12, జనవరి 2019, శనివారం

సమస్య - 2900 (అరిషడ్వర్గమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్"
(లేదా...)
"అరిషడ్వర్గము లాప్తమిత్రములుగా నానంద మందించులే"

60 కామెంట్‌లు:

 1. కలియుగ భీముడు యుధిష్ఠిరునకు:

  "నరవర! సోదర! వినుముర!
  పరిపరి బాధించునట్టి పాపాత్ముండౌ
  కురునాథుని క్రుంగించెడి
  యరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్"

  రిప్లయితొలగించండి
 2. పరులన్ బిడ్డలవోలె వారి ధనమున్ భావించి లోష్టమ్ముగా,
  పరకాంత న్నిజసోదరీమణిగ సంభావించి సౌభ్రాత్రమున్,
  పరసౌజన్యగుణాంశమాత్రమున నల్పార్థమ్మునా దల్చ, నా
  యరిషట్వర్గములాప్తమిత్రములుగా నానందమందించులే.

  కంజర్ల రామాచార్త
  కోరుట్ల.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పరవృద్ధిని గోరుచు సం
   బరమింపెసలారు ప్రేమభావనతోడన్
   వరలెడు వానికి నయ్యెడ
   నరిషడ్వర్గమ్మొసంగు నానందమ్మున్.

   కంజర్ల రామాచార్య
   కోరుట్ల.

   తొలగించండి
 3. డా.పిట్టా సత్యనారాయణ
  ఆర్యా, ----వర్గము ఏకవచనము కాదా?

  రిప్లయితొలగించండి
 4. పరిపూర్తిగ మానవులకు
  ధరణిని శోకము మిగుల్చు తథ్యమ్మిదియే
  మరియేవిధి వదలందగు
  నరిషడ్వర్గమ్ములొసుఁగు నానందమ్మున్

  రిప్లయితొలగించండి


 5. తరుణీ! దుందుడు కుతనం
  బరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్
  పరమాత్ముని సేవ యొసగు
  పరిశీలింప వివిధములు ప్రభువుని లీలల్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. అరులటనరులకునారివి
  పరమార్థపుమార్గవిఘ్నవల్లరులనగా
  హరిహరియెవ్విధిగవులకు
  *అరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్*?

  రిప్లయితొలగించండి
 7. పరిపరి విధముల వరమని
  మురియుచు జనులంత హాయి మోదము నొందన్
  పరువము నందున యువతకు
  నరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్

  రిప్లయితొలగించండి
 8. రిప్లయిలు

  1. సరిలేనట్టిది మోక్షమార్గమును నే
   జక్కంగ బొందంగ శ్రీ
   హరి బ్రార్థించుచు వీడితిన్ సతము మో
   హక్రోధకామాదులౌ
   నరిషద్వర్గము ; లాప్తమిత్రములుగా
   నానంద మందించులే
   మరి " సోహం " " సకలంబు నేక " మను నా
   మాధుర్యభావంబులే .

   తొలగించండి
 9. దురిత ము లొ న రించు జనులు
  నిరతము నాశ్రయ మొసగు చు నేర చరితు లౌ
  పరిపరి విధముల వారికి
  అరి షడ్వర్గ మ్ము లొ సగునానoదమ్మున్

  రిప్లయితొలగించండి

 10. అరయగ శ్రేష్ఠపు గుణములు

  దరిలేక పరివిధముల సదాత్ముల నెపుడున్

  పరివేధించెడు ఖలులకు

  నరిషడ్వర్గమ్ము లొసగు నానందమ్మున్

  🍀 ☘ ఆకుల శాంతి భూషణ్ 🌿🌱

                      🌷 వనపర్తి 🌷


  రిప్లయితొలగించండి


 11. తరుణీ! యున్నదిదొక్కటే బతుకు యుత్సాహంబుతో దూకొనన్!
  పరమాత్ముండు, దయాళు, యీశుడు బృహత్బ్రహ్మమ్ము,సర్వాత్మ, సో
  మరిపోతుల్ కని బెట్టినట్టి కబురుల్! మస్తైనదీ జీవితం
  బరిషడ్వర్గము లాప్తమిత్రములుగా నానంద మందించు; లే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. సురుచిరవాక్యభాషణము, సుందరవర్తనళమన్నివేళలన్
  తరగనిదీక్ష సత్కృతుల, ధార్మికభావము, దానశీలతల్,
  గురుజనులందు భక్తిసమకూరుట లన్నవి సంగడీడ!చూ
  పరి! షడ్వర్గము లాప్తమిత్రములుగా నానంద మందించులే"

