25, జనవరి 2019, శుక్రవారం

సమస్య - 2911 (భల్లూకము కడుపులోన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భల్లూకము కడుపులోన భానుఁడు పొడిచెన్"
(లేదా...)
"భల్లూకోదరమందుఁ దాఁ బొడిచి భాస్వంతుండు వెల్గెన్ గడున్"

102 కామెంట్‌లు:

 1. నల్లని జంతువ దెద్దియొ?
  యెల్లరికిన్ బెద్ద ప్రేవె యెక్కడ నుండున్?
  తెల్లగ తెలవారు నటుల
  భల్లూకము ; కడుపులోన ; భానుఁడు పొడిచెన్"

  రిప్లయితొలగించండి
 2. ఉల్లము పొంగగ ప్రజలకు,
  చల్లగ మెల్లగ పొడుచుచు సంబర పడుచున్...
  తల్లడ మందగ నంధపు
  భల్లూకము కడుపులోన భానుఁడు పొడిచెన్

  పొడుచు = ఉదయించు (రెండవ పాదములో)

  రిప్లయితొలగించండి
 3. ఉల్లాసము పొంగి పొరల
  వెల్లువగా విరిసె నంట ప్రేమయె సతిపై
  నల్లరి చిల్లర పనులకు
  భల్లూకము కడుపు లోన భానుఁడు పొడిచెన్

  రిప్లయితొలగించండి
 4. ( అల్లూరులో మిట్టమధ్యాహ్నసమయం . తిరిగితిరిగి
  అలసిన భల్లూకం వాగులో స్నానం చేస్తున్నది .. )
  అల్లూరున గల వాగున
  భల్లూక మలసి వెలకిల బడుకొని యుండన్ ;
  జల్లని నీటను నల్లని
  భల్లూకము కడుపులోన భానుడు పొడిచెన్ .

  రిప్లయితొలగించండి


 5. మన సభలో జీపీయెస్ వారు :)


  అల్లాటప్పా యే కా
  రల్లా టములేని వారు రయ్యన గానన్
  చల్లగ మెల్లగ పద్యపు
  భల్లూకము కడుపులోన భానుఁడు పొడిచెన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. AM
   మన తమిళులకు ప బ నహియో భేదహ:

   జీపియస్ - ஜி பாநு ஸாஹெப்
   🤣🙏🏻

   తొలగించండి
 6. కొల్లలుగ దొరికె ఫలములు
  పెల్లుగ తేనియ లభించె విందని తినఁగా
  నల్లన నొప్పియె లేచెన్
  భల్లూకము కడుపులోన, భానుఁడు పొడిచెన్.

  రిప్లయితొలగించండి


 7. వేట గాడు - వేట, 'గాడు' :)


  అల్లా దయ! దూరె బరిసె
  భల్లూకము కడుపులోన! భానుఁడు పొడిచెన్
  నుల్లాసముగా నెత్తెను
  జొల్లను దాటి గృహమునకు జోరుగ చేరెన్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. కల్లా కపట ము నెఱుఁగ ని
  నల్లని గాత్ర ము కలిగిన నారీ మణి కిన్
  తెల్లని శిశువు జనింపగ
  భల్లూకపు కడుపు లోన భానుడు పొడిచె న్

  రిప్లయితొలగించండి
 9. జెజెకె బాపూజీ గారి భల్లూకం పాపం మా భానుగాడి బారిన పడింది...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చల్లని నీటిని కనుగొని
   భల్లున భాను ప్రకాశు వాగున దిగగా
   నల్లూరున, మీద బడిన
   *"భల్లూకము కడుపులోన భానుఁడు పొడిచెన్"*

   తొలగించండి


 10. మన జీపీయెస్ వారు :)


  ఉల్లాసంబుగ శంకరాభ రణ పద్యోత్సాహ శూరుండు తా
  నల్లాటమ్ములు లేని వాడు సభలో నైర్భర్యమున్ గల్గి తా
  కొల్లాబండిని జోరు గా నడుపుచున్ కోఆట గా పద్య మౌ
  భల్లూకోదరమందుఁ దాఁ బొడిచి భాస్వంతుండు వెల్గెన్ గడున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. జిలేబి పదవిన్యాసము:

