5, అక్టోబర్ 2022, బుధవారం

సమస్య - 4209

6-10-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సంధ్యావందనము విడువ స్వర్గము దక్కున్”
(లేదా...)
“సంధ్యావందన మిచ్చగింపరు బుధుల్ స్వర్లోకసౌఖ్యార్థులై”

22 కామెంట్‌లు:

Rama Murthy Duvvuri చెప్పారు...

కందము
సంధ్యల నిత్యముఁజేయుము
సంధ్యావందనము, విడువ స్వర్గము;దక్కున్
వంద్యుఁడ!విప్రుఁడ!మోక్షం
బాంధ్యంబును తొలగిపోవు హరిఁజేరంగన్.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
సంధ్యను సాయంవేళల
సంధ్యాదేవిని భజింప జ్ఞానమ్మబ్బున్
వంధ్యపు కర్మలఁ, జేయగ
సంధ్యావందనము, విడువ స్వర్గము దక్కున్

శార్దూలవిక్రీడితము
సంధ్యన్గాంచఁగ భక్తిభావములవే సాయంత్రముప్పొంగెడున్
సంధ్యాదేవి సరస్వతీ జనని విశ్వాసమ్మునన్ బ్రోచెడున్
వంధ్యమ్మౌ గతి కర్మలన్ నెరుపుటల్, భక్త్యాత్ములై చేయగన్
సంధ్యావందనమి,చ్చగింపరు బుధుల్ స్వర్లోకసౌఖ్యార్థులై

seethadevi gurram చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విరించి చెప్పారు...


సంధ్యను మానుమటంచును
జంద్యము తొలగించమంచు జగడము లేలా
వింధ్యా! మోక్షార్థి కిలను
సంధ్యావందనము విడువ స్వర్గము దక్కున్?

seethadevi gurram చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
seethadevi gurram చెప్పారు...

వరూధిని ప్రవరునితో

మాంద్యము వీడుము జడుడా!
వంద్యాంగన నిన్నుగోర వలదన దగునే
నింద్యము గాదది విప్రుడ
సంధ్యా వందనమును విడువ స్వర్గము దక్కున్

subbarao చెప్పారు...

సంధ్యను వార్చగ వలయును
సంధ్యా కాలంబులందు సన్మతి తోడన్
సంధ్యా వందన మిదియే
సంధ్యావందనము విడువ స్వర్గము దక్కున్?

విరించి చెప్పారు...


జంద్యమ్మున్ ధరియించు వారలిలన్ శ్రద్ధన్ ద్రిపర్యాయముల్
సంధ్యావందనమాచరింతురు కదా సద్భక్తితో నిత్యమున్
సంధ్యా! నేమము వీడబోరెపుడు దిష్టమ్మే విలంబించెడిన్
సంధ్యావందన మిచ్చగింపరు బుధుల్ స్వర్లోకసౌఖ్యార్థులై.

Rama Murthy Duvvuri చెప్పారు...

శార్దూలము
ఆంధ్యంబందున నుండిపోయి యకటా!యా నాస్తిక బ్రాహ్మణుల్
సంధ్యావందనమిచ్చగింపరు;బుధుల్ స్వర్లోక సౌఖ్యార్థులై
సంధ్యాదేవినిఁగొల్చిమోక్షపదమున్ సాధించగా నెంచరే!
సంధ్యాతంబిదివిప్రకోటికినిశిష్టాచారమార్గంబగున్

M.B.G.TILAK చెప్పారు...

వింధ్యాచల పరిసరముల
వంద్యుల దర్శనమునొంది వందనమేలన్
జంధ్యాల హాస్యము గనిన
సంధ్యా!వందనము విడువ స్వర్గము దక్కున్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

సంధ్యావందనమననది
వంద్యంబని వేదవిహిత ప్రక్రియయని నీ
వింధ్యను విడువకు సఖుడా
సంధ్యావందనము విడువ స్వర్గము దక్కున్

sitharamayya solasa చెప్పారు...

