26-12-2023 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ధర్మమూర్తులె కావింత్రు దారుణములు”(లేదా...)“ధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణంబగు కృత్యముల్”(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)
తేటగీతిద్రోణ గురువును గూల్చగ ద్రౌణి నామముచ్ఛరించి పిదప కరి చచ్చెననుచుగొంతుసవరించి ధర్మజుడంతుఁ జూసెధర్మమూర్తులె కావింత్రు దారుణములు! మత్తకోకిలచర్మమొప్పిన మేకవన్నెను శ్వాపదమ్మును బోలుచున్మర్మమెంచియు ద్రౌణినామపు దంతిచచ్చిన వ్యాఖ్యలన్ధర్మరాజట ద్రోణుఁ జంపెను దాచి మెల్లగ కంఠమున్ధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణంబగు కృత్యముల్!
☝గురువు ద్రోణుడు మరణించిన తరువాత దుర్యోధనుని ఆవేదన☝
పదుగుర కవసరమ్మగు భవనములను గూల్చు తమను ప్రశ్నించెడు కోవి దుండ్రనడచు హీన చరితుల సహాయమున నధర్మమూర్తులె కావింత్రు దారుణములు.
కర్మపాశము పట్టె భీష్ముని కాంచెనోటమి విజ్ఞుడైదుర్మతిన్గనెయోధనుండునుతూలనాడెనుకృష్ణునిన్మర్మమెంచినధర్మజుండును మాయ జేసెను ద్రోణునిపైధర్మమూర్తులొనర్తు వెప్పుడు దారుణంబగుకృత్యముల్
ద్రోణునిన్
నిర్మలమ్మగు మానసంబున నిర్గుణాత్ముని గొల్చుచున్ ధర్మమార్గము వీడబోవరు, తట్టమయ్యది చేరగానోర్మిజూపుచు సాగవారలె యుత్తముండ్రిల నెవ్విధిన్ ధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణంబగు కృత్యముల్?
ఎన్నికల లోన మమ్ముల నెన్ను కొనినదప్పక ప్రజలందరి కుచితముల నిడుటతొడగెదమనుచు నమ్మించు ధూర్తులగు యధర్మమూర్తులె కావింత్రు దారుణములు
మ. కో.దుర్మతిన్ రుమఁబట్టు వాలిని దున్మె రాముడు దాగుచున్ గర్మభూమిని భీష్మ సంహృతిఁ గార్యసిద్ధిగఁ గృష్ణుడేమర్మమున్ దెలుపంగ ద్రోణ సమస్యఁ దీర్చగ సూచనల్ *ధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణంబగు కృత్యముల్.*
ధర్మ మూర్తుల కర్తవ్య తత్వమరయధర్మమాయని మదిలోని తలపులేలధర్మమూర్తులే బద్ధులు కర్మములకుధర్మమూర్తులె కావింత్రు దారుణములుధర్మ మూర్తుల దారుణంబుల తత్వమెర్గర సోదరాధర్మమాయని చిత్తమందున ధర్మ చింతన యేలరాధర్మమూర్తులు కర్మబద్ధులు దారుణంబులు తప్పకేధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణంబగు కృత్యముల్
హంగులార్భాటములు సల్పి దొంగగురులుకర్మ యోగినని జనుల నమ్మబలుకుమర్మమెరిగితినని చెప్పి మతకరించు"ధర్మమూర్తు"లె కావింత్రు దారుణములు
నిర్మలాత్ముని జేరుమార్గము నేనటంచును బల్కుచున్దుర్మధమ్మున కన్నుగానక దుష్టచేష్టల వీగుచున్ కర్మయోగిని మానవాళికి కాంతి రేఖను నేననేధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణంబగు కృత్యముల్
ధర్మమెంచక దేవరాయడు దానమిమ్మని కర్ణునిన్దుర్మతుండయి కుండలమ్ములతోడ వర్మము కోరగన్నిర్మలాత్ముడు కర్ణుడిచ్చెను నీమమున్ విడనాడకన్ధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణంబగు కృత్యముల్
ధర్మమెంచక శక్రుడు దానకర్ణుఁవద్దకేతెంచి విప్ర రూపము వహించిగోరె కవచముతోగూడి కుండలములధర్మమూర్తులె కావింత్రుదారుణములు
ధర్మపీఠముదద్దరిల్లగ దారఁబంపెనుఁరాముడున్మర్మమెంతయుదెల్సియున్మరి మాటదప్పని కర్ణుడున్నిర్మలుండగు ధర్మజుండటు నిష్ఠవీడిన వాడునైధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణంబగు కృత్యముల్కొరుప్రోలు రాధాకృష్ణరావు