   ఆకాశంబున నుండి వ్రాలు గదరా హైరాన జేయంగనన్
   చీకాకుల్ పడజేయునట్టి పదముల్ జీలేబి దోసిల్లలోన్
   నాకోసంబని వచ్చెనేమొ విడువ న్నాంధ్రమ్ము భాషన్ను నే
   కోకల్ సిల్కువి పట్టు చీర లిడుదున్ కోపేశ్వరీ! నీకు నేన్

   తొలగించండి

  2. :)

   కోపేశ్వరీ :) మహాదుష్టు :)


   జిలేబి

   తొలగించండి
  3. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. మైలవరపు వారి పూరణ

  హృల్లీలామృగయార్థియై జనెను భూమీశాత్మజుండొక్కరుం
  డల్లన్ ఘోరవనమ్ము, నంతగనె నుగ్రాకారభల్లూకమున్
  కల్లోలమ్ముగ పోరుసల్పి తుదకున్ ఖడ్గప్రయోగమ్మునన్
  భల్లూకోదరమందుఁ దాఁ బొడిచి , భాస్వంతుండు వెల్గెన్ గడున్"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 12. కల్లోలం బగుమా నసంబునను నేకాంతంబు నేకోరుచు
  న్నుల్లాసం బున పద్యమల్ల గను భానున్ వేడగా మోదమున్
  ముల్లోకం బులనే లురాణి పలుకన్ పూరించ గాకావ్య మున్
  భల్లూకో దరమందుఁ దాఁ బొడిచి భాస్వంతుండు వెల్గెన్ గడున్

  రిప్లయితొలగించండి
 13. హిరణ్య కశిపుని పుత్రుడుగా ప్రహ్లాదుని ప్రస్తావిస్తూ..............

  ఎల్లెడల నిండి యుండెడు
  చల్లని హరియే ప్రభువని చాటించిన యా
  పిల్లడు ప్రహ్లాదుని గన
  భల్లూకము కడుపులోన భానుఁడు పొడిచెన్.

  రిప్లయితొలగించండి
 14. ఎల్లర నాహ్లాదపరచ
  చల్లని పొగమంచుదొలగ జలజమువిచ్చన్
  నల్లని తూరుపు తిమిరపు
  భల్లూకము కడుపులోన భానుడు పొడిచెన్

  రిప్లయితొలగించండి
 15. చెల్లా చెదరై యరిగిరి
  పల్లీయులు;యీటె గ్రుచ్చె ప్రాణ భయమునన్
  పెల్లగు,భీకరమగు భల్లుకము నా
  భల్లూకము కడుపులోన;భానుడు పొడిచెన్.

  రిప్లయితొలగించండి


 16. మల్లెల మాసము ! ప్రేయసి
  యుల్లాసము ప్రియునిచేరె! యుజ్యపు యానం
  బల్లన జల్లన భళ్ళన
  భల్లూకము; కడుపులోన భానుడు పొడిచెన్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 17. ఆకుల శివరాజలింగం
  అల్లరిజేయుచు దిరిగెడు
  భల్లూకము గాంచిప్రజలు భయమునుజెందన్
  బల్లెము గొని నిర్భయమున
  భల్లూకము కడుపులోన భానుడు పొడిచెన్

  రిప్లయితొలగించండి
 18. రిప్లయిలు
  1. చెల్లున్ విశ్వరహస్యమిట్టు నిలలోఁ, జెన్నొందు విద్యుత్తులే
   వాల్లభ్యంబునఁ బుట్టవే జలమునన్, వైపర్యరీతిన్ బువిన్
   భల్లూకం బతిభీకరావృతతమోవ్యాప్తాకృతిం దాల్చ, నా
   భల్లూకోదరమందుఁ దాఁ బొడిచి భాస్వంతుండు వెల్గెన్ గడున్.

   కంజర్ల రామాచార్య
   కోరుట్ల.

