28, డిసెంబర్ 2021, మంగళవారం

సమస్య - 3945

29-12-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పద్యమును వ్రాయవద్దనె భార్య పతిని”
(లేదా...)
“పద్యము వ్రాయరా దనుచు భర్త పదమ్ముల వ్రాలె పత్నియే”

59 కామెంట్‌లు:

  1. తేటగీతి
    పిచ్చి పిచ్చిగ గణములు ఖచ్చితంబు
    లేని యతి మైత్రి జతజేసి, లేని సాధు
    భావములను గూర్చి రచించ వలదు స్వామి
    పద్యమును వ్రాయ వద్దనె భార్య పతిని
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    "వయసు పైబడ గౌరవపథమునెంచి
    భక్తి సామ్రాజ్య మేలుచు ముక్తిఁ గనఁగ
    పుణ్య భావాల మునుగుచు నన్యమైన
    పద్యమును వ్రాయవద్ద"నె భార్య పతిని

    ఉత్పలమాల
    "విద్య గలుంగు వాడవన వృద్ధుడవై చరమాంకమందునన్
    హృద్యమునౌ కవిత్వమున నీశ్వరు గొల్చుచు ముక్తినంద నై
    వేద్యమనంగ గూర్చుమయ! విజ్ఞత వీడుచు నన్య భావనన్
    బద్యము వ్రాయరా ద"నుచు భర్త పదమ్ముల వ్రాలె పత్నియే

    రిప్లయితొలగించండి
  3. పద్యమాలికముడులవిపంతమాడ
    నాధుడంతటనెమ్మదినయముమీఱి
    ఊహసుందరివలపుననూగులాడ
    పద్యమునువ్రాయవద్దనెభార్యపతిని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఊహాసుందరి' అనడం సాధువు కదా?

      తొలగించండి
    2. ఊహతోసుందరియందలివలపున, అనిఅనుకోవచ్చునేమో

      తొలగించండి
  4. నాస్తికత్వమున్ బోధించి నరులలోన
    బాలసమ్మును తొలగించు వాడననుచు
    యువతను పెడదారిని పెట్టయుక్తమైన
    పద్యమును వ్రాయ వద్దనె భార్య పతిని.

    రిప్లయితొలగించండి
  5. భావ బంధుర మైననే పఠిత మెచ్చు
    పేల వంబగు నట్టివి ప్రీతి నొసగఁ
    వెప్పుడ ది తెలిసి కొని నీ విట్టి దైన
    పద్యమును వ్రాయ వద్దనె భార్య పతిని

    రిప్లయితొలగించండి
  6. వేద్యముకానిదీకవితవింతలుజేయునువెఱ్ఱివానితో
    ఆద్యముస్రుష్టికియ్యదియునంబికవీనులవిందుజేసినన్
    సాధ్యముమాకుకాదనుచుశాంమువీడుచుశోకమందుచున్
    పద్యమువ్రాయరాదనుచుభర్తపదమ్ములవ్రాలెపత్నియే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సృష్టికి... శాంతము' టైపాట్లు.

      తొలగించండి

  7. విద్యలవెన్ని నేర్చినను విజ్ఞత యించుక లేకపోయినన్
    వేద్యులు మెచ్చబోరుకద విజ్ఞత గల్గిన నీవిటుల్ సదా
    మద్యము గ్రోలి మొప్పెవలె మాన్యుల నెప్పుడు కించపర్చుచున్
    బద్యము వ్రాయరాదనుచు భర్తపదమ్ముల వ్రాలె పత్నియే.

    రిప్లయితొలగించండి
  8. పద్యము నొక్కటైన ఘన బండిత
    వర్యులు మెచ్చునట్లు నే
    హృద్యముగాను వ్రాయుటకు హెచ్చగు
    యత్నము చేసినాను నా
    పద్యమునందు దోషములు ప్రాజ్ఞులు
    సూపునుండ్రి నాకు నే
    పద్యము వ్రాయరాదనుచు భర్త పదంబుల వ్రాలె పత్నియే

    విద్యను నేర్చి గొప్పగను బేరువహిం
    చియు లాభమేమిలన్
    సేద్యమె చేయుచుంటివి విచిత్రము,
    వ్రాయుము దోష హీనమౌ
    హృద్యపు పద్యముల్ మిగుల పృథ్వి
    కవీశ్వరులెల్ల మెచ్చగా
    పద్యము వ్రాయరాద నుచు భర్త పదం
    బుల వ్రాలె పత్నియే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'సూపుచునుండ్రి' టైపాటు.

      తొలగించండి
  9. హృద్యముగ వ్రాయ బూనిన పద్యములను
    మంచి మాటలు శూన్యమై మరపు కలుగె,
    కాలహరణము దేనికి,కలిమి తేని
    పద్యమును వ్రాయవద్దనె భార్య పతిని.

