1, జనవరి 2019, మంగళవారం

నిషిద్ధాక్షరి - 47

కవిమిత్రులారా,
అంశము - నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నిషిద్ధము - శ, ష, స
ఛందస్సు - మీ ఇష్టము.

88 కామెంట్‌లు:

  1. అభయము నీయగ జగతికి
    నభమును దాటించు కీర్తి నలు దిక్కులలో
    అభివృద్ధి యైన మేలగు
    నిభమెం చకమంగ ళంబు నిక్కము నాదిన్

    రిప్లయితొలగించండి
  2. నమస్కారములు
    అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  3. క్రొత్తయేడు వచ్చె;కోర్కెల పంటలే
    పండుగాక !కనులపండువుగను ;
    మనదు జన్మభూమి మరియెంతొ గొప్పదై
    పొందికైన పేరు పొందుగాక !!

    రిప్లయితొలగించండి
  4. కలతలు వీడియు జనులి ల
    మెలగుట వలనను కలుగును మెండగు ముదము ల్
    తలపు న మైత్రీ భావము
    వెలుగంగా క్రొత్త యేట విశ్వ ము మించు న్

    రిప్లయితొలగించండి
  5. ....పూజ్య గురుదేవులకు, కవిమిత్రులెల్లరకూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు......

    రిప్లయితొలగించండి
  6. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    నేటి అంశము :: నిషిద్ధాక్షరి (47)
    విషయము :: నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    నిషిద్ధాక్షరములు :: శ, ష, స
    ఛందస్సు :: ఏ పద్యమైనా సరే
    సందర్భము :: కాలగతిలో యథాశక్తి ప్రీతిని కలిగించి సెలవు తీసికొని మనకు వీడ్కోలు పలికి వెళ్లిపోయిన 2018 కి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు సమర్పించుకొంటున్నాను.
    ప్రేమతో విచ్చేసిన 2019 కి ఆనందాలు పంచేందుకు పెంచేందుకు రమ్మని అనురాగంతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాను.

    రెండువేల పద్దెనిమిది ప్రీతి గూర్చి
    యేగ, ధన్యవాదాల నర్పించుచుంటి;
    రెండువేల పందొమ్మిది ప్రేమ తోడ
    రాగ, రమ్మనుచుంటిని రాగ మొప్ప.
    కోట రాజశేఖర్ నెల్లూరు (1-1-2019)

    రిప్లయితొలగించండి
  7. దిగ్విజయమాయురారోగ్యదీవెనాళి
    నీయగణపయ్యలేవయ్యనిద్రనుండి
    రెండువేలపందొమ్మిదినిండుమెండు
    దండిమంగళములిడుమోదకములొసగు

    రిప్లయితొలగించండి
  8. రెండువేలపందొమ్మిదినిండుగుండె
    కోర్కెలకుఱెక్కలీయుతకోరుకున్న
    మంగళంబులనీయుతమానవాళి
    కనలజలధరవిలయప్రకంపమనక

    రిప్లయితొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    కవిమిత్రులందరికీ శుభాకాంక్షలతో... 💐💐

    తలచినట్టి పనుల దైవానుకూలత
    గలిగి , ధనము హితము గౌరవమును
    పొంది , ధర్మబుద్దినంది యానందమ్ము
    గనుమ ! నూతనాబ్దకామనలివె !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  10. గురువులకు, కవి మిత్రులకు, హిత బంధువర్గమునకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    తే: నూత నాబ్దము నందున నూత మిచ్చి
    కాచి కాపాడ వలయును కంబుపాణి
    ప్రాత బాధలనన్నియు పరిహరించి
    కాంచవలె మంచి జీవిత మంచితముగ

    రిప్లయితొలగించండి
  11. మిత్రులందఱకు నవ్యాంగ్లవత్సర శుభాకాంక్షలు!

