20, డిసెంబర్ 2023, బుధవారం

సమస్య - 4621

21-12-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తన సొగసు దయ్యముగఁ దోఁచె దర్పణమున”
(లేదా...)
“తన సౌందర్యము నద్దమందుఁ  గనినన్ దయ్యంబుగాఁ  దోఁచెనే”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

32 కామెంట్‌లు:

  1. తేటగీతి
    రామచంద్రుని వనవాసరభసఁగూర్చి
    నేలఁగూలి సౌభాగ్యమ్ము నిందలంది
    రాజమాతయైనను కైక రగిలి పొగులఁ
    దన సొగసు దయ్యముగఁ దోఁచె దర్పణమున!


    మత్తేభవిక్రీడితము
    వనవాసమ్మునకంపి రామునిఁ బతిన్ బాధించి పంతమ్ముతోఁ
    దన సౌభాగ్యము నేలరాల వగతో దాపమ్మునన్ ఖిన్నయై
    కనులన్ జిందిన బాష్పముల్ తిలకమున్ గార్చంగ కైకమ్మకున్
    తన సౌందర్యము నద్దమందుఁ గనినన్ దయ్యంబుగాఁ దోఁచెనే!

    రిప్లయితొలగించండి
  2. మందమౌ మేను పూతల అందములతొ
    తళుకు బెళుకుల చిత్రాల కలికి కొమ్మ
    ముఖము కడగంగ గృహమేగి ముద్దుగుమ్మ
    తన సొగసు దయ్యముగఁ దోఁచె దర్పణమున

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది
      అనిన్ అనడం సాధువు కాదు

      తొలగించండి
    3. సవరణతో.....

      వినిపించెన్ గద వాణి కంస విభుకున్ విస్పష్టమౌ రీతిగా
      తన సైదోడుకు పుట్టి చంపుఁ దననే తత్గర్భ సంజాతమై
      పనిపై పూతననంపె పద్మముఖియై ప్రాణంబు దీయంగ పూ
      తన సౌందర్యము నద్దమందుఁ గనినన్ దయ్యంబుగాఁ దోఁచెనే

      తొలగించండి

  4. స్తన్యమిచ్చి బాలకుని తా జంపనెంచి
    స్తనములందున విషము పూతనయె దాల్చి
    సుందరాంగిగ మారినన్ జోద్య మదియె
    తన సొగసు దయ్యముగఁ దోఁచె దర్పణమున.


    చను బాలిచ్చి వహంతమున్ దునుమగా ఛందమ్మునే నిండుగా
    స్తనమందున్ ధరియించి పూతనయె తాజానైన తన్వంగి గా
    తనరూపంబును మార్చనేమి యట చోద్యంబందె రాకాసియే
    తన సౌందర్యము నద్దమందుఁ గనినన్ దయ్యంబుగాఁ దోఁచెనే.

    రిప్లయితొలగించండి
  5. నెలవునంత శుభ్రపరచి నిదురబోయి
    తెల్లవారనె నామెకు దెలివి రాగ
    చెదరిన చికురముల జక్కజేయనంత
    తన సొగసు దయ్యముగఁ దోఁచె దర్పణమున

    రిప్లయితొలగించండి
  6. మ.

    మునులన్ దారిని మార్చమంచు బలుకుల్ మోహమ్ములో ముంచెడిన్
    ఘనమౌ నాట్యము జేసి గానములచే గవ్వించు పొన్నారియై
    వనమున్ సాగిన రాసలీల సలుపన్ భారంబు దేహంబుతో
    *దన సౌందర్యము నద్దమందుఁ గనినన్ దయ్యంబుగాఁ దోఁచెనే!*

    రిప్లయితొలగించండి
  7. పలు విధంబగు పూతలు వదన మునకు
    నలదు కొంచును మిక్కిలి య ద్భు తంపు
    కీలక o బగు ముస్తాబు కృత్రిమ మగు
    తన సొగసు దయ్యముగ దో చె దర్పణ మున

    రిప్లయితొలగించండి
  8. అన్నమో రామ చంద్రాయటంచు నలమ
    టించు ప్రజల నడుమ తన ఠీవి తగ్గ
    కుండ వారిని పీడించు కుత్సితునికి
    తన సొగసు దయ్యముగ దోచె దర్పణమున


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వాహ్... మళ్లీ ఎన్నాళ్ళకెన్నాళ్ళకు మీ దర్శనం!
      ఈ రకంగా మీ మీ క్షేమ సమాచారం తెలిసింది. సంతోషం

      తొలగించండి
  9. జనసందోహము వింతగా దలచిరా శాస్త్రీయ సమ్మేళనన్
    తనవారందరగూడి వింతలను సందర్శింపగా నేగఁగా
    ఘనమౌ దర్పణమొండు గాంచె సుమ ప్రాకారంపు మధ్యమ్మునన్
    తన సౌందర్యము నద్దమందుఁ గనినన్ దయ్యంబుగాఁ దోఁచెనే

    రిప్లయితొలగించండి
  10. శాస్త్ర సమ్మేళనమ్మున సరళ గాంచె
    నిలువుటద్దము గోడకు నిలువబెట్టి
    వింతగాదోచి చూచెడునంతలోన
    తన సొగసు దయ్యముగఁ దోఁచెదర్పణమున

    రిప్లయితొలగించండి
  11. తే॥ తనసొగసుఁ గని నిరతముఁ దనయు తరుణి
    ముసలి తనమందు నందము పొంకముండఁ
    బోదని గ్రహించ జాలక ముద్దుగఁ గన
    తన సొగసు దయ్యముగఁ దోఁచె దర్పణమున

    మ॥ తనువున్ డస్సిన వార్ధకమ్మునను సత్వంబట్లు క్షీణించినన్
    మనసే యొప్పదు తగ్గె నందమని సామాన్యంబుగన్ గాంచఁగన్
    గనకన్ సత్యము నొక్క యింతి ఘనమౌ గారాముతో సాగుచున్
    దన సౌందర్యము నద్దమందు గనినన్ దయ్యంబుగాఁ దోఁచెనే

    రిప్లయితొలగించండి
  12. కంసు డంపగ వచ్చెను కలికి యొకతె
    బాల కృష్ణుని పరిమార్చు బాధ్యతగొనె
    నమతి పూ"తన సొగసు దయ్యముగఁ దోఁచె
    దర్ప ణమున" ప్రతిఫలింప తనదురూపు

    రిప్లయితొలగించండి
  13. రాక్షసాకృతియువిడచియురాగ మొలుకొని
    శూర్ప ణఖయును మెఱసెగా చూడ రాము
    కాంక్ష తీరక విరహయైకనలె నంత
    తనసొగసుదయ్యముగ దోచెదర్పణమున

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    రంగులద్దుచు లోపమ్ముల సరిజేసి
    వదనమును తీర్చి దిద్దగ పడుచు వోలె
    చిత్రమందు నటించి సాయంత్రమునకు
    కడిగి రంగులను గృహము కడను జూడ
    తన సొగసు దయ్యముగఁ దోచె దర్పణమున.

    రిప్లయితొలగించండి