31, మే 2022, మంగళవారం

సమస్య - 4096

 1-6-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చరణము పద్మాకరమున జారిన శుభమౌ”
(లేదా...)
“భద్రమ్మౌ వడి జాఱ శ్రీచరణముల్ పద్మాకరమ్మందునన్”
(శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి సంచాలకత్వంలో తిరుపతిలో జరుగుతున్న               శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారి శతావధానంలో ఇచ్చిన సమస్య)

28 కామెంట్‌లు:

  1. పురజనులు రక్షణ నిడిరి
    చరణము పద్మాకరమున జారిన , శుభమౌ
    మరువక వారె ల్లరకును
    త్వరితముగ బహుమతు లీయ , దగు విధమదియే

    రిప్లయితొలగించండి
  2. కందం
    సరసనఁ గొని శ్రీకృష్ణుడు
    తరుణిని దాటింపనెంచి తడుముచు నడుమున్
    గరమునఁ జుట్టినఁ, గలికికిఁ
    జరణము పద్మాకరమున జారిన శుభమౌ!

    శార్దూలవిక్రీడితము
    చిద్రూపుండగు కృష్ణమూర్తి సరసన్ జెల్వారుచున్ గోపికే
    ముద్రారాజితు చేయిచుట్ట నడుమున్ మున్ముందుకున్ సాగుచున్
    నిద్రాణమ్ముగ నుండుకోర్కెలెగయన్ నింపారనిట్లించెనే
    భద్రమ్మౌ వడి జాఱ శ్రీచరణముల్ పద్మాకరమ్మందునన్!

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. కందం
    మరిమరి జెప్పుట చర్విత
    చరణము, పద్మాకరమున జారిన శుభమౌ
    శిరము మునుగంగ స్నానము
    తిరుమల కోనేటి యందు తీరుగ జేయన్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి

    రిప్లయితొలగించండి
  5. మురియగనవధానియునట
    కరిభంగినిహుంకరించికవితలఁజెప్పెన్
    అరవిరిసెజనులముఖములు
    చరణముపద్మాకరమునజారినశుభమౌ

    రిప్లయితొలగించండి

  6. సరసమున నీదు లాటన
    పరిణేష్ఠియె వాడట కుటపమ్ములు ప్రియమౌ
    పరిగృహ్యకివ్వ నెంచిన
    చరణము పద్మాకరమున జారిన శుభమౌ

    రిప్లయితొలగించండి
  7. నిరతము వీడక చేయుచు
    స్మరణమునవవిధభకుతులచక్కగమదిలో
    సరసిజనాభుని కీర్తన
    *“చరణము పద్మాకరమున జారిన శుభమౌ”*

    రిప్లయితొలగించండి
  8. ఛిద్రంబాయెగపార్వతీతపమపపోచేరంగశంభుండునున్
    విద్రోహంబునమాటకారిగనగావీడంగవేషంబుసౌ
    భద్రంబేయికభావజుండునహహాభావింపశోభాంగుడై
    భద్రంమ్మౌవడిజాఱశ్రీచరణముల్పద్మాకరమ్మందునన్

    రిప్లయితొలగించండి
  9. తరుణము సంధ్యా సమయము
    స్మరణము గోపాలబాలు సాన్నిధ్యంబా
    పరవశమున గోపస్త్రీ
    చరణము పద్మాకరమున జారిన శుభమౌ

    రిప్లయితొలగించండి

  10. నిద్రావస్థన యుంటివో? తెలియదే నీస్నేహితున్ శక్తియే
    భద్రా! శోకమదేల మానుమిక నీ పైరమ్ములన్ బ్రోవగా
    చిద్రూపుండగు కృష్ణుడే మడుగునన్ జేరెన్ గదా! యాలకున్
    భద్రమ్మౌ వడి జాఱ శ్రీచరణముల్ పద్మాకరమ్మందునన్

    రిప్లయితొలగించండి
  11. వరపద్య చరణతతులే
    వరుసగ నవధాన సరసి బళిరా!జారన్
    మురియుచు సభ్యులు పల్కిరి
    *చరణము పద్మాకరమున జారిన శుభమౌ.*

    రిప్లయితొలగించండి
  12. పరపున పూరించినదౌ
    చరణము పద్మాకరమున జారిన శుభమౌ
    విరుపుల మెరుపుల పొరపున
    సరియగు శబ్దపు పొలుపున సరసాన్వితమౌ

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. రౌద్రాకారతనుండు మత్స్య ములు నౌరా!ఘోరమౌ నంబుధిన్
      భద్రేభంబుల పట్టిలాగు మొసళుల్ బాధించుగా, నెవ్విధిన్
      భద్రమ్మౌ ?వడి జాఱ;శ్రీచరణముల్ పద్మాకరమ్మందున్
      భద్రంబౌ జలజంబులట్లుగను శోభంగూర్చునెల్లప్పుడున్.