మంచి మార్గాన వ ర్తించు మనుజు లు గదధర్మ మూర్తులె :: కా విం త్రు దారుణములుదురిత మతు లౌ చు ధరణి లో దుష్ట జనులుపరుల పీ డింప నెంచ రే పాపులగుచు
తే॥ గురువనుచు గురి నిలుపుచు గరిమ తోడ విద్య నేకలవ్యుఁడు నేర్వ విద్యఁ గనినగురువు నంగుళీయముఁ గోర కోసి యొసఁగెధర్మ మూర్తులె కావింత్రు దారుణములుమత్త॥ మర్మమెంచక నేకలవ్యుఁడు మన్ననన్ గని కోరఁగన్మర్మయెంతయొ నింపి ద్రోణుఁడు మారు మాటను బల్కకన్గర్మమియ్యదటంచు దక్షిణగా నొసంగెను వ్రేలినిన్ధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణంబగు కృత్యముల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
క్షమించాలి తేటగీతిలో మూడవ పాదమును సవరించానండి."గురువు నంగుళమును గోర కోసి యొసఁగె"ఇలా చదువుకొనవలసినదిగా విన్నపము
తే.గీ:ధర్మ మిది యని,మా సంప్రదాయ మనియుమనుజులను విభజించుచు మానవతనుమదిన దలచక దానినే మతమనెడు న ధర్మమూర్తులె యొనరింత్రు దారుణములు
ప్రశ్నోత్తరిమ.కో:ధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణ మ్మగు కృత్యముల్?ధర్మమున్ విడనాడి రాజులె దారుణమ్ము లొనర్చినన్దర్మమూర్తులె యిట్లు మారు కథాళి పూర్వము నున్నవే?నిర్మలుండగు భార్గవుండె గణింపగా నుపమానమౌ
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. ధర్మ మార్గమును విడిచి ధర్మ కర్తదైవ భీతియు లేకుండ దేవుని ధనముఁ దిగ మ్రింగుచు చేతురు మోసముల నధర్మమూర్తులె కావింత్రు దారుణములు.
కర్మమంచును పేదవారల కష్టమున్ బడ ద్రోయుచున్ధర్మమార్గము వీడి పోవుచు తస్కరించుచు సొమ్ములన్శర్మమొందగ, దొడ్డిదారిని సాగు వారల కాచుచున్,ధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణ మ్మగు కృత్యముల్
తేటగీతి
రిప్లయితొలగించండిద్రోణ గురువును గూల్చగ ద్రౌణి నామ
ముచ్ఛరించి పిదప కరి చచ్చెననుచు
గొంతుసవరించి ధర్మజుడంతుఁ జూసె
ధర్మమూర్తులె కావింత్రు దారుణములు!
మత్తకోకిల
చర్మమొప్పిన మేకవన్నెను శ్వాపదమ్మును బోలుచున్
మర్మమెంచియు ద్రౌణినామపు దంతిచచ్చిన వ్యాఖ్యలన్
ధర్మరాజట ద్రోణుఁ జంపెను దాచి మెల్లగ కంఠమున్
ధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణంబగు కృత్యముల్!
☝గురువు ద్రోణుడు మరణించిన తరువాత దుర్యోధనుని ఆవేదన☝
తొలగించండి
రిప్లయితొలగించండిపదుగుర కవసరమ్మగు భవనములను
గూల్చు తమను ప్రశ్నించెడు కోవి దుండ్ర
నడచు హీన చరితుల సహాయమున న
ధర్మమూర్తులె కావింత్రు దారుణములు.
కర్మపాశము పట్టె భీష్ముని కాంచెనోటమి విజ్ఞుడై
రిప్లయితొలగించండిదుర్మతిన్గనెయోధనుండునుతూలనాడెనుకృష్ణునిన్
మర్మమెంచినధర్మజుండును మాయ జేసెను ద్రోణునిపై
ధర్మమూర్తులొనర్తు వెప్పుడు దారుణంబగుకృత్యముల్
ద్రోణునిన్
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండినిర్మలమ్మగు మానసంబున నిర్గుణాత్ముని గొల్చుచున్
ధర్మమార్గము వీడబోవరు, తట్టమయ్యది చేరగా
నోర్మిజూపుచు సాగవారలె యుత్తముండ్రిల నెవ్విధిన్
ధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణంబగు కృత్యముల్?
ఎన్నికల లోన మమ్ముల నెన్ను కొనిన
రిప్లయితొలగించండిదప్పక ప్రజలందరి కుచితముల నిడుట
తొడగెదమనుచు నమ్మించు ధూర్తులగు య
ధర్మమూర్తులె కావింత్రు దారుణములు
మ. కో.
