29, ఏప్రిల్ 2021, గురువారం

సమస్య - 3708

30-4-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కొడుకు దండ్రినిఁ జెప్పుతోఁ గొట్టె సరియె”
(లేదా...)
“తనయుడు చెప్పు తీసికొని తండ్రినిఁ గొట్టెను తప్పు గాదులే”

50 కామెంట్‌లు:

pks kumar చెప్పారు...

కొడుకు తండ్రిని‌ చెప్పుతో కొట్టె సరియె


నాయ నా రమ్మ నెవరనె హాయి గాను,

తేలు కనిపించ గానేమి తీసి చంప

మంచి దనుచు నా పతితోడ మగువ బలికె

కొడుకు తండ్రిని,చెప్పు తో కొట్టె సరియె

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

తల్లి దండ్రులు ప్రత్యక్ష దైవము లన
పూజనీయులు వారలు పుడమి యందు
ఎట్టి దుర్మార్గు డైన దా నెచట నైన
కొడుకు తండ్రిని చెప్పుతో కొట్టె సరియె?

BMahalakshmi చెప్పారు...

చిలిపిచేష్టలబిడ్డనిచేరఁదీసి
తప్పుఁజెప్పంగచెప్పునతడిమెతండ్రి
ఆటయనుచునుతలచియుహాస్యసరణి
కోడుకుతండ్రినిఁజెప్పుతోఁగోట్టెసరియె

BMahalakshmi చెప్పారు...

అనయముకానిపద్ధతినియాదరమింయులేనిపెద్దగా
కనగనుకాంతబిడ్డలనుకాదనిభోగముదేలియాడుచున్
జనమునయాగిసేయుచునుజన్మనునిచ్చినతండ్రియున్నచో
తనయుడుచెప్పుతీసికొనితండ్రినిగొట్టెనుతప్పులేదులే

seethadevi gurram చెప్పారు...

కనివిని యెర్గనట్టి కలికాలపు చేష్టల నేమియందుమో
వినుట కునేవగింపు పరివేదన గల్గెడి మాటలివ్వి యా
తనయుల బెంచురీతియతి దారుణమైన విధంబునుండగా
తనయుడు చెప్పుదీసుకొని తండ్రిని గొట్టెను తప్పుకాదులే


విరించి చెప్పారు...


తప్పతాగి తా బొరుగింటి తరుణితోడ
సభ్యతవిడి ప్రవర్తింప సకుటు డైన
వానిని గని యాగ్రహమును పట్టలేక
కొడుకు దండ్రినిఁ జెప్పుతోఁ గొట్టె సరియె.


వినయమదెంతయో కలిగి ప్రేమగ బిడ్దల బెంచి పుత్రులన్
ఘనులుగ దిద్దితీర్చగను కష్టము లెన్నొ భరించు వాడె యా
జనకుడు వృశ్చికమ్మొకటి జారుచు నాతని వీపు పై పడన్
దనయుడు చెప్పుతీసికొని తండ్రిని గొట్టెను, తప్పుగాదులే.

sitharamayya solasa చెప్పారు...

నగరమున దండ్రి వెంబడి నడచు చుండ
నెదుట వృశ్చికమును గాంచి హెచ్చ రించె
గొడుకు దండ్రినిఁ ; జెప్పుతోఁ గొట్టె సరియె
దానిజంప నంతియెగాని దప్పుగాదు

chandrashekhar yelisetty చెప్పారు...

సంతాన ప్రాప్తికై ఎన్నో రకాల మొక్కులు మొక్కుతారు. ఒక కొత్త తరహా మొక్కు ను ప్రస్తుతించే ప్రయత్నం గా నా పూరణ:

చం:

జనకుడు గావనెంచి వయ సాచెడు వేళన విశ్వసింపనై
కనివిని యెర్గమయ్యె ఘన కార్యమటంచని ముడ్పు గట్టగన్
మనసగు కోర్కె దీర దన మాటగ దేవర మొక్కు దీర్చ నా
తనయుడు చెప్పు తీసుకొని తండ్రిని గొట్టెను తప్పు గాదులే

వయసాచెడు వేళ = late age

వై. చంద్రశేఖర్

శశిభూషణ సిద్ధాంతి నంద్యాల శ్రీ కొలను భారతి పంచాంగ కర్త చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శశిభూషణ సిద్ధాంతి నంద్యాల శ్రీ కొలను భారతి పంచాంగ కర్త చెప్పారు...

