6, ఆగస్టు 2022, శనివారం

సమస్య - 4155

7-8-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అపశబ్దము లున్న పద్య మానంద మిడున్”
(లేదా...)
“అపశబ్దంబులు గల్గు పద్యము లమందానందమున్ గూర్చెడిన్”

19 కామెంట్‌లు:

  1. కందం
    నిపుణతఁ గల్గుచు భావ
    మ్ముపయుక్తమునౌచు శిల్పమున్నతమనఁగా
    నపురూపమ్ముగఁ, దొలగఁగ
    నపశబ్ధములున్న, పద్యమానందమిడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్తేభవిక్రీడితము
      నిపుణత్వంబది దీప్తమైమిగుల సంధింపంగ భావంబునం
      దుపయుక్తమ్మగు భాషయున్ బుధులు ధీయుక్తంబనన్ శిల్పమం
      దపురూపత్వము నింపునింప, గనఁగానందెక్కడన్ లేనివై
      యపశబ్దంబులు, గల్గు పద్యములమందానందమున్ గూర్చెడిన్

      తొలగించండి

  2. నిపుణత పొందుటకొరకై
    కపటము లెరుగని బుడతలు కలమున్ ధరియిం
    చి పలువిధాలుగ వ్రాసిన
    నపశబ్దము లున్న, పద్య మానంద మిడున్.

    రిప్లయితొలగించండి
  3. నిపుణతఁ దొలగం జేయును
    నపశబ్దము లున్న పద్య మా,నంద మిడున్
    సఫలతయు నిచ్చు కవులకు
    నపశబ్దములేనిపద్య మాదర మొసగున్

    రిప్లయితొలగించండి

  4. కపటమ్మించుకలేని బాలుడట సత్కావ్యమ్ము నే వ్రాయగా
    నిపుణత్వమ్మును పొందగోరి కవిసాన్నిధ్యమ్ము నేగోరుటే
    యపరాధమ్మని యెంచబోడెవడదే యత్నమ్మునే మెత్తు రా
    యపశబ్దంబులు గల్గు పద్యము లమందానందమున్ గూర్చెడిన్.

    రిప్లయితొలగించండి
  5. విపరీతంబగు మాటలేల కవిరాడ్విఖ్యాత కావ్యంబులో
    నపశబ్దంబులు గల్గు పద్యము లమందానందమున్ గూర్చెడిన్?
    నిపుణత్వంబున గావ్యముండవలదే, నిష్ఠా బలప్రజ్ఞతో
    నపవర్గంబును జేఱవచ్చు కవి, తా నాహ్లాదచిత్తంబునన్.

    రిప్లయితొలగించండి
  6. ఇపుడిపుడె నేర్చి , వ్రాయగ
    నుపక్రమించుచు రచించె నొప్పని రీతిన్
    నెపమెంచకుండ విడువగ
    నపశబ్దములున్న పద్య మానంద మిడున్

    రిప్లయితొలగించండి
  7. కందము
    అపకీర్తియె పద్యములో
    *నపశబ్దములున్న;పద్యమానందమిడున్*
    అపురూపమైన పదముల
    విపులార్థముతోడ వ్రాయ వినువారలకున్.

    రిప్లయితొలగించండి
  8. విపరీతపు కోర్కె కలిగి
    కపటము లేని విధ ము నను కవి యగు కొఱకై
    తపియించి వ్రాయ నతనికి
    నప శబ్దము లున్న పద్య మానంద మిడున్

    రిప్లయితొలగించండి
  9. కపటత్వము తెగటాఱుచు
    సుపరిచితకవులు రచించి చూపెడు విధమున్
    విపరీతంబౌ శ్లేషయు
    నపశబ్దము లున్న పద్య మానంద మిడున్

    రిప్లయితొలగించండి
  10. అపవర్గంబును ద్రోసిరాజనును నాయావ్రాతలేనాటికిన్
    నపశబ్దంబులు గల్గు పద్యము ల,మందానందమున్ గూర్చెడిన్
    సఫలం బిచ్చును నాయువుం బెరుగు నాశాజ్యోతి వెల్గొందు ,నా
    యపశబ్దంబులు లేనిచోభువిని నాత్మానందమొందున్సుమా

    రిప్లయితొలగించండి
  11. ఉపమానములను గూర్చుచు
    నుపమేయపు వైభవమ్ము నుట్టంకించన్
    సుపదాన్వితమై, దొరలని
    యపశబ్దము లున్న పద్య మానంద మిడున్

    రిప్లయితొలగించండి
  12. మత్తేభము
    తపమేయియ్యది నేర్వకున్న నకటా!తథ్యంబుగా నెన్నియో
    *యపశబ్దంబులు గల్గు;పద్యములమందానందముంగూర్చెడిన్*
    అపురూపంబగు శబ్దగుంఫనలనాయాపట్టులన్ రమ్యమౌ
    ఉపమా శ్లేషలలంకృతుల్ రసములెన్నోయొప్ప కావ్యంబునన్.

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. అపశృతుల నిడును పాడగ
      నపశబ్దము లున్న; పద్య మానంద మిడున్
      యుపయుక్తంబౌ శోభిత
      సుపదములవి యుండిన విన సొంపగు రీతిన్

      తొలగించండి
  14. కందం
    ఉపమానముతో వ్రాసిన
    విపరీత పదముల కూర్పు వింతగ సభలో
    టపటప నాశువు జెప్పిన
    అపశబ్దము లున్న పద్య మానంద మిడున్
    ప్రబల వేంకట సుబ్రమణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  15. సుపదంబుల్దనరార పద్యములలో శోభాయమానంబుగా
    నుపమానంబులు వర్ణనల్సలుపుచున్ యుక్తంపు భావంబులన్
    నిపుణత్వంబుగఁ నేర్చికూర్చి పదముల్, నీమంబుగా వేయకన్
    అపశబ్దంబులు, గల్గు పద్యము లమందానందమున్ గూర్చెడిన్

    రిప్లయితొలగించండి
  16. సు పరిచిత మెల్లరకును ద
    న పనితనం బింపుగాఁ దనర సమయం బం
    చెపుడైనఁ బరిష్కర్తకు
    నపశబ్దము లున్న పద్య మానంద మిడున్


    విపరీతమ్ములు గావు దోషము లహో విశ్వంబులో నెవ్వ రే
    ని పరీక్షింపఁ గవీంద్ర కావ్యముల సందేహమ్ము శూన్యంబు సూ
    తపనీయ ద్యుతి వెల్గు నట్టి కవి రాడ్ధౌత ప్రమాదస్ధ వా
    గపశబ్దంబులు గల్గు పద్యము లమం దానందముం గూర్చెడిన్

    రిప్లయితొలగించండి
  17. అపుడేవారించవలయు
    నపశబ్దములున్న, పద్యమానందమిడున్
    నిపుణతగలకవులరచన
    లపురూపముగానుచదువననపరతంబున్

    రిప్లయితొలగించండి