17, డిసెంబర్ 2023, ఆదివారం

సమస్య - 4618

18-12-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మయసభలోఁ గాఁచితివఁట  మానము సతికిన్”
(లేదా...)
“మయసభ యందుఁ గాఁచితివి మానిని మానము ధర్మమూర్తివై”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

29 కామెంట్‌లు:

 1. గయునికి వరమిచ్చితివట,
  జయమిచ్చితివి రణమున విజయునకు, నీలో
  లయమగు జగములు, కరుణా
  మయ! సభలోఁ గాఁచితివఁట మానము సతికిన్”.

  రిప్లయితొలగించండి
 2. కందం
  దయనీయమనఁగ వారిజ
  నయనకు నూడ్చఁగ వలువల 'నగధర' ,నగె ని
  ర్దయనని రారాజున్ గని
  మయసభలోఁ, 'గాఁచితివఁట మానము సతికిన్'

  చంపకమాల
  దయవిడి ధార్తరాష్ట్రులట దారుణమెంచుచు నందనందనా!
  నియమ విహీనులై చెలఁగి నీరజనేత్రకు వల్వలూడ్చ, ని
  ర్దయ మును రాజరాజుఁ గని ద్రౌపది నవ్వెనటంచు గేలిగన్
  మయసభ యందుఁ, గాఁచితివి మానిని మానము ధర్మమూర్తివై

  రిప్లయితొలగించండి
 3. రయమున నీడిచి సభకున్
  నయ రహితులు వలువలిప్ప
  నాతి భయమునన్
  దయజూడుమనగ కరుణా
  మయ సభలోగాచితివట
  మానము సతికిన్.

  రిప్లయితొలగించండి
 4. ఆయుగమందున గరుణా
  మయ ! సభలోఁ గాఁచితివఁట మానము సతికిన్
  రయముగ వస్త్రము నొసగుచు
  సుయోధనుని కొలువు నందు సకృతిగ కృష్ణా

  రిప్లయితొలగించండి
 5. దయమాలి దుస్ససేనుడు
  భయమునుగొనఁగన్ కులసతి వసనములూడ్చన్
  ప్రియముగ మొరవినిన దయా
  మయ! సభలోఁ గాఁచితివఁటమానముసతికిన్

  రిప్లయితొలగించండి

 6. నియమము తప్పక భక్తుల
  దయతో బ్రోచెదవు నీవు దామోదర చే
  డియ వేడినంతనె దయా
  మయ, సభలోఁ గాఁచితివఁట మానము సతికిన్.


  దయగల వాడవోయి యసిదంష్ట్రము ద్రుంచుచు సింధురమ్మునే
  రయమున నేగి ప్రోచితివిరా! యదు భూషణ యంచు కృష్ణయే
  భయమున నిన్ను వేడ పలు వల్వలొసంగిన వాడ! హే దయా
  మయ, సభ యందుఁ గాఁచితివి మానిని మానము ధర్మమూర్తివై.

  రిప్లయితొలగించండి
 7. దయజూపుమి కృష్ణాయని
  భయవిహ్వలయైన పడతి ప్రార్థించంగాన్
  రయమున నేతెంచి దురిత
  మయ సభలోఁ గాఁచితివఁట మానము సతికిన్

  రిప్లయితొలగించండి
 8. కురుసభలో దౌష్ట్యమునకు
  భయపడి ద్రౌపతి మొరలిడ వలువలనొసగన్
  రయమున నరుదెంచి దయా
  మయ! సభలోఁ గాఁచితివఁట మానము సతికిన్

  స్వయముగ నోడిపోయెగద పాండు కుమారుడు జూదమందునన్
  జయమును పొందికౌరవులు సంతస మొందుచు వేణుమాధవా
  రయమున వల్వలూడ్చిరట ద్రౌపదికిన్ సభయందునే దయా
  మయ! సభ యందుఁ గాఁచితివి మానిని మానము ధర్మమూర్తివై

  రిప్లయితొలగించండి
 9. చం.

  నియమము లేని కౌరవులు నీతినిఁ దప్పిన దుర్జనుల్ కదా
  పయనము వాసుదేవునకు బాండవ పత్ని పరాభవంబు, చి
  *న్మయ! సభ యందుఁ గాఁచితివి మానిని మానము ధర్మమూర్తివై*
  ప్రియముఁ జమత్కృతిన్ జనులు పీల్చిరి శ్వాసను నిర్భయమ్ముగన్.

  రిప్లయితొలగించండి
 10. భయమును గొల్పురీతిగ సభాంగణమందున దుస్ససేనుడే
  దయవిడనాడి పాండవుల దారను చేలములూడ్చ బూనగా
  రయమున నేగుదెంచితివి ద్రౌపది యార్తిని దీర్చనో దయా
  మయ! సభ యందుఁ గాఁచితివి మానిని మానము ధర్మమూర్తివై

  రిప్లయితొలగించండి
 11. కం॥ భయమున విహ్వల మొందుచు
  నయముగఁ బ్రోచుమని వేడ నమ్ముచు నిన్నే
  రయముగ ద్రౌపది కరుణా
  మయ సభలోఁ గాఁచితివఁట మానము సతికిన్

  చం॥ భయమును బాధ హెచ్చఁగను బాండవ పత్నియె నిన్ను భక్తితో
  నయముగ రక్షకై తలఁచ నమ్మితినయ్య నటంచు బేలయై
  రయముగ వచ్చినాడవఁట రాజస మొప్పగఁ బ్రోవగన్ దయా
  మయ సభయందుఁ గాఁచితివి మానిని మానము ధర్మ మూర్తివై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి
   నమ్మితినయ్య యటంచు... అనండి

   తొలగించండి
  2. ధన్యవాదములండి యటంచు నటంచు తర్జనభర్జన చేసుకొని నటంచు ఉంచానండి.
   మనఃపూర్వక ధన్యవాదములు

   తొలగించండి
 12. దయతో భక్తుల గావగ
  రయమున నేతెo తు వు గద రక్షణ సేయన్
  నియతి గ ద్రౌపది ని కృపా
  మయ:.సభలో గాచితివట మానము సతికిన్

  రిప్లయితొలగించండి

 13. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  భయవిహ్వలయై ద్రోవది
  నయముగ కాపాడమనుచు నారాయణునిన్
  రయమున వేడగ, కరుణా
  మయ!సభలోఁ గాచితివట మానము సతికిన్.

  రిప్లయితొలగించండి

 14. భయములు బాపెడి దేవా
  దయతోనను బ్రోవరావ తలతును నిన్నే
  రయముననినువేడగనే
  మయసభలోగాచితివటమానము సతికిన్

  రిప్లయితొలగించండి