  రిప్లయితొలగించండి
 13. మైలవరపు వారి పూరణ

  అరి వర్గమ్మునకాది కామమదియే ఆరింటిగా దోచి దు...
  ర్భరమౌ బాహ్యజగమ్మునన్ దగులుచో ., భద్రమ్ముఁ జేకూర్చు శ్రీ
  హరికామంబగుచో., విశేషఫలదంబౌ ! భక్తితో గొల్వనా అరిషడ్వర్గములాప్తమిత్రములుగా నానంద మందించులే !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 14. దురితానీకముమేలొసంగు గలిలోదుర్మార్గదుశ్శాసకుల్
  భరతోర్విన్బలుగీచకాధములకేబట్టంబు,చట్టంబు పు
  ల్లరినేగట్టని,గానివానిని,సభన్లాలించ జక్రంబు గ
  *ల్లరిషడ్వర్గము లాప్తమిత్రములుగా నానంద మందించులే"*

  రిప్లయితొలగించండి
 15. పరిపాలించెడు వారలు
  మరిమరి యెన్నికలగెల్వ మాటలతూటాల్
  గురిపెట్టగ ప్రతిపక్షుల
  నరిషడ్వర్గములిచ్చు నానందమునన్

  రిప్లయితొలగించండి
 16. వర సంతాన ఫలాప్తికై, కుజన దుర్వార క్రియాంతమ్ముకై,
  పరమోత్కృష్ట గుణాప్తికై, యవిరత బ్రహ్మైక్య సంసిద్ధికై,
  దురిత స్కంధి నికృంతనోద్ధతికినై, తుల్యాన్యసాధ్వాత్మకై
  యరిషడ్వర్గములాప్తమిత్రములుగా నానందమందించులే

  చిటితోటి విజయకుమార్

  రిప్లయితొలగించండి
 17. సరియగు కట్టడి యెరుగక
  దురితంబులు దెలియలేని ధూర్తులకెల్లన్
  మరి సహజమైన విషయము
  అరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్

  రిప్లయితొలగించండి
 18. కరులేకామ ప్రచోదకాలు మరులేకామాగ్నికాజ్యంబు నే ర్పరులేక్రోధముజూపరెన్నరులపై ప్రజ్ఞామదోన్మత్తులే
  బరిమర్యాదకుజుట్టుగైదువగులోభారాతిమాత్సర్య వై
  *ర్యరిషడ్వర్గము లాప్తమిత్రములుగా నానంద మందించులే*

  రిప్లయితొలగించండి
 19. అరయగ మానవ మనుగడ
  కొరకే సృజియించ బడెను కువలయ మందున్
  సరియౌ రీతిని వాడగ
  "నరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్

  రిప్లయితొలగించండి
 20. పరులకు కీడొనగూర్చెడి
  అరిషడ్వర్గమ్ము లొసగునానందమ్మున్
  తరచుగనమ్మినవారికి
  పరువంబేనాశనంబు పరికించంగా

  రిప్లయితొలగించండి


 21. హరదైవమ్మును మానసంబున సదా ధ్యానించు సచ్ఛీలురున్

  పర సేవే పరమాత్మ సేవని కడున్ ప్రహ్లాద తామొందరే?

  దురితంబుల్ పలు సజ్జనావళి కిడున్ దుర్మార్గ సంచారికే

  యరిషడ్వర్గము లాప్తమిత్రములుగా నానంద మందించులే


  🍀 ☘ ఆకుల శాంతి భూషణ్ 🌿🌱

                      🌷 వనపర్తి 🌷


  రిప్లయితొలగించండి

 22. తురగముల వలె దుముకుచు
  న్నరులను పడద్రోసి తఱచు నాశము గూర్చున్
  సరిగన్నదుపున నుంచిన
  "నరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్

  రిప్లయితొలగించండి
 23. 1 మరి కామము బుట్టెనదియె
  గురు పాదములాశ్రయించ గురుకొని, నఘమా?
  గురు నింద జేయ బెట్టెద
  మరి యాదరణమ్ములేక మరుభూమినదే

