31, డిసెంబర్ 2023, ఆదివారం

సమస్య - 4632

1-1-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జారులు లేకున్న నగునె శాంతి సుఖంబుల్”
(లేదా...)
“జారులు లేనిచో భువిని శాంతిసుఖంబులు సంభవించునే”

30, డిసెంబర్ 2023, శనివారం

సమస్య - 4631

31-12-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కీచకుని శాంతిపర్వానఁ గ్రీడి సంపె”
(లేదా...)
“భారత శాంతిపర్వమునఁ బార్థుఁడు సంపెను కీచకాధమున్”

29, డిసెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4630

30-12-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బకములఁ గని చేపలనుచు వ్రాసిరి సుకవుల్”
(లేదా...)
“బకములఁ జూచి చేపలని వ్రాసిరి కైతల లోన సత్కవుల్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

28, డిసెంబర్ 2023, గురువారం

సమస్య - 4629

29-12-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బింబము లనేకములు ప్రతిబింబ మొకటె”
(లేదా...)
“వసుధన్ బింబము లెన్ని యున్నఁ బ్రతిబింబం బొక్కటే దోఁచెనే”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

27, డిసెంబర్ 2023, బుధవారం

సమస్య - 4628

28-12-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పెండ్లమునకు మ్రొక్కు పతికిఁ బెన్నిధు లబ్బున్”
(లేదా...)
“పెండ్లముఁ జేరి మ్రొక్కు పతి పెన్నిధులన్ గని పొందు సేమమున్”

26, డిసెంబర్ 2023, మంగళవారం

సమస్య - 4627

27-12-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కోరనిది దక్కు దక్కదు కోరి కొలువ”
(లేదా...)
“కోరిన దేది దక్కదఁటఁ గోరనిదే లభియించుఁ గొల్చినన్”
(శిష్ట్లా వేంకట లక్ష్మీ నరసింహ శర్మ గారికి ధన్యవాదాలతో...)

25, డిసెంబర్ 2023, సోమవారం

సమస్య - 4626

26-12-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధర్మమూర్తులె కావింత్రు దారుణములు”
(లేదా...)
“ధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణంబగు కృత్యముల్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

24, డిసెంబర్ 2023, ఆదివారం

సమస్య - 4625

25-12-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఉరగములు దంపతుల సెజ్జ నొప్పుచుండు”
(లేదా...)
“దంపతు లొక్కటైన తఱి దాపున నుండును కాలసర్పముల్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

23, డిసెంబర్ 2023, శనివారం

సమస్య - 4624

24-12-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రణము లనేకంబులుగ వరంబు లగుఁ గదా”
(లేదా...)
“రణము లనేకముల్ గద వరంబులుగా లభియించు నిచ్చలున్”
(ఈ సమస్యను పంపిన శిష్ట్లా వేంకట నరసింహ శర్మ గారికి ధన్యవాదాలు)

22, డిసెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4623

23-12-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... (ఛందో గోపనము)
“కుంజరము కుశాగ్రమున నిదుర చక్కగఁ బోయెన్”
(లేదా...)
“కుంజరము కుశాగ్ర భాగమునఁ జక్కగ నిద్దుర వోయెఁ జూడుమా”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

21, డిసెంబర్ 2023, గురువారం

సమస్య - 4622

22-12-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జ్ఞానసరస్వతినిఁ గొలువ జ్ఞానము దొలఁగున్”
(లేదా...)
“జ్ఞానము లుప్తమౌను గద జ్ఞానసరస్వతిఁ గొల్వ బాసరన్”
(రేపు బాసర క్షేత్రంలో జ్ఞానసరస్వతీ సన్నిధిలో ఉంటాను)

20, డిసెంబర్ 2023, బుధవారం

సమస్య - 4621

21-12-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తన సొగసు దయ్యముగఁ దోఁచె దర్పణమున”
(లేదా...)
“తన సౌందర్యము నద్దమందుఁ  గనినన్ దయ్యంబుగాఁ  దోఁచెనే”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

19, డిసెంబర్ 2023, మంగళవారం

సమస్య - 4620

20-12-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రమ్ము లరుణవర్ణ భీకరమ్ములు గనఁగన్”
(లేదా...)
“రమ్ములు రక్త వర్ణ రుచిరమ్ములు సర్వభయంకరమ్ములున్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

18, డిసెంబర్ 2023, సోమవారం

సమస్య - 4619

19-12-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సింగము వెంట నడుచు నొక చిన్నది యెపుడున్”
(లేదా...)
“సింగము వెంట సాగు నొక చిన్నది నిత్యము నిర్భయమ్ముగన్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

17, డిసెంబర్ 2023, ఆదివారం

సమస్య - 4618

18-12-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మయసభలోఁ గాఁచితివఁట  మానము సతికిన్”
(లేదా...)
“మయసభ యందుఁ గాఁచితివి మానిని మానము ధర్మమూర్తివై”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

