28-12-2023 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పెండ్లమునకు మ్రొక్కు పతికిఁ బెన్నిధు లబ్బున్”(లేదా...)“పెండ్లముఁ జేరి మ్రొక్కు పతి పెన్నిధులన్ గని పొందు సేమమున్”
పెండ్లిండ్లను సేయగ చెల్లెండ్లకు విత్తమ్ము చెంత లేకుండె ననన్ పెండ్లాము తెలిపె శ్రీహరిపెండ్లమునకు మ్రొక్కు పతికిఁ బెన్నిధు లబ్బున్.పెండ్లిని చేయగా వలయు ప్రేమగ పెంచిన నాదు ముద్దు చెల్లెండ్లకు గాంచ విత్తమది లేదుకదాయని భర్త బాధగాపెండ్లము తోడ చెప్ప విని భీరువు పల్కెను పుష్కరాక్షునిన్ బెండ్లముఁ జేరి మ్రొక్కు పతి పెన్నిధులన్ గని పొందు సేమమున్.
"శ్రీహరి పెండ్లమునకు మ్రొక్కు" బాగుందండీ విరించి గారూ.
మీ రెండు పూరణలు బాగున్నవి
కూతురితో తల్లి:కందంపెండ్లయి నాల్గేళ్లయినదియిండ్లను గట్టరె? సిరులెటు నింకెనొ? పూడ్చన్గండ్లవి హరి సేవించెడుపెండ్లమునకు మ్రొక్కు, పతికిఁ బెన్నిధు లబ్బున్ఉత్పలమాలపెండ్లయి నాలుగేండ్లయిన విత్తము పెద్దగ కూడలేదటే?యిండ్లను గట్టిరే వణిజులెందరొ మీకును వెన్క పెండ్లియై! గండ్లవి యేవిసంపదలఁ గార్చునొ? పూడ్చ ముకుందు సొంతమౌపెండ్లముఁ జేరి మ్రొక్కు, పతి పెన్నిధులన్ గని పొందు సేమమున్
ఇండ్లను సామ్రాజ్యములకు పెండ్లములే ప్రభువులౌచు వెల్గుదురిల పూచెండ్లును హారమ్ములతోపెండ్లమునకు మ్రొక్కు పతికిఁ బెన్నిధు లబ్బున్
మీ పూరణ బాగున్నది
కండ్లనుగట్టినగంతనుముండ్లను మాటను సరి యని మురిపెము తోడనేఇండ్లను తిరుగక బుద్ధినిపెండ్లమునకుమ్రొక్కుపతికి పెన్నిధులబ్బున్
తోడన్
పెండ్లము మెచ్చి న చీరలుపెండ్లము కోరిన నగలను ప్రీతిగ నొసగన్పెండ్ల ము మగడును శ్రీహరిపెండ్లము నకు మ్రొ క్క పతికి పెన్నిధు లబ్బున్
కండ్లకజుని జూప నగునుపెండ్లమునకు ; మ్రొక్కు పతికిఁ బెన్నిధు లబ్బున్బండ్ల నెరవుగా ధాన్యములిండ్లకు జేరి సుఖశాంతు లిమ్మగ గలుగున్
ఉ.ఇండ్లను నిర్ధనుండు పరమేశ్వరుడై తొలి మందహాసముల్కండ్లను పూర్తిగా తెరచి కాంచగ నిల్లరికంబు ఘోరమైపండ్లను సంతరించుటకు శ్వాస బిగించుచు నత్త భీతిచే*బెండ్లముఁ జేరి మ్రొక్కు పతి పెన్నిధులన్ గని పొందు సేమమున్.*
కండ్లను వర్తులన్ నిలిపి గాంచగజాలక నంబుదమ్ము లోగిండ్లను తిండిగింజలకు ఖేదనమేర్పడె కర్షకాళికిన్పెండ్లియొనర్పగా సుతకు విత్తము కావలె తాతతాతకుంపెండ్లముఁ జేరి మ్రొక్కు పతి పెన్నిధులన్ గని పొందు సేమమున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది
పెండ్లియొనర్పగ సుతకున్కండ్లకు నొక ఠోళియైన కానని పతికిన్పెండ్లమ్మిటులనె "హరికిన్పెండ్లమునకు మ్రొక్కు పతికిఁ బెన్నిధు లబ్బున్"
