29, డిసెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4630

30-12-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బకములఁ గని చేపలనుచు వ్రాసిరి సుకవుల్”
(లేదా...)
“బకములఁ జూచి చేపలని వ్రాసిరి కైతల లోన సత్కవుల్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

35 కామెంట్‌లు:

 1. వికసించిన కుసుమమువలె
  యకలంకుండై దనరెడు స్యందుని వోలెన్
  మొకముమెరయు కోమలియం
  బకములఁ గని చేపలనుచు వ్రాసిరిసుకవుల్

  రిప్లయితొలగించండి

 2. సుకుమారిని వర్ణించుచు
  వికసుని బోలిన ముఖమున బింబము లధరా
  లు కలిగిన యా పడతి యం
  బకములఁ గని చేపలనుచు వ్రాసిరి సుకవుల్.  వికసిత పూర్ణబింబమది భీరువు మోరమటంచు నామె వే
  ణిక గన చామ వర్ణపు ఫణీంద్రుడు కాంచగ సుందరాంగి చూ
  చుకమది దీపపుష్పమనుచున్ వచి యించి విశాల మైన యం
  బకములఁ జూచి చేపలని వ్రాసిరి కైతల లోన సత్కవుల్.

  రిప్లయితొలగించండి
 3. వికసిత కమలము కరణి ని
  సుకుమారి వదన ము నందు శోభి లు చు కడున్
  బ్రకటి త మై తో చెడు నం
  బ కములు గని చేప లనుచు వ్రాసిరి సు కవు ల్

  రిప్లయితొలగించండి
 4. ఒకపరి తటాకము కడకు
  బకములు చేరి జలము పయి వ్రాలిన వేళన్
  తికమకన నీట బింబపు
  బకములఁ గని చేపలనుచు వ్రాసిరి సుకవుల్

  రిప్లయితొలగించండి
 5. అకలుష కుసుమస్యంద
  న్మకరందముల మరపించు మాకందరసా
  త్మకములగు యాలలన చుం
  బకములఁ గని చేపలనుచు వ్రాసిరి సుకవుల్

  రిప్లయితొలగించండి
 6. వికచ సరోరుహమ్మువలె వెన్నెలరాయనివోలె స్వచ్ఛమౌ
  ముకురము వంటి మోముగల ముగ్ధ మనోహర నారియంచు యం
  బకములఁ జూచి చేపలని వ్రాసిరి కైతల లోన సత్కవుల్
  సుకవులు సుందరాంగులగు సుప్రియలన్ గణుతింతురివ్విధిన్

  రిప్లయితొలగించండి
 7. అకలుష కుసుమస్యంద
  న్మకరందముల మరపించు మంజుల కరుణా
  త్మకములగులలన చటులాం
  బకములఁ గని చేపలనుచు వ్రాసిరి సుకవుల్

  రిప్లయితొలగించండి
 8. రిప్లయిలు
  1. కం॥ సకలము నాకు తెలుసునని
   వికలము కాఁగ మధువుఁ గొన విజ్ఞత తనకం
   బకమును బకమని నుడివెన్
   బకములఁ గని చేపలనుచు వ్రాసిరి సుకవుల్

   చం॥ సకలము నాకు తెల్సునని చక్కగఁ బల్కె నిటుల్ ఘనమ్ముగన్
   బకములఁ జూచి చేపలని వ్రాసిరి కైతల లోన సత్కవుల్
   వికలము కాఁగ మానవుని విజ్ఞత మద్యముఁ ద్రావ నాతడం
   బకములనే బకమ్ములని వర్ణనఁజేయఁగ నవ్వి పోయిరే

   తొలగించండి
  2. మరొక పూరణండి

   చం॥ చకితులు గాఁగ మీనములఁ జక్కగఁ బోలు నటంచు నింతి యం
   బకములఁ జూచి చేపలని వ్రాసిరి కైతల లోన సత్కవుల్
   సకలము దైవ నిర్మితము సాధ్యము గాదు పటుత్వ కైతలన్
   వికసిత నీలి కన్నులను వేరుగ వర్ణనఁ జేయఁ గాంచఁగన్

   తొలగించండి
 9. కం:సకలప్రకృతిన్ బురుషుల
  చకితుల జేయంగ జాలు చతురలు స్త్రీలే
  సుకుమారము లగు లలనాం
  బకముల గని చేప లనుచు వ్రాసిరి సుకవుల్

  రిప్లయితొలగించండి
 10. ఉ:ఒక మగవాని పై లలన యోరగ జూపు నిగిడ్చి నంతనే
  సకలము వీడి పూరుషుడు చక్కగ జిక్కును చేప వోలె నీ
  ప్రకృతిని జూచి యెందులకొ పాపము స్త్రీలను మెచ్చి వారి యం
  బకముల జూచి చేప లని వ్రాసిరి కైతల లోన సత్కవుల్
  (స్త్రీల ఓర చూపులకి మగవాళ్లే చేపల లాగా వాళ్ల వల ల్లో చిక్కుతారు.కానీ కవులు స్త్రీల కళ్లనే చేపల లాగా వర్ణిస్తుంటారు.)

  రిప్లయితొలగించండి
 11. సకలముధర్మమేయనుచుసాయుధుడౌగదనంతరంగమున్
  ముకుళితహస్తుడైప్రజలమోకరిలున్గగశుద్ధసత్వుడై
  మకిలినిచూడకుండనికమాదొరవీడనిభ్రాంతిబొందుచున్
  బకములఁజూచిచేపలనివ్రాసిరికైతలలోనసత్కవుల్

  రిప్లయితొలగించండి
 12. అకలంక విశా లానన
  వికసిత మందస్మిత పరివేష్టిత వనితా
  నిక రాసితప్రవిమలాం
  బకములఁ గని చేఁపలనుచు వ్రాసిరి సుకవుల్


  వికచ సరోరుహాస్య గణ విస్తృత చంచల రమ్య లోచన
  ప్రకరములన్ ఝషాలిగను వర్ణన మింపుగఁ జేసి పిమ్మటన్
  సకల సరోవరేద్ధ జల సంచరితప్లవ చారు నూత్న శా
  బకములఁ జూచి చేఁపలని వ్రాసిరి కైతల లోన సత్కవుల్

  రిప్లయితొలగించండి
 13. కందం
  సకలమెఱిఁగి జ్ఞానమ్మున,
  నికరముగన్ దొంగ జపము నెఱుప కొలనిఁ 'గౌ
  తుకమున నేముండుననగ?'
  బకములఁ గని, 'చేపల'నుచు వ్రాసిరి సుకవుల్!

  చంపకమాల
  సకలమెఱింగి జ్ఞానమయ చక్షువులన్గని వర్ణనమ్ములన్
  ప్రకటన జేసెడున్ బటిమ రాజిల, 'దొంగ జపమ్ము నందుఁ గౌ
  తుకమున నుండు నేమనఁగ?' తొందరనెంచి సరస్సు యొడ్డునన్
  బకములఁ జూచి, 'చేపల'ని వ్రాసిరి కైతల లోన సత్కవుల్

  రిప్లయితొలగించండి
 14. చకచక వ్రాయుచు కావ్యము
  నొకటొకటిగ వ్రాయుచుండి యుత్కంఠతతోన్
  వికచాంభోరుహ ముఖియం
  బకములఁ గని చేపలనుచు వ్రాసిరి సుకవుల్

  రిప్లయితొలగించండి
 15. చం.

  సకలము నాక్రమించి కడి సంపద గైకొను నీతి ధర్మముల్
  శకులములోగిరమ్ము జలసంధిని వైనము నోటికందగా
  వికలము దృశ్యముల్ పలుక విత్తము దూరము శ్లాఘనీయమౌ
  *బకములఁ జూచి చేపలని వ్రాసిరి కైతల లోన సత్కవుల్.*

  రిప్లయితొలగించండి

 16. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  సుకుమారి యొకతె కన్పడ
  ప్రకటితమౌ చెక్కిలి యధరమ్ముల తోడన్
  వికసిత వదనమ్మున నం
  బకములఁ గని చేపలనుచు వ్రాసిరి సుకవుల్.

  రిప్లయితొలగించండి

 17. పికశుక రాగ గాత్రమున వేవురు మెప్పును పొంది మించి పొం
  దికగల మేని సౌరు గణుతింపగ నచ్చరలన్నడంచు న
  చ్చకితను గాంచి మత్తున రసైకత నందుచు చెంగలించు నం
  బకములఁ జూచి చేపలని వ్రాసిరి కైతల లోన సత్కవుల్

  రిప్లయితొలగించండి