16, డిసెంబర్ 2023, శనివారం

సమస్య - 4617

17-12-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“క్రూరమృగము లాకుకూరలఁ దిను”
(లేదా...)
“క్రూరమృగమ్ము లెప్పుడును గోరి తినున్ గద యాకుకూరలన్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

15, డిసెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4616

16-12-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్వర్గమం దప్సరలు పతివ్రతలె సుమ్ము”
(లేదా...)
“వాసిన్ గాంత్రు పతివ్రతా మణులుగా స్వర్గంబునం దప్సరల్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

14, డిసెంబర్ 2023, గురువారం

సమస్య - 4615

15-12-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కనులకు వీనులకు విందు గద యుద్ధమ్మే”
(లేదా...)
“యుద్ధము నేత్ర పర్వముగ నుండును పిమ్మటఁ గర్ణపేయమౌ”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

13, డిసెంబర్ 2023, బుధవారం

సమస్య - 4614

14-12-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మృదులములు వజ్రముల్ పూలరేకుల వలె”
(లేదా...)
“లేఁత గులాబి రేకుల వలెన్ సుతిమెత్తగ నుండు వజ్రముల్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

12, డిసెంబర్ 2023, మంగళవారం

సమస్య - 4613

13-12-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరమాత్ముఁడు మూగవాడు పసిబాలుఁ డయో”
(లేదా...)
“బాలుఁడు మూగవాడు పసివాడు కదా పరమాత్ముఁ డెప్పుడున్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

11, డిసెంబర్ 2023, సోమవారం

సమస్య - 4612

12-12-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శిలలుగా మారె శిల్పముల్ చిత్రగతిని”
(లేదా...)
“శిల్పంబుల్ శిలలయ్యె నయ్యెడ నహో చిత్రాతిచిత్రంబుగన్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

10, డిసెంబర్ 2023, ఆదివారం

సమస్య - 4611

11-12-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుట్మలదంతికిఁ గలిగెను కోపము నాపై”
(లేదా...)
“కుట్మలదంతికిన్ గలిగెఁ గోపము నాపయి హేతు వెద్దియో”

(ఉప్పలధడియం భరతశర్మ అష్టావధానంలో ఈరోజు నేనిచ్చిన సమస్య)

9, డిసెంబర్ 2023, శనివారం

సమస్య - 4610

10-12-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీరిడిరే”
(లేదా...)
“కష్టములెల్లఁ దీరెనని కంటను నీరిడి రెల్లరయ్యెడన్”

8, డిసెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4609

9-12-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అయ్యలకే కాని మీస మందఱ కేలా?”
(లేదా...)
“అయ్యల కొప్పుఁ గాని కన నందఱ కెందుకు కోఱమీసముల్”
(కవి చౌడప్పకు నమస్సులతో...)

7, డిసెంబర్ 2023, గురువారం

సమస్య - 4608

8-12-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె”
(లేదా...)
“అమృతము ప్రాణహానికర మందురు విజ్ఞులు ద్రాగఁ బోకుమా”

6, డిసెంబర్ 2023, బుధవారం

సమస్య - 4607

7-12-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అత్తకుఁ గను గీటె నల్లుఁ డౌర”
(లేదా...)
“అత్తకుఁ గన్ను గీటె నల యల్లుఁడు మామయె చూచి మెచ్చఁగన్”

5, డిసెంబర్ 2023, మంగళవారం

సమస్య - 4606

6-12-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలలు గల్లలైనఁ గలుగు ముదము”
(లేదా...)
“కలలవి కల్లలైనపుడె కల్గును మోద మెడంద శాంతిలున్”

4, డిసెంబర్ 2023, సోమవారం

సమస్య - 4605

5-12-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కమలాప్తుఁడు చంద్రుఁడన్నఁ గల్ల యెటులగున్”
(లేదా...)
“కమలాప్తుండు శశాంకుఁడౌట నిజమే కాదందువా సత్కవీ”

3, డిసెంబర్ 2023, ఆదివారం

సమస్య - 4604

4-12-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గెలిచినవాఁడేడ్చె నవ్వె గెలువనివాఁడున్”
(లేదా...)
“గెలిచినవాఁడు దుఃఖపడె గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్”

2, డిసెంబర్ 2023, శనివారం

సమస్య - 4603

3-12-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్నా యని రాముఁ బిలిచె నవనిజ భక్తిన్”
(లేదా...)
“అన్నా యంచు ధరాత్మజాతయె యయోధ్యారాముఁ బిల్చెం దగన్”

1, డిసెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4602

2-12-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చెనటులకున్ నిలయము గద చిత్తూరు గనన్”
(లేదా...)
“చెనటుల్ మాత్రమె వాసముందురు గదా చిత్తూరులో నెప్పుడున్”

(ఈరోజు చిత్తూరులో ఆముదాల మురళి గారి 'శతావధాన కౌముది' పుస్తకావిష్కరణలో పాల్గొన్నాను)