   తొలగించండి
  2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి


 19. కల్లోలంబుగ చేర పెన్మిటిని తాకన్ వేడియున్ యుజ్యమే
  యుల్లాసంబుగ మారి సేదగొన నాయుత్సాహమున్ భామినీ
  భల్లూకోదరమందుఁ దాఁ బొడిచి భాస్వంతుండు వెల్గెన్ గడున్
  పిల్లాడై తన రార, జీవితము శోభించెన్ మహారాజ్ఞిగా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. కల్లోలమయ్యె దేశము
  తెల్లదొరల పాలనమున,ధీరుడు గాంధీ
  యల్లంతన నడుగిడగా
  భల్లూకము కడుపులోన భానుఁడు పొడిచెన్!

  రిప్లయితొలగించండి
 21. భల్లూకము పట్టుగలిగి
  యెల్లరనాకట్టుకొనగ, యెన్నిక కాగా
  మల్లుని
  సుతుననిరిజనులు
  "భల్లూకము కడుపులోన భానుఁడు పొడిచెన్"

  రిప్లయితొలగించండి
 22. ఆ శారదాంబను చిత్తశుద్ధితో కొలిచిన నజ్ఞానమనే భల్లూకము గర్భములో జ్ఞానకాంతులనే సూర్యుడుద్భవిస్తాడని.


  తల్లీ భారతిఁ గొల్తునే సతము నీ దాసాను దాసుండనై
  యుల్లాసమ్మున నీదు రూపమును నా యుల్లంబులో నిల్పుచున్
  కల్లోలమ్మొసగెడిన్ దయా మయివె సత్కారుణ్యమున్నంతనే
  భల్లూకోదరమందుఁ దాఁ బొడిచిభాస్వంతుండు వెల్గెన్ గడున్.

  కల్లోలము.... ఆనందము సంతోషము.

  రిప్లయితొలగించండి
 23. డా.పిట్టా సత్యనారాయణ
  నల్లని గొల్లని సంస్కృతి
  చెల్లెను విజ్ఞాన శాస్త్ర సిరినిన్ గరిమన్
  కొల్లలు పీయెస్యెల్వీల్
  భల్లూకము కడుపులోన భానుడు పొడిచెన్

  రిప్లయితొలగించండి
 24. అల్లన గృధ్రమొకటి తినె
  బల్లిని నాకలి గొనిన్ గభాలున యింకన్
  గొల్లుమనె బాధకు గనగ
  భల్లూకము కడుపులోన భానుఁడు పొడిచెన్

  భల్లూకము..... గద్ద
  భానుఁడు..... బల్లి

  రిప్లయితొలగించండి
 25. డా.పిట్టా సత్యనారాయణ
  అల్లా! క్రీస్తును సిక్కు బోధనలనే యన్నింటినిన్ గల్పె బో,
  చెల్లా గట్టిన గాంధి;దీన జనులన్ గాపాడ "మోడీ"వెసన్
  దల్లిన్నింటనె గూర్చి హైందవమునే దా గొల్చె విశ్వంభరన్
  భల్లూకోదరమందు దా బొడిచి భాస్వంతుండు వెల్గెన్ గడున్

  రిప్లయితొలగించండి
 26. అల్లా,యేసు,మహేశులు
  కల్లోలిత కల్మషంబు గానక జేయన్!
  డిల్లీ గల్లీయందున
  బల్లూకము కడుపులోన భానుడుపొడిచెన్!

  రిప్లయితొలగించండి
 27. బల్లెము దించెను వేటరి
  భల్లూకము కడుపులోన ; భానుఁడు పొడిచెన్
  మెల్లగ మేల్కొలిపి జనుల
  యుల్లము లుప్పొంగ చూడు ముదయమనందే!

  రిప్లయితొలగించండి
 28. ఈ రోజు శంకరా భరణము సమస్య
  భల్లూకము కడుపు లోన భానుఁడు పొడి చెన్

