21, డిసెంబర్ 2023, గురువారం

సమస్య - 4622

22-12-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జ్ఞానసరస్వతినిఁ గొలువ జ్ఞానము దొలఁగున్”
(లేదా...)
“జ్ఞానము లుప్తమౌను గద జ్ఞానసరస్వతిఁ గొల్వ బాసరన్”
(రేపు బాసర క్షేత్రంలో జ్ఞానసరస్వతీ సన్నిధిలో ఉంటాను)

22 కామెంట్‌లు:

  1. పూనక విద్యను నేర్వగ
    మానక చరవాణియందు మాటలుసతతం
    గానక సద్గురుదయ, న
    జ్ఞానసరస్వతినిఁ గొలువ జ్ఞానము దొలఁగున్

    రిప్లయితొలగించండి
  2. జ్ఞానంబాయదలౌకిక
    జ్ఞానంబేగద సుజనులజ్ఞానము వెలుగన్

    జ్ఞానాంజనమునులేకను
    జ్ఞాన సరస్వతిని కొలువ జ్ఞానముతొలగున్

    రిప్లయితొలగించండి
  3. కందం
    హీనమనస్తత్త్వమ్మునఁ
    దానొక్కఁడె కవిగ నిలిచి తక్కినవారల్
    రాణించకుండునటులన్
    జ్ఞానసరస్వతినిఁ గొలువ జ్ఞానము దొలఁగున్!

    ఉత్పలమాల
    హీనమనంగ మానసము నెంతయొగర్వము గన్నుకప్పఁగన్
    దానొకఁడే కవీశునిగ తక్కిన వారలు రాణకెక్కకే
    మౌనము దాల్చెడున్ వరము మానుగ నిమ్మని నీచమెంచినన్
    జ్ఞానము లుప్తమౌను గద జ్ఞానసరస్వతిఁ గొల్వ బాసరన్!

    రిప్లయితొలగించండి
  4. జ్ఞానమలౌకికంబనుచు జ్ఞానులుఁజెప్పగ నాలకింపకన్
    జ్ఞానములుప్త మౌనుగద జ్ఞానసరస్వతిఁగొల్వబాసరన్
    భానునితేజమాయదియు భావన సేయుము సాధనన్ భావిస్తారు
    ఆనకసిద్ధిబందురటహంసగవీడుచు జన్మ బంధముల్

    రిప్లయితొలగించండి

  5. జ్ఞానమోసంగునటంచును
    మానవులే విశ్వసించు మాతయె గద య
    జ్ఞానమ్ము ద్రుంచు నిజము
    జ్ఞానసరస్వతినిఁ గొలువ జ్ఞానము దొలంగున్?


    మానుమటంచు చెప్పినను మానక వాగుచు నుంటి వేల? వి
    జ్ఞానము గోరిచేరెదరు జ్ఞానసరస్వతి సన్నిధానమున్
    మానవులెందరో! నలువ మానస రాణిని గాంచినంత య
    జ్ఞానము లుప్తమౌను గద జ్ఞానసరస్వతిఁ గొల్వ బాసరన్.

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. ఉ.

      గానము నృత్య నాటికలు కావ్యము వాణి వరమ్ములిద్ధరన్
      ధ్యానము, భక్తి, సేవ లిడి తల్లికిఁ దండ్రికి నొజ్జకున్ బసన్
      మానము నిచ్చు శీలమును మాసటి లక్షణముల్ వరించవ
      *జ్ఞానము లుప్తమౌను గద జ్ఞానసరస్వతిఁ గొల్వ బాసరన్.*

      తొలగించండి
  7. మానస వికాసమలరును
    జ్ఞానసరస్వతినిఁ గొలువ ; జ్ఞానము దొలఁగున్
    నేననెడి యహం కారము
    మాననమందున పెరిగిన మాత్రపు సావిన్

    రిప్లయితొలగించండి
  8. గానకళయుహెచ్చునుగదా
    *“జ్ఞానసరస్వతినిఁ గొలువ, జ్ఞానము దొలగున్”*
    హీనపు దృక్కులతోడను
    నేనేగొప్పనుచుబుధులనిందింపంగన్.

    డా బల్లూరి ఉమాదేవి

    జ్ఞానము లేనివారలను సమ్ముఖ మందున సన్నుతించినన్
    *“జ్ఞానము లుప్తమౌను గద జ్ఞానసరస్వతిఁ గొల్వ బాసరన్”*
    జ్ఞానమువృద్ధిచెందగను సంతస మొప్పగ మెచ్చనెల్లరున్
    హీనముగానిసొమ్ములవి యిబ్బడి ముబ్బడియౌటనిక్కమౌ

    రిప్లయితొలగించండి
  9. జ్ఞానము పెంపొందనగును
    జ్ఞానసరస్వతినిఁ గొలువ; జ్ఞానము దొలంగున్
    హీనులు మూర్ఖులు మరి య
    జ్ఞానము మెండైన వారు సహచరులైనన్

    జ్ఞానముఁ బొందియున్నపుడు జ్ఞానియనంబడు లోకమందునన్
    జ్ఞానమొసంగు లాభమని జ్ఞానులు పేర్కొన సత్యమేకదా
    జ్ఞానము సంగ్రహించుటకు శ్రద్ధయు నిష్ఠయు ముఖ్యమౌను య
    జ్ఞానము లుప్తమౌను గద జ్ఞానసరస్వతిఁ గొల్వ బాసరన్

    రిప్లయితొలగించండి
  10. కానగ లేదట పొత్త ము
    నే నాడు ను బడి ముఖమ్ము నెరు గని వాడై
    హీనుడు కపట పు భక్తిన్
    జ్ఞాన సరస్వతి ని గొలువ జ్ఞానము దొలగున్

    రిప్లయితొలగించండి
  11. జానెడు పొట్టను నింపెడు
    జ్ఞానమ్మే జ్ఞానమండ్రు జనులిల, బ్రహ్మా
    జ్ఞానార్థియై వరమ్మిడ
    జ్ఞానసరస్వతినిఁ గొలువ జ్ఞానము దొలఁగున్

    మాయా పూరితమైన ప్రాపంచిక జ్ఞానం తొలగి బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది అనే భావంలో.🙏

    రిప్లయితొలగించండి
  12. జ్ఞానము సంప్రాప్తించును
    జ్ఞానసరస్వతినిఁ గొలువ, జ్ఞానము దొలఁగున్
    జ్ఞానుల నవమానించిన
    జ్ఞానార్జనచే సుజనుడుచరితార్థుడగున్

    రిప్లయితొలగించండి
  13. మానవకోటి జీవనము మాన్యత నొందును జ్ఞాన సంపదన్
    జ్ఞానసరస్వతిన్ మదిని సంశ్రయణమ్ముగ నిల్పకున్నచో
    జ్ఞానము లుప్తమౌను గద, జ్ఞానసరస్వతిఁ గొల్వ బాసరన్
    మానిసి జీవితమ్ము సుగమంబగు విద్యలయందు నొజ్జయౌ

    రిప్లయితొలగించండి
  14. కం॥ మానని సాధన పెంచును
    జ్ఞాన సరస్వతినిఁ గొలువ జ్ఞానము, దొలఁగున్
    మానసమున నజ్ఞానము
    మానకు సాధనఁ గొలుచుచు మాటలబోటిన్

    ఉ॥ వీణను చేతఁబూని ఘన విద్యల నెల్ల యొసంగు శారదన్
    మానసమందు నిల్పుచును మక్కువ మీరఁగ జేయ సాధనన్
    మానక సర్వవేళలను మాటలబోటియె మోదమొందు న
    జ్ఞానము లుప్తమౌను గద జ్ఞాన సరస్వతిఁ గొల్వ బాసరన్

    రిప్లయితొలగించండి
  15. ఉ.

    గానము నృత్య నాటికలు కావ్యము వాణి వరమ్ములిద్ధరన్
    ధ్యానము, భక్తి, సేవ లిడి తల్లికిఁ దండ్రికి నొజ్జకున్ బసన్
    మానము నిచ్చు శీలమును మాసటి లక్షణముల్ వరించవ
    *జ్ఞానము లుప్తమౌను గద జ్ఞానసరస్వతిఁ గొల్వ బాసరన్.*

    రిప్లయితొలగించండి
  16. కం:జ్ఞానసరస్వతి నాత్మ
    జ్ఞానము కై గొలువ వలయు గాని ప్రతిష్ఠన్
    బూనగ,కీర్తిని బొందగ
    జ్ఞానసరస్వతిని గొలువ జ్ఞానము తొలగున్
    (జ్ఞానసరస్వతిని జ్ఞానం కోసం కొలవాలి కానీ దాని వల్ల లభించే పేరు ప్రతిష్ఠల కోసం కాదు.)

    రిప్లయితొలగించండి
  17. ఉ:తా నొక హేతువాది నని,తత్త్వము,యోగము మిథ్య యంచు,వి
    జ్ఞానిని తా నటంచును,వినాశపు హేతువు భక్తి యంచు న
    జ్ఞానము తోడ బల్కు నొక నాస్తికు డిట్లను భక్తకోటితో
    జ్ఞానము లుప్త మౌను గద జ్ఞానసరస్వతి గొల్వ బాసరన్.

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    జ్ఞానము లభించు విరివిగ
    జ్ఞాన సరస్వతినిఁ గొలువ; జ్ఞానము దొలగున్
    హీనపు టాలోచనతో
    మానవతను మరచి మద్యమందున
    మునుగన్.

    రిప్లయితొలగించండి