్ నాట్యమున్
లీలన్ జేయుచునుండ రేఁగె వెనునన్ ద్రిక్కుల్ గరిష్ఠమ్ముగా;
మ్రోలన్ వైద్యునిఁ గోరఁ జెప్పెనపు డంభోజాక్షికిన్ వెజ్జు "త
ల్పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యం బగున్!"
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండి
రిప్లయితొలగించండిరాలిన వెంట్రుకలు రుజువు
యేలన్ సావాసము! సరియే కాదు సఖా,
చాలించు బీడి! వడి ధూ
పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రుజువు + ఏలన్ = రుజు వేలన్' అవుతుంది. యడాగమం రాదు.
చాలా సుఖమ్ము బీడీ
తొలగించండిగ్రోలన్ మీకికను రావు రోగాలెపుడున్!
చాలున్! జిలేబి! మీ శా
పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్!
"As an example to others, and not that I care for moderation myself, it has always been my rule never to smoke when asleep and never to refrain when awake.
- 70th birthday speech"
http://www.twainquotes.com/Smoking.html
నిజమ..బీడిని గ్రోలిన రోగాలు రావు...
తొలగించండిఅసలు మనిషుంటే గదా రావడానికి...😀😁😂
ఉన్నాను కదా డెబ్బై ఆరేళ్ళు చీకూ చింతా సుగరూ బీపీ కొలెస్టరాలూ వగైరా వగైరా లేకుండా వేలకొలదీ పూరణలుచేస్తూ...
తొలగించండిhttps://today.duke.edu/2001/08/mm_medicaluses.html
తొలగించండి"The recent decision by the Food and Drug Administration to label cigarettes a nicotine delivery system has drawn cheers from many in the scientific community, including Colleen McBride, director of the cancer prevention, detection and control program at Duke University Medical Center. McBride says there is a growing body of evidence that nicotine actually relieves some symptoms of Parkinson's and Alzheimer's disease, and appears to help those with severe depression focus."
తొలగించండి
తొలగించండికోలాహలముగను జిలే
బీలా బతుకన్ విడువకు బీడీలన్ యి
న్నేలా! సాక్షి ని నే! ధూ
పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్?
జిలేబి :)
🙏
తొలగించండిసరదాకి...జిలేబి గారి కొరకు వ్రాసిన పద్యమది...
"Smoking is injurious to health!"
( భిక్ష లభించలేదని కాశీక్షేత్రాన్ని శపింపబోయిన వ్యాసుడు)
రిప్లయితొలగించండికేలన్ దండకమండలంబులును , సు
గ్రీవాన రుద్రాక్షలున్ ,
మేలౌ రీతి ధరించు వ్యాసముని , నె
మ్మేనెల్ల కంపింపగా
కైలాసంబును బోలు కాశిక నెదన్
గైకోక నిందించె ; శా
పాలన్ దూరమునందు బెట్టినపుడే
స్వాస్థ్యంబు లభ్యంబగున్ .
జంధ్యాల వారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ. అభినందనలు.
జంద్యాల వారి పూరణ అత్యద్బుతం
తొలగించండిశంకరార్యులకు , రాజేశ్వరి గారికి ధన్యవాదాలు .
తొలగించండి
రిప్లయితొలగించండిఏలన్ మూర్ఖత? యంత
ర్జాలములో చదివినావ? సరికాదు సుమా
పాలనగ శక్తి కద! యే
పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్?
జిలేబి
జిలేబి గారూ
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాలముకల్తీమయమై
రిప్లయితొలగించండిబాలలకారోగ్యమొసగెఫలములుబాలున్
మలినంబాయెను డబ్బా
పాలన్ దూరమున బెట్ట స్వాస్థ్యము దక్కున్
శంకర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండిచాలీచాలనిజీతము
రిప్లయితొలగించండినేలనుశయనించునడకనిత్తెము రోగా
లేలీలగలుగు ప్రిడ్జీ
పాలన్ దూరమున బెట్ట స్వాస్థ్యము దక్కున్
శంకర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు
'చాలీ' అనడం వ్యావహారికం "చాలియు చాలని" అనండి.