  ఇచ్చిన పాదము కందము నా పూరణము సేసములో


  రాముడు రావణుని చంపి అయోధ్యకు తిరిగివచ్చిన తర్వాత ఒకరోజు ఉత్సవము జరుపుకుంటారు. రాముడు తనకు సాయముచేసిన వారికీ పేరు పేరున పిలిచి బహుమతులను అంద చేస్తాడు. హనుమంతుడికి సీతా దేవి ఒక రవ్వల హారము కానుక గా ఇస్తుంది .హను మంతుడు అది తీసుకొని ధరించక దానిలో ఒక్కొక్క వజ్రము త్రుంచి పరిశీలించి పార వేస్తాడు. అప్పుడు సీతకు కోపమువచ్చి నీ మీదపుత్ర వాత్స ల్యముతో అత్యంత విలువైన హారము ఇచ్చాను ఎందుకు అలా త్రుంచి పార వేస్తున్నావు అని చిరు కోపముగా అడుగుతుంది .అప్పుడు హనుమంతుడు ఈ వజ్రములలో నా రాముని రూపము కనబడుటలేదు అని అంటాడు. అప్పుడు ఎగతాళిగా రాముడు నీ దగ్గిర ఉన్నడా అనిఅడుగగా నాహృదయములో ఉన్నాడని గుండెను చీల్చి చూపుతాడు. అప్పుడు భల్లూకము (కోతి అని అర్ధము కలదు) కడుపులో (గుండె అను అర్ధము కలదు) భానుడు (ఇనకుల సూర్యుడు ) కనిపించెనని భావన


  ప్రేమగ నొసగితి పేరును నీకు పవనసుతా! యేల నీవా సరమున
  వజ్రము లన్నియు పారవేయుచు నుంటివనగ, నా భానుని వదనము కన
  బడగుండె నని బల్కి, యెడదన చూపెద కూర్మి తో నని చీల్చె గుండె నపుడు,
  ముదముగా (భల్లూకము కడుపు లోన భానుఁడు పొడి చెన్) తన పడతి గూడి

  నెల్లరకు విస్మయము గల్గ, నుల్ల మపుడు
  ఝల్లు మనెను పృధ్విసుతకు ,సంత సముగ
  నా సభికులెల్ల కొనియాడి నమస శతము
  ల నిడె రామ భక్తికి మెచ్చి హనుమకపుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. చాలా బాగుందండి పూసపాటి వారు!


   "భల్లూకపు బుద్ధి! మణుల
   చెల్లాచెదరు విసిరితివి"! సీత కనలగా
   "తల్లి! దొరపొడలె!" పగటగ
   భల్లూకము, కడుపులోన భానుఁడు పొడిచెన్!


   జిలేబి

   తొలగించండి
  2. పూసపాటి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 29. 25 జనవరి 2019, శుక్రవారం
  శంకరాభరణం
  సమస్య

  భల్లూకము కడుపులోన భానుఁడు పొడిచెన్

  నా పూరణ. కం:
  **** *** *

  నల్లని తిమిరము గనపడె
  భల్లూకము వోలె; రవియె ప్రభవించంగన్
  మెల్లగ జీల్చుచు చీకటి;
  భల్లూకము కడుపులోన భానుఁడు పొడిచెన్


  🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 30. చల్లంగజాఱఁ దిమిరము
  త్రుళ్ళి పడంగఁ గమలములు దోరం బవనిం
  బెల్లుబికి రేఁగ నాకలి
  భల్లూకము కడుపులోన, భానుఁడు పొడిచెన్


  కల్లోలాంబుధిఁ బూర్వ దిగ్వనిత సత్కారార్థ సంరంభియై
  సల్లాపమ్ములు సల్పఁ దోయజ బృహత్షండమ్ముతో నెల్ల శో
  భిల్లంగన్ భువి సింహ రాశి మృగ రాడ్విద్రావితక్షుద్ర వ
  ద్భల్లూకోదరమందుఁ దాఁ బొడిచి భాస్వంతుండు వెల్గెన్ గడున్

  రిప్లయితొలగించండి
 31. గిల్లెన్రక్కెను కొట్టె తన్నె వడిగా గీపెట్టె వృక్షమ్ములన్
  రాళ్ళన్రప్పల బండకొండలను గిఱ్ఱన్ద్రిప్పుచుం గృష్ణునిన్
  భల్లం, బంతట వాని మోది తెలివిం బాయంగ జేసెన్తుదిన్
  భల్లూకోదరమందుఁ దాఁ బొడిచి భాస్వంతుండు వెల్గెన్ గడున్.