    రిప్లయితొలగించండి
  10. చోద్యమయ్యె నీయోచన జూచు చుండ
    విద్య కలదని సమితికి వెఱ వ కుండ
    వద్యయనుచు సతిపతుల భాషణపయి
    పద్యమును వ్రాయవద్దనె భార్య పతిని

    వద్య = చెప్పదగినది

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    అంత్యప్రాసలు మాత్రల నందిపట్టి
    వచన కైతలు వ్రాసెడి వల్లభుండ
    ఛందమందు నెఱుకలేక సవురుగాని
    పద్యమును వ్రాయవద్దనె భార్య పతిని.

    రిప్లయితొలగించండి
  12. చోద్య మొసంగె నా తలపు జూడగ దాను రచించ యుక్తమౌ
    విద్యను పొంది యుంటినని పెద్దగ గర్వము జూపి దానినే
    వద్యగ నెంచి దంపతుల భాషణ గూర్చి నుతించు చుండి యే
    పద్యము వ్రాయరా దనుచు భర్త పదమ్ముల వ్రాలె పత్నియే

    వద్య = చెప్పదగినది

    రిప్లయితొలగించండి
  13. ఉత్పలమాల:
    హృద్యము లైన పద్యముల సృష్టిని జేసెడి భర్త సాహితీ
    సేద్యము నందు పాల్గొనగ చిత్తము నందొక యాశ గల్గి యా
    విద్యను నాకు నేర్పుమని వేడుచు నొజ్జగ స్వామినెంచి తాన్
    “పద్యము వ్రాయ రాదనుచు భర్త పదమ్ముల వ్రాలె పత్నియే”
    --కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    గద్యమునందు చక్కనగు కైతలు వ్రాయుచు నెల్లవేళలన్
    హృద్యములైన కావ్యముల నిమ్ముగ చాటెడి ప్రాణనాథుడా!
    పద్యములల్లు శాస్త్రమున పండయె సుంతయు లేని నీవిటన్
    పద్యము వ్రాయరాదనుచు భర్తపదమ్ముల వ్రాలె పత్నియే.

    రిప్లయితొలగించండి
  15. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

    కలము బలమును దెలిపెడి కవివి నీవు
    కూర్చు మేదైన కావ్యము గొప్పగాను
    కాని పండిత మెప్పును గాంచలేని
    పద్యమును వ్రాయవద్దనె భార్య పతిని.

    రిప్లయితొలగించండి
  16. నన్నుమించిన సొగసైనవన్నెలాడి
    నీదుపద్యాన దాగుట నిక్కమోయి
    చదువునపుడైన నీర్ష్యనామదిననింపు
    పద్యమును వ్రాయవద్దనె భార్య పతిని

    రిప్లయితొలగించండి
  17. రిప్లయిలు
    1. అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
      'ఇస్తి' అన్నది వ్యావహారికం. "పతకమిచ్చి... త్రాడొసగితి" అందామా?

      తొలగించండి
    2. ధన్యోస్మి....సవరించెద
      తేటగీతి:
      శతక మచ్చు వేసెదనన్న పతక మిచ్చి
      దాని యావిష్కరణ యన్న తాడొసగితి
      కూడు పెట్టని యీ పద్య గోల యేల
      “పద్యమును వ్రాయవద్దనె భార్య పతిని”
      --కటకం వేంకటరామశర్మ.

      తొలగించండి
  18. పద్యమననది హృద్యమై బరగవలయు
    మంచి సందేశమేదేని పంచనట్టి
    పద్యమును వ్రాయనేటికి పరువుచేటు
    పద్యమును వ్రాయవద్దనె భార్య పతిని

    రిప్లయితొలగించండి
  19. హృద్యముగాని పద్యములనేలరచింతువు ప్రాణ నాథుడా!
    పద్యము  వ్రాసి పాఠకుల ప్రాణము తీయగనేటికయ్య నై
    వేద్యము నష్టియంచెరిగి విగ్రహపుష్టిని చూపబోకుమా
    పద్యము వ్రాయరా దనుచు భర్త పదమ్ముల వ్రాలె పత్నియే

    రిప్లయితొలగించండి
  20. ఇదసలు సమస్య కా దేమో!చాలా చోట్ల మొగుళ్లు పద్యాలు రాసుకుంటూ కూర్చుంటే వీళ్ల కేమీ పనీ పాట లేదు,బాధ్యత లేదు అని పెళ్లాలు సాదిస్తూనే ఉంటారు.కాబట్టి దీన్ని యథాతథంగా పూరించేసినా తప్పు కాదు.

    రిప్లయితొలగించండి
  21. ఉ:పద్యము వ్రాయ లేదు సతి,బాగుగ వ్రాయును వ్యాసముల్ కథల్
    పద్యము వ్రాయునట్టి పతి బాగుగ నొక్క సమస్య దీర్చి యా
    పద్యము జెప్పబోయె తన భార్యకు "పద్యము నే వినన్,ప్రభో!
    పద్యము వ్రాయరాదనుచు" భర్తపదమ్ముల వ్రాలె పత్నియే

    రిప్లయితొలగించండి
  22. తే.గీ:నేను వ్రాసెడు కవితలన్ నింద జేసి
    పురుషవిద్వేషి యౌ నొక ముదిత నన్ను
    పద్యమును వ్రాయవద్దనె భార్య పతిని
    బాధ పెట్టెడు వర్ణనల్ వదలు మనియె.

