12, డిసెంబర్ 2023, మంగళవారం

సమస్య - 4613

13-12-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరమాత్ముఁడు మూగవాడు పసిబాలుఁ డయో”
(లేదా...)
“బాలుఁడు మూగవాడు పసివాడు కదా పరమాత్ముఁ డెప్పుడున్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

31 కామెంట్‌లు:

  1. వరము లొసగు నడుగగనే
    విరివిగ దుష్టులగు వారు వినయము జూప
    న్నెరుగడె దుర్మార్గములను!
    పరమాత్ముఁడు మూగవాడు పసిబాలుఁ డయో.

    రిప్లయితొలగించండి
  2. లీలలు జూపునాడచట లేమలఁజీరల దోచెనెవ్వడో?
    బేలగ భీమసేనునికి వేగము సైగల జేసినాడనన్,
    నీలపు దేహకాంతినను నిల్చిన పుత్రుడు వాసుదేవుడే
    బాలుఁడు మూగవాడు పసివాడు కదా పరమాత్ముఁ డెప్పుడున్
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి

  3. పిరిమి నటించుచు స్తన్యము
    చిరుతడి కిచ్చి తునుమాడ జేరిన వనితన్
    హరియించె వాడు నిజముగ
    పరమాత్ముడు, మూగవాడు పసిబాలుడయో.

    రిప్లయితొలగించండి
  4. ఉ.

    పాలకుడైన సత్త్వగుణవంతుడు నాటక సూత్రధారియే
    మూలము సృష్టి హేతువయి ముచ్చటగా వటపత్రశాయిగా
    కాలము మార్పుఁ బత్రమునఁ గన్పడు విష్ణువు సూక్ష్మరూపుడై
    *బాలుఁడు మూగవాడు పసివాడు కదా పరమాత్ముఁ డెప్పుడున్.*

    రిప్లయితొలగించండి
  5. కందం
    గరళము త్రాపించ మనెను
    వర ప్రహ్లాదునకని పిత! భజియింప హరిన్,
    వెరపున వాగడు, వచ్చునె
    పరమాత్ముఁడు? మూగవాడు! పసిబాలఁడయో!!

    ఉత్పలమాల
    పాలసముద్రవాసునట భక్తునిగా భజియింపపుత్రఁడున్
    క్ష్వేళము ద్రాపగన్ భటులవెంటను దైత్యుఁడు పంపినంత తా
    నాలనపాలనన్ దనరి యక్కున జేర్చునె? ,నిగ్రహంబునన్
    బాలుఁడు మూగవాడు పసివాడు కదా! ,పరమాత్ముఁ డెప్పుడున్

    కందం
    కొరకొర యశోద సణిగిన
    చిరునగవులు చిందు చిన్ని శ్రీకృష్ణుండున్
    మురిపెము గొన తల్లి దరిని
    పరమాత్ముఁడు మూగవాడు! పసిబాలుఁ డయో!

    ఉత్పలమాల
    పాలు, పెరుంగులన్ గుడిచి భంగము జేసియు నుట్టి, కుండలన్
    వాలకమొల్క తానెరుగ వాస్తవమంచని బాలకృష్ణుఁడున్
    దూలి యశోద నుల్మఁ జెవి తొల్కడునుల్కడు తల్లి ప్రేమకై
    బాలుఁడు మూగవాడు పసివాడు కదా పరమాత్ముఁ డెప్పుడున్!

    రిప్లయితొలగించండి

  6. పాలను గ్రోలమంచు నొక భామిని రేకుమణంచ బోవ నా
    వాలుగ కంటి జంపగ నపాయము త్రప్పెను కాదె కాంచగన్
    బాలుడు మూగవాడు పసివాడుకదా! పరమాత్ము డెప్పుడున్
    పాలన సేయు శిష్టులను వాస్తవ మియ్యెదె విశ్వసించినన్.

    రిప్లయితొలగించండి
  7. పెరిమినెరిగించుటందున
    పరమాత్ముఁడు మూగవాడు ; పసిబాలుఁ డయో
    తరతమ బేధము జూపడు
    వరముల దయసేయుటందు భక్త జనులకున్

    రిప్లయితొలగించండి
  8. నిరతము భక్తుల మొరలను
    పరమాత్ముఁడు వినినగాని బదులీయడు తా
    నరయగ నైజము నందున
    పరమాత్ముఁడు మూగవాడు పసి బాలుఁడయో

    రిప్లయితొలగించండి
  9. కరమునశంఖాదులతో
    ధరలో కంసాదిదుష్టదైత్యుల నెల్లన్
    సరుగున చంపగ బుట్టిన
    *“పరమాత్ముఁడు మూగవాడు పసిబాలుఁ డయో”*

    రిప్లయితొలగించండి
  10. సరియగు వేళల లీలలు
    విరివిగ పొడయించువాడు విశ్వంభరుడే
    నిరతము యశోద తలపుల
    పరమాత్ముఁడు మూగవాడు పసిబాలుఁ డయో

    లీలలు చూపినాడు గద లెక్కకు మిక్కిలి వేళలందునన్
    వ్రేలినిఁ శైలమే నిలిపి పిల్లలు పెద్దలఁ గాచినాడు గో
    పాలుడు మాతృమూర్తియగు భామ యశోద తలంపులందునన్
    బాలుఁడు మూగవాడు పసివాడు కదా పరమాత్ముఁ డెప్పుడున్

    రిప్లయితొలగించండి
  11. వరదు డ ణు వునను దాగియు
    పరి శీ లించు చు ను నుండు ప్రతి యొ క్క రి నిన్
    దొరకడు సులువు గ నెవరికి
    పరమాత్ము డు మూగ వాడు పసి బాలు డ యో

    రిప్లయితొలగించండి
  12. వరమడిగిన మారాడక
    నెరవడి నేతెంచు కోర్కె నెరవేర్చంగన్
    హరి భక్తరక్షకుడయో
    పరమాత్ముఁడు మూగవాడు పసిబాలుఁ డయో

    రిప్లయితొలగించండి
  13. వరములనొసఁగున దెవ్వడు
    పరిపరి విధముల పిలిచిన పల్కనిదెవడున్
    నెరఊయలలో నెవ్వడు
    పరమాత్ముఁడు మూగవాడు పసిబాలుఁ డయో

    రిప్లయితొలగించండి
  14. ఆలనుగాచు గోపకుల నందర గూడి గృహాంగణమ్ములన్
    పాలను వెన్నపూసలను పన్నుగ మ్రుచ్చిలు దుండగీఁడు గో
    పాలుడు దేవుడే తనదు భావనయందు యశోద మాతకున్
    బాలుఁడు మూగవాడు పసివాడు కదా పరమాత్ముఁ డెప్పుడున్

    రిప్లయితొలగించండి
  15. కం॥ వరదుఁడు జనియించె నచట
    ధరణిని ధర్మము నిలుపఁగ దైత్యులఁ దునుమన్
    మురిసిరి గోపకులెల్లరుఁ
    బరమాత్ముఁడు మూగవాడు పసిబాలుఁ డయో

    ఉ॥ కాలుని చెంతకంపఁగను గంసుని దైత్యుల నెల్లరన్ హరే
    బాలుఁడుగా జనించె నఁట పాలన సేయఁగ శిష్టులందరిన్
    హేలగ నాటలాడుచును హీనులఁ ద్రుంచెను జిన్ననాటనే
    బాలుఁడు మూగవాడు పసివాడు కదాపరమాత్ముఁ డెప్పుడున్

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    పరిమార్చ నెంచి పూతన
    గరళపు క్షీరమ్ము త్రాపు కాలమునందున్
    హరియించె రక్కసి యుసురు
    పరమాత్ముడు,మూగవాడు,పసిబాలుడయో!

    రిప్లయితొలగించండి