15, జనవరి 2019, మంగళవారం

దత్తపది - 151 (కర)

'కర'తో నాలుగు పాదాలను ప్రారంభిస్తూ
మకర సంక్రమణాన్ని వర్ణిస్తూ 
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

65 కామెంట్‌లు:

 1. మైలవరపు వారి పూరణ

  కరకరలాడు జంతికలు గారెలు బూరెలు పూతరేకులా...
  కరముగ దక్కు , వీథులకు కాంతులు తెచ్చును ముగ్గు , పంట శ్రీ..
  కరముగ గాదెకెక్కు , వినగా సరసమ్ము పసందునౌ , ప్రభా...
  కర గమనమ్ము మారగనె గ్రామము పండుగశోభవెల్గెడిన్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. "ప్రభాకరుని" తలచితిరి...ధన్యవాదములు!

   తొలగించండి
  3. ఈరోజు దాదాపు అందరికీ 'ప్రభాకర' స్మరణ తప్పదు.

   తొలగించండి
  4. అసలు "ప్రభాకరుడు" బిజీ ఐపోయాడు సమస్యలతో:

   ***************************

   శంకరాభరణం సమస్య - 2607

   "జీతము లేని కొల్వుల నిసీ యనువారలు గూడ నుందురే"

   ఖ్యాతిని మానమున్ గనక కైతను నేర్పగ మాతృభాషనున్
   రాతిరి ప్రొద్దునున్ గనక రైతును వోలుచు సేద్యమోర్చుచున్
   ప్రీతిని శంకరాభరణ వేదికనున్ గని వృద్ధిజేయుటౌ
   జీతము లేని కొల్వుల నిసీ యనువారలు గూడ నుందురే!

   (కంది శంకరయ్య గారి సౌజన్యంతో)

   తొలగించండి
  5. కరసంస్పర్శయె చాలు జీవులకు రోగంబుల్ హరింపన్ , ప్రభా...
   కరతేజమ్మది యంధకారవితతిన్ గాల్చంగ శక్యమ్ము , భా...
   స్కరనామమ్మన విష్ణునామసమమై గాచున్ జనాళిన్ , దినం...
   కర ! త్వత్సంక్రమణమ్ము పుణ్యదము సంక్రాంతిప్రభల్ మాకిడున్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి


 2. కరయై యాక్రమణ గన మ
  కరమ్ము నదిగో నభమున కార్మికుడు ప్రభా
  కరవిభవమ్ము, భళా రా
  క రయముగా, సంకురాత్రి కందువ సొబగౌ!


  శుభాకాంక్షలతో


  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. కరముల వేయిం దాల్చిన
  కర మరుదగు కాంతుల శుభకర ! నిశి నాశం
  కర ! కర్కాటకరాశిని
  కరము విడచు మకరవిభుడ ! కైమోడ్పులయా !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జంధ్యాల వారూ
   ప్రశస్తమైన పూరణ. అభినందనలు

   తొలగించండి
  2. కర ముగ వెల్గు చు నినుడు మ
   కరరాశి ని చేరె డు తరి కై మోడ్పు ల తో
   కర మగు భక్తి గ గొలువ మ
   కర సంక్రాంతి శుభ కర ములు కల్గించు గదా !

   తొలగించండి

  3. బాపూజీ గారు

   ధనుర్రాశి కరమువిడుచు విడుచు మకరవిభుడు కదా? కర్కాటక మన్నారు వేరే యేదన్నా‌ విశేష ముందా ?


   జిలేబి

   తొలగించండి
  4. రాజేశ్వరరావు గారూ
   మీ పూరణ బాగున్నది అభినందనలు
   చివరి పాదంలో గణదోషం. "కర సంక్రాంతి శుభమ్ముల కల్గించు... అందామా

   తొలగించండి
 4. రిప్లయిలు
  1. రామాచార్య గారూ,
   మీ పూరణ మనోహరంగా ఉంది అభినందనలు.
   మీ పద్యంపై సమీక్షను వాట్సప్ లో చూడండి.