    రిప్లయితొలగించండి
  23. తేటగీతి:
    రసము ఛందము శైలితో రాగ గతిన
    పద్యము పఠించిన కలుగు పరవశంబు
    సారము రసము లేని నిస్సారమైన
    పద్యమును వ్రాయవద్దనె భార్య పతిని

    🌷గొర్రె రాజేందర్ 🌷
    🏡సిద్దిపేట🏘️

    రిప్లయితొలగించండి
  24. పద్యము వ్రాయుయిచ్చగొని భర్త కుటుంబము నెంచ డెప్పుడున్
    సేద్యము జీవనమ్మునిడ చేయడు వృత్తిని చిత్తశుద్ధితో
    హృద్యము వాని పద్యమని హేలగఁ బల్కగ, కూడు బెట్టదీ
    పద్యము వ్రాయరా దనుచు భర్త పదమ్ముల వ్రాలె పత్నియే

    రిప్లయితొలగించండి
  25. తేటగీతి:
    కలము నిలువ వలెను పేద గళము వైపు
    కవన లక్ష్యము హితమునే కలుగచేయు
    పనికి రానిట్టి ప్రభువుల భజన చేసె
    పద్యమును వ్రాయవద్దనె భార్య పతిని

    🌷గొర్రె రాజేందర్🌷
    🏡సిద్దిపేట🏡

    రిప్లయితొలగించండి
  26. ప్రాస యతులను దప్పులు వ్రాయుకతన
    పద్యమును వ్రాయవద్దనె భార్యపతిని
    ఛందమది సరిలేనిచో జదువరాదు
    నడక భిన్నముగను నుండు నాగవేణి!

    రిప్లయితొలగించండి
  27. చేయక ద్రుతాది సంధులు చిత్రముగను
    వాడుచుఁ బర భాషా పదవ్రజము నెల్లఁ
    జొనుపుచు నడుమ వింత నచ్చులు విసంధిఁ
    బద్యమును వ్రాయవద్దనె భార్య పతిని


    మత్యపకార భావము లమానుష రీతి స్ఫరించు నట్టులం
    జోద్యపు శబ్ద దోష తతి చొప్పడ వ్యాకర ణార్థ సంధి వృ
    త్యాద్యవిరామ దోష నిచ యావృత రిక్త పదాలి యుక్తమౌ
    పద్యము వ్రాయరా దనుచు భర్త పదమ్ముల వ్రాలెఁ బత్నియే

    రిప్లయితొలగించండి
  28. పద్యము జూడగా దెలిసె భావము,ఛందము దప్పుగా వుతన్
    బద్యము వ్రాయరాదనుచు భర్త పదమ్ముల వ్రాలె పత్నియే
    పద్యము వ్రాయుచో దగిన ప్రాసయు మైత్రియు కచ్చితంబుగా
    హృద్యమ మౌవిధంబుగను నింపగు నట్లుగ జూడనొప్పగున్

    రిప్లయితొలగించండి
  29. "పద్యము వ్రాయ నంత జనవాహిని మెచ్చుచు పాడగా వలెన్!
    హృద్యముగా రచింప కవితేనియు శోభిలు నాల్గు కాలముల్
    గద్యమె యైన సిద్ధి గొన గల్గునె, యర్థము కాని యట్టిదౌ
    పద్యము వ్రాయ రాద"నుచు భర్త పదమ్ముల వ్రాలె పత్నియే!

    రిప్లయితొలగించండి
  30. సమస్య:
    పద్యమును వ్రాయవద్దనె భార్య పతిని

    నా ప్రయత్నం..

    తే.గీ.
    పద్య రచన నేర్వ దలచి ప్రతిదినంబు
    పనులనన్నిటిని వదలి పాటు పడగ
    కష్టముల భరియించ లేక యొక దినము
    పద్యమును వ్రాయవద్దనె భార్య పతిని

    తే.గీ.
    మంచి భావార్థముల తోడ మధురముగను
    బరులకుపయుక్తమగు రీతి పద్య కవిత
    వ్రాయుమనెడి సూచనల దిరస్కరింప
    పద్యమును వ్రాయ వద్దనె భార్య పతిని

    తిరివీధి శ్రీమన్నారాయణ

    రిప్లయితొలగించండి
  31. విద్యల రాణి వాణికి నివేదనగా మదినెంచి శ్రద్ధగా
    సద్యశ కారకంబులగు చక్కని పద్యములల్లగాదగున్
    మద్యపు మత్తులోన మతిమాలిన మాటల మేళనంబుగా
    పద్యము వ్రాయరా దనుచు భర్త పదమ్ముల వ్రాలె పత్నియే

    రిప్లయితొలగించండి