29-12-2023 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“బింబము లనేకములు ప్రతిబింబ మొకటె”(లేదా...)“వసుధన్ బింబము లెన్ని యున్నఁ బ్రతిబింబం బొక్కటే దోఁచెనే”(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)
తేటగీతికలిమిఁ గలుగంగ గర్వమ్ము వలదు వలదుపంచభూత నిర్మితదేహమంచితముగవేరు రూపాలఁ గొని కడ విరుగునటులెబింబము లనేకములు ప్రతిబింబ మొకటె!మత్తేభవిక్రీడితముఅసలీదేహము పంచభూతమయమై యాకారముల్ బొంద మీకిసుమంతైనను గర్వముండతగునా? యెంచెంచి మీ సంపదేయసువుల్ బాసిన తక్షణంబు విడి తానౌ పంచభూతాలుగన్వసుధన్ బింబము లెన్ని యున్నఁ బ్రతిబింబం బొక్కటే దోఁచెనే!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
ఆత్మ లన్నిటగల పరమాత్మ ఓలెబింబము లనేకములు ప్రతిబింబ మొకటెసర్వ మతములు బోధించు సారమిదియె సుఖము మైత్రిన కలహించ దుఃఖ మయము
మీ పూరణ బాగున్నదిపరమాత్మ వోలె...మైత్రిని అనండినాల్గవ పాదంలో ప్రాసయతి తప్పింది. శోకమయము అనండి
ధన్యవాదములు ఆర్యా. 🙏
మతములగ్గలముగ బుట్టె మానవాళియందు , వాటిని బూర్తిగ నాకళించనొప్పిరి జనులందరు దైవ మొక్కడె యనిబింబము లనేకములు ప్రతిబింబ మొకటె
మంచి పూరణ
🙏🏽
ప్రాణికోటిని నివసించు పరము డతడుకణము కణమున శక్తియై ఘనత నందుభాసురంబగు జీవులు బాహ్య మందుబింబములనేకములు ప్రతిబింబ మొకటె
మీ పూరణ బాగున్నది
వివిధ రూ పాల లో నున్న వేల్పుల నిలకొలుచు చుండుట చూ డంగ తె లియ గలదుబింబ ము లనే కములు ప్రతి బింబ మొకటెయనె డు సత్యంబు వచి యించి రార్యు లెపు డొ
పసివాడాతఁడు మౌనిగామెలగుచున్పారంబుతాజూపుగాకసితో సాధన గోపికల్మనములో కంజాక్షు దర్శించిరేమిసిమిన్గన్నులమేలమాడిరటనేమింగోరకాభామలున్వసుధన్బింబములెన్నియున్న ప్రతిబింబంబొక్కటైదోచెనే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది
ధన్యవాదములండి
కాంచగ ప్రకృతి యందున కలువరేడుతొవల రాయిడికాడును దొండ పండురంగులను మార్చి తిరుగాడు ప్రాణి చిత్రబింబము లనేకములు ప్రతిబింబ మొకటె.నిసిలో జ్యోత్స్నిక కాంతులీనునతడా నీద్రుండు తానున్న నక్కసమున్ రాల్చెడు భాస్కరుండదిగొ యాకాశమ్ము నందున్న నీహసమున్ వీడని నీ బెడంగు వదనమ్మద్దమ్ము నన్ గాంచగావసుధన్ బింబము లెన్ని యున్నఁ బ్రతిబింబం బొక్కటే దోఁచెనే.