రిప్లయితొలగించండిలైలాని నీకు, ప్రియుడా!
రాలిన పువ్వువలె చూడ రమణిని తగునా?
కాలెను మదియు, సరసి తా
పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్?
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్యాపాదాన్ని యతిదోషంతో ఇచ్చాను. మన్నించండి.
వేళకు వ్యాయామంబును
రిప్లయితొలగించండిమేలగు సిరిధాన్యములను మెక్కినరోగం
బేలీలనె *ఖాదరు* త
ల్పాలన్ దూరమున బెట్ట స్వాస్థ్యము దక్కున్
శంకర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మాలిన్యంబు నొదల్చగా యుదయమున్; మధ్యాహ్న వేళన్ క్షుధన్;
రిప్లయితొలగించండినాలో కామముబుట్టు చుండగ నిశిన్; నానా వికారంబులే
చాలన్ మేకొన నే విచార పడితిన్, సద్బుద్ధి దక్కంగ తా
పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యం బగున్
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వదల్చు'ను 'ఒదల్చు' అన్నారు. "మాలిన్యంబు వదల్చగా నుదయమున్" అనండి.
మేలౌ సేవలతో పతిన్ సతతమున్ మెప్పించుచున్ వాని లో
రిప్లయితొలగించండిపాలన్ దిద్దుచు ప్రేమఁ బంచుచును దీపంబై ప్రకాశించు నా
లోలాక్షిన్ రహితోడఁ గాంచి తనలో లోపాలఁ జూపించు కో
పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
[2]
రిప్లయితొలగించండి[ఒక హృద్రోగి యెల్లప్పుడును కోపముతో ఱోలు రోఁకండ్లను చేతఁబూని, పోట్లాటలకు దిగుచుండఁగా, నతని హితైషి యొక్కఁ డాతనికిఁ దగిన సలహా నొసఁగిన సందర్భము]
"ఱోలున్ రోఁకలిఁ బట్టనేల సఖ, హృద్రోగమ్ము నీ కుండఁగా?
నేలన్ నింగినిఁ జేర్చనేల దరికిన్? నీకున్న రోగమ్ముచే
మ్రోలం గందువు నైతలమ్ము భువిపై! మోదాన నీ కోప తా
పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యం బగున్!"
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండినా ప్రయత్నం :
రిప్లయితొలగించండితాళఁగ లేనే సతి నీ
లాలనలు విడచి భయద విరహము భరించన్
జాలను, బింబానన కో
పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్
అత్తగారింటికి వెళ్లే కూతురుతో తల్లి...
శార్దూలవిక్రీడితము
మాలా! భర్తకు నత్తమామలకు సంభావమ్ము గూర్చంగ నే
వేళైనన్ విడనాడబోకు మదిలో ప్రేమించు మవ్వారినిన్
శ్రీలన్ గూర్చ గృహంబునందు సతమున్ శ్రీలక్ష్మిఁ బోలంగ కో
పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఏల కినుకబూనెదవో
రిప్లయితొలగించండిబాలా! శాంతిసహనమ్మె పాటించినన్
మేలౌ గాదే యిక కో
పాలన్ దూరమున బెట్ట స్వాస్థ్యము దక్కున్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిమాలలు, జపమాలలు, పూ
మాలలు, తోమాలలు పరిమళ సౌగంధం
బాలివ్వవు సుఖముల! కో
పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్!
జిలేబి
రిప్లయితొలగించండిమూలాధారము నుండి క
పాలపు కొపురు వరకున్ తపస్సును జేయన్
స్థూలముగ యక్కసుల , తా
పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రిప్లయితొలగించండిఈలోకమ్మున ముఖ్యమైన దొకటే !యింపైన స్వాస్థ్యమ్మెగా!
యాలోచింపగ నన్యమైన దెదిరా?యారోగ్యమున్ మించగా
నేలాగై నను కష్ట నష్టము లనే యీడేర్చి కోపాల,తా
పాలన్ దూరము నందు పెట్టినపుడే స్వాస్థ్యమ్ము సాధ్యంబగున్!
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆలోకించగ కామక్రోధమద మోహాహంపుషడ్వర్గమే
రిప్లయితొలగించండినీలో నిత్తెమశాంతిబీజముల, గన్నీరొల్కు దుశ్చేష్టలన్,
గాలాధీనమటంచువిస్మృతిని ముక్కాలంబులన్ గూర్చె గో
*"పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్"*
కాలనియమాలమీరక
రిప్లయితొలగించండికాలములోవచ్చుఫలము గల్గినదానిన్
మేలని తలచుచుదిని కో
పాలన్ దూరమున బెట్ట స్వాస్థ్యము దక్కున్
శంకర్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
యతిమైత్రి కుదుర్చుకోవటం పూరించే వారి బాధ్యత గా భావించి యీవిధంగా పూరించినాను.
రిప్లయితొలగించండి****)()(****
ఏలిన వారికి మనవిది
బాలలెగా భవితలోన పౌరులనంగన్
బాలల కన్నులలో భా
ష్పాలను దూరమున బెట్ట సౌఖ్యంబబ్బున్.
జనార్దన రావు గారూ,
తొలగించండియతి దోషాన్ని పరిహరిస్తూ మీరు చేసిన పూరణ మిక్కిలి బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిలోలాక్షి! జిలేబీ! లల
నా! లావణ్యవతి! రావె! నాదు ప్రియ సఖీ
మాలిని! గుబులేలా! తా
పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్?
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
{ జాంబవంతుడు కపివర్గముతో అన్నమాటలు }
సాంద్ర దయాగుణాంచితుడు , చండతరానయ నాశకుండు , మౌ
నీంద్రనుతుండు , సారసదళేక్షణుడున్ , దిననాథవంశపున్
జంద్రుడు వచ్చె జూడుడు ప్రచండ విభాకరుడై దినమ్మునన్ |
జింద్రము చేసివేయు రజనీచర వర్గము నీ క్షణంబునన్ |
జంద్రుని ముందు తళ్కు మనునా చిన చుక్క లవెన్ని నిల్చినన్ |
( చింద్రము = ఖండము )
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
గురుమూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
హేలన్జీవితమంతహాసమొదవన్నీశానుడే మేలనున్.,
రిప్లయితొలగించండికాలంబొక్కొక తీరుమారి హృదిలో కంగారు హెచ్చించగా.,
లీలన్ భీకరకోపతాపగణముల్లేవంచు రూపింపకో
పాలన్ దూరమునందు బెట్టినపుడేస్వాస్ధ్యంబు లభ్యంబగున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్
సందర్భము: సులభం. సమస్యను రెండవ నాల్గవ పాదాలలోను వుంచి పూరించడం విశేషం.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
లీలగ.. పాపాలను, లో
పాలన్ దూరమునఁ బెట్ట
స్వాస్థ్యము దక్కున్..
మే లగు.. కోపాలను, తా
పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్
✒~డా.వెలుదండ సత్యనారాయణ
6.1.19
-----------------------------------------------------------
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బాలల బీడించురుజలు
రిప్లయితొలగించండిపాలను దూరముగబెట్ట;స్వాస్థ్యంబబ్బున్
మేలగు మాతృక్షీరము
గ్రోలగ,సహజాతమైన గూరిమితోడన్
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
లీలామానుష విగ్రహున్ మనమునన్ రేయిన్ బవల్ నిష్ఠచే
రిప్లయితొలగించండికాలంబుచ్చుట జన్మ ధన్యమవదే!కామ్యార్థముల్ గల్గవే!
వాలాయంబుగ కామ, క్రోధ,మదమున్ వారించియున్ మోహ తా
పాలన్ దూరము నందు బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్!
ఆకుల శివరాజ లింగం
వనపర్తి
శివరాజ లింగం గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కామ క్రోధ మదముల్' అని ఉండాలి కదా?
కవిమిత్రులు మన్నించాలి.
రిప్లయితొలగించండిఉదయం పొరపాటున కందపాద సమస్య "పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్" అని ఇవ్వడం జరిగింది. పోచిరాజు సుబ్బారావు గారు పోను చేసి పొరపాటును తెలియజేసారు. వారికి ధన్యవాదాలతో సమస్యాపాదాన్ని సవరించాను.
పాలను తాగిన చేకురు
రిప్లయితొలగించండిబాలలకు బలమ్ము గాంతి బాగుగ విజయా
పాలను క్రయించు కల్తీ
పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
లీలామానుష విగ్రహు
రిప్లయితొలగించండినాలయ ప్రాంగణముజేరి యారాధనకై
వాలాయమ్ముగ మనకో
పాలన్దూరమునబెట్టస్వాస్ధ్యముదక్కున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బాలుడ వద్దుర పూతన
రిప్లయితొలగించండిపాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్
నీ లీలలు చాలించర
ఏలర కష్టములు నీకు ఎందుకు బాధల్
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాలంబెంతగ మారెనో యకట! యాకాశమ్మె తోడయ్యె! పా
రిప్లయితొలగించండిపాలన్ జేసితినేమొ, బాధల గొనన్ వ్యాధుల్ వరించేను! శా
పాలేలన్ గలవో! రసాయనములన్ పట్టించి త్రాగేటి యా
పాలన్ దూరము నందు పెట్టినపుడే స్వాస్థ్యంబగున్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ.. .
రిప్లయితొలగించండికాలాయాపన జేయకుండగ రమాకాంతున్ సదా భక్తితో
లీలామానుషుడైన శేషశయనున్ లేలెమ్ము సేవించ యిీ
భూలోకమ్మున నీవు చేసిన మహా మోహంపు దుస్కార్య పా
పాలన్ దూరము బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్.
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గోలా తటిఁ జెలరేఁగఁగ
రిప్లయితొలగించండిగోల త్రుటినిఁ బాల కొఱకుఁ గూర్పఁగ సంధిన్
గోలను సతిని ననుచు ను
ష్పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్
[గోల = గోదావరి, కలకలము, ముగ్ధ ]
ఏలా మానవు లెల్లరుం జలమునున్ హేయంపు రీతిం గతం
బాలోచించక పూన నేర్తు రకటా యాశ్చర్యమే తల్చఁగన్
జ్వాలా రూపము దాల్చి కాల్చవె మదిన్ శాంతంబునం గోప తా
పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యం బగున్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహీలా గతినిం జూచితి
తొలగించండివేలా యీయి ల్లకట సవిస్తరమైనన్
లీలగ వాసమునకు మును
పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్ధ్యము దక్కున్
[మునుపు + ఆలన్ = మును పాలన్; ఆలన్ = ఆవులను]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిస్త్రీలున్వృద్ధులు బాలబాలికలు నిస్తేజంబునన్జవ్వను
రిప్లయితొలగించండిల్లీలామానుష విగ్రహంబులన నేలీల న్బ్రశంసింతురో
వేళాకోలమొ తీపిబీపిగవచంబేభద్రమా గోపతా
*పాలన్ దూరము నందు బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్*
ఏలీలన్నురుభాగ్యమబ్బుయువతన్నేలీలరక్షింతురి
క్కాలంబందుభుజించెటోగిరముదుగ్ధంబాపమున్ గల్తియై
గాలాధీనపు దీపిబీపియిరు దుష్కర్మాంతమై గోపతా
*పాలన్దూరమునందుబెట్టినపుడేస్వాస్థ్యంబు లభ్యంబగున్*
శంకర్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
లాలూ ఉవాచ:👇
పాలన్ గ్రోలిన శక్తి వచ్చు భళిగా పాలింప బీహారునున్
గాలింపంగను గ్రోలవచ్చు ధనమున్ గ్రాసమ్ము మేయంగహా...
కాలమ్మేగగ కోలుపోవ కురిసీ ఖైదీగ బంధింతురే!
పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.
