20-12-2023 (బుధవారం) కవిమిత్రులారా, ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... “రమ్ము లరుణవర్ణ భీకరమ్ములు గనఁగన్” (లేదా...) “రమ్ములు రక్త వర్ణ రుచిరమ్ములు సర్వభయంకరమ్ములున్” (ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)
దమ్మముతప్పి కూటమున ద్రౌపది వస్త్రము లూడ్చినట్టి యా ద్రిమ్మరి దుస్ససేనునివధించి యురమ్మును జీల్చి రక్తమున్ గుమ్ముగ గ్రోలబూనెడు వృకోదరు నిప్పులు గ్రక్కుచున్న నే త్రమ్ములు రక్త వర్ణ రుచిరమ్ములు సర్వ భయంకరమ్ములున్
రిప్లయితొలగించండి(ఖాండవ వనదహన సమయమున జరిత మనోవేదన)
ఇమ్మహి నెటనుండెనొ కద
మిమ్ముల నాకొసగి చనియె మీ జనకుడయో
మిమ్ముల గావగ లేనగి
రమ్ము లరుణవర్ణ భీకరమ్ములు గనఁగన్.
నిమ్మకు నెత్తు నీరువలె నీ జనకుండు తపమ్ము పేరుతో
మిమ్ముల నాకొసంగి చనె మీకిపు డెంతటి ముప్పు జేరెనో
యమ్ములు రాల్చి కృష్ణసఖు డాటవి గాల్చుచు నుండ ప్రాతటీ
రమ్ములు రక్త వర్ణ రుచిరమ్ములు సర్వభయంకరమ్ములున్.
కందం
రిప్లయితొలగించండినమ్మినదేవుఁ గనెద కం
బమ్మునఁ జూపుమన తండ్రి, ప్రహ్లాద నుతిన్
గ్రమ్మ నృసింహ నఖ కఠా
రమ్ము లరుణవర్ణ భీకరమ్ములు గనఁగన్!
ఉత్పలమాల
నమ్మిన నీదు దైవమును నర్మిలి జూచెదనంచుఁ దండ్రి కం
బమ్మును మోదుచున్ గదను బాలుని గోరఁగ వాని స్తోత్రమై
క్రమ్మె నృసింహమై హరి! కరాగ్ర నఖమ్ములె బోలఁగన్ గఠా
రమ్ములు రక్త వర్ణ రుచిరమ్ములు సర్వభయంకరమ్ములున్!!
నమ్ముము మహిలో విధ్వం
రిప్లయితొలగించండిసమ్ములు గడుజరు గుచుండు
సంగరములచే
నిమ్మలముండదు సుమి గో
రమ్ము లరుణవర్ణ భీకరమ్ములు గనఁగన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికమ్మని కూరిమి భావము
రిప్లయితొలగించండినెమ్మన మున లేక జరుగు నీచ రణ ములో
జిమ్మెడు వీర వరుల రుధి
రమ్ములరుణ వర్ణ భీక రమ్ములు గనన్
ఇమ్మహినెక్కడహరియని
రిప్లయితొలగించండిబమ్మవరమ్ము నుపడసిన వాడడుగవడిన్
కుమ్మగవచ్చినహరినే
*“త్రమ్ము లరుణవర్ణ భీకరమ్ములు గనఁగన్”*
కొమ్మ యభిలాష దీర్చక
రిప్లయితొలగించండిపొమ్మనగనె , వేగ కెంపు పొదుగిన వాటిన్
కమ్మల ధరింప జేయు క
రమ్ము లరుణవర్ణ భీకరమ్ములు గనఁగన్
ఉ.
రిప్లయితొలగించండిఅమ్మకు నిచ్చె మాట దివి హాయిగఁ జేరెను వైనతేయుడే
బమ్మెర ఠక్కురుల్ అమృత భాండముఁ దెచ్చెను పోరు గెల్వగన్
వమ్ముగఁ జేసె దాస్యమునుఁ బాములఁ దిండిగ గెబ్బెడిన్ విషా
*రమ్ములు రక్త వర్ణ రుచిరమ్ములు సర్వభయంకరమ్ములున్.*
నెమ్మిని పతిఁ జేరి చెవుల
రిప్లయితొలగించండికమ్మలు తెమ్మన్న గొనక గమ్మున యున్నన్
అమ్మణి యాక్రోషపు నే
త్రమ్ము లరుణవర్ణ భీకరమ్ములు గనఁగన్
అమ్మిక ప్రాణము విడిచిన
రిప్లయితొలగించండిపిమ్మట తాండవమొనర్చె విషకంఠుడు క్రో
ధమ్మెగయగ నాతని హా
రమ్ము లరుణవర్ణ భీకరమ్ములు గనఁగన్
అమ్మిక చూడనెంచెనట యజ్ణము దక్షుడు పిల్వకుండినన్
బిమ్మట పొందెనెల్లిదము వీడెను ప్రాణము కుండమందునన్
జిమ్మన రుద్రతాండవము చేయగనా సెగకంటి కంఠ హా
రమ్ములు రక్త వర్ణ రుచిరమ్ములు సర్వభయంకరమ్ములున్
దమ్మముతప్పి కూటమున ద్రౌపది వస్త్రము లూడ్చినట్టి యా
రిప్లయితొలగించండిద్రిమ్మరి దుస్ససేనునివధించి యురమ్మును జీల్చి రక్తమున్
గుమ్ముగ గ్రోలబూనెడు వృకోదరు నిప్పులు గ్రక్కుచున్న నే
త్రమ్ములు రక్త వర్ణ రుచిరమ్ములు సర్వ భయంకరమ్ములున్
దమ్మము దప్పిన కౌరవ
రిప్లయితొలగించండిదిమ్మరి దుశ్శాసనుని రుధిరమును గ్రోలన్
దమ్ముగ నిలచిన భీము క
రమ్ము లరుణవర్ణ భీకరమ్ములు గనఁగన్
శ్రీకృష్ణుడు రాయబార సమయమున ధృతరాష్ట్రునితో
రిప్లయితొలగించండికం॥ ఇమ్ముగ సంధిని కోరక
రమ్మనఁ బోరుకుఁ దలఁపవొ రణరంగమునన్
గ్రమ్మగ పాండు సుతుల క్షా
త్రమ్ము లరుణవర్ణ భీకరమ్ములు గనఁగన్
ఉ॥ ఇమ్ముగ సంధిఁ గోరెదవొ యిష్టముఁ బోరునఁ జూపనెంతువో
నమ్ముము నాదు వాక్కులను నమ్మిన మేలగుఁ గౌరవేంద్రుఁడా!
క్మమ్మగఁ బాండు పుత్రులకు ఘాటగు రోషముఁ దెల్ప వారి క్షా
త్రమ్ములు రక్కవర్ణ రుచిరమ్ములు సర్వభయంకరమ్ములున్
రక్తవర్ణ పొరపాటున రక్కవర్ణ యైనదండి
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
క్రమ్మగను పాత కక్షలు
నమ్మక ద్రోహమ్ముతోడ నరుకగ హితులన్
చిమ్మిన రక్తమున శరీ
రమ్ము లరుణవర్ణ భీకరమ్ములు గనగన్.