1, అక్టోబర్ 2022, శనివారం

సమస్య - 4206

2-10-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కామ మదముల రిపులుగాఁ గాంచ నగునె”
(లేదా...)
“కామక్రోధమదాదులన్ రిపులుగాఁ గాంచంగ న్యాయంబొకో”

15 కామెంట్‌లు:

Rama Murthy Duvvuri చెప్పారు...

ఆటవెలది
అరరె!మనిషిలోన స్థిరముగా నున్నట్టి
క్రోధ మరియు పరమ లోభ మోహ
మత్సరములు* కామ మదముల రిపులుగా
కాంచనగు, నె*రింగి త్రుంచ వలయు.

M.B.G.TILAK చెప్పారు...

మోక్ష మార్గమున్ బయనించి ముక్తి నొంద
కామి కానివాడిటమోక్ష కామి కాడు
బాధ్యతగలసంసారికి బాటలైన
కామ మదముల రిపులుగాఁ గాంచ నగునె

విరించి చెప్పారు...


*(రావణుడు సీతతో పలికిన మాటలుగా)*

దాన వాగ్రజుడను గాదె తన్వి నన్ను
ధర్మ భ్రష్టుడ ననుచును తలచ నేల
భోగముల్ గోరు వారెల్ల భూటులేను
కామ మదముల, రిపులుగాఁ గాంచ నగునె.

seethadevi gurram చెప్పారు...

శ్రీకృష్ణుడు రాయబారఘట్టంలో దుర్యోధనునితో

నీమంబెంచక వారి భాగమును దుర్నీతిన్ గ్రహింపంగ నా
ధీమంతుండగు ధర్మజుండు తనయుద్రేకంబు
ద్రోపాడుచున్
గ్రామంబుల్ కడకైదు గోర పెను సంగ్రామంబు
వారింపగా
నేమాత్రంబును జాలిలేక మదిలో నీచుండవై వారలన్,
కామక్రోధ మదాదులన్, రిపులుగా గాంచంగ న్యాయంబొకో

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

సాత్వికంబుగ చరియించు సజ్జనుండు
తలచ వలె తాను సతతంబు ధరణి యందు
కామ మదముల రిపులుగా :గాంచ నగునె
వాటి నత్యంత ముఖ్యమై వసుధ యందు?

sitharamayya solasa చెప్పారు...

ఖలుడనుచు సమాజమునందు ఖ్యాతినొంద
కామ మదముల రిపులుగాఁ గాంచ నగునె
వానికవియె భూషణములు పద్ధతిగను
విడిచిపెట్ట నతని వాసి వీగిపోవు

Subbarao Ayyalasomayajula చెప్పారు...

శా.

సోమమ్మున్ బడయంగ నీశ్వరునిచే శూరుండు పౌలస్త్యుడున్
బోమున్ జేసెను పుంజికస్థల నటన్ భూతాత్ము శాపమ్ముగా
మీమాంసించక సీతఁ గొల్లగొనగా మృత్యున్ బ్రసంగమ్ముగన్
*కామక్రోధమదాదులన్ రిపులుగాఁ గాంచంగ న్యాయంబొకో.*

Rama Murthy Duvvuri చెప్పారు...

శార్దూలము
ధీమంతుల్ గురువుల్ జితేంద్రియులు ఖ్యాతింగాంచరే సజ్జనుల్
*కామక్రోధ మదాదులన్ రిపులుగా గాంచంగ;న్యాయంబొకో*
కామాంధత్వముతో చరించుటలహో!కారుణ్యముంజూపకే
నీమంబుల్ విడనాడి యక్కటకటా!నీచాత్ములై పోవుటల్.

విరించి చెప్పారు...



*(రావణుడు సీతతో పలికిన మాటలుగా)*


కోమా! నేనిల ధర్మశాస్త్రముల సాంగోపాంగమున్ నేర్చితిన్
గామంబన్నది చూడ శాస్త్రమది సత్కార్యమ్మదే వీరు లీ
భూమిన్ భూషణమంచు నెంచెదరుగా భోగార్థులై పొందుగన్
కామక్రోధమదాదులన్ , రిపులుగాఁ గాంచంగ న్యాయంబొకో.

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

అంతరంగమ్ము నెలవుగా నాశ్రయించి
యారడినిబెట్ట మనజులం దణగియుండు
కామ మదముల రిపులుగాఁ గాంచ నగు, నె
వరికయిన నివియె వినాశకరము గాన

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
కోరి తినకూడనివి తిని కుక్షినింపి
దుష్టసంగతి నొనగూడ నష్టములును
క్రోధ లోభ మాత్సర్య మోహాధిపతులు
కామ మదముల రిపులుగాఁ గాంచ నగునె?

శార్దూలవిక్రీడితము
నీమంబెంచక మెక్కి కూడనివి యెంతేన్ దుష్టసంఘమ్మునన్
బ్రాముఖ్యమ్మును గోలుపోవు కతనన్ బాయంగ సర్వార్థముల్
సేమమ్ముల్ గడుదూరమై కడపటన్ జింతించి దుష్కర్మకున్
గామక్రోధమదాదులన్ రిపులుగాఁ గాంచంగ న్యాయంబొకో?

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

హయ ఖరమ్ము లొక్క విధము లగునె యెన్నఁ
గరము దుఃఖ దాయకములు గాక నిత్య
మానదమ్ములు ధర్మ సమ్మతము లైన
కామ మదముల రిపులుగాఁ గాంచ నగునె

భీ మాకారము నూనఁ జిత్తముల నుద్వేగమ్ము ఘోరమ్ము కా
నీ మర్త్యాలినిఁ జేయు మూర్ఖులుగ లే రెవ్వారు నాపంగ నీ
వీ మాటల్ కడుఁ జక్కఁగా నుడివితే యీరీతి నిక్కంబుగాఁ
గామ క్రోధ మదాదులన్ రిపులుగాఁ గాంచంగ న్యాయం బొకో

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

కోమలీవినునామాటకూర్మి తోడ
ప్రకృతి పురుషుల కలయిక వసుధ యందు
మూల మీసృష్టికండ్రువిబుధులు గాన
కామ మదముల రిపులుగా గాంచ నగునె

Koninty Ramesh చెప్పారు...

గొప్పవాడుగ వెలుగొందు కోర్కె గలిగి
సాధననుజేసి సాధించు శౌర్యముగల
కార్యశూరుని కూతమౌ గాననట్టి
" కామ మదముల రిపులుగా గాంచనగునె"

Koninty Ramesh చెప్పారు...

ధీమంతుండగుచున్ స్వశక్తి నెదుగన్ ధ్యేయమ్ము నూహించియున్
శ్రీమంతంబునుపొందగోరి శ్రమచే జీవించు కర్మిష్ఠునిన్
యేమాత్రమ్మును సంశయించ కతనిన్ యీరీతి నిందించి యా
" కామక్రోధమదాదులన్ రిపులుగా గాంచంగన్యాయంబొకో "