    ఇమ్ముగ భోగభాగ్యముల వెన్నియొ యిచ్చుచు జీవనమ్మునన్
    నెమ్మినిఁ బెంచుచున్మిగుల నేత్రపుఁ బర్వము లేర్పఱింపఁ దా
    నిమ్మెయి వచ్చు నూత్నమగు నేఁడిదె చూడుఁడు రెండువేల పం
    దొమ్మిది క్రొత్తకోర్కెలను తొల్తొలిఁ దీర్చఁగ నందకత్తెయై!

    రిప్లయితొలగించండి
  12. గణపతి నిరవధికముగా కాచ వలయు,
    నాలుక పైన నలువరాణి నాట్యమాడ
    వలయు, జలదిజ నిరతము కలిమి
    నిడగ వలయును ,దేవ వైద్యుడు
    నెమ్మి తోడ నెల్లప్పుడు తిమ్మ నిడగ
    వలయు పండితులకు గారవము నిరతము
    కలుగ వలయు, గురువు గారు కవుల మెదడు
    మెరుగు పెట్టవలయు, కవి వరులు నవ్య
    కావ్యములు లేఖనము చేయగ వలయు, చిరు
    కవులు వెరవక రయముగ కంది వారి
    బ్లాగు లో చేరగ వలయు, ప్రజ్ఞ చూపి
    పండితుల చెంత కూర్చుండ వలయు, రెండు
    వేల పదునెనిమిదికి వీడ్కోలు చెప్పి
    క్రొత్త వర్ణమా మాజాతి మొత్తము ఘన
    ముగ పలుకు చుంటి మీనాడు ముదము తోడ
    మేలురాక నీకు, వినుము మేము నిన్ను
    కోరినట్టి పై కోరికల్ కూర్మి తోడ
    తీర్చ వలయు,నవ్య ఋతువృత్తి ,లలి తోడ

    ఋతువృత్తి = సంవత్సరము తిమ్మ =ఆరోగ్యము
    మేలురాక = స్వాగతము లలి = ప్రేమ
    వర్ణము = సంవత్సరము

    రిప్లయితొలగించండి
  13. కం॥
    జనవరియొకటి ప్రపంచము
    జనులందరమేయ రీతి జరుపగ నిటులన్
    మనమూ కేకును కోయుచు
    పనుపుచు కుడుచుదము క్రొత్త పండుగ వేళన్ .

    రిప్లయితొలగించండి
  14. నేటి ఈనాటిక్రొంగొత్తమేటియతిథి
    యేగుదెంచెనాహ్వానించజగమువేచె
    రంగవల్లులు దిద్దినోరారబిల్చె
    రెండువేలపందొమ్మిదిరండటంచు

    కరిగికదలిపోయెనుకాలగర్భమందు
    తీపిచేదులముచ్చట్లుదేవుడిడగ
    వృత్తికినికుటుంబమునకువృద్ధినీయ
    రెండువేలపందొమ్మిదిప్రేమరావె

    రిప్లయితొలగించండి
  15. కన్న కలలన్ని ఫలియింప కమ్ర ఫణితి
    నూత్న కాలంబునిడుత నెన్నో వరాలు
    భావి భాగ్యోదయంబులు పరిఢవిల్ల
    లోక మానంద మందుత!వీక నిజము.

    రిప్లయితొలగించండి
  16. పలువురి కోర్కెలు దీర్చగ
    మలపులచే మంచిబెంచి మహిమాన్వితమౌ
    తలపులకుంచెడివిధులన్
    గలుపుము పందొమ్మిదందు గర్వంబదియే!

    రిప్లయితొలగించండి

  17. ఉరకలెత్తు గాత! యుర్విని బ్రగతియే
    యుత్తమాభి రుచులె యువత పొంద!
    పెంచు కొనుత!జ్ఞాన మించుకించుక గాను
    కొత్త వత్సరమున కోరి కోరి !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వత్సరము'లో నిషిద్ధ సకార మున్నది.