   తొలగించండి
 5. కరములు జోడించి కొలుతు మ
  కర సంక్రమణ దినమున గాదెలు నిండన్
  కరకం కణములు మెరయగ
  కరకర కాంతులు విరియగ కనుమే తుదకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా
   మీ పూరణ బాగున్నది. అభినందనలు
   రెండవ పాదంలో గణదోషం. 'దినమ్మున' అనండి

   తొలగించండి
  2. కరములు జోడించి కొలుతు మ
   కర సంక్రమణ దినమ్మున గాదెలు నిండన్
   కరకం కణములు మెరయగ
   కరకర కాంతులు విరియగ కనుమే తుదకున్

   తొలగించండి
 6. సంక్రాంతి శుభాకాంక్షలు

  *దత్తపది*:-
  *'కర'* తో నాలుగు పాదాలను ప్రారంభిస్తూ
  మకర సంక్రమణాన్ని వర్ణిస్తూ
  మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

  *కందం**

  కరములు ముడుచుకు బోయె మ
  కర సంక్రమణమును బొంది కరుణించు ప్రభా
  కర,చలిగాయుము దిన
  కర నీ నులివెచ్చనైన కరముల తోడన్
  ......................✍చక్రి

  రిప్లయితొలగించండి
 7. కరమరుదైన పూతనుతికారకసంక్రమణమ్ము, దివ్యభా
  స్కరవిహితార్చనీయము, సుఖప్రకరాత్తము, రంగవల్లికా
  కరణనిమగ్నబాలికల కామ్యఫలప్రదమౌను, గొబ్బిళుల్,
  కరకరలాడు చక్కిలము,కమ్మని పొంగలి, గంగిరెద్దులున్,
  చెరుకుగడల్ జెలంగురుచి, చెన్నెసలారెడు భోగి మంటలున్,
  పరమసురమ్యమై పరగి భాసిలు తెల్గుదనమ్ము చిందుచున్
  వరలెడు దివ్యమౌ మకరభాస్కరసంక్రమణమ్ము సౌఖ్యముల్
  నిరతమునైన పెన్నిధిని నిక్కమొసంగుత మానవాళికిన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 8. కరము వెల్గెను మకర సంక్రాంతి యన,ని
  కరము ధాన్యపు రాశుల కలిమి చేర,
  కరకు గుండెల హర్ష సంఘాతమొప్పు
  కరణి ధరణిని బంతుల కాంతి మెరసె.

  రిప్లయితొలగించండి
 9. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


  ********* *********

  సం క్రాం తి వై భ వ ము

  ********** ***********  ఎచ్చోట జూచిన నింపుగ హరిదాసు

  కీర్తనతో జేయు నర్తనములె

  ఎచ్చోట జూచిన నెసగు మధుర మైన

  జానపదుల లోని గాన సుధలె

  ఎచ్చోట జూచిన నచ్చెర వొసగెడు

  కోలాటరవముల ‌ మేలుగతులె ( గతి = తాళపునడక )

  ఎచ్చోట జూచిన హెచ్చైన స్థాయిలో

  చెక్కభజనల యొక్క చెలగు ధ్వనులె


  తే • గీ • రంగురంగుల రంగవల్లరుల కాంతి

  రంగరించగ నంగనల్ ప్రాంగణమున ,

  కర్షకులు తడియగ హర్ష వర్ష మందు ,

  వచ్చె సంక్రాంతి లక్ష్మి శోభాయముగను |

  మకరసంక్రాంతి మనకిడె నికరముగను

  సకల శుభముల సుఖముల సంతసముల |
  తే • గీ • గంగిరెద్దులాటలు ప్రతిగ్రామ మందు

  కానిపించి కన్నులవేడ్క గలుగ జేసె

  సింగిఁ బందెపుకోడి విజృంభణమున

  పోర , నావల గలకోడి పారె వెరచి |

  గాలి పటము లెగురవేసి బాల లెల్ల

  తేలియాడి రానందపు డోల లందు |


  ( సింగి = తెగించిన కోపము )


  *************** *************

  బ స వ దే వు ని అ లం కా ర ము

  ************** *************


  పసుపున్ , గుంకుమ బొట్టువెట్టెదము నీ ఫాలాన | శృంగంబులన్

  మిసిమిన్ దీర నొనర్చి వాటి నడుమన్ మేలైన పూలుంతు ‌ | మీ

  కుసుమగ్రైవము వైతుమయ్య మెడలో గొండంత ప్రేమాస్పదన్ |

  బసవా ! దండమువెట్టి కొల్తుము నినున్ , భర్గుండు హర్షింపగా


  ( మిసిమి = కాంతి ; కుసుమగ్రైవము = పూలమాల )


  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి
 10. డా. పిట్టా సత్యనారాయణ
  కరమున దె(తె)ల్లని పద్మము
  కరమరుదగు రథము నేడు కళలగు వాజుల్
  కరకర బొడిచెన్ గూర్చిన
  కరములివే వినతిగొను మకర సంక్రాంతిన్

  రిప్లయితొలగించండి
 11. కరపీడనముగ సందడి
  కరకరిచలి దరుగజేయ కమలాప్తుడు,శం
  కరయాజ్ఞగ,సంక్రాంతియు
  కరగించకరవు వరమగు కైళముగాదా!