  2.
  గురు సేవకు క్రోధమది య
  వరోధమా?, లోభమదియె వరగురు జపముల్
  విరివిగ చేయగ, నామని
  ధి రమ్యము వదల దయానిధీ గనుము గురో


  3 కరివలె మదమున్న ముదము
  పరులందరి వదిలి నిన్నె పట్టితినని యే
  గరువము, ఆశ్చర్యము గురు
  వరా కలిగె మత్సరమది వగచెను చూడన్

  4
  చిఱుతఁడు బ్రహ్లాదుండను
  కరుణించగ, మోహమున నకటకట పడితిన్
  చరణమ్ముల గాంచగనే
  అరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్

  రిప్లయితొలగించండి
 24. కరి వరదునిఁ గిటిని హరి న
  సుర గణ దమను నమర విభు సురుచిర నిలయున్
  నిరతము నిలుప హృదిని రి
  ప్వరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్

  [రిపు + అరిషడ్వర్గములు = రిప్వరిషడ్వర్గములు : అరిషడ్వర్గములకు శత్రువులు: నిష్కామము, అక్రోధము, నిర్లోభము, నిర్మోహము, నిర్మదము, నిర్మాత్సర్యము]


  నిరతం బింపుగ ధర్మ మార్గ రతులై నిల్వంగ నిర్భీతినిన్
  మురసంహారుని భక్తి చిత్తమున సంపూజించి వైకుంఠు నా
  యరవిందాక్షుని సందియంబు మది నేలా ఖండితక్షుద్ర వా
  గరిషడ్వర్గము లాప్తమిత్రములుగా నానంద మందించులే

  రిప్లయితొలగించండి
 25. అరిషడ్వర్గము లన్నియు
  వరములుగామారబోవు,బాధించునిలన్
  పరులహితమ్మునుగోరిన
  *"అరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్"*

  రిప్లయితొలగించండి
 26. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  తెరచున్ కన్నులు తెల్లవారగనె తా తీండ్రించి గాండ్రించుచున్
  కరచున్ మెండుగ శాపనార్థములతో కవ్వించి జామాతనున్
  వర శార్దూలపు గర్జనమ్ములిడుచున్ వర్ధిల్లు నత్తయ్యవౌ
  యరిషడ్వర్గము లాప్తమిత్రములుగా నానంద మందించులే

  రిప్లయితొలగించండి
 27. ఈ రోజు శంకరా భరణము సమస్య

  నరిషడ్వర్గము లాప్త మిత్రములు గా నానందమందించు లే

  ఇచ్చిన పాదము మత్తేభము నా పూరణము సీసములో


  కామిఐ ఋషిపత్ని కలయిక కోరిన బలభేది మౌని శాపమును బడసె,
  క్రోధము తో తన కొంప వీడిన సిరి పతితోడ తానెడ బాటు పొందె,
  పిన తండ్రి సుతులకు పిడికెడు నేలనిడక ధార్తరాష్ట్రేయు డసువు బాసె,
  మోహము తో దశ ముఖుడు సీతను బట్ట దాశరధి వలన తనువు వీడె,
  మదముతో సైరంది మగువ పొందును గోర కీచకున్వలలుడు పీచ మణచె,
  హరి పై పగను పెంచి హరిచేత నే హిరణ్యకశిపుడున్ మరణంబు నొందె
  యెoచి చూడ నెపుడు మంచి జరుగునని కాంక్షలను బడయంగ నది యొకక
  ల , నరిషడ్వర్గము లాప్త మిత్రములు గా నానందమందించు లే ననగ స

  బబు నెటులనగు ధరణిలో , పగను వదలి
  కోపము విడచి , సతతము కూర్మి పంచి
  శక్తి కొలది దానము చేయ సంత సంబు
  కలుగు ననవర తమ్ముజనులకు భువిని

  పూసపాటి గుంటూరు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. మత్తేభాన్ని కూడా సీసంలోనా !!!
   అదురహో

   శార్దూలాన్ని కూడా పెట్టొచ్చా ? :)


   జిలేబి

   తొలగించండి
  2. జిలేబి గారికి ధన్యవాదములు నిన్నటి వాఖ్యను కూడా ఇప్పుడే చూశాను మరొక్కమారు ధన్యవాదములు

   తొలగించండి
 28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అరయంగా గీడునెగద
   నరిషడ్వర్గమ్ములొసగు,నానందమ్మున్
   గరమునుబొందగ వచ్చును
   నరిషడ్వర్గమ్ముదొలగ నహరహమార్యా!