గుంతకల్లు పట్టణానికి సమీపంలో కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి ఆలయం పురాతనమైనది మరియు ప్రసిద్ధమైనది. స్వామి రాజగోపుర ద్వారంలో భద్రపీఠంమీద సుమారు 2 అడుగుల పొడవు గల తోలు పాదరక్షలు ఉంచబడి ఉంటాయి. ఈ పాదరక్షలతో తాడనం చేసుకుంటే సకల గ్రహ బాధలు తొలగిపోతాయి అని ప్రతీతి. ఈ సందర్భం పురస్కరించుకొని నేటి నా పూరణ...


ఘనుడు కసాపురేశ్వరుని కాంచన గోపుర ద్వారమందున్
కనెనట స్వామిపాదుకలు కాచి నికామము గూర్చు తాడనం
బొనరగ జేయ సత్యమన పోహణమందున భక్తితోడ నా
తనయుడు చెప్పు తీసికొని తండ్రిని గొట్టెను తప్పు గాదులే !

నికామము = కోరిన కోర్కెలు
పోహణ = వ్యవహారము, సందర్భము

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

సమస్య :
తనయుడు చెప్పు తీసికొని
తండ్రిని గొట్టెను తప్పు గాదులే

( సామంతుడైన పాండ్యరాజును దాయాదుల నుండి కాపాడి తిరిగి సింహాసనాధిష్ఠితుని కావించి రమ్మని
సేనాని నాగమనాయకుని పంపిన కృష్ణదేవరాయలవారి ఆజ్ఞను ధిక్కరించి తానే మధురరాజ్య సింహాసనమెక్కిన తండ్రి నాగమనాయకునికి విశ్వనాథ
నాయకుడు చేసిన సత్కారం )

" పనిగొని పోయినాడవుగ !
పాండ్యుని రాజ్యపు నప్పగింతకై
ఘనుడగు కృష్ణరాడ్విభుడు
గట్టిగ నమ్ముచు నిన్ను నంపగన్ ;
మనదగు రాజభక్తి కిది
మచ్చయె నాగమనీడ ! " యంచు నా
తనయుడు చెప్పు తీసికొని
తండ్రిని గొట్టెను తప్పు గాదులే .

అపర్ణ గాడేపల్లి చెప్పారు...

శ్రీ గురుభ్యోనమః

అతిధి మరియాదలను జేయ ననుసరించె
కొడుకు తండ్రినిఁ ; జెప్పుతోఁ గొట్టె సరియె
భిత్తి మీదకు నెగబాకు వృశ్చికమును
నదను జూచి సమయమున బెదరకుండ

Haranath Rao Chennamsetty చెప్పారు...

మనుషులు చెడ్డ వారలయ మార్గమునడ్డము పోకుమన్ననూ

వినియును చీకటింటనల వేసెను కాటును వెర్రి జెఱ్ఱికిన్

తనయుడు , చెప్పు తీసికొని తండ్రినిఁ గొట్టెను తప్పు గాదులే

అనువుగ పెంచుటన్దెలియనట్టి కుకీటక రాజ రాజమా

...భారతీనాథ్ చెన్నంశెట్టి...

krkr చెప్పారు...

మునుమునుబుట్టెవారికొకముద్దులబిడ్డడులేకలేకయున్
వనరులగూడగట్టుకొనివానినిబెంచిరిగారవమ్మునన్
వినయమునేర్వజాలకనువీడకగారముమంకుబట్టులన్
తనయుడు చెప్పు తీసికొని తండ్రినిఁ గొట్టెను తప్పు గాదులే

కొరుప్రోలు రాధాకృష్ణరావు

ఫణి కుమార్ తాతా చెప్పారు...

