6, ఆగస్టు 2022, శనివారం

సమస్య - 4155

7-8-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అపశబ్దము లున్న పద్య మానంద మిడున్”
(లేదా...)
“అపశబ్దంబులు గల్గు పద్యము లమందానందమున్ గూర్చెడిన్”

19 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
నిపుణతఁ గల్గుచు భావ
మ్ముపయుక్తమునౌచు శిల్పమున్నతమనఁగా
నపురూపమ్ముగఁ, దొలగఁగ
నపశబ్ధములున్న, పద్యమానందమిడున్

విరించి చెప్పారు...


నిపుణత పొందుటకొరకై
కపటము లెరుగని బుడతలు కలమున్ ధరియిం
చి పలువిధాలుగ వ్రాసిన
నపశబ్దము లున్న, పద్య మానంద మిడున్.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

మత్తేభవిక్రీడితము
నిపుణత్వంబది దీప్తమైమిగుల సంధింపంగ భావంబునం
దుపయుక్తమ్మగు భాషయున్ బుధులు ధీయుక్తంబనన్ శిల్పమం
దపురూపత్వము నింపునింప, గనఁగానందెక్కడన్ లేనివై
యపశబ్దంబులు, గల్గు పద్యములమందానందమున్ గూర్చెడిన్

subbarao చెప్పారు...

నిపుణతఁ దొలగం జేయును
నపశబ్దము లున్న పద్య మా,నంద మిడున్
సఫలతయు నిచ్చు కవులకు
నపశబ్దములేనిపద్య మాదర మొసగున్

విరించి చెప్పారు...


కపటమ్మించుకలేని బాలుడట సత్కావ్యమ్ము నే వ్రాయగా
నిపుణత్వమ్మును పొందగోరి కవిసాన్నిధ్యమ్ము నేగోరుటే
యపరాధమ్మని యెంచబోడెవడదే యత్నమ్మునే మెత్తు రా
యపశబ్దంబులు గల్గు పద్యము లమందానందమున్ గూర్చెడిన్.

Yajnesh చెప్పారు...

విపరీతంబగు మాటలేల కవిరాడ్విఖ్యాత కావ్యంబులో
నపశబ్దంబులు గల్గు పద్యము లమందానందమున్ గూర్చెడిన్?
నిపుణత్వంబున గావ్యముండవలదే, నిష్ఠా బలప్రజ్ఞతో
నపవర్గంబును జేఱవచ్చు కవి, తా నాహ్లాదచిత్తంబునన్.

sitharamayya solasa చెప్పారు...

ఇపుడిపుడె నేర్చి , వ్రాయగ
నుపక్రమించుచు రచించె నొప్పని రీతిన్
నెపమెంచకుండ విడువగ
నపశబ్దములున్న పద్య మానంద మిడున్

Rama Murthy Duvvuri చెప్పారు...

కందము
అపకీర్తియె పద్యములో
*నపశబ్దములున్న;పద్యమానందమిడున్*
అపురూపమైన పదముల
విపులార్థముతోడ వ్రాయ వినువారలకున్.

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

విపరీతపు కోర్కె కలిగి
కపటము లేని విధ ము నను కవి యగు కొఱకై
తపియించి వ్రాయ నతనికి
నప శబ్దము లున్న పద్య మానంద మిడున్

M.B.G.TILAK చెప్పారు...

కపటత్వము తెగటాఱుచు
సుపరిచితకవులు రచించి చూపెడు విధమున్
విపరీతంబౌ శ్లేషయు
నపశబ్దము లున్న పద్య మానంద మిడున్

subbarao చెప్పారు...

అపవర్గంబును ద్రోసిరాజనును నాయావ్రాతలేనాటికిన్
నపశబ్దంబులు గల్గు పద్యము ల,మందానందమున్ గూర్చెడిన్
సఫలం బిచ్చును నాయువుం బెరుగు నాశాజ్యోతి వెల్గొందు ,నా
యపశబ్దంబులు లేనిచోభువిని నాత్మానందమొందున్సుమా

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఉపమానములను గూర్చుచు
నుపమేయపు వైభవమ్ము నుట్టంకించన్
సుపదాన్వితమై, దొరలని
యపశబ్దము లున్న పద్య మానంద మిడున్

Rama Murthy Duvvuri చెప్పారు...

మత్తేభము
తపమేయియ్యది నేర్వకున్న నకటా!తథ్యంబుగా నెన్నియో
*యపశబ్దంబులు గల్గు;పద్యములమందానందముంగూర్చెడిన్*
అపురూపంబగు శబ్దగుంఫనలనాయాపట్టులన్ రమ్యమౌ
ఉపమా శ్లేషలలంకృతుల్ రసములెన్నోయొప్ప కావ్యంబునన్.

Siva Prasad Chavali చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Siva Prasad Chavali చెప్పారు...

అపశృతుల నిడును పాడగ
నపశబ్దము లున్న; పద్య మానంద మిడున్
యుపయుక్తంబౌ శోభిత
సుపదములవి యుండిన విన సొంపగు రీతిన్

sarada చెప్పారు...

కందం
ఉపమానముతో వ్రాసిన
విపరీత పదముల కూర్పు వింతగ సభలో
టపటప నాశువు జెప్పిన
అపశబ్దము లున్న పద్య మానంద మిడున్
ప్రబల వేంకట సుబ్రమణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

సుపదంబుల్దనరార పద్యములలో శోభాయమానంబుగా
నుపమానంబులు వర్ణనల్సలుపుచున్ యుక్తంపు భావంబులన్
నిపుణత్వంబుగఁ నేర్చికూర్చి పదముల్, నీమంబుగా వేయకన్
అపశబ్దంబులు, గల్గు పద్యము లమందానందమున్ గూర్చెడిన్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

సు పరిచిత మెల్లరకును ద
న పనితనం బింపుగాఁ దనర సమయం బం
చెపుడైనఁ బరిష్కర్తకు
నపశబ్దము లున్న పద్య మానంద మిడున్


విపరీతమ్ములు గావు దోషము లహో విశ్వంబులో నెవ్వ రే
ని పరీక్షింపఁ గవీంద్ర కావ్యముల సందేహమ్ము శూన్యంబు సూ
తపనీయ ద్యుతి వెల్గు నట్టి కవి రాడ్ధౌత ప్రమాదస్ధ వా
గపశబ్దంబులు గల్గు పద్యము లమం దానందముం గూర్చెడిన్

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

అపుడేవారించవలయు
నపశబ్దములున్న, పద్యమానందమిడున్
నిపుణతగలకవులరచన
లపురూపముగానుచదువననపరతంబున్