16, అక్టోబర్ 2022, ఆదివారం

సమస్య - 4221

18-10-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరులన్ హింసింపఁ బుణ్యఫలముల్ దక్కున్”
(లేదా...)
“పరులకు హింసఁ గూరిచెడి వానికి దక్కు నగణ్యపుణ్యముల్”

18 కామెంట్‌లు:

విరించి చెప్పారు...


నరుడే నారాయణుడని
పరులను సేవించుమంచు వచియించిరి యు
త్తరులెందరెందరో మరి
పరులన్ హింసింపఁ బుణ్యఫలముల్ దక్కున్?

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
ధర నపకారికి సైతము
నిరతము నుపకారమెంచు నీమము నెంచన్
భరతావని ననఘుల కే
పరులన్ హింసింపఁ బుణ్యఫలముల్ దక్కున్?

చంపకమాల
ధర నపకారి కైనను విదాయకమౌ నుపకారమెంచుటల్
నిరతమటంచు నీమము వినిర్మితమై భరతావనిన్ మనన్
వరగుణ శోభితమ్ముగ ప్రవర్తన దీపిల సంచరింప నే
పరులకు హింసఁ గూరిచెడి వానికి దక్కు నగణ్యపుణ్యముల్?

M.B.G.TILAK చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

నరకమె ప్రాప్తించు తుదకు
పరులను హింసింప ,పుణ్యఫలములు దక్కున్
కరమతి ప్రీతిన్ వీడక
నిరతమునారాయణునిల నిత్యము కొలువన్

subbarao చెప్పారు...

పరులును మనవారుంగనె
యరసిన చో హింస లేక హాయిగ మనువున్
దరతమ భేదము లెఱుఁగక
పరులన్ హింసింపఁ బుణ్యఫలముల్ దక్కున్?

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

కరములనుకట్టి వేయుచు
పరిపరివిధముల జనులకు బాధలనిడుచున్
ధరలో తిరుగు దురాశా
పరులన్ హింసింపఁ బుణ్యఫలముల్ దక్కున్”

విరించి చెప్పారు...


శరణమటంచు చేరినను శత్రువు నైనను పేర్మితోడ నా
దరణము చూపమంచని యుదాత్తులు పూర్వుల మాటలెప్పుడున్
మరువకు, కూళ్ళమారియగు మందుడు క్రూరుడు స్వార్థ చిత్తుడై
పరులకు హింసఁ గూరిచెడి వానికి దక్కు నగణ్యపుణ్యముల్?

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

మరులుగ మానవ జాతిని
నిరుపమ సేవా నిరతిగ నిశ్చల. మతులై
కరముగ సేవింప నెటుల
పరులను హింసింప పుణ్య ఫలముల్ దక్కున్?

sitharamayya solasa చెప్పారు...

పురవాసులు చనిపోయిన
తరుణమునందు చితిపేర్చ ధనమాశించన్
పురమున గల పితృవన కా
పరులన్ హింసింపఁ బుణ్యఫలముల్ దక్కున్

M.B.G.TILAK చెప్పారు...

పరులనుహింసించుటలో
పరమానందమ్మునొందు పాపాత్మకులన్
పురికొల్పెడి ధనతృష్ణా
పరులన్ హింసింపఁ బుణ్యఫలముల్ దక్కున్

subbarao చెప్పారు...

నరకము వచ్చు దప్పకను నల్గురి యేహ్యత గల్గునెప్పుడుం
బరులకు హింసఁ గూరిచెడి వానికి, దక్కు నగణ్యపుణ్యముల్
బరులకు మేలు జేయుచును వారిని గంటికి ఱెప్పవోలె నే
మరువక జూచుచుండుచును మన్నన లిచ్చుచు నుండు వారికిన్

Subbarao Ayyalasomayajula చెప్పారు...

ఉ.

నరులను నాల్గు వర్ణములు నందము భాజ్యము వేదశాస్త్రముల్
సురలను లెక్క చేయకనె చోద్యపు రీతిని హేతువాదమున్
గరువము జూపకన్ మిగుల గర్వముతో నెడయాడు గిడ్డి మే
*“పరులకు హింసఁ గూరిచెడి వానికి దక్కు నగణ్యపుణ్యముల్”*

A.Satyanarayana Reddy చెప్పారు...

నిరతము దుష్ట కార్యముల నీతిని వీడుచు దుష్టచిత్తులై
దురితములందు మగ్నులయి దూరుచు పెద్దల సంచరించు కా
వరుల నియంత్రణమ్మునకు బాధ్యత గైకొని దీక్ష నట్టి ఖ
ర్పరులకు హింసఁ గూరిచెడి వానికి దక్కు నగణ్యపుణ్యముల్

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...



నిరతము నీతి హీనుడయి నిర్దయు
డై కడు క్రూరచిత్తుడై
పరహిత మానవోన్నతుల బాధల
పాలొనరించునీచుకున్
భరతపవిత్రదేశమున ప్రస్తుత కాలమునందు
గాంచగన్
పరులకు హింస గూరిచెడి వారికి దక్కు నగణ్య పుణ్యముల్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పరికింపఁగ సూ క్ష్మార్థ మ
డరు హింసా పదమునకు నెడఁద నిక్కముగన్
ధర వీడి సజ్జ నాలినిఁ
బరులన్ హింసింపఁ బుణ్య ఫలముల్ దక్కున్

నర విల యార్థ కర్ములకు నైతిక భావ విహీన పూరు షో
త్కరమనకుం గఠోర తర తర్జన చిత్త విలాస కోటికిన్
గురు జన ఘోర దూషకులకుం గుటి లాత్మక పాప కార్య త
త్పరులకు హింసఁ గూరిచెడి వానికి దక్కు నగణ్య పుణ్యముల్

Rama Murthy Duvvuri చెప్పారు...

కందం
అరెరే!లంచముఁగొనుటయె
దురితంబని చూడకుండ దుర్మార్గముగా
జరియించెడి దుర్నయ తీ
*ర్పరులను హింసింపఁబుణ్య ఫలములుఁదక్కున్. *

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

నరకము నొందుట తథ్యము
పరులన్ హింసింపఁ, బుణ్యఫలముల్ దక్కున్
పరనారినిసోదరిగా
నిరతము భావించి ధర్మ నిరతిని జూపన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

నరకము తథ్యమౌను పరనారుల పొందును గోరువానికిన్,
నిరతము సజ్జనాళియెడ నిర్దయజూపుచు ధర్మరక్షణా
పరులకు హింసఁ గూరిచెడి వానికి, దక్కు నగణ్యపుణ్యముల్
మరువక నెల్లవారియెడ మాన్యతతో దనరారు వానికిన్