15, డిసెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4616

16-12-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్వర్గమం దప్సరలు పతివ్రతలె సుమ్ము”
(లేదా...)
“వాసిన్ గాంత్రు పతివ్రతా మణులుగా స్వర్గంబునం దప్సరల్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

17 కామెంట్‌లు:

  1. అచ్చరలకు పతియన స్వర్గాధిపతియె
    యిష్టమైనను పతిమాట కష్టమైన
    తామెపుడు పతియానతి దాటరుగద,
    స్వర్గమం దప్సరలు పతివ్రతలె సుమ్ము.

    రిప్లయితొలగించండి
  2. మయసభలో తనను ద్రౌపది పరాభవించిఁదన్న కసితో దుర్యోధనుని కారుకూతలు:

    తేటగీతి
    కులట పంచభర్తృక కృష్ణ గుప్పెనవ్వు
    మయసభ పరాభవమ్మును మఱచుటెట్లు?
    ద్రౌపది పతివ్రతగనెంచి చూపఁ దగిన
    స్వర్గమం దప్సరలు పతివ్రతలె సుమ్ము!

    శార్దూలవిక్రీడితము
    కాసింతైనను వీడదే స్మృతినవజ్ఞాదుఃఖమా కృష్ణ నే
    కాసారంఋనఁదూలుచున్ మయసభన్ గాల్జార హాసింపఁగన్
    వేసమ్మందుఁ బతివ్రతామణిగ సంవీక్షింప పాంచాలినిన్
    వాసిన్ గాంత్రు పతివ్రతా మణులుగా స్వర్గంబునం దప్సరల్!

    రిప్లయితొలగించండి
  3. ఇంద్రుడు తమను పంపగ యిలపయిన
    తాపసులను కూడిరి , వారి తపము భంగ
    పరచుటకయి , యంతియె గాని వారిని గన
    స్వర్గమం దప్సరలు పతివ్రతలె సుమ్ము

    రిప్లయితొలగించండి
  4. తపము మాన్ఫగ ధరణికి తరలి వచ్చి
    భంగ పరచు చు నుండెడు పతులు లేని
    వార లై యుండ నెట్టుల పలుక దగును
    స్వర్గ మం దప్సరలు పతి వ్రతలు సుమ్ము,?

    రిప్లయితొలగించండి

  5. (వరూధిని ప్రవరాఖ్యునితో మాటాడిన మాటలు)

    నేలను జనించు పడతికే నియమములవి
    యమృత పానుల పొందది యకము కాదు
    దోష మంటదు రమ్మిటు తోషమందు
    స్వర్గమం దప్సరలు పతివ్రతలె సుమ్ము


    నీ నర్వంసహలో జనించు సతికే నేమంబులే హెచ్చు గా
    దే సావిత్రుడ యాలకించుమిదియే దీనత్వమున్ వీడు పే
    యూషంబున్ జవిగొన్న పడతిన్ ద్యోసత్తునే నేనటన్
    వాసిన్ గాంత్రు పతివ్రతా మణులుగా స్వర్గంబునం దప్సరల్.

    రిప్లయితొలగించండి
  6. వేసంబందున తళ్కుబెళ్కులు సమావేశించగా నప్సరల్
    గాసింబెట్టుచు మౌనివర్యుల తపోఘాతంబొనర్పంగనే
    దోసంబున్ మదినెంచకన్ ద్యుపతికిన్ దోస్థమ్ము గావించుచున్
    వాసిన్ గాంత్రు పతివ్రతా మణులుగా స్వర్గంబునం దప్సరల్

    రిప్లయితొలగించండి
  7. ద్యుపతి యానతి తలదాల్చి యుక్తిబన్ని
    తళుకు బెళుకుల జూపించి తాపసులకు
    భంగమొనరింప తపమును బాళిపట్టు
    స్వర్గమం దప్సరలుపతివ్రతలె సుమ్ము

    రిప్లయితొలగించండి
  8. తే॥ తమ కొసఁగిన యానతులను దర్కముఁ గన
    కుండఁ దలఁదాల్చుచుఁ బ్రభువు కోరినటుల
    సేవలఁ గని నడచుకొను భామలైరి
    స్వర్గమం దప్సరలు పతివ్రతలె సుమ్ము