   తొలగించండి
 29. హరినాగోపికరాజిగామమున, గ్రోధావేశుడైగంసుడున్,
  బరిమాత్సర్యముతో,మదంబున
  నె గ్రవ్యాశాలి, లోభాంధ్యతన్
  గురుఱే,డున్నజుసూతిమోహమున,ముఖ్యుండ్రెన్నవిఖ్యాతి మ
  *చ్చరిషడ్వర్గము లాప్తమిత్రములుగా నానంద మందించులే"*

  రిప్లయితొలగించండి
 30. పరిపూర్ణుండ్రగుయోగివర్యులకు సంప్రాప్తంబగున్సత్యమ
  త్తరిలోకంబగునొక్కపూర్ణమదిహృత్తాంభోజసాదృశ్యమై
  యరిమిత్రుండ్రనుభేదభావరహితుండ్రాహంసలందందు నే
  "ర్పరి,షడ్వర్గము లాప్తమిత్రములుగా నానంద మందించులే"

  రిప్లయితొలగించండి


 31. హరియే యన్నిటికిన్ మన
  పరిధిని నేది గల దంచు భక్తియు తోడై
  పరిపూర్ణముగా నమ్మగ
  నరిషడ్వర్గమ్ములొసుఁగు నానందమ్మున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీరీమధ్య మరీ మాతాజీ ఐపోయారు...ఆధ్యాత్మికతతో...

   🙏

   తొలగించండి


  2. మీరీమధ్యన మారిపోయిరికదా మేదావి యైపోయిరే ! :)


   జిలేబి

   తొలగించండి
  3. పోరున్ పోరుచు శంకరాభరణనున్ పోట్లాడి కాట్లాడుచున్
   దారీ తెన్నులు కానరాకగనునే తర్జించి భర్జించగా
   మారామారము జేసి నన్నిటకునున్ మళ్ళించి రప్పించుచున్...
   మీరీమధ్యన మారిపోయిరికదా మేధావి యైపోయిరే !

   తొలగించండి

  4. మీపద్యంబును రామమూర్తి వరులామింపంగ శ్రావ్యంబుగా ...   జిలేబి   జిలేబి

   తొలగించండి
 32. మయాసభానంతరము శకుని రారాజు దుర్యోధనునితో.....

  మత్తేభవిక్రీడితము
  సిరులన్ దూలుచు నల్లుడా! మయసభన్ జేయంగ నిన్ భంగమున్
  గురితో పాచికలాడి ధర్మజుని నే గూఢాన నోడించెదన్
  ధరణిన్ శత్రువుదైనదౌ వ్యసన సంధానమ్మునన్ వారివౌ
  నరిషడ్వర్గము లాప్తమిత్రములుగా నానంద మందించులే

  రిప్లయితొలగించండి
 33. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అరయన్గీడునుగల్గజేయునుగదామాత్సర్యక్రోధాదులౌ
   యరిషడ్వర్గములా,ప్తమిత్రములుగానానందమందించులే
   పరగన్శాంతియుసౌఖ్యముల్ సహనముల్బాహాటమైయొప్పగన్
   నరిషడ్వర్గములొందుచోసతముకయ్యాలొయ్యనన్ వచ్చుగా

   తొలగించండి
 34. పరమాత్ముండను వాడు లేడనుచు నీ పాపంబులే మిథ్యయున్
  ధరలో మానవ కోటికిన్ సిరియె ప్రాధాన్యమ్మటన్ నమ్ముచున్
  దరుణుల్ మద్యము నాయకత్వములనే తాఁ గోరెడిన్ వారికీ
  యరిషడ్వర్గము లాప్తమిత్రులుగా నానంద మందించులే.

