14, డిసెంబర్ 2023, గురువారం

సమస్య - 4615

15-12-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కనులకు వీనులకు విందు గద యుద్ధమ్మే”
(లేదా...)
“యుద్ధము నేత్ర పర్వముగ నుండును పిమ్మటఁ గర్ణపేయమౌ”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

28 కామెంట్‌లు:

 1. జనులకు తెరపై గనుటకు
  వినోద మొసగునని సన్నివేశము లెపుడున్
  మనసారగందు రెల్లరు
  కనులకు వీనులకు విందు గద యుద్ధమ్మే.

  రిప్లయితొలగించండి
 2. కందం
  వనితా రత్నమ! సొగసుల
  మునిపంటను నొక్కి కేళి మునిగెడు వేళన్
  దనరెడు సడిమత్తిడఁగన్
  గనులకు, వీనులకు విందు గద యుద్ధమ్మే!

  ఉత్పలమాల
  సిద్ధము సేసి మల్లెలను సిగ్గులమొగ్గగ జేరితే సఖీ!
  యుద్ధతి నిక్కు నందములు నోపక నే ముని పంటనొక్కి నీ
  యద్దమరాతిరిన్ జెలగు నంగజకేళిని సవ్వడుల్ వినన్
  యుద్ధము నేత్ర పర్వముగ నుండును పిమ్మటఁ గర్ణపేయమౌ!

  రిప్లయితొలగించండి
 3. వినరా ! తమ్ముడ ! చెప్పెద,
  పెనిమిటి జననికి తరుణికి పెచ్చుగ జరుగున్
  కనుచుండ ప్రక్క వారికి
  కనులకు వీనులకు విందు గద యుద్ధమ్మే

  రిప్లయితొలగించండి

 4. (రామ రావణ యుద్ధము జరుగువేళ ఇద్దరు రాక్షసుల మాటలుగా)

  కనుటకు కుణపము లెన్నియొ
  వినగను మరణించువారి వేధన కేకల్
  తినగను విరివిగ మాంసము
  కనులకు వీనులకు విందు గద యుద్ధమ్మే.  బుద్ధియె లేని రావణుడు భూమిజ సీతను బంధిసే యగా
  క్రుద్ధము బూని రాఘవుడు క్రూరునితో జగడమ్ము గోరి తా
  నిద్ధర జేరవచ్చె నికనీరువు పుష్కల మందు గాదె యీ
  యుద్ధము నేత్ర పర్వముగ నుండును పిమ్మటఁ గర్ణపేయమౌ.

  రిప్లయితొలగించండి

 5. బుద్ధియె లేని దర్శకుడు మోజుగ దీసన నొక్క చిత్రమం
  దిద్దరు ప్రేయసీ ప్రియులునింపగు కార్యమటంచు నచ్చటన్
  బద్ధవిరోధులట్లు కడు పావన మోటమెఱుంగ నట్టి యా
  యుద్ధము నేత్ర పర్వముగ నుండును పిమ్మటఁ గర్ణపేయమౌ.

  రిప్లయితొలగించండి
 6. ఉ.

  బద్ధము స్త్రీల రాజ్యమున వాహము చిత్రము లోకమంతటన్
  సిద్ధము నశ్వమేధమున జిష్ణువు జూడ ప్రమీల ముగ్ధయై
  క్రుద్ధుడు గాక ప్రేమనిడ గోమలి రమ్యము విల్లునెత్తెడిన్
  *యుద్ధము నేత్ర పర్వముగ నుండును పిమ్మటఁ గర్ణపేయమౌ.*

  రిప్లయితొలగించండి
 7. కినుక వహించిన సత్యను
  అనునయమొనరించ కృష్ణుడనువర్తించన్
  ఒనరుబడు ప్రణయ కలహము
  కనులకు వీనులకు విందు గద యుద్ధమ్మే

  రిప్లయితొలగించండి
 8. పెను వి షాద ము నింపుచు
  ఘన విలయము సృష్టి కిదియ కారణము గదా
  మనుజులు కోర ర దె ట్టుల
  కనులకు వీనులకు విందు గద యు ద్ధమ్మే?