  రిప్లయితొలగించండి
 12. సంక్రాంతి శుభాకాంక్షలుకవులకు,పండితులకు,గురువర్యులకు

  రిప్లయితొలగించండి
 13. 'కర'క వానలు గురియుత ! ఘనము గాను
  'కర'కు దనమును విడుగాత కలుష జనులు
  'కర'కమలములు గలవాడు గాచగను మ
  'కర'త ములనెన్నొ సంక్రాంతి గలుగ జేయు.

  రిప్లయితొలగించండి
 14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. ఖద్యోమణి,దివమణి,గగనమణి పునరక్తి కాగలదండి.

   తొలగించండి
  3. కరకర కాకర,జయ శుభ

   కర, తామరచెలి,గభస్తి,గగనమణి, దివా
   కర,మింటి తెరువరి,రవి,మ

   కర రాశిన కాలిడి మము కాచగ వలయున్


   తొలగించండి
  4. పూజ్య కామేశ్వరరావు గారు నమస్కారము కరెక్టే నేను ప్రయాణములో ఉండి సెల్ ఫోన్ నుంచి పైపద్యము వ్రాసిపంపుట జరిగింది సరియైన పదముల ఎంపిక చేయలేకపోయాను ఇప్పుడు మీ సూచన మేరకు తిరిగి వ్రాశాను . ధన్యవాదములు ఇట్లాగే ప్రతిదినము మీ యొక్క అమూల్యమైన సలహాలు ఇవ్వవలసినది గా మరల మరల ప్రార్దిసున్నాను

   తొలగించండి
 15. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కరమున్ త్రిప్పుచు భామ వాకిలికి తా గావించ రంగోలినిన్
  కరముల్ పెంచి ప్రభాకరుండు భళిగా కాల్చంగ శీతమ్మునున్
  కరమౌ రీతిని నత్తగారరిసెలన్ కాల్చంగ జామాతకై
  కరమున్ దించెను జైత్లి గారు వడిగా కంపించి టెంకాయపై :)

  కరము =
  1. చేయి
  2. కిరణము
  3. మిక్కిలి
  4. కప్పము (GST)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. *కర* మును వాడుడ నుచు శం
   *కర* య్య గారనగ నాకు, గగనమయె ప్రభా
   *కర* శాస్త్రి గారు బహు సుఖ
   *కర* ముగ పద్యము 'జిలేబి' గారికొసగిరే!

   ( Sri GP, శాస్త్రి గారికి... ధన్యవాదాలతో....
   డా. మునిగోటి. మదనపల్లె! 🙏🕉👏

   తొలగించండి
  2. "కరము త్రిప్రు లేక కలమును త్రిప్పును
   కరము మాకు శాస్త్రి కవి హితుండు
   కరము పెరిగి నపుడు ఖర కర పద్య ని
   కరము తో “ప్రభాకర” రవి రహించు

   కరము = పన్ను (లు)"

   ...చిటితోటి విజయ కుమార్

   తొలగించండి
 16. కరమింపును గూర్చు రవి మ
  కర రాశిని చేరి పుణ్య కాలము నిడ భీ
  కరమౌ చలి బాధల కా
  కరమై మిథునము తపించు కౌగిలికొరకై

  రిప్లయితొలగించండి
 17. కరసాహస్రముల బరచి
  కరగించెనుశీతలమ్ము క్రాంతినిగొనుచున్
  కరమనుమోదమ్మున బ్రజ
  కరములుమోడ్చె మకరమున కమలాప్తుగనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రెండవ పాదములో చిరుసవరణ
   కరగించగశీతలమ్ము క్రాంతినిగొనుచున్ గా చదువ ప్రార్ధన

   తొలగించండి
 18. శ్రీ కంది శంకరయ్యగారి సూచనమేరకు ఎనిమిది పాదాలలో కరశబ్దప్రయోగంతో---