రిప్లయితొలగించండిదుర్మతిన్ రుమఁబట్టు వాలిని దున్మె రాముడు దాగుచున్
గర్మభూమిని భీష్మ సంహృతిఁ గార్యసిద్ధిగఁ గృష్ణుడే
మర్మమున్ దెలుపంగ ద్రోణ సమస్యఁ దీర్చగ సూచనల్
*ధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణంబగు కృత్యముల్.*
ధర్మ మూర్తుల కర్తవ్య తత్వమరయ
రిప్లయితొలగించండిధర్మమాయని మదిలోని తలపులేల
ధర్మమూర్తులే బద్ధులు కర్మములకు
ధర్మమూర్తులె కావింత్రు దారుణములు
ధర్మ మూర్తుల దారుణంబుల తత్వమెర్గర సోదరా
ధర్మమాయని చిత్తమందున ధర్మ చింతన యేలరా
ధర్మమూర్తులు కర్మబద్ధులు దారుణంబులు తప్పకే
ధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణంబగు కృత్యముల్
హంగులార్భాటములు సల్పి దొంగగురులు
రిప్లయితొలగించండికర్మ యోగినని జనుల నమ్మబలుకు
మర్మమెరిగితినని చెప్పి మతకరించు
"ధర్మమూర్తు"లె కావింత్రు దారుణములు
నిర్మలాత్ముని జేరుమార్గము నేనటంచును బల్కుచున్
రిప్లయితొలగించండిదుర్మధమ్మున కన్నుగానక దుష్టచేష్టల వీగుచున్
కర్మయోగిని మానవాళికి కాంతి రేఖను నేననే
ధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణంబగు కృత్యముల్
ధర్మమెంచక దేవరాయడు దానమిమ్మని కర్ణునిన్
రిప్లయితొలగించండిదుర్మతుండయి కుండలమ్ములతోడ వర్మము కోరగన్
నిర్మలాత్ముడు కర్ణుడిచ్చెను నీమమున్ విడనాడకన్
ధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణంబగు కృత్యముల్
ధర్మమెంచక శక్రుడు దానకర్ణుఁ
రిప్లయితొలగించండివద్దకేతెంచి విప్ర రూపము వహించి
గోరె కవచముతోగూడి కుండలముల
ధర్మమూర్తులె కావింత్రుదారుణములు
ధర్మపీఠముదద్దరిల్లగ దారఁబంపెనుఁరాముడున్
రిప్లయితొలగించండిమర్మమెంతయుదెల్సియున్మరి మాటదప్పని కర్ణుడున్
నిర్మలుండగు ధర్మజుండటు నిష్ఠవీడిన వాడునై
ధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణంబగు కృత్యముల్
కొరుప్రోలు రాధాకృష్ణరావు
మంచి మార్గాన వ ర్తించు మనుజు లు గద
రిప్లయితొలగించండిధర్మ మూర్తులె :: కా విం త్రు దారుణములు
దురిత మతు లౌ చు ధరణి లో దుష్ట జనులు
పరుల పీ డింప నెంచ రే పాపులగుచు
తే॥ గురువనుచు గురి నిలుపుచు గరిమ తోడ
రిప్లయితొలగించండివిద్య నేకలవ్యుఁడు నేర్వ విద్యఁ గనిన
గురువు నంగుళీయముఁ గోర కోసి యొసఁగె
ధర్మ మూర్తులె కావింత్రు దారుణములు
మత్త॥ మర్మమెంచక నేకలవ్యుఁడు మన్ననన్ గని కోరఁగన్
మర్మయెంతయొ నింపి ద్రోణుఁడు మారు మాటను బల్కకన్
గర్మమియ్యదటంచు దక్షిణగా నొసంగెను వ్రేలినిన్
ధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణంబగు కృత్యముల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిక్షమించాలి తేటగీతిలో మూడవ పాదమును సవరించానండి.
తొలగించండి"గురువు నంగుళమును గోర కోసి యొసఁగె"
ఇలా చదువుకొనవలసినదిగా విన్నపము
తే.గీ:ధర్మ మిది యని,మా సంప్రదాయ మనియు
రిప్లయితొలగించండిమనుజులను విభజించుచు మానవతను
మదిన దలచక దానినే మతమనెడు న
ధర్మమూర్తులె యొనరింత్రు దారుణములు
ప్రశ్నోత్తరి
రిప్లయితొలగించండిమ.కో:ధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణ మ్మగు కృత్యముల్?
ధర్మమున్ విడనాడి రాజులె దారుణమ్ము లొనర్చినన్
దర్మమూర్తులె యిట్లు మారు కథాళి పూర్వము నున్నవే?
నిర్మలుండగు భార్గవుండె గణింపగా నుపమానమౌ
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
ధర్మ మార్గమును విడిచి ధర్మ కర్త
దైవ భీతియు లేకుండ దేవుని ధన
ముఁ దిగ మ్రింగుచు చేతురు మోసముల న
ధర్మమూర్తులె కావింత్రు దారుణములు.
కర్మమంచును పేదవారల కష్టమున్ బడ ద్రోయుచున్
రిప్లయితొలగించండిధర్మమార్గము వీడి పోవుచు తస్కరించుచు సొమ్ములన్
శర్మమొందగ, దొడ్డిదారిని సాగు వారల కాచుచున్,
ధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణ మ్మగు కృత్యముల్