  రిప్లయితొలగించండి
 9. పెద్దకుళాయి చెంత ప్రతి వేకువ ఝామున మంచినీటికై
  బద్ధవిరోధులై చెలఁగు భామల మధ్యన వాగ్వివాదముల్
  తద్దయు త్రోపులాటలును దారుణమౌ సిగపట్ల గోత్రముల్
  యుద్ధము నేత్ర పర్వముగ నుండును పిమ్మటఁ గర్ణపేయమౌ

  రిప్లయితొలగించండి
 10. కనివిని యెరుగని రీతిగ
  ననుదినము కుళాయి చెంత నతివల నడుమన్
  పెనఁగొను వాగ్వాదమ్ములు
  కనులకు వీనులకు విందు గద యుద్ధమ్మే

  రిప్లయితొలగించండి
 11. కం॥ మన చలనచిత్ర మందున
  ఘనమగు పోరును గనఁగను ఘన హాస్యమ్మే
  మనమున కిచ్చును దెలుపఁగఁ
  గనులకు వీనులకు విందు గదయుద్ధమ్మే!

  ఉ॥ బుద్ధియు లేకఁ జేసెదవొ మొద్దుగ నిద్దురఁ దెల్లవారెనే
  బద్ధక వీరుడంచుఁ దన భామయె నిద్దుర వీడమన్నచో
  క్రుద్ధత మీరఁగన్ ఘనుఁడు కోమలి తోడను సల్ప యుద్ధమున్
  యుద్ధము నేత్ర పర్వముగ నుండును పిమ్మటఁ గర్ణపేయమౌ

  రిప్లయితొలగించండి
 12. కం:మనమున మంత్రులు,రాజులు
  కనుగొన చదరంగ మందు కల్పన లయ్యున్
  కనగా,విన వ్యాఖ్యానము
  కనులకు వీనులకు విందు కద యుద్ధమ్మే
  (చదరంగం ఒక కల్పితయుద్ధం.చూస్తుంటే,కామెంటరీ వింటుంటే కనువిందు,వీనుల విందు కూడా.)

  రిప్లయితొలగించండి
 13. ఉ:ఇద్ధర జూద మందున గ్రహించిన మత్తున నింత ధర్మసం
  బద్ధత వీడి ద్రౌపదికి బాధ నొనర్తువొ యెల్లి పార్థుతో
  యుద్ధము నేత్రపర్వముగ నుండును, పిమ్మట కర్ణపేయమౌ
  నుద్ధతి తోడ నీ యురమె యొక్క గదాహతి జీలు రోదనల్

  రిప్లయితొలగించండి

 14. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  విననగు భేరీ శబ్దము
  లనిలో ఖడ్గములు,డాలుల సడుల్ నినదిం
  చిన వారి కేకలు కనగ
  కనులకు, వీనులకు విందు గద యుద్ధమ్మే.

  రిప్లయితొలగించండి
 15. సిద్ధమొనర్చిరో చలన చిత్రము పెద్దలు గాంచ యుక్తమే
  నద్దిరబన్న దానిఁ గని హత్తుకు పోవును జంటలన్నియున్
  ముద్దుల దృశ్యముల్ భళిర మోహము తీవ్రము జేయు శయ్యపై
  యుద్ధము నేత్ర పర్వముగ నుండును పిమ్మటఁ గర్ణపేయమౌ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మన చలనచిత్రములలో
   కనవచ్చునుగద విలాసి కామంగామిన్
   ఘనతర పర్యంకము పై
   కనులకు వీనులకు విందు గద యుద్ధమ్మే

   తొలగించండి
 16. వినుమిది సత్యము జగతిని
  జనములుపడుచున్న గొడవ సతతము వీధిన్
  కనులారగనెడి వారల
  *"కనులకు వీనులకు విందు గద యుద్ధమ్మే”*

  రిప్లయితొలగించండి