  కరమరుదైన పూతనుతికారకసంక్రమణమ్ము, దివ్యభా
  స్కరవిహితార్చనీయము, సుఖప్రకరాత్తము, రంగవల్లికా
  కరణనిమగ్నబాలికల కామ్యఫలప్రదమౌను, గొబ్బిళుల్,
  కరకరలాడు చక్కిలము,కమ్మని పొంగలి, గంగిరెద్దులున్,
  చెరుకుగడల్ గరంగు రుచి, చెన్నెసలారెడు భోగి మంటలున్,
  బరపున సంకరమ్మగుచు, భాసిలు తెల్గుదనమ్ము చిందుచున్
  వరలెడు దివ్యమౌ మకరభాస్కరసంక్రమణమ్ము సౌఖ్యముల్
  నిరతకరార్థిఁ బెన్నిధిని నిక్కమొసంగుత మానవాళికిన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి


 19. కరతాళమ్ముల తోడు గొబ్బిపదముల్ కై పెక్కు జాతోక్షముల్
  కరపాలిన్ తెగు తామ్రచూడములు, శాకాహార కూరాదులున్
  కరమొప్పంగ వయారమైన నడకల్, కాంతామణుల్ గీరలున్
  కరదంబుల్,సయి యిచ్చిపుచ్చుకొను సంక్రాంతిన్ గనన్ రండహో!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. కరముల కష్టముల్ గడచి కాంచి ఫలమ్ముల రైతు సోదరుల్
  కరమగు తృప్తితో చెలఁగి కమ్మని వంటల నారగించి శ్రీ
  కరమగు నుత్తరాయణపు కాలమునందున నల్లువాడి య
  క్కరలను తీర్చుచున్ ముదముఁ గాంచుచు, క్రాలుచునుంద్రు పల్లెలన్
  అల్లువాడు: అల్లుడు

  రిప్లయితొలగించండి
 21. కరములు విప్పె, సకల సూ
  కర పశు పక్ష్యాది జీవ కర్మలసాక్షిన్,
  కరమాలము నుంచి వెడలె,
  కరములు మోడ్చెద యినకుల కరుణాధిపుడా

  రిప్లయితొలగించండి
 22. కర దశశత విలసిత దిన
  కర నామాకాశమణి మకర రాశి దయా
  కర సంక్రమణ మనఁబడు మ
  కర సంక్రాంతి పుడమినిఁ బ్రకటతర రీతిన్

  రిప్లయితొలగించండి
 23. కరములు గలిగిన రవియెమ
  కరమ్మున్జేరుకతన గరమది మిన్నై
  కరముగబుణ్యమిడుదివా
  కరునిన్ ప్రార్ధింతునెపుడు కరుణను జూపన్

  రిప్లయితొలగించండి
 24. కరములు జోడించెద శుభ
  కరముగ రంజిల్లు నవ్యకాంతుల నంతః
  కరణమ్మునిమ్ము దేవ! మ
  కరసంక్రాంతిసమయాన గమనీయమగున్.

  మిరియాల ప్రసాదరావు. కాకినాడ

  రిప్లయితొలగించండి
 25. గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు.

  కందం
  కరమోడ్చి మ్రొక్కెదన్ శ్రీ
  కరమన భువి పంట సిరులు గాదెలు నిండన్
  కరవెరుగని విధిఁ జూచి మ
  కరమున సంక్రాంతి నాడు ఖరకరుఁ డొదుఁగన్

  రిప్లయితొలగించండి
 26. గురువర్యులకు మఱియు కవి మిత్రులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.
  కరకర మను నరిసెలు శుభ
  కరమగు గొబ్బియలును దినకరుని కొసఁగు శ్రీ
  కరమగు పొంగల్లె గద మ
  కర సంక్రాంతి కిల లోన కాంతులు నింపున్!