అనయము రామునిం దలచు నగ్ని పునీతను గూర్చి ధూర్తతన్
జనకుని బుత్రి రావణుని సన్నిధి వత్సర మున్నదంచు నో
జనపదముండు దుష్టమతి చాకలి ప్రేలుచు నున్నవేళలో
తనయుడు చెప్పు తీసికొని తండ్రినిఁ గొట్టెను తప్పు గాదులే

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"రమ్మను నెవరు" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పద్ధతిని నాదర మింతయు" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'సకుటుడు'?

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వేళను..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
"ద్వారమందునన్" టైపాటు.

కంది శంకరయ్య చెప్పారు...

చారిత్రకమైన అంశంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అన్ననూ' అన్న ప్రయోగం సాధువు కాదు. "పోకుమన్న తా వినియును..." అనండి. 'రాజ రాజమా'?

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

విరించి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విరించి చెప్పారు...

సకటుడు (క టైపాటుతో కు అయ్యింది) దుష్టుడు

chandrashekhar yelisetty చెప్పారు...

ధన్యవాదములు

Surya చెప్పారు...

అనుదినమున్ సతీ సుతుల నారడి వెట్టుచు దిట్టి కొట్టుచున్
అనయము మద్యపాన మదమందున దేలుచు మందబుద్ధియై
తనయనె కాముకత్వమున దగ్గర జేరుమటంచు బల్కగా
తనయుడు చెప్పు తీసికొని తండ్రినిఁ గొట్టెను తప్పు గాదులే

A.Satyanarayana Reddy చెప్పారు...

వనమునపోవు చుండగను పట్టకుపీకగ నప్డు తండ్రినిన్
శునకము, పండ్లతోడుతను చూచి, తలంచుచు పాతసామెతన్
కనదగు స్వస్థతంచు వడిగా చని చెంతకు, భక్తి మ్రొక్కుచున్
తనయుడుచెప్పుతీసికొనితండ్రినిగొట్టెనుతప్పులేదులే

BMahalakshmi చెప్పారు...

తప్పుజేశాను, దిద్దుకుంటాను

BMahalakshmi చెప్పారు...

అద్భుతమైనసమయస్ఫూర్తిగలిగి, ఆనందదాయకముగానున్నది. గురువులకుప్రణామములు

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

దారివెంబడిజనుచుండు తరుణమందు
వెఱ్ఱి శునకము తండ్రికి వేసె గాటు
చెప్పుదెబ్బ యౌషధమని చెప్పగ విని
కొడుకు దండ్రినిఁ జెప్పుతోఁ గొట్టె సరియె

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

ఉఱుకులఁ బరుగులఁ గదిసి యఱచుచు వడిఁ
దనదు తండ్రినిఁ గాపాడఁ దలఁచి మించి
మీదకు నుఱుకు పగవాని, నాదు కొనుచుఁ
గొడుకు దండ్రినిఁ, జెప్పుతోఁ గొట్టె సరియె


అనయము మీఱ నల్లరి నిజాత్మజుఁ డింతయు జాలి లేక తాఁ
గనిన మహాల్ప జీవులను గ్రక్కునఁ బట్టి చెలంగి వాని వేఁ
చినఁ గని రోష వేగమునఁ జిన్నఁదనమ్మునఁ దాత తండ్రికిం
దనయుఁడు చెప్పు తీసికొని తండ్రినిఁ గొట్టెను దప్పు గాదులే

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

అనయము సొమ్మరోగమున
నార్తము జెందెడు కన్నతండ్రితో
వనమున బోవుచుండగ దబాలు
న తండ్రి పడెం ధరిత్రిపై
కనుగొని వెంటెనే యడలి గ
మ్మున బాధను బాప ముక్కపై
తనయుడు చెప్పు తీసుకొని
తండ్రిని గొట్టెను దప్పు లేదుగా.

subbarao చెప్పారు...