కం॥ పెండ్లము నకర్ధ మేనునుబెండ్లము నకెడఁద నొసఁగుచుఁ బెండ్లము విలువన్గండ్లకుఁ గట్టగ విభులే పెండ్లమునకు మ్రొక్కు పతికిఁ బెన్నిధు లబ్బున్ఉ॥ పెండ్లము నర్ధభాగమునఁ బేరిమి మీరఁగ నిల్పె నీశుఁడేపెండ్లము నాక్రమించె హృదిఁ బ్రేమగఁ జూడఁగ నామురారినేపెండ్లము ప్రేమఁ బొందఁగను బ్రీతిగఁ గాంతురు సర్వ సౌఖ్యముల్పెండ్లముఁ జేరి మ్రొక్కు పతి పెన్నిధులన్ గని పొందు సేమమున్
కం:ఇండ్లున్,స్థలములు,పసిడియు,బండ్లన్ ధాన్యమ్ము దెచ్చు వసతి గలిగియున్ కండ్లన్ గర్వము జూపని పెండ్లమునకు మ్రొక్కు పతికి బెన్నిథు లబ్బున్
ఉ:పెండ్లము తన్నినన్ తనకు వీసము కోపము రాక కృష్ణుడేముండ్లను బోలు నా తనువు, ముద్దగు నీ పద మెంత నొచ్చెనోకండ్లను జూడ కష్ట మని,కమ్మని పల్కుల బల్కి యిట్లనెన్"పెండ్లము జేరి మ్రొక్కు పతి పెన్నిథులన్ గని పొందు సేమమున్"
పండ్లను నైవేద్య మిడుచుదండ్లను మెడలోనవేసి దయతో మమ్మున్మండ్లమున కావుమని హరిపెండ్లమునకు మ్రొక్కు పతికిఁ బెన్నిధు లబ్బున్”*పండ్లునుపూలుదెచ్చితినివాసిగ మ్రొక్కులుదీర్చివెండివౌగుండ్లనుహుండిలోనునిచికోర్కెలుదీర్చినదైవమంచుమావాండ్లనుగూడివచ్చితినిభాగ్యముపండెనువేంకటేశ నీపెండ్లముజేరిమొక్కుపతిపెన్నిధులన్ గని పొందు సేమమున్
ఏండ్ల తరబడి జరుగుఁ బెక్కిండ్ల నరయ నివ్విధంబ యిహ లోకమునంబెండ్లము తోడుత వెన్నునిపెండ్లమునకు మ్రొక్కు పతికిఁ బెన్నిధు లబ్బున్ గుండ్ల విరోధి సోదరుఁడు కోపము సంతస మంద నాత్మలో బండ్లగు నోడ లొక్క త్రుటి బండ్లు సెలంగును గొప్ప యోడలై పండ్లు జలమ్ము పుష్పములు భక్తి నొసంగి రమామనో ధవుంబెండ్లముఁ జేరి మ్రొక్కు పతి పెన్నిధులన్గని పొందు సేమమున్ [పెండ్లముఁ జేరి = చేరి పెండ్లమును]
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. దండ్లను వేయుచు భక్తిగ పండ్లు సమర్పించుచుండి భగవంతునికిన్కండ్లను మూయుచు శ్రీహరిపెండ్లమునకు మ్రొక్కుపతికిఁ బెన్నిధులబ్బున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
బండ్లకు నెత్తిధాన్యము నివాసము జేర్చి కరమ్ము తుష్టి రెండేండ్లకు చాలు సస్యముల నింటనమర్చి పోషనార్థమైపెండ్లి యెనర్చ పుత్రికకు, వేంకట నాథుని మందిరమ్ములోపెండ్లముఁ జేరి మ్రొక్కు పతి పెన్నిధులన్ గని పొందు సేమమున్
రిప్లయితొలగించండిపెండ్లిండ్లను సేయగ చె
ల్లెండ్లకు విత్తమ్ము చెంత లేకుండె ననన్
పెండ్లాము తెలిపె శ్రీహరి
పెండ్లమునకు మ్రొక్కు పతికిఁ బెన్నిధు లబ్బున్.