    శా॥ వేసంబుల్ గనిరంట యాజ్ఞలను సంప్రీతిన్ ముగించంగనే
    మోసంబుల్ గనిరంట యాజ్ఞలను సంపూర్ణంబుగన్ జేయనే
    దోసంబుల్ బ్రభువాజ్ఞలన్ దలుపకన్ దుష్టిన్ బ్రవర్తించుచున్
    వాసిన్ గాంత్రు పతివ్రతామణులుగా స్వర్గంబునం దప్సరల్

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:చిత్ర మేమన నీ పాడు చిత్ర మందు
    పతితకున్ శచీదేవి యన్ పాత్ర దక్కె
    స్వర్గమం దప్సరలు పతివ్రతలె సుమ్ము
    నటనలును స్వభావమ్ములు నటు నిటయ్యె
    (చెడి పోయిన స్త్రీకి శచీదేవి పాత్ర దక్కి,పతివ్రతలకి అప్సరస పాత్ర లిచ్చారు.)

    రిప్లయితొలగించండి
  10. శా:ఓ సద్బ్రాహ్మణ! దేవతాంగనను న న్నూహింపుమా భార్యగా !
    నీ సాంగత్యము బొందు నప్సరసలే నిన్ వీడి యింద్రాదులన్
    దోస మ్మెంచక బల్వురిన్ బడయు నుద్యోగమ్ములన్ వీడరే
    వాసిన్ గాంత్రు పతివ్రతా మణులు గా స్వర్గమ్మునం దప్సరల్
    (ప్రవరుని తో వరూధిని-ఏ అప్సరస లైనా నిన్ను వివాహం చేసుకుంటే చాలు.వాళ్లకి అనేక దేవతలు కావాలి అనిపించక పతివ్రతలు గా మిగులుతారు అని తన కోరికని ధర్మప్రబోధం లాగా చెప్పింది. )

    రిప్లయితొలగించండి
  11. శా.

    భాసంతుండు సమన్వయించు గణుతిన్ వాల్గంటి ప్రార్థించెడిన్
    మోసాలన్ గనరాక భక్తి, రహియున్ మూలమ్ము భూలోకమున్
    *“వాసిన్ గాంత్రు పతివ్రతా మణులుగా,..... స్వర్గంబునం దప్సరల్*
    దోసాలన్ విడువంగ చేతనముతో దూకొంద్రు నింద్రాజ్ఞచే.

    రిప్లయితొలగించండి
  12. ఇంద్ర సభయందు రంజిలు ఇష్టసఖులు
    శక్రునాస్థానమందున జక్కదనము
    వెరసి సుర'పతి' ఆనను మీరకుండు
    స్వర్గమం దప్సరలు పతివ్రతలె సుమ్ము

    రిప్లయితొలగించండి
  13. ధర్మ నిరతితోడ చరింత్రు తరుణులైన
    నచ్చరల్ పాపమనియెడు మచ్చలేని
    వారు స్వర్గవధువులని వాసిమీఱు
    స్వర్గమం దప్సరలు పతివ్రతలె సుమ్ము

    ఏసంక్షోభమునైన మార్కొనుటకై నెల్లప్పుడున్ బంపినన్
    గాసంతైనను భీతిలేక చనరో కాంతామణుల్ వేగమున్
    దోసంబంటదు వారికిన్ దలపగా తోడ్పాటులోభాగమై
    వాసిన్ గాంత్రు పతివ్రతా మణులుగా స్వర్గంబునం దప్సరల్

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ఇంద్రు నాజ్ఞను పాటించు నింతు లెప్పు
    డతిథు లేతెంచ స్వాగతమంద జేయు
    నాట్యముల తోడ దేవకన్యలు నిరతము
    స్వర్గమం; దప్సరలు పతివ్రతలు సుమ్ము!

    రిప్లయితొలగించండి
  15. వాస ముందురు సతతము వజ్రి చెంత
    స్వర్గమందప్సరలు , పతివ్రతలు సుమ్ము
    పుడమిననసూయ సావిత్రి భూమి జాది
    వెలదులేయని తెల్పిరి విబుధులెల్ల

    రిప్లయితొలగించండి