30, డిసెంబర్ 2023, శనివారం

సమస్య - 4631

31-12-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కీచకుని శాంతిపర్వానఁ గ్రీడి సంపె”
(లేదా...)
“భారత శాంతిపర్వమునఁ బార్థుఁడు సంపెను కీచకాధమున్”

14 కామెంట్‌లు:

  1. మీరకధర్మపాలనము మందిని రక్షనుజేయుద్రోవలో
    ఆరనిదీక్షతోడుతనునన్నకుబోధను జేసెవిజ్ఞుడై
    భారత శాంతిపర్వమున పార్థుడు,సంపెనుకీచకాధమున్
    వీరరసావతారుడుగ భీముడు ద్రౌపది
    మానరక్షకై

    రిప్లయితొలగించండి

  2. కొమ్మ వేషమున్ దాల్చి వృకోదరుండు
    చంపె నెవనిని? భీష్ముడు చక్రిఁ బొగడు
    పర్వమేది కర్ణు నెవండు బారిసమరె
    కీచకుని , శాంతిపర్వానఁ , గ్రీడి సంపె


    శౌరిని శంతనాత్మజుడు శ్లాఘమొనర్చిన పర్వమెద్ది యో
    వీర దినేశ్వరాత్మజుని విగ్రహమందున గూల్చెనెవ్వడో
    భీరువు వేషమందుజని భీముడెవానిని సంహరించెనో
    భారత శాంతిపర్వమునఁ , బార్థుఁడు సంపెను, కీచకాధమున్.

    రిప్లయితొలగించండి
  3. శిష్యునితో గురుదేవులు:


    తేటగీతి
    పాఠము వినక నీకుండ ప్రక్కచూపు
    చవట! చరవాణి మోజుతో చదువు మఱువ
    నివ్వెఱొంద పరీక్షలో నీ జవాబు
    "కీచకుని శాంతిపర్వానఁ గ్రీడి సంపె!"

    ఉత్పలమాల
    నేరుపు పాఠమందునుచు నీదగు శ్రద్ధయె ప్రక్క చూపులై
    తీరెదవెప్పుడున్ చవట! దృష్టిని నా చరవాణికంటు, టం
    కారమనన్ పరీక్షలను గాంచగ నీదు జవాబు నందునన్
    "భారత శాంతిపర్వమునఁ బార్థుఁడు సంపెను కీచకాధమున్"

    రిప్లయితొలగించండి
  4. వలలుడెవరిని జంపెను వనిత పొడన ?
    భారతమున పన్నెండవ పర్వమేది ?
    యినుని సుతుడగు రాధేయు నెవరు చంపె ?
    కీచకుని శాంతిపర్వానఁ గ్రీడి సంపె

    రిప్లయితొలగించండి
  5. క్రమాలాంకారంలో --
    భీము డెవ్వరి కసి తోడ పీచ మడ చె?
    భీష్ము డే పర్వ మున జక్రి వినుతి జేసె?
    కర్ణు నెవ్వరు దునిమిరి కయ్య మందు?
    కీచ కుని :: శాంతి పర్వాన :: క్రీడి సంపె

    రిప్లయితొలగించండి
  6. వలలుఁడెవ్వాని వధియించి పడతిఁ గాఁచె?
    ధర్మజుడెపుడు సంతాప తప్తుడయ్యె ?
    దురమునందున కర్ణునిఁ దునిమెనెవరు?
    కీచకుని, శాంతిపర్వానఁ ,గ్రీడి సంపె

    రిప్లయితొలగించండి
  7. తే॥ వలలుఁడు వధించె నెవరిని నలఁచి మెదిపి
    భీష్ముని యుపదేశములను వినిరి యెచట
    సైంధవునిఁ జంపి నదెవరు జన్యమందు
    కీచకుని శాంతిపర్వానఁ గ్రీడి సంపె

    ఉ॥ “భారత శాంతిపర్వమునఁ భార్థుడు సంపెను కీచకాధమున్”
    నేరకఁ దెల్పి నారిటుల నేమముఁ దప్పిన వారలెవ్వరో
    వీరుఁడు భీమసేనుఁడుగ భీకర పోరునఁ జంపెఁ గీచకున్
    భారత శాంతిపర్వమునఁ బట్టము గట్టిరి ధర్మరాజుకున్

    అందరూ క్రమాలంకారములో వ్రాసినందున నేను ప్రయత్నించానండి.

    రిప్లయితొలగించండి
  8. వైరమునందు మిత్రులును బాంధవు లెల్లరు నంతరించగా
    తీరని వేదనన్ గనె యుధిష్ఠిరు డెందున? సూర్య నందనున్
    బోరున చంపెనెవ్వరు? నభోగతుఁజేసెను భీముడెవ్వనిన్?
    భారత శాంతిపర్వమునఁ బార్థుఁడు సంపెను కీచకాధమున్

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:ధర్మములె యుండు,చూడ మధర్మపరుని
    కీచకుని శాంతి పర్వాన, గ్రీడి సంపె
    కర్ణునిన్ గాని యా యుద్ధ కథలు ముగిసి
    భీష్మ ధర్మ బోధల శాంతి వెలుగు చుండు.
    (శాంతి పర్వం వచ్చే సరికి కీచకాదుల యుద్ధము,కర్ణుడు మొదలైనవి ముగిసి భీష్ముని శాంతి బోధలే ఉంటాయి.)

    రిప్లయితొలగించండి
  10. ఉ:పోరులు పూర్తి యైనవిక పో!తన శౌర్యము జూప డయ్య యీ
    భారతశాంతిపర్వమున బార్థుడు ,చంపెను కీచకాథమున్
    ధీరత దోడ భీము డని తెల్పితి గాదె విరాటపర్వమం
    దా రణగాధలన్ మరచి యందుము భీష్ముని ధర్మబోధనల్
    (ఒకరు భారతకథ వినిపిస్తూ యుద్ధకథలు ముగిశాయి.ఇక భీష్ముని ధర్మబోధలు విను అన్నట్టు.)

    రిప్లయితొలగించండి
  11. పడతి పాంచాలి మానమ్ము వఱలి కావ
    దారుణమ్ముగ నిసి యందుఁ బోరి పోరి
    కాంచ వలలుండు, దగ నాలకించి పలుకఁ,
    గీచకుని శాంతి పర్వానఁ, గ్రీడి, సంపె

    [కాంచ కీచకుని శాంతి; ఆలకించి క్రీడి పలుక]
    [శాంతి=నాశము; పర్వాన = పండుగ నాఁడు]


    నారులఁ బూజ్య యౌ ద్రుపద నందన కింపుగఁ గాఁగఁ పండుగే
    వీరుల కెంచ దుర్జయుఁడు భీముఁడు నర్తన శాల నుగ్రుఁడై
    దూరము గా మనోవ్యథయె తోరము వొందఁగ నాలకింపు మో
    భారత! శాంతి, పర్వమునఁ బార్థుఁడు సంపెను గీచకాధమున్

    [పర్వము = పండుగ; పార్థుఁడు = పృథా తనయుఁడు]

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    వలలు డెవరిని జంపె ద్రౌపదియు కోర?
    విష్ణుని సహస్ర నామముల్ భీష్ముడెపుడు
    చెప్పె? కర్ణుని సమయగా జేసెనెవరు?
    కీచకుని; శాంతి పర్వానఁ; గ్రీడి సంపె.

    రిప్లయితొలగించండి
  13. ఉ.

    క్షీరసముద్రరాజసుత శేషుల దేవుని విష్ణునామముల్
    కౌరవ సైన్యమున్ వెదకి కంఠము ఖండన జేసి సైంధవున్
    ధారుణి భీమసేనుడల ద్రౌపది బాధను దీర్చ జంపెనా
    *భారత శాంతిపర్వమునఁ బార్థుఁడు సంపెను, కీచకాధమున్.*

    రిప్లయితొలగించండి