డా. బల్లూరి ఉమాదేవి గగన మందున యగుపించు కలువ రేడుతానొకడెయయిననుపంచు తనదు కాంతిజగతిజనులకు ననయము. చక్కగాను*"బింబము లనేకములు ప్రతిబింబ మొకటె”*
అసువుల్ దాల్చిన జీవజాలములలో నాత్మాను రూపంబునన్మసలున్ దైవమనేక చేతములుగా మాయా విశేషంబుచేకుసిలింతన్బడనేల చింతనమునన్ గుహ్యంపు సత్యంబిదేవసుధన్ బింబము లెన్ని యున్నఁ బ్రతిబింబం బొక్కటే దోఁచెనే
తే॥ అద్దముల గదిఁ జేరఁగ నగుపడుఁ గదబింబము లనేకములు ప్రతిబింబ మొకటెయైన సత్యము నిత్యము నైన దైవమొకటె వివిధ రూపమ్ముల నొప్పు నిటులెమ॥ మసలన్ నచ్చిన రీతిగన్ గొలిచి సమ్మానమ్ముతో ధాత్రిలోవెసులున్ బొందఁగఁ జేసిరందు మనుజుల్ వేవేల రూపంబులన్వసుధన్ దేవుని, దైవ మొక్కటని సంభావించ వేదాదులున్వసుధన్ బింబము లెన్ని యున్నఁ బ్రతిబిం బొక్కటే దోఁచెనే
వసుధన్ బింబము లెన్ని యున్నఁ బ్రతిబింబం బొక్కటే దోఁచెనేసమస్యను తప్పుగా టైపు చేసానండి
తే.గీ:నాకు నొక్కడే బిడ్డ ,యన్నకు నలువురుఆన్ననే పోలు నట్టివే యైనవి ప్రతిబింబము లనేకములు ప్రతిబింబ మొకటెనాకు గారాబ మతని పై నాకు హెచ్చు.
నమస్కారం గురువు గారు! ధన్యవాదం.
మ:అసమానత్వపు జాతకమ్ము లెవియో ఆ యింటనే యుండె, వారసులన్ బొందగ నన్నదమ్ము లతి ఘోరమ్మైన నిష్ఠల్ సదావిసుగున్ బొందక జేయ నొక్కడె కనెన్ బిడ్డన్ భళా!వసుధన్ బింబము లెన్ని యున్న ప్రతిబింబ మ్మొక్కటే తోచెనే(ఆ ఇంట్లో అన్నదమ్ము లందరూ బిడ్డలు కావాలని ఏవో నిష్ఠలు చేశారు.కానీ బిడ్డ జన్మించినది ఒక్కరికే.అన్ని బింబా లున్నా ఆ వంశానికి ప్రతిబింబం ఒక్కటే.)
మ:వసుధన్ బింబ మదొక్కటుండి,ప్రతిబింబమ్ముల్ పదుల్ గాదె యంచసిధారన్ వచియించు వాగ్మియె పరధ్యాసన్ వచించెన్ "సఖా!వసుధన్ బింబము లెన్ని యున్న ప్రబింబ మ్మొక్కటే తోచెనే!అసలౌ సత్య మిదే" యటంచు వినువా రాశ్చర్యమున్ బొందగన్.(అసలైన బింబం ఒక్కటే కానీ ప్రతిబింబాలు వేరు అనేది తాత్త్విక బోధ.ఆ ఉపన్యాసకుడు గొప్పవాడే ఐనా పరధ్యాస తో "బింబా లనేకం,ప్రతిబింబ మొక్కటి" అన్నాడు.)
చాలా చక్కని సమస్య.మూడు పూరణలు చెయ్యా లనిపించింది.
జీవజాలము లన్నిట చేరియుండియంతరాత్మగ వర్తిల్లు నక్షయుండుబింబ రూపము తాదాల్చి పిచ్చలముగబింబము లనేకములు ప్రతిబింబ మొకటె
ఒక్క రొక్కొక్క నామమ్ము నుచ్చరించికొలుచు చుండ మోక్షమ్మును గోరి వింత నెంచ దేవుఁ డొక్కఁడె నామ మేది యైన బింబము లనేకములు ప్రతిబింబ మొకటె లసదంతఃకర ణాలయస్థిత పరబ్రహ్మంబ యవ్యగ్రమై వసియించున్ స చరాచరప్రచుర జీవస్వాంత బింబౌఘ మంద సమీక్షించుచుఁ బ్రాణి కర్మములు నిర్వ్యాపార మేపారఁగన్ వసుధన్ బింబము లెన్ని యున్నఁ బ్రతిబింబం బొక్కటే దోఁచెనే
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నాయి
నమఃపూర్వక ధన్యవాదములండి.