పెండ్లిని చేయగా వలయు ప్రేమగ పెంచిన నాదు ముద్దు చె
ల్లెండ్లకు గాంచ విత్తమది లేదుకదాయని భర్త బాధగా
పెండ్లము తోడ చెప్ప విని భీరువు పల్కెను పుష్కరాక్షునిన్
బెండ్లముఁ జేరి మ్రొక్కు పతి పెన్నిధులన్ గని పొందు సేమమున్.
"శ్రీహరి పెండ్లమునకు మ్రొక్కు" బాగుందండీ విరించి గారూ.
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి
తొలగించండికూతురితో తల్లి:
రిప్లయితొలగించండికందం
పెండ్లయి నాల్గేళ్లయినది
యిండ్లను గట్టరె? సిరులెటు నింకెనొ? పూడ్చన్
గండ్లవి హరి సేవించెడు
పెండ్లమునకు మ్రొక్కు, పతికిఁ బెన్నిధు లబ్బున్
ఉత్పలమాల
పెండ్లయి నాలుగేండ్లయిన విత్తము పెద్దగ కూడలేదటే?
యిండ్లను గట్టిరే వణిజులెందరొ మీకును వెన్క పెండ్లియై!
గండ్లవి యేవిసంపదలఁ గార్చునొ? పూడ్చ ముకుందు సొంతమౌ
పెండ్లముఁ జేరి మ్రొక్కు, పతి పెన్నిధులన్ గని పొందు సేమమున్
మీ రెండు పూరణలు బాగున్నవి
తొలగించండిఇండ్లను సామ్రాజ్యములకు
రిప్లయితొలగించండిపెండ్లములే ప్రభువులౌచు వెల్గుదురిల పూ
చెండ్లును హారమ్ములతో
పెండ్లమునకు మ్రొక్కు పతికిఁ బెన్నిధు లబ్బున్
మీ పూరణ బాగున్నది
తొలగించండికండ్లనుగట్టినగంతను
రిప్లయితొలగించండిముండ్లను మాటను సరి యని మురిపెము తోడనే
ఇండ్లను తిరుగక బుద్ధిని
పెండ్లమునకుమ్రొక్కుపతికి పెన్నిధులబ్బున్
తోడన్
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది
తొలగించండిపెండ్లము మెచ్చి న చీరలు
రిప్లయితొలగించండిపెండ్లము కోరిన నగలను ప్రీతిగ నొసగన్
పెండ్ల ము మగడును శ్రీహరి
పెండ్లము నకు మ్రొ క్క పతికి పెన్నిధు లబ్బున్
మీ పూరణ బాగున్నది
తొలగించండికండ్లకజుని జూప నగును
రిప్లయితొలగించండిపెండ్లమునకు ; మ్రొక్కు పతికిఁ బెన్నిధు లబ్బున్
బండ్ల నెరవుగా ధాన్యము
లిండ్లకు జేరి సుఖశాంతు లిమ్మగ గలుగున్
మీ పూరణ బాగున్నది
తొలగించండిఉ.