      తొలగించండి
  14. అరమరికలేని మనమున
    విరజాజుల మాల తోడ వేంకట పతినిన్
    హరిహర యనుచును బలికెడు
    చరణము పద్మాకరమున జారిన శుభమౌ

    రిప్లయితొలగించండి
  15. భద్రా!నిండుమ నంబు తోడను నికన్ భారంబు గానెంచకన్
    నిద్రామత్తుడ వైచ రింపక రతిన్ నెమ్మోముహర్షంబుగా
    చిద్రూపుండగు రుక్మి ణీపతికి జే జేలంచు గీర్తించగా
    భద్రమ్మౌ వడి జాఱ శ్రీచరణముల్ పద్మాకరమ్మందునన్”

    రిప్లయితొలగించండి
  16. సిరిపతి పదమును పడవగ
    'హరి-హరి' ద్వయమును ఖజముగ నలవిని భవమున్
    తరియించగ హరి మంత్రో
    చ్చరణము పద్మాకరమున జారిన శుభమౌ

    రిప్లయితొలగించండి
  17. వరదుని గొలుచుట గు సదా
    చరణము :పద్మాకరమున జారుట శుభమౌ
    తిరముగ మునకలు వేసియు
    మురహరి ధ్యానించు టొప్పు పొల్పగు రీతిన్

    రిప్లయితొలగించండి

  18. సురభుల మ్రింగెడు సర్పము
    సరసున గలదోయి దాని సంహారముకై
    సరుగున నడువగ కృష్ణుని
    చరణము పద్మాకరమున జారిన శుభమౌ.

    రిప్లయితొలగించండి
  19. చిద్రూపుండు సనాతనుండు హరియేశ్రీకృష్ణుడై ద్వాపరన్
    భద్రంబున్ సమకూర్చె గోవులకు గోపాలుండుగా, గోపకుల్
    ఛిద్రంబవ్వగ కాళియున్ విషముతో చింతించి రేరీతిగా
    భద్రమ్మౌ వడి జాఱ శ్రీచరణముల్పద్మాకర మ్మందునన్?

    రిప్లయితొలగించండి
  20. కం:కరముల జలమును పద్మా
    కరమున విడువంగ సంధ్య కాలము శుభమౌ
    పరము కొరకు దుష్కర్మా
    చరణము పద్మాకరమున జారిన శుభమౌ

    రిప్లయితొలగించండి
  21. శా:"భద్ర"మ్మంచు యశోద పల్కినను దా పర్వెత్త గృష్ణుండహో
    నిద్రన్ మాని యశోద పల్కు "నిక వీనిన్ జారకే పట్టుటా!
    భద్రమ్మౌ వడి జార శ్రీ చరణముల్, పద్మాకర మ్మందునన్
    చిద్రూపమ్మగు చంద్రబింబ మటులన్ జేకొందు ముద్దాడుచున్".
    (యశోద "పరుగెత్త వద్దు భద్రం "అంటున్నా చిన్న కృష్ణుడు పరుగెత్తుతాడు.వీణ్ని జారకుండా పట్టుకోవటం నా వల్ల కాదు.పడేవా డేదో నా వడి లోనే పడితే పద్మాకరం లో చంద్రబింబం పడినట్లు సంతోషించి ఆ పాదాలు ముద్దెట్టుకుంటాను"అనుకుంటోంది యశోద.)

    రిప్లయితొలగించండి
  22. తేటగీతి
    రామ!శ్రీరామ!జగదభిరామ!యంచు
    సన్నుతించగ నిరతంబు శరణు నొసఁగు
    రామ*చరణము;పద్మాకరమున జాఱి
    న,శుభమౌ* రవికిరణము నలినమునకు.

    రిప్లయితొలగించండి
  23. మరణమునకు కారణమగు
    చరణము పద్మాకరమున జారిన; శుభమౌ
    త్వరణమును వీడి పర్యా
    వరణము గని మసలుకొనెడి వారలకెపుడున్

    రిప్లయితొలగించండి
  24. Modified poem.
    శా:"భద్ర"మ్మంచు యశోద పల్కినను దా పర్వెత్త గృష్ణుండహో
    నిద్రన్ మాని యశోద పల్కు "నిక వీనిన్ జారకే పట్టుటా!
    భద్రమ్మౌ వడి జార శ్రీ చరణముల్, పద్మాకర మ్మందునన్
    చిద్రూపమ్మగు చంద్రబింబ మటులన్ , చిత్రమ్ముగా నా యొడిన్ )

    రిప్లయితొలగించండి
  25. అరి రాజు లణఁగి వేగమ
    మరలిన నస్త్రములు వీడి మౌనము తోడం
    దరుణు లడరి నోములు నోఁ
    చ రణము పద్మాకరమున జాఱిన శుభమౌ

    భద్రాభ్రాసన మందు రత్న రుచులన్ భాసిల్ల నాసీనవై
    క్షుద్రాలోచన లెల్ల వీడి నిలు నిశ్శోకంబ రాజిల్లె రా
    జద్రాకేందు నిభాస్య! యాస్తరము విస్తారమ్ముగా మెత్తగా
    భద్రమ్మౌ వడి జాఱ శ్రీచరణముల్ పద్మా! కర మ్మందునన్

    [కరమ్ము = అధికమ్ముగ; అందునన్ = అందులో]

    రిప్లయితొలగించండి