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. దర్పణములు కొన్ని గది యందమరజేసినట్టి యద్దాల గదిలోకి యడుగిడి యొకడందు బింబములను గనె వందలాదిబింబము లనేకములు ప్రతిబింబ మొకటె.
మ.రసముల్ తొమ్మిది పూర్ణమై మనము సారస్యంబుఁ జేకూరెడిన్దెసలన్ వ్యాపకుడైన దేవునిగఁ గౌంతేయుల్ స్తుతుల్ చేయగన్హసమున్ గృష్ణుడనేక రూపములతో నావిర్భవించున్ విధిన్*వసుధన్ బింబము లెన్ని యున్నఁ బ్రతిబింబం బొక్కటే దోఁచెనే.*
Revised poem2)మ:అసమానత్వపు జాతకమ్ము లెవియో ఆ యింటనే యుండె, వారసులన్ బొందగ నన్నదమ్ము లతి ఘోరమ్మైన నిష్ఠల్ సదావిసుగున్ బొందక జేయ నొక్కడె కనెన్ బిడ్డన్ భళా! చిత్రమౌవసుధన్ బింబము లెన్ని యున్న ప్రతిబింబ మ్మొక్కటే తోచెనే(ఆ ఇంట్లో అన్నదమ్ము లందరూ బిడ్డలు కావాలని ఏవో నిష్ఠలు చేశారు.కానీ బిడ్డ జన్మించినది ఒక్కరికే.అన్ని బింబా లున్నా ఆ వంశానికి ప్రతిబింబం ఒక్కటే.)
తేటగీతి
రిప్లయితొలగించండికలిమిఁ గలుగంగ గర్వమ్ము వలదు వలదు
పంచభూత నిర్మితదేహమంచితముగ
వేరు రూపాలఁ గొని కడ విరుగునటులె
బింబము లనేకములు ప్రతిబింబ మొకటె!
మత్తేభవిక్రీడితము
అసలీదేహము పంచభూతమయమై యాకారముల్ బొంద మీ
కిసుమంతైనను గర్వముండతగునా? యెంచెంచి మీ సంపదే
యసువుల్ బాసిన తక్షణంబు విడి తానౌ పంచభూతాలుగన్
వసుధన్ బింబము లెన్ని యున్నఁ బ్రతిబింబం బొక్కటే దోఁచెనే!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిఆత్మ లన్నిటగల పరమాత్మ ఓలె
రిప్లయితొలగించండిబింబము లనేకములు ప్రతిబింబ మొకటె
సర్వ మతములు బోధించు సారమిదియె
సుఖము మైత్రిన కలహించ దుఃఖ మయము
మీ పూరణ బాగున్నది
తొలగించండిపరమాత్మ వోలె...మైత్రిని అనండి
నాల్గవ పాదంలో ప్రాసయతి తప్పింది. శోకమయము అనండి
ధన్యవాదములు ఆర్యా. 🙏
తొలగించండిమతములగ్గలముగ బుట్టె మానవాళి
రిప్లయితొలగించండియందు , వాటిని బూర్తిగ నాకళించ
నొప్పిరి జనులందరు దైవ మొక్కడె యని
బింబము లనేకములు ప్రతిబింబ మొకటె
మంచి పూరణ
తొలగించండి🙏🏽
తొలగించండిప్రాణికోటిని నివసించు పరము డతడు
రిప్లయితొలగించండికణము కణమున శక్తియై ఘనత నందు
భాసురంబగు జీవులు బాహ్య మందు
బింబములనేకములు ప్రతిబింబ మొకటె
మీ పూరణ బాగున్నది
తొలగించండివివిధ రూ పాల లో నున్న వేల్పుల నిల
రిప్లయితొలగించండికొలుచు చుండుట చూ డంగ తె లియ గలదు
బింబ ము లనే కములు ప్రతి బింబ మొకటె
యనె డు సత్యంబు వచి యించి రార్యు లెపు డొ
మంచి పూరణ
తొలగించండిపసివాడాతఁడు మౌనిగామెలగుచున్పారంబుతాజూపుగా
రిప్లయితొలగించండికసితో సాధన గోపికల్మనములో కంజాక్షు దర్శించిరే
మిసిమిన్గన్నులమేలమాడిరటనేమింగోరకాభామలున్
వసుధన్బింబములెన్నియున్న ప్రతిబింబంబొక్కటైదోచెనే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది
తొలగించండిధన్యవాదములండి
తొలగించండి
రిప్లయితొలగించండికాంచగ ప్రకృతి యందున కలువరేడు
తొవల రాయిడికాడును దొండ పండు
రంగులను మార్చి తిరుగాడు ప్రాణి చిత్ర
బింబము లనేకములు ప్రతిబింబ మొకటె.
నిసిలో జ్యోత్స్నిక కాంతులీనునతడా నీద్రుండు తానున్న న
క్కసమున్ రాల్చెడు భాస్కరుండదిగొ యాకాశమ్ము నందున్న నీ
హసమున్ వీడని నీ బెడంగు వదనమ్మద్దమ్ము నన్ గాంచగా
వసుధన్ బింబము లెన్ని యున్నఁ బ్రతిబింబం బొక్కటే దోఁచెనే.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి
తొలగించండిడా. బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండిగగన మందున యగుపించు కలువ రేడు
తానొకడెయయిననుపంచు తనదు కాంతి
జగతిజనులకు ననయము. చక్కగాను
*"బింబము లనేకములు ప్రతిబింబ మొకటె”*
మీ పూరణ బాగున్నది
తొలగించండిఅసువుల్ దాల్చిన జీవజాలములలో నాత్మాను రూపంబునన్
రిప్లయితొలగించండిమసలున్ దైవమనేక చేతములుగా మాయా విశేషంబుచే
కుసిలింతన్బడనేల చింతనమునన్ గుహ్యంపు సత్యంబిదే
వసుధన్ బింబము లెన్ని యున్నఁ బ్రతిబింబం బొక్కటే దోఁచెనే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది
తొలగించండితే॥ అద్దముల గదిఁ జేరఁగ నగుపడుఁ గద
రిప్లయితొలగించండిబింబము లనేకములు ప్రతిబింబ మొకటె
యైన సత్యము నిత్యము నైన దైవ
మొకటె వివిధ రూపమ్ముల నొప్పు నిటులె
మ॥ మసలన్ నచ్చిన రీతిగన్ గొలిచి సమ్మానమ్ముతో ధాత్రిలో
వెసులున్ బొందఁగఁ జేసిరందు మనుజుల్ వేవేల రూపంబులన్
వసుధన్ దేవుని, దైవ మొక్కటని సంభావించ వేదాదులున్
వసుధన్ బింబము లెన్ని యున్నఁ బ్రతిబిం బొక్కటే దోఁచెనే
వసుధన్ బింబము లెన్ని యున్నఁ బ్రతిబింబం బొక్కటే దోఁచెనే
తొలగించండిసమస్యను తప్పుగా టైపు చేసానండి
తే.గీ:నాకు నొక్కడే బిడ్డ ,యన్నకు నలువురు
రిప్లయితొలగించండిఆన్ననే పోలు నట్టివే యైనవి ప్రతి
బింబము లనేకములు ప్రతిబింబ మొకటె
నాకు గారాబ మతని పై నాకు హెచ్చు.
మీ పూరణ బాగున్నది
తొలగించండినమస్కారం గురువు గారు! ధన్యవాదం.
తొలగించండిమ:అసమానత్వపు జాతకమ్ము లెవియో ఆ యింటనే యుండె, వా
రిప్లయితొలగించండిరసులన్ బొందగ నన్నదమ్ము లతి ఘోరమ్మైన నిష్ఠల్ సదా
విసుగున్ బొందక జేయ నొక్కడె కనెన్ బిడ్డన్ భళా!