      తొలగించండి
  18. జంటవెంటమాకంటమాయింటనుండి
    మెండుమెండుగనిండుగదండిగనిడ
    చెడుకుదూరముగామాకుచెడుదవ్వు
    రెండువేలపందొమ్మిదినిండెడంద
    మంగళంబులగుప్పమమ్మాదరింప
    పిల్చెరావమ్మమాయమ్మపెరటితరువ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలోని దోషాలను వాట్సప్ లో వివరించాను.

      తొలగించండి
  19. కంది కవన గంధ తరువు
    నొందిన కవి పండిత, సుమనోహరులకు నా
    వందనమిడి కోరెద ఆ
    నందము గాంచవలె నూతనాబ్దిన మీరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ధన్యవాదాలు!

      తొలగించండి
  20. తే.గీ. ఆదరమ్మును జూపంగ యరుగుదెంచె
    క్రొత్త యేడాది నేడిట! కోరుకొనెద
    జనుల కెల్లర కిల మేలు జరుగు నటుల!
    వెలుగు లీనుచు నెదలన్ని చెలగ వలయు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      'జూపంగ నరుగుదెంచె' అనండి.

      తొలగించండి
  21. మీకు మీకుటుంబ సభ్యులకు అందరకు
    2019 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

    ఆటవెలది:
    రాజకీయ శాంతి రాష్ట్రాల నెలకొన
    కీచకాధములకు పీచమడగ
    సుఖము సౌఖ్యములును శుభమంద ప్రజలకు
    వరలుగాక నూత్నవత్సరమ్ము.

    ---గోలి.😐

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి వారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ఇది నేటి నిషిద్ధాక్షరికి వ్రాసినది కానట్టుంది!

      తొలగించండి
  22. పాత యేడు పోయె నూతనం బరుదెంచె
    కోటి కోర్కెలెన్నొ కోరి చేరె
    లక్ష్య మెరిగి తగిన లక్షణముల గూర్చి
    యత్న పడిన కలుగు నఖిల జగము ౹౹

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      క్షకారం కకార షకారాల సంయోగం. కనున నిషిద్ధాక్షరి నియమానికి భంగం.

      తొలగించండి
    2. గురువుగారూ, సవరించాను చూడండి -

      పాత యేడు పోయె నూతనం బరుదెంచె
      కోటి కోర్కెలెన్నొ కోరి చేరె
      ధ్యేయ మెరిగి తగిన కాయకత్వము తోడ
      యత్న పడిన కలుగు నఖిల జగము ౹౹

      తొలగించండి
  23. నీతియు ధర్మము నిల్పుచు
    గోతులలో బడక గాచి గోపాలుండే
    నూతన కారున జనులకు
    ప్రీతిని కలిగించు భూరి విజయమ్ములతో!!!

    రిప్లయితొలగించండి
  24. ఆనందపు లోతులవే
    గానంగ కవులు వినూత్న కవితా రీతుల్
    గానంబుల్జేతురు నే
    పానంబునుజేతు కొత్త ఆంగ్లపు యబ్దిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      "ఆంగ్లపు టబ్ధిన్" అనండి.

      తొలగించండి
  25. ఇంపగు తిన్నని హృదయ చింతనములఁ దనరారి నిత్యము తగుల మందు
    జనహిత కార్య నిచయ నిమగ్నోద్యోగ వర్తనమ్ముల కెల్లఁ గర్త లగుచుఁ
    గులమత భేదమ్ము కొంచె మైనను మది రానీక యందఱు రహిని మెలఁగి
    విద్యా వివేకము లాద్యమ్ము లని తల్చి పౌరులు వాని నింపారఁ గఱచి

    తర తమముల భేద మరయక జను లెల్ల
    రొక్క రూప యంచు నుచిత రీతిఁ
    గడప జీవనమ్ము కాంతివంత మగుచు
    నూత నాబ్ద మలరు జ్యోతి భంగి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నూతన ధైర్య విక్రమ వినోద సమంచిత పూర్ణ భాగ్యముల్
      చేతన సంయు తోత్తమ విశేష వివేక విలాస భోగముల్
      నీతి విచార కార్య చయ నిర్జిత శుద్ధ యశో తరంగముల్
      శీత గిరీంద్ర నాథు దయఁ జేకురుఁ గావుతఁ గ్రొత్త యేటినిన్

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పద్యాలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      రెండవ పద్యం ఈనాటి నిషిద్ధాక్షరి కొరకు వ్రాసినది కాదు కదా!

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
      నూతన సంవత్సర సందర్భముగా వ్రాసినదండి యీ రెండవ పద్యము.

      తొలగించండి
  26. పాతయబ్దపు వీడ్కోలుబలుకగానె
    క్రొత్తయేడాది వచ్చెను గుముదమంద
    యేటికేడాదివరములనిచ్చుగాత
    రెండువేలపందొమ్మిదిప్రీతితోడ

    రిప్లయితొలగించండి
  27. క్రొవ్విడి వెంకట రాజారావు:
    తే.గీ.
    నవ్య హాయనమందున నందమొంది
    పెరిమె నిలిపెడి ప్రౌఢిమ పెంపునొంద
    భోగ యుక్తమౌ బ్రదుకున పొదలుచుండి
    మీరలెల్లరు కీర్తిని మెఱయు గాత!

    రిప్లయితొలగించండి
  28. చిందులకు విందులకు మందులకు మందునకు గొందరకు నందరకు గందరపుగోళం
    బందియలు ఘల్లనగ మందులకు జిందులిడి చందురుని పట్టుకొన మందగతిడెందం
    బందుబడి దందడిగ మందకదలాడగనె
    వందనము నందరకు బొందుగ నొనర్చున్
    బందులును మచ్చెములు నందమగు జంతువులు గుంద నరుదెంచె నరుడెందదడ హెచ్చన్
    బందువుగ హాయనము నందరకు వచ్చెనొకొ గొందరకొ మోదమది యెందరకు ఖేదమ్

    రిప్లయితొలగించండి
  29. గురువు గారికి వందనములు, నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  30. గురువుగారికి,కవి మిత్రులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    క్రొత్త యేడాది యరుదెంచె గొప్పగాను
    ప్రాత భావనలను త్రోచిపార వైచి
    ప్రాత క్రొత్తల మేలుగా పాటుపడగ
    భావి భారత పౌరులే బాగుపడరె!

    రిప్లయితొలగించండి
  31. విఘ్ననాయకు డొనగూర్చ వేడుకలను
    యేడుకొండల నాధుడు యేలుగాత
    యేటి కేడాది దీవెన లిడుచు ప్రజకు
    నూతనాబ్దియు తోడయి యూతనీయ

    నిన్నటి సమస్యకు నా పూరణ

    న్యాయముగా మెలిగెదరట
    సాయిని నమ్మి కొలిచినఁ ; గసాయిగ మారున్
    తీయగ మాటలనాడుచు
    మాయలు జేయంగ జూడు మనుజులు జగతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'నాథుడు + ఏలు' అన్నపుడు యడాగమం రాదు. "నాథుడె యేలుగాత" అనండి.
      "మాయలు జేయంగ జూచు మనుజుడు జగతిన్" అనండి. క్రియాపదం 'మారున్' అని ఏకవచనంలో ఉంది.

      తొలగించండి
  32. పదవీ విరమణ జేయుచు
    పదునెనిమిది వెళ్ళి పోగ పంతొమ్మిది యే
    ముదమున భువి జేరెను తెలి
    పెదమిక యభినందనలను పేరిమి తోడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వెడలి చనగ' అనండి.