🙏
తొలగించండినిగమశర్మతో అక్క
రిప్లయితొలగించండివేలల నంటించుకొనుచు
కూలగ కాపురము సానికొంపల దిరిగే
వేలర?శర్మా, నీ తా
పాలను దూరముగబెట్ట స్వాస్ధ్యంబబ్బున్
వేల=రోగము
తొలగించండిమూడవపాదమున శర్మాకు బదులు తమ్ముడ గా చదువ ప్రార్ధన
తొలగించండిసీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తిరిగేవు' అన్నది వ్యావహారికం. అక్కడ "తిరుగం బోలునె" అందామా?
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఆలక్షించుచు నుంటి నేను సఖుడా! నన్యాయమైనట్టి వౌ
ప్రేలాపమ్ములతోడ లోకుల యెడన్ పేట్రేగి రోషమ్ముతో
కాలమ్మెంచుచు నుంటివేమి? తగునా? కావేషముల్ త్రోసి కో
పాలన్ దూరమునందు బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్.
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇది సరదా కొరకే గురువు గారు
రిప్లయితొలగించండిపాలన్ద్రావితి పండ్లుమెక్కితి సదాపద్మాసనంబందునన్
శూలిన్మ్రొక్కితి బూదిబూసితి మహాశుద్ధోత్తరీయంబులన్
లీలన్మేనునదాల్చి దిర్గితి శివా!శ్రీనాథుడెంచెన్ కలా
*పాలన్ దూరమునందు బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్*
సరదాగా శ్రీనాథకవి ఇలా పూరించే వాడేమొ..
శంకర్ గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఉల్లాస మమరదిల మురి
పాలన్ దూరమున బెట్ట; స్వాస్థ్యము దక్కున్
వాలయ మంతయు ననువగు
శీలముతో నొప్పిదముగ చెలగుచు నుండన్.
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆలోకింపుడు కోపము
రిప్లయితొలగించండిలేలా మనతోటివారి గించపరుపగా
జాలున్ జాలిక మీ కో
"పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్"
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందం:
రిప్లయితొలగించండిపాలను సేవించినచో
మేలును జేయును నిరతము మేనికి యెపుడున్
హాలహలమైన కల్తీ
"పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్"
కందం:
పాలన జేసెడి మారుతి
వేలుపును మనమున నిలుపి వేడుక తోడన్
మాలను ధరించి నీ పా
"పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్"
గొర్రె రాజేందర్
సిద్దిపేట
రాజేందర్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
"మేనికి నెపుడున్... మనమున నిలిపి..." అనండి.
తూలుచు గర్వితు డగుచు
రిప్లయితొలగించండిన్నాలిని హింసించెడి క్షణి కానందము కై
బాలల చెఱచుచు కడు పా
పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చెఱచెడి' అంటే బాగుంటుం దనుకుంటాను.
శార్దూలవిక్రీడితము
రిప్లయితొలగించండిపాలించన్ ప్రజ నెంచి వారలకిలన్ స్వచ్ఛంపుదౌ భారత
మ్మాలోకించి విశాల దృక్పథమునన్ మాన్యమ్ముగా విద్యవై
ద్యాళిన్ గూర్చుచు పేదలన్ మురికి ప్రాయంబైన లోగిళ్ల కూ
పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్
పీలుచు ధూమము నిన్నే
రిప్లయితొలగించండిచాలించుము చెప్పుచుంటి "చైన్ స్మోకర్ వే"
మేలగురా "సిగరెట్" ధూ
పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్
సందర్భము: సులభం.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
మేలుగ మంత్రములఁ జదువ
గాలేరె పురోహితాళి! కన్నుల గ్రమ్మున్..
జాలగ ధూమ మెగయు ధూ
పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్
✒~డా.వెలుదండ సత్యనారాయణ
6.1.19
-----------------------------------------------------------
పాలు నవనీతముల గో
రిప్లయితొలగించండిపాలుని పూజించి, దినము భగవద్గీతన్
పాలించి నసూయాకో
పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్
ఈ బ్లాగ్ లొ ఇది నా మొదటి పద్యం తప్పులుంటె సరిదిద్దమని ప్రార్ధన