  రిప్లయితొలగించండి
 35. హరియే వెంటనె రాగా
  కరిరాజటు వేడినంత కావగవచ్చెన్
  హరిగాంచితలచె నక్రము
  "అరిషడ్వర్గమ్ములొసగు నానందమ్మున్ "
  ఫురుషోత్తమరావు రావెల

  రిప్లయితొలగించండి


 36. పరిశోధింపగ నంతః
  పురంపు శత్రువులతో విపులముగ నొడబా
  టు రహియు గనన్ జిలేబీ
  యరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్


  జిలేబి

  రిప్లయితొలగించండి


 37. రాబోవు వారపు ఆకాశవాణి సమస్య


  కరినినుడాక్రమణ చేసె కాంక్షలు హెచ్చన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 38. సరియగు కట్టడి యెరుగక
  దురితంబులు దెలియలేని ధూర్తులకెల్లన్
  మరి సహజమైన విషయము
  అరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్

  సరియెవరు నాకు లేరని
  గరువముతో బలుకు సంఘకంటకుకిలలో
  శిరమందు గూడు గట్టుక
  అరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్
  ప్రసాదరావు మిరియాల-. కాకినాడ

  రిప్లయితొలగించండి
 39. పరువపు వయసున యువతకు
  పరులెవ్వరి నీతిబోధ పట్టదుయిలలో
  తరతమ భేదము మరతురు
  అరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్

  రిప్లయితొలగించండి
 40. డా.పిట్టా సత్యనారాయణ
  అరె, యివి లేనిదె గడువదు
  మరి యణచెడు మార్గములకు మన్నిక గలుగన్
  "సరి కాట్లు మాని బుస గొన"
  అరిషడ్వర్గమ్ము లొసగు నానందమ్మున్
  (తన్ను కాటిడ వచ్చిన పాముకు ఒకముని ఉపదేశమిడెను.ఆ పాము ఎవరేమన్నా సహనము వహించి అతని తిరుగు ప్రయాణంలో నగుపడి తన దుస్థితి నెరిగించెను "ఓయీ కాటు మానుమన్నాను గాని బుసకొట్ట వద్దన్నానా"అని అంటాడు,ఆ ముని.అరిషడ్వర్గాలు పైకి నటించనిదే జీవిక సాగదు.వాటి నెదుగకుండా అణచవలెను.ఇద సత్యము)

  రిప్లయితొలగించండి
 41. గురుదేవులకు వినమ్రవందనములు
  ఈ మధ్య కాలంలో ఇటువంటి వెధవులు ఎక్కువైనారు
  =======********=======
  ధరణిని జననీ జనకు ల
  వరోధమను కుక్కమూతి పాంసను లెపుడున్
  పరిపరి విధముల జెప్పెద
  రరిషడ్వర్గమ్ము లొసగు నానందమ్మున్!

  పాంసనుడు = దుష్టుడు

  రిప్లయితొలగించండి
 42. డా.పిట్టా సత్యనారాయణ
  సరి పాళ్ళన్బడ కామమే గురువగున్(కామిగాక మోక్షగామి కాడు)సాయుజ్యమున్ గోర,నా
  అరి క్రోధంబును పూర్తిగా విడిచిన న్నాడించరే నిన్ను;మేల్
  మరి మోహంబును జ్ఞానమందు గనుచో మర్యాదయౌ లాభమే
  హరి!నీ గర్వము పెచ్చుబెర్గ మదమౌ నజ్ఞాన -మాత్సర్య మి
  ద్ధర నీ మన్గడ సాగనిచ్చు నణచన్ తత్శాంతి(తచ్ఛాంతి)నిన్ బొంద నీ
  అరిషడ్వర్గము లాప్త మిత్రములుగా నానంద మందించులే!

  రిప్లయితొలగించండి
 43. హిరకశిపుడు చండామార్కులను ఆదేశించు సందర్భము.

  కందం
  నిరతము హరినే మదిలో
  స్మరించు ప్రహ్లాద సుతుడు మమ్మర్చించన్
  పురికొల్పుడయ్య, వానికి
  నరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్.

  రిప్లయితొలగించండి


 44. పరిశీలింపగ నంతః
  కరణమ్మును తొలిచెడు ప్రతికర్తల నొడబా
  టు రహియు గనన్ జిలేబీ
  యరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్

  జిలేబి"

  రిప్లయితొలగించండి
 45. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  *"అరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్"*

  సందర్భము: సులభము.. ఇది ఒక హిత వచనము.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  అరిషడ్వర్గమువలనను
  నరు డింద్రియములకుఁ జిక్కి నాశన మందున్
  బొరపడి యనుకొనరా దిటు..
  "అరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్"

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  12.1.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి


 46. వరుసగ వీడిన బ్రతుకున
  నరిషడ్వర్గమ్ము లొసగు నానందమ్మున్
  సరిగా యోచన చేయుచు
  నిరతము సన్మార్గవీధిఁనెమ్మిని చనుమా

  రిప్లయితొలగించండి