      తొలగించండి


  33. ఆ.వె:పాత యేడు చనియె భారముగా తాను
    కొత్త యేడు వచ్చె కూర్మి పంచ
    వేడ్కతోడ జనులు వేయికనుల తోడ
    నెదురు చూచు చుండి రెల్ల రిదిగొ


    పదియునెనిమిదేగి పదియు తొమ్మిది వచ్చె
    జయము లిడగ మనకు జవము గాను
    నాదరమ్ముతోడ నాహ్వాన మిడరండు
    హర్ష చిత్తులగుచు నార్యులార.

    ఆ.వె: గతము లోన యున్న వెతలను తొలగించి
    జగతి జనుల కెల్ల జయము నిడగ
    వచ్చెరెండువేల పంతొమ్మిదిప్పుడు
    ముదము నొంది రెల్ల పుడమి జనులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'హర్ష' అన్నపుడు నిషిద్ధమైన 'ష' ఉన్నది.
      "గతములోన నున్న..." అనండి.

      తొలగించండి
  34. సరదా పూరణ (అన్నయ్యకు అంకితం)
    నేతలందరు గుంపుగూడుచు నేర్పుగా నొకటవ్వగా
    నీతులం బలు బల్కనేర్చుచు నేతిబీరల చందమున్
    క్రొత్తయేడున నెన్నికల్ బహు గొప్పగా నడిపించగా
    నూతమిచ్చెడి నాయకుండిట నూరుమెచ్చెడి నేతయై
    నీతి నిల్పెడిరీతి పాలన నెల్లవేళల గూర్చులే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాల్గవ పాదములో
      "నూతమిచ్చెడు నాయకుండిట నూరుమెచ్చగ నేతయై" గా చదువ ప్రార్ధన!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  35. కాలము దైవ రూప మని జ్ఞానులు పల్కుదు రట్టి దివ్యమౌ
    కాలపు చక్రమందు గల కంటికి నాకులు కార్లు దొర్లగా
    కాలము క్రొత్త కారు నవకమ్ము వెలార్చుచు వచ్చె నేటికీ
    నేలకు మంచిరాక యను నిద్దపు భావన జేయు డెల్లరున్.

    కారు = సాలు

    రిప్లయితొలగించండి
  36. క్రొత్త యేడాది కొంగ్రొత్త కోరికలను
    తెచ్చునట్టుల, జనులకు దిగులు తొలగి
    మోదమందెడి గంటలు మోగునటుల
    కోటి కోర్కెల నేనిటు కోరుకొందు.

    రిప్లయితొలగించండి
  37. ఆర్తి తోడ వచ్చె ఆనందముగయెంతొ
    ప్రీతి గొలిపె క్రొత్త ప్రియతమము గ
    కలుగు మేలు మనకు, కాలాంతరమ్మున
    క్రొత్త యేడు జూపు క్రొత్త బాట!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గంగాప్రసాద్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "ఆనందముగ నెంతొ" అనండి.

      తొలగించండి
  38. గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు

    కందం
    తిరుమల గిరి రాయుడు మీ
    బరువుల తగ్గించి మిగుల బాగును జూడన్
    వరమిడగా నీ యేడది
    బిరబిర నడువంగ మ్రొక్కి వేడెద భక్తిన్

    రిప్లయితొలగించండి
  39. ..............🌻శంకరాభరణం🌻...............
    .................🤷🏻‍♂నిషిద్ధాక్షరి🤷‍♀....................
    అంశము - నూతన సంవత్సర శుభాకాంక్షలు
    నిషిద్ధము - శ, ష, స
    ఛందస్సు - మీ ఇష్టము.

    సందర్భము: సులభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "ఇయరు న్యూ యైన నోల్డైన నేమిగాని
    లక్కు న్యూ గావలెను ప్రతియొక్కరికిని..
    మే యువరు హెలు తింప్రువు
    భాయి! భాయి!
    హ్యాప్పి టూ జీరొ వొ న్నయి నన్ని తీర్లు.."

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    1.1.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి