24, డిసెంబర్ 2023, ఆదివారం

సమస్య - 4625

25-12-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఉరగములు దంపతుల సెజ్జ నొప్పుచుండు”
(లేదా...)
“దంపతు లొక్కటైన తఱి దాపున నుండును కాలసర్పముల్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

17 కామెంట్‌లు:

  1. తేటగీతి
    నరుని పాతాళమును జేర్చి మరులుగురియ
    నాగకన్య యులూపియె నర్మిలిగొని
    శుభముహూర్తాన మనువాడ శోభనమున
    నురగములు దంపతుల సెజ్జ నొప్పుచుండు