  రిప్లయితొలగించండి
 27. కరమౌహరిదాసులగానము,శం
  కరమౌసిరిగాదెలుగారెలు,భా
  స్కరుసంక్రమణాగమ కాగడలై
  గరబంధపతంగులుఖంవిశిఖన్

  రిప్లయితొలగించండి
 28. కరానురాగ సంకురాత్రి గారెలర్సెలెన్నొ శం
  కరోత్తరాయణార్కయాన గౌరవార్థమైశుభం
  కరాంగణాణి రంగవళ్లి గాంతివిల్లుగొబ్బియల్
  గరంపుగుక్కుటాలిపోరు గర్షకాలిమోదమై
  గరాగ్రచిర్తెదాల్పులూర గంగిరెడ్లుభిక్షుకుల్
  గరోగ్రమర్కుడాఘఘాతి గల్ములీయుపర్వమౌ

  రిప్లయితొలగించండి
 29. కరకమలమ్ములం బొదివి కౌగిట చాయను, చూచి మంగళా
  కరముగ పద్మినీ సతిని, గాటపు బ్రేమను దాకి వెచ్చనౌ
  కరముల సంజ్ఞ నా మకరగమ్యము జేరెను ధాత్రికి న్యశో
  కరమగు నుత్తరాయణపు కాన్క నొసంగుచు సూర్యు డల్లదే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పెద్దలు కామేశ్వరరావు గారి సూచించిన సవరణతో...
   కరకమలమ్ములం బొదివి కౌగిట చాయను, చూచి మంగళా
   కరముగ పద్మినీ సతిని, గాటపు బ్రేమను దాకి వెచ్చనౌ
   కరముల సంజ్ఞ నా మకరగమ్యము జేరెను ధాత్రికి న్యశ
   స్కరమగు నుత్తరాయణపు కాన్క నొసంగుచు సూర్యు డల్లదే.

   తొలగించండి
 30. కరకరలగీర్తనల వరలుహరిదాసులును, వరహితపు టక్కరల బరగు గవితల్, సం
  కరగతపుగల్మషము దరిగి మకరార్కునికి, ధరకు,గపిలమ్మలకు గరనతులతో శ్రీ
  కర, శుభకరార్క, నిశి హర,హరి,గుణాకరుని సిరులహరివిల్లు విరి పెరిమఝరితో శం
  కర శిరపుగొబ్బియల విరియు విరిగన్నులును సురుచిరపు వీధులకు గరకరలకాంతుల్
  కరకుదనమున్దుడిచి నరులకిడు వానలును మకరవిభుసంక్రమణ మరుల నెదనించన్

  రిప్లయితొలగించండి
 31. గురువు గారికి మరియు కవి కులమునకు సంక్రాంతి శుభాకాంక్షలు.
  కరములు దినకరు కరమగు
  కరవాలంబగు హిమాంశు కాలంబందున్
  కరన్యాసo బులనేక మ
  కర సంక్రమణ దినమున కాలస్వరూపా!

  రిప్లయితొలగించండి
 32. కరములెత్తి కొలుతు గగనమణీ నిన్ను
  కరము వేడుకొందు కరుణజూపు
  కర్మసాక్షి వీవు కాపాడు మోశుభ
  కర నిరతము విడక కాశ్యపేయ.


  రిప్లయితొలగించండి
 33. కరణీయంబయి యిల శ్రీ
  కరముగ నరుదెంచు పౌష్య కాలం బందున్
  కరదంబై యలరంగ, మ
  కర సంక్రమణం బడుగిడు ఘన పర్వంబై!

  రిప్లయితొలగించండి
 34. నా రెండవ పూరణము:

  కరముల మ్రొక్కెద నిను శుభ
  కరారుణ గభస్తి! ఖమణి! కామిత సంప
  త్కర ధరనేలుచు నీదు మ
  కర సంక్రమణ క్రమమున గాపాడుమయా!

  రిప్లయితొలగించండి
 35. కరముగ పంటల నంది మ
  కర సంక్రాంతి యన రైతు ఘనముగ దలచన్
  కరములు మోడ్చి గొలుతు దిన
  కర! దీవింప గదవె శుభకరమగు నటులన్!

  రిప్లయితొలగించండి
 36. గురుదేవులకు వినమ్రవందనములు
  సరదగా త్రిప్రాస ప్రయత్నం

  కం
  అరకొరగ వండిరరిసెలు
  కరకర లాడక నవి శుభకరమై దోచెన్
  ఖరకరుని దలచి మెండుగ
  ధర కర ! శక్తి నిడు నాకు దండిగ ననుచున్!

  రిప్లయితొలగించండి
 37. కవిమిత్రులకు నమస్కృతులు... ఈరోజు ఉదయం హైదరాబాదు చేరుకున్నాను. ప్రయాణపు టలసట, జి. సీతాదేవి గారి పుస్తకాన్ని ప్రెస్సుకు ఇవ్వడానికి తుది మెరుగులు దిద్దుతూ ఉన్న కారణంగా మీ పూరణలపై స్పందించలేకపోయాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి