16, డిసెంబర్ 2023, శనివారం

సమస్య - 4617

17-12-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“క్రూరమృగము లాకుకూరలఁ దిను”
(లేదా...)
“క్రూరమృగమ్ము లెప్పుడును గోరి తినున్ గద యాకుకూరలన్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

18 కామెంట్‌లు:


  1. సాధు జంతువనియె సాకుచునుంటిమి
    ప్రేమతోడ మేము వేశమందు
    ఛగలి యదియె నిజము సర్వభక్షయె, కాదు
    క్రూరమృగము, లాకుకూరలఁ దిను.

    రిప్లయితొలగించండి
  2. కలియుగాంతమందు కలుగు వింతలుమెండు
    పురుష పుంగవులకు పురుడు గల్గు
    లేచి ఱంకె వేయు లేపాక్షి బసవయ్య
    క్రూరమృగము లాకుకూరలఁ దిను”

    రిప్లయితొలగించండి
  3. ఆటవెలది
    రాగమతిశయింప రాజు సుతునిఁ బెంచె
    కొమరుఁడు భరతుని శకుంతల కని
    కలసి యాడ నతడు కణ్వాశ్రమమ్మున
    క్రూరమృగము లాకుకూరలఁ దిను!

    ఉత్పలమాల
    వీరవరేణ్యునిన్ బగిది వేడ్క శకుంతల పెంచె పుత్రనిన్
    సారసనేత్రుడై 'భరత' నామము శోభిల నేర్చె విద్యలన్
    ధీరుడు సింహముల్ పులుల తేరుగ నాడగ గణ్వ వాటికన్
    క్రూరమృగమ్ము లెప్పుడును గోరి తినున్ గద యాకుకూరలన్!

    రిప్లయితొలగించండి
  4. హింస వలదటంచు హితవు నొసంగుచు
    విజ్ఞులిడిన మాట వినిన వేళ
    లోకుల మది మార లొకమందున గల
    క్రూరమృగము లాకుకూరలఁ దిను

    రిప్లయితొలగించండి
  5. భారము కానెకాదది శుభమ్మును గూర్చునటంచు చెప్పగా
    పేరిమి బెంచుచుంటిమి నివేశము నందున గోవు నొక్కటిన్
    క్షీరమొసంగ లాభమది చేకురు పైరము లన్న గావురా
    క్రూరమృగమ్ము , లెప్పుడును గోరి తినున్ గద యాకుకూరలన్

    రిప్లయితొలగించండి
  6. ఆశ్రమమ్ములందునానందమొందుచు
    తిరుగుచుండునిలను తీరు గాను
    జనులతోడకలసి చక్కగాసతతము
    *“క్రూరమృగము లాకుకూర లఁదిను”*


    రిప్లయితొలగించండి
  7. ఉ.

    తోరముగా శరీరమును దూల్చుచు మాంసమునొందు భక్షణల్
    *క్రూరమృగమ్ము లెప్పుడును గోరి తినున్ గద,... యాకుకూరలన్*
    దీరుగ గంధమున్ జనులు ధీమక భోజనమున్ భుజించెడిన్
    గారము దైవభక్తి దివికై భజనల్ తనరింత్రు ధన్యులై.

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. తీరుతెన్నులెపుడు మారకుండును చూడ
      క్రూరమృగము లాకుకూరలఁ దిను
      ట మనమెరుగముగద సమయమేదైనను
      మాంస భక్షణమ్ము మానబోవు


      మారని లోకమందు పెను మార్పులు గాంచుట సంభవించునా
      కోరిన జంతువుల్నడచి కోరిక తీరగ వాటి మాంసమున్
      గ్రూరమృగమ్ము లెప్పుడును గోరి తినున్ గద; యాకుకూరలన్
      గోరిభుజించు నెన్నడును గోవులు మేకలు సాధు జంతు

      తొలగించండి
  9. శాంతివనమునందు సకల జీవులలోన
    శ్రాంతి వెల్లివిరియు రాజితముగ
    కర్వరములు లేళ్ళు కలిసి కట్టుగ నుండు
    క్రూరమృగము లాకుకూరలఁ దిను

    రిప్లయితొలగించండి
  10. ఆశ్ర.. మాల యందు నావాస మున్నట్టి
    జంతు తతులు మారె సాత్వి కముగ
    మునుల వోలె నవియు పూత చిత్తు లగుచు
    క్రూర మృగ ము లాకు కూ ర లు దిను

    రిప్లయితొలగించండి
  11. కోరవు మాంసభక్షణముఁ గోరవు వైరముశాంతమూర్తులై
    కూరిమి సాధుజీవనము గోరుకొనున్ విపినంబు నందునన్
    క్షీరము నిచ్చు కర్వరము చింబునకున్ ముని యాశ్రమంబునన్
    క్రూరమృగమ్ము లెప్పుడును గోరి తినున్ గద యాకుకూరలన్

    రిప్లయితొలగించండి
  12. ముక్క లేక యొక్క ముద్ద మ్రింగని వారు
    పప్పునేతులు తిని పరగు చుండు
    కలయొ భ్రమయొ ఇద్ది కార్తీక మహిమయో
    క్రూరమృగము లాకుకూరలఁ దిను

    రిప్లయితొలగించండి
  13. ఆ॥ సాధు జంతువులను జంపి తినుచునుండు
    "క్రూర మృగము లాకుకురులఁ దిను"
    ననఁగఁ గల్ల గాద వినఁగ నేమి ఫలము
    గలుగు నెరుగ నైతి తెలుపు మయ్య

    ఉ॥ “క్రూరమృగమ్ము లెప్పుడును గోరి తినున్ గద యాకుకూరలన్”
    నేరకఁ దెల్పినారిటుల నేముముఁ దప్పున జంతుజాలముల్
    వీరతఁ జూపి జంతువుల వేటాడి చంపి భుజించునే కనన్
    గ్రూరమృగమ్ము లెప్పుడును గోరున యట్టివి యాకుకూరలన్?

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    మునుల యాశ్రమముల మున్ను క్రూర
    మృగాలు
    సాధు జంతువులును సంచరించు
    చుండ కలసి మెలసి, చూడ నచ్చెరువగు
    క్రూరమృగము లాకుకూరలఁ దిను.

    రిప్లయితొలగించండి