  రిప్లయితొలగించండి
 32. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  తల్లీ! నిన్ను దలంచి ఫోనునిట చేతన్ బూనితిన్ నీవు నా
  యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దమ్ము శో
  భిల్లంబల్కుము నాదు వాక్కుననుచున్ విల్లంది ఛందస్సనున్
  భల్లూకోదరమందుఁ దాఁ బొడిచి భాస్వంతుండు వెల్గెన్ గడున్!

  భాస్వంతుండు =
  gpsastry.blogspot.com

  రిప్లయితొలగించండి
 33. అల్లదె యేమని యంటిరి
  భల్లూకము కడుపులోన భానుడు పొడిచెన్
  గల్లలు బలుకుట యొప్పునె
  పుల్లయ్యా! యేమియిటుల బొసగని మాటల్

  రిప్లయితొలగించండి
 34. నల్లని మృగమేది వనిని
  పిల్లలు పుట్టుటకు ముందు పెరిగెద రెచటన్
  తెల్లగనయె తూర్పదెటుల
  భల్లూకము, కడుపులోన , భానుఁడు పొడిచెన్

  నిన్నటి సమస్యకు నా పూరణ

  పాపపు కార్యము సలుపగ
  దీపమునకు తైల ముడుగ తిమిరమె కాగా
  శాపంబై మారిన యా
  దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్

  రిప్లయితొలగించండి
 35. మల్లుడు భానుడు వేటరి
  వెల్లువ వలె విఱుచుకు పడు వేటాడుటలో
  బల్లెముతో నటవిని నొక
  భల్లూకము కడుపులోన భానుఁడు పొడిచెన్

  రిప్లయితొలగించండి
 36. నల్లని యాఫ్రిక యువతిని
  వల్లెయని బ్రిటను యువకుడు పరిణయ మాడన్
  తెల్లని శిశువే పుట్టెన్!
  భల్లూకము కడుపులోన భానుడు పొడిచెన్!

  రిప్లయితొలగించండి
 37. తెల్లారు వేళ మేఘా
  లల్లిన యాకాశ పథము నవలోకించన్
  యుల్లమున దోచె నిట్టుల
  భల్లూకము కడుపులోన భానుడు పొడమెన్!

  రిప్లయితొలగించండి
 38. భల్లూకము పట్టుగలిగి
  యెల్లరనాకట్టుకొనగ, నెన్నిక కాగన్
  మల్లుని
  సుతుననిరిజనులు
  "భల్లూకము కడుపులోన భానుఁడు పొడిచెన్"

  **సవరణతో.

  రిప్లయితొలగించండి
 39. చెల్లని వారిని గూడియు
  కల్లెక్కువ ద్రావినావొ కల గాంచితివో
  సొల్లేల పలికెద వెటుల
  భల్లూకము కడుపులోన భానుఁడు పొడిచెన్ ?

  రిప్లయితొలగించండి
 40. ఎల్ల జనుల జీవితముల
  నెల్లలు లేనట్టి కాంతి నింపుగ నింపన్
  అల్లదె!చూడంగ తిమిర
  భల్లూకము కడుపులోన భానుడు పొడిచెన్

  రిప్లయితొలగించండి
 41. శార్దూలవిక్రీడితము
  ఇల్లాలిన్ రఘురాముడంద ననిలో నీడేర్చి తాఁ గోరినన్
  గల్లోలమ్ముగ యుద్ధమున్ సలుపు శ్రీకాంతుండు రాముండటం
  చుల్లాసంబున కూతుకందఁగ వివాహోత్సాహి యైనంతటన్
  భల్లూకోదరమందుఁ దాఁ బొడిచి భాస్వంతుండు వెల్గెన్ గడున్

  రిప్లయితొలగించండి
 42. కుమారజనవరి 25, 2019 8:21 PM
  ఎల్లల్ దాటగ చీకటుల్ ఘనముగా నీలోక మందంతటన్
  తెల్లారన్ గగనంపు ప్రాగ్దిశన చిత్రించెన్ ప్రభారాశియే
  భల్లూకమ్మును బోలు మేఘమును సేబాసంచు శ్లాఘించ నా
  భల్లూకోదరమందుఁ దాఁ బొడిచి భాస్వంతుండు వెల్గెన్ గడున్

  రిప్లయితొలగించండి