వసుధన్ బింబము లెన్ని యున్న ప్రతిబింబ మ్మొక్కటే తోచెనే
(ఆ ఇంట్లో అన్నదమ్ము లందరూ బిడ్డలు కావాలని ఏవో నిష్ఠలు చేశారు.కానీ బిడ్డ జన్మించినది ఒక్కరికే.అన్ని బింబా లున్నా ఆ వంశానికి ప్రతిబింబం ఒక్కటే.)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది
తొలగించండిమ:వసుధన్ బింబ మదొక్కటుండి,ప్రతిబింబమ్ముల్ పదుల్ గాదె యం
రిప్లయితొలగించండిచసిధారన్ వచియించు వాగ్మియె పరధ్యాసన్ వచించెన్ "సఖా!
వసుధన్ బింబము లెన్ని యున్న ప్రబింబ మ్మొక్కటే తోచెనే!
అసలౌ సత్య మిదే" యటంచు వినువా రాశ్చర్యమున్ బొందగన్.
(అసలైన బింబం ఒక్కటే కానీ ప్రతిబింబాలు వేరు అనేది తాత్త్విక బోధ.ఆ ఉపన్యాసకుడు గొప్పవాడే ఐనా పరధ్యాస తో "బింబా లనేకం,ప్రతిబింబ మొక్కటి" అన్నాడు.)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది
తొలగించండిచాలా చక్కని సమస్య.మూడు పూరణలు చెయ్యా లనిపించింది.
రిప్లయితొలగించండిజీవజాలము లన్నిట చేరియుండి
రిప్లయితొలగించండియంతరాత్మగ వర్తిల్లు నక్షయుండు
బింబ రూపము తాదాల్చి పిచ్చలముగ
బింబము లనేకములు ప్రతిబింబ మొకటె
మీ పూరణ బాగున్నది
తొలగించండిఒక్క రొక్కొక్క నామమ్ము నుచ్చరించి
రిప్లయితొలగించండికొలుచు చుండ మోక్షమ్మును గోరి వింత
నెంచ దేవుఁ డొక్కఁడె నామ మేది యైన
బింబము లనేకములు ప్రతిబింబ మొకటె
లసదంతఃకర ణాలయస్థిత పరబ్రహ్మంబ యవ్యగ్రమై
వసియించున్ స చరాచరప్రచుర జీవస్వాంత బింబౌఘ మం
ద సమీక్షించుచుఁ బ్రాణి కర్మములు నిర్వ్యాపార మేపారఁగన్
వసుధన్ బింబము లెన్ని యున్నఁ బ్రతిబింబం బొక్కటే దోఁచెనే
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నాయి
తొలగించండినమఃపూర్వక ధన్యవాదములండి.
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
దర్పణములు కొన్ని గది యందమరజేసి
నట్టి యద్దాల గదిలోకి యడుగిడి యొక
డందు బింబములను గనె వందలాది
బింబము లనేకములు ప్రతిబింబ మొకటె.
మ.
రిప్లయితొలగించండిరసముల్ తొమ్మిది పూర్ణమై మనము సారస్యంబుఁ జేకూరెడిన్
దెసలన్ వ్యాపకుడైన దేవునిగఁ గౌంతేయుల్ స్తుతుల్ చేయగన్
హసమున్ గృష్ణుడనేక రూపములతో నావిర్భవించున్ విధిన్
*వసుధన్ బింబము లెన్ని యున్నఁ బ్రతిబింబం బొక్కటే దోఁచెనే.*
Revised poem
రిప్లయితొలగించండి2)మ:అసమానత్వపు జాతకమ్ము లెవియో ఆ యింటనే యుండె, వా
రసులన్ బొందగ నన్నదమ్ము లతి ఘోరమ్మైన నిష్ఠల్ సదా
విసుగున్ బొందక జేయ నొక్కడె కనెన్ బిడ్డన్ భళా! చిత్రమౌ
వసుధన్ బింబము లెన్ని యున్న ప్రతిబింబ మ్మొక్కటే తోచెనే
(ఆ ఇంట్లో అన్నదమ్ము లందరూ బిడ్డలు కావాలని ఏవో నిష్ఠలు చేశారు.కానీ బిడ్డ జన్మించినది ఒక్కరికే.అన్ని బింబా లున్నా ఆ వంశానికి ప్రతిబింబం ఒక్కటే.)