ఆశిసుల నిమ్మనిదనకు నడిగెనార్య!
కొడుకుతండ్రిని,జెప్పుతోగొట్టె సరియె
తనదు భార్యజో లికివచ్చు దమ్మునపుడు
స్వార్ధమనునది వదలదు బంధువులను

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

విననిది వింతగొల్పెడిని వెఱ్ఱితనంబనిపించు గాని యా
వినినది నిక్కమే యొకడు వీధిన బోవుచునుండ పుత్రుతో
శునకము గాటు వేయగనె సుంతయు గొంకును చూపకుండ నా
తనయుడు చెప్పు తీసికొని తండ్రినిఁ గొట్టెను తప్పు గాదులే

శ్రీహర్ష చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శ్రీహర్ష చెప్పారు...

వెనుకకు జేరి జాగిలము వెర్రిగ తండ్రిని కాటువేయగన్
మననము జేసి సామెతను మందుగ నెంచియు *కుక్కకాటుకున్*
ఘనమగు *చెప్పుదెబ్బయని* గౌరవ భావము తోడ బేలయై
*తనయుడు చెప్పు తీసికొని తండ్రినిఁ గొట్టెను తప్పు గాదులే*

తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

Sri[dharAni]tha చెప్పారు...

కుక్కను పెంచుకున్న తండ్రి తనయల నడుమ
గేయ మని గొడవలు మష్రుమించిన వేళ
నల్ల మేయిలు జేసి నగదు కాజేసి నిటుల
నిరుడు తన్నుకు బోయే తదా చెప్పులను తినగ దెబ్బలు

~సిరిహర్ష జనక

subbarao చెప్పారు...

అనయము ద్రాగుచుండియును నందఱి బంధుజనంబు సాక్షిగా
చనువునునుండు వానివలె శారదచేతిని ముద్దువెట్టగా
దనదగు భార్య హస్తమును సోకుట కోర్చుకొనంగ లేకనే
దనయుడు చెప్పుతీసికొని తండ్రిని కొట్టెను దప్పుగాదులే

seethadevi gurram చెప్పారు...

ధన్యవాదములు గురువుగారూ! నమస్సులు!🙏🙏🙏

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులందఱకు నమస్సులు!

అనయము మద్యమాంసముల నానుచుఁ, గాముకుఁడై చరించుచున్,
ధనమును దుష్టమార్గమున దండిగఁ గూర్చుచు, బేలలం గసిం
దునుముచు, గర్వియై తిరుగ, దూఱి, సహించఁగలేక, కూళకుం
దనయుఁడు చెప్పుఁ దీసికొని తండ్రినిఁ గొట్టెను! తప్పు గాదులే!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
అప్పుఁ దీర్చమంచడుగగా చెప్పుఁ దీసి
వెంటఁ బడుచు తరుమఁ గని మంటరేగి
యాప దుష్టుని దుశ్చర్య నాదుకొనుచు
కొడుకు దండ్రినిఁ, జెప్పుతోఁ గొట్టె సరియె

చంపకమాల
అనయము సానికొంపలను హాయిగఁ బొర్లుచు సర్వసంపదల్
మణిమయ భూషలన్ దొడగ మైకముఁ గ్రమ్మి సమర్పణమ్మునన్
జననిని తీవ్రకష్టమున జాలిని గాంచుచు మారబోననన్

Satyanarayana Tirunahari చెప్పారు...

వెసన పరుడైన కొడుకును వెసనుగావ
తండ్రి మందలించెను దినం, తగదటంచు
కొడుకుదండ్రిని చెప్పుతోకొట్టె సరియె
మత్తుదిగి కాళ్ళపైబడి మొత్తుకొనియె!

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...


తనకు జన్మ నొసంగిన తల్లి నచట
తండ్రి తిట్టుచు కొట్టుచు దయను మాలి
వెతలనిడగ తాళగలేక విసిగి పోయి
కొడుకు దండ్రిని చెప్పుతో కొట్టె సరియె