రిప్లయితొలగించండిఇండ్లను నిర్ధనుండు పరమేశ్వరుడై తొలి మందహాసముల్
కండ్లను పూర్తిగా తెరచి కాంచగ నిల్లరికంబు ఘోరమై
పండ్లను సంతరించుటకు శ్వాస బిగించుచు నత్త భీతిచే
*బెండ్లముఁ జేరి మ్రొక్కు పతి పెన్నిధులన్ గని పొందు సేమమున్.*
మీ పూరణ బాగున్నది
తొలగించండికండ్లను వర్తులన్ నిలిపి గాంచగజాలక నంబుదమ్ము లో
రిప్లయితొలగించండిగిండ్లను తిండిగింజలకు ఖేదనమేర్పడె కర్షకాళికిన్
పెండ్లియొనర్పగా సుతకు విత్తము కావలె తాతతాతకుం
పెండ్లముఁ జేరి మ్రొక్కు పతి పెన్నిధులన్ గని పొందు సేమమున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది
తొలగించండిపెండ్లియొనర్పగ సుతకున్
రిప్లయితొలగించండికండ్లకు నొక ఠోళియైన కానని పతికిన్
పెండ్లమ్మిటులనె "హరికిన్
పెండ్లమునకు మ్రొక్కు పతికిఁ బెన్నిధు లబ్బున్"
మీ పూరణ బాగున్నది
తొలగించండికం॥ పెండ్లము నకర్ధ మేనును
రిప్లయితొలగించండిబెండ్లము నకెడఁద నొసఁగుచుఁ బెండ్లము విలువన్
గండ్లకుఁ గట్టగ విభులే
పెండ్లమునకు మ్రొక్కు పతికిఁ బెన్నిధు లబ్బున్
ఉ॥ పెండ్లము నర్ధభాగమునఁ బేరిమి మీరఁగ నిల్పె నీశుఁడే
పెండ్లము నాక్రమించె హృదిఁ బ్రేమగఁ జూడఁగ నామురారినే
పెండ్లము ప్రేమఁ బొందఁగను బ్రీతిగఁ గాంతురు సర్వ సౌఖ్యముల్
పెండ్లముఁ జేరి మ్రొక్కు పతి పెన్నిధులన్ గని పొందు సేమమున్
కం:ఇండ్లున్,స్థలములు,పసిడియు,
రిప్లయితొలగించండిబండ్లన్ ధాన్యమ్ము దెచ్చు వసతి గలిగియున్
కండ్లన్ గర్వము జూపని
పెండ్లమునకు మ్రొక్కు పతికి బెన్నిథు లబ్బున్
ఉ:పెండ్లము తన్నినన్ తనకు వీసము కోపము రాక కృష్ణుడే
రిప్లయితొలగించండిముండ్లను బోలు నా తనువు, ముద్దగు నీ పద మెంత నొచ్చెనో
కండ్లను జూడ కష్ట మని,కమ్మని పల్కుల బల్కి యిట్లనెన్
"పెండ్లము జేరి మ్రొక్కు పతి పెన్నిథులన్ గని పొందు సేమమున్"
పండ్లను నైవేద్య మిడుచు
రిప్లయితొలగించండిదండ్లను మెడలోనవేసి దయతో మమ్మున్
మండ్లమున కావుమని హరి
పెండ్లమునకు మ్రొక్కు పతికిఁ బెన్నిధు లబ్బున్”*
పండ్లునుపూలుదెచ్చితినివాసిగ మ్రొక్కులుదీర్చివెండివౌ
గుండ్లనుహుండిలోనునిచికోర్కెలుదీర్చినదైవమంచుమా
వాండ్లనుగూడివచ్చితినిభాగ్యముపండెనువేంకటేశ నీ
పెండ్లముజేరిమొక్కుపతిపెన్నిధులన్ గని పొందు సేమమున్
ఏండ్ల తరబడి జరుగుఁ బె
రిప్లయితొలగించండిక్కిండ్ల నరయ నివ్విధంబ యిహ లోకమునం
బెండ్లము తోడుత వెన్నుని
పెండ్లమునకు మ్రొక్కు పతికిఁ బెన్నిధు లబ్బున్
గుండ్ల విరోధి సోదరుఁడు కోపము సంతస మంద నాత్మలో
బండ్లగు నోడ లొక్క త్రుటి బండ్లు సెలంగును గొప్ప యోడలై
పండ్లు జలమ్ము పుష్పములు భక్తి నొసంగి రమామనో ధవుం
బెండ్లముఁ జేరి మ్రొక్కు పతి పెన్నిధులన్గని పొందు సేమమున్
[పెండ్లముఁ జేరి = చేరి పెండ్లమును]
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
దండ్లను వేయుచు భక్తిగ
పండ్లు సమర్పించుచుండి భగవంతునికిన్
కండ్లను మూయుచు శ్రీహరి
పెండ్లమునకు మ్రొక్కుపతికిఁ బెన్నిధులబ్బున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబండ్లకు నెత్తిధాన్యము నివాసము జేర్చి కరమ్ము తుష్టి రెం
రిప్లయితొలగించండిడేండ్లకు చాలు సస్యముల నింటనమర్చి పోషనార్థమై
పెండ్లి యెనర్చ పుత్రికకు, వేంకట నాథుని మందిరమ్ములో
పెండ్లముఁ జేరి మ్రొక్కు పతి పెన్నిధులన్ గని పొందు సేమమున్