సంధ్యల నడి ఖలముడుగదు
సంధ్యావందనము విడువ, స్వర్గము దక్కున్
సంధ్యోపాసన జరుపగ
సంధ్యావందన మొసగును స్వాస్థ్యము కూడన్

subbarao చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
subbarao చెప్పారు...

సంధ్యావందన మిచ్చగింపరు బుధుల్ స్వర్లోకసౌఖ్యార్థులై
సంధ్యావందన మాచరించఁదగు నా సంధ్యన్ శుభాకారులై
సంధ్యన్ వార్చిన సూర్య దేవుఁడు గడున్ సంతోష మగ్నుండు నై
దధ్యంబౌ విధ మిచ్చు సుస్థత నికన్ దార్ఢ్యంబు సౌఖ్యంబునున్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

వంద్యంబౌ సురలోక సౌఖ్యములు నీవొందంగ నిచ్చోటనే
సంధ్యావందనమాది సువ్రతములన్ సల్పంగ నింకేటికిన్,
నింద్యంబెట్టులగున్, సుఖంబులొదవన్ నిత్యంబులై యీభువిన్
సంధ్యావందన మిచ్చగింపరు బుధుల్ స్వర్లోక సౌఖ్యార్థులై

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

సంధ్యా సమయము నందున
సంధ్యా వందనము సలుప సార్థక్య మగున్
నింద్యo బగు నంద్రె టు లన్
సంధ్యా వందనము విడువ స్వర్గము దక్కున్?

Subbarao Ayyalasomayajula చెప్పారు...

*దేవీ భాగవతంలో 9వ స్కంధములో, శ్రీహరి నారద మహర్షికి కలియుగ లక్షణములను వివరించు అంశం ఆధారంగా, నా ప్రయత్నం ఇలా.....*

శా.

సంధ్యాకాలములిట్లు మూడు దినమున్ సత్బ్రాహ్మణుల్ గొల్వగన్
వింధ్యాద్రిన్ గనగా నగస్త్యుడు పసన్ విఖ్యాతిఁ బోగొట్టెనే
*సంధ్యావందన మిచ్చగింపరు బుధుల్ స్వర్లోక సౌఖ్యార్థులై*
సంధ్యన్ వార్చఁ గలిన్ వ్యళీక, హరిచే సంబుద్ధి, మౌనిన్ రహిన్.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

మాంద్యము కలుగును నరునకు
సంధ్యావందనము విడువ: స్వర్గము దక్కున్
సంధ్యను వార్చుచునుండిన
వంద్యుండగుననుటనిజము వసుధా స్థలిలో

Koninty Ramesh చెప్పారు...

సంధ్యల మరువని దేమిటి ?
ఆంధ్యము మూర్ఖుల కలయిక యనుచున్ వారిన్‌ ?
సంధ్యావాటిని గొలిచిన ?
" సంధ్యా వందనము, విడువ, స్వర్గము దక్కున్"

Koninty Ramesh చెప్పారు...

వంధ్యమంచునుపండితుల్‌ పలుకుచున్ పాటించరీనేలపై
సంధ్యారాముని గొల్వ బోరు జడులై సంస్కృతి బాటించరే?
వింధ్యావాసిని పూజలన్ విడువకన్ ప్రెబ్బొత్తిచే జూతురే?
“సంధ్యావందన మిచ్చగింపరు, బుధుల్ స్వర్లోకసౌఖ్యార్థులై”

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

వంధ్యం బెందుల కగు నా
వింధ్యాచలమున కరిగిన వీడను భక్తిన్
సంధ్యా విను నే నెన్నఁడు
సంధ్యావందనము విడువ స్వర్గము దక్కున్

ఆంధ్యాచారము లేల నిర్మలపుఁ జిత్తౌన్నత్యమే లేనిచో
వంధ్యా క్షేత్రము భంగి నిష్ఫలములౌ పాపాత్ము పూజావళుల్
కంధ్యాత్మోద్భవ నాథునిం గొలువ శ్రీకాంతున్ ధరం జాలదే
సంధ్యావందన మిచ్చగింపరు బుధుల్ స్వర్లోక సౌఖ్యార్థులై