11, డిసెంబర్ 2023, సోమవారం

సమస్య - 4612

12-12-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శిలలుగా మారె శిల్పముల్ చిత్రగతిని”
(లేదా...)
“శిల్పంబుల్ శిలలయ్యె నయ్యెడ నహో చిత్రాతిచిత్రంబుగన్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

29 కామెంట్‌లు:

  1. కలలు కల్లలయ్యెను కాల గమనమందు,
    శిల్ప చాతుర్య విభవమ్ము జీర్ణమయ్యె
    ధూర్తులు శిథిల మొనరించి ధూళిఁగలుప
    శిలలుగా మారె శిల్పముల్ చిత్రగతిని.

    రిప్లయితొలగించండి
  2. ఉలుల తాడనములచేత ఉజ్వలముగ
    అలరుచుండెడు శిల్పాలు అవతరించె
    ఖలుల ఆక్రమణల వల్ల భరతవనిని
    శిలలుగా మారె శిల్పముల్ చిత్రగతిని

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    తగిన శిల్పివి జక్కనా! తలను వంచి
    వందనంబిడుదెన్ నవబ్రహ్మవీవు
    మునుపు గాంచితి నిచ్చోట కనుల వీని
    శిలలుగా! మారె శిల్పముల్ చిత్రగతిని


    శార్దూలవిక్రీడితము
    తల్పంబందున మేనిసోయగములన్ దర్పంబునన్ జూపఁగన్
    శిల్పాచార్యుడవౌచు జక్కన శిలన్ శిల్పంబుగన్ దీర్చితే!
    కల్పంబెట్టుల నేర్చితో నలువవే కాకున్న రూపొందునే
    శిల్పంబుల్! శిలలయ్యె నయ్యెడ నహో చిత్రాతిచిత్రమ్ముగన్! !

    రిప్లయితొలగించండి
  4. రక్ష చేసెడి వారలు రాజ్య మందు
    మచ్చు కైనను గన రాక మాయ మైరి
    శిలలు గా మారె శిల్పలు చిత్ర గతిని
    యనుచు లోకులు బల్కిరి యార్తి తోడ

    రిప్లయితొలగించండి

  5. భారతీయ సంస్కృతికవి పట్టు కొమ్మ
    లనుచు శిల్పాలనే చెక్కిరైరి నాడు
    కుత్సితుల దండ యాత్రన కూల్చగ నట
    శిలలుగా మారె శిల్పముల్ చిత్రగతిని.



    శిల్పంబుల్ మన సంస్కృతిన్ దెలుపు ప్రాచీనంపు సత్సంపదన్
    దెల్పన్ జేయగ నాటిచారపతులే దేవాలయా లందునన్
    నిల్పన్ జేసిన నేమి పాపరతులౌ నీచుండ్రె కూల్చంగ నా
    శిల్పంబుల్ శిలలయ్యె నయ్యెడ నహో చిత్రాతిచిత్రంబుగన్.

    రిప్లయితొలగించండి
  6. శిల్పులు నెరిగ చెక్కిన శిల్పములకు
    దాపున ప్రకృతి వైపరీత్యము దలమున
    వీచిన పవనమునకవి విరిగి పడగ
    శిలలుగా మారె శిల్పముల్ చిత్రగతిని

    రిప్లయితొలగించండి
  7. శా.

    శిల్పుల్ చెక్కి రనేక రీతుల రహిన్ జిందించు పాంచాలికల్
    అల్పుల్ యుద్ధములన్ జయించి పగతో హానంబు జేకూర్చెడిన్
    గోల్పోవంగ దయన్ విదేశ కరముల్ కొట్టన్ గురూపమ్ముగా
    *శిల్పంబుల్ శిలలయ్యె నయ్యెడ నహో చిత్రాతిచిత్రంబుగన్.*

    రిప్లయితొలగించండి
  8. తల్పమేగద నిద్రకు తావు నొసగు
    నిద్రలో కలలే హాయినిచ్చు కతన
    హాయిగ నిటుల ప్రశ్నల నీయవచ్చు
    “శిలలుగా మారె శిల్పముల్ చిత్రగతిని”

    తల్పంబుల్ సరియైన నిద్రకు సదా తావౌను యోచింపగన్
    స్వల్పంబౌ కలలిచ్చి హాయినొసగున్ సంతృప్తి చేకూరగా
    కల్పింపందగు ప్రశ్నలివ్విధి కవుల్ కాంక్షించు వైదుష్యమున్
    "శిల్పంబుల్ శిలలయ్యె నయ్యెడ నహో చిత్రాతిచిత్రంబుగన్"

    రిప్లయితొలగించండి
  9. చదువు‌‌ నేర్చినవారంత‌ చవటలైరి‌
    పెరిగె‌ నాగరికతపట్టె‌ పిచ్చిబాట‌
    తుదకు‌ మనకొక విషయంబు‌ తోచుచుండె‌
    శిలలుగా మారె శిల్పముల్ చిత్రగతిని

    రిప్లయితొలగించండి
  10. దమనకాండకు నొడిగట్టి దారుణముగ
    యవన సంతతి దండెత్తి యాలయముల
    శిల్పసంపద ధ్వంసమ్ము చేసిరయ్యొ
    శిలలుగా మారె శిల్పముల్చిత్రగతిని

    రిప్లయితొలగించండి
  11. శిల్పంబుల్ భరతావనిన్ గుడులలో శిష్టంపు సౌభాగ్యముల్
    నిల్పన్ సంస్కృతి దీర్ఘకాలికముగా నెక్కొన్నవీ నేలలో
    నల్పుల్ మ్లేచ్ఛులు దండయాత్రల ఫలంబాఛిద్రమౌ సంపదల్
    శిల్పంబుల్ శిలలయ్యె నయ్యెడ నహో చిత్రాతి చిత్రంబుగన్

    రిప్లయితొలగించండి
  12. తే॥ శిలలపై శిల్పములఁ జెక్కి శిలకు రూపు
    నొసఁగ నాలనా పాలనా నోచు కొనక
    ముష్కరులు గూల్చ ఛిద్రమై పోయె నేఁడు
    శిలలుగా మారె శిల్పముల్ చిత్రగతిని

    శా॥ శిల్పంబుల్ ఘన సంప్రదాయ ప్రగతిన్ జిత్రీకరించంగ నా
    శిల్పంబుల్ పరదేశ ముష్కరులటుల్ ఛిద్రంబు గావించిరే
    యల్పుల్ ధూర్తులు కచ్చతోఁ జనుచు హాహాకారముల్ సేయుచున్
    శిల్పంబుల్ శిలలయ్యె నయ్యెడ నహో చిత్రాతి చిత్రంబుగన్

    రిప్లయితొలగించండి
  13. పలుకలేకున్న శిలలన్ని నిలచియున్న
    వర్ణనాంశములందున వరలుచుండు
    ఆశనత్యాసలందున యలరునపుడు
    శిలలుగామారెశిల్పముల్ చిత్రగతిని!

    రిప్లయితొలగించండి
  14. జక్కనాదిశిల్పులిలనుచక్కనైన
    శిల్పములనాలయములందు చెక్కినిల్ప
    జాతిగౌరవమునుచాటజగతియందు
    కుత్సితమతితోకూళలు కూల్చినంత
    శిలలుగామారెశిల్పముల్ చిత్రగతిని

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    రాజు లానాడు చెక్కించె రమ్యమైన
    శిల్పముల నెన్నొ నాలయ క్షేత్రములను
    మూర్ఖులై మతఛాందస ముష్కర తతి
    దండయాత్రలు చేయుచు దాడిచేయ
    శిలలుగా మారె శిల్పముల్ చిత్రగతిని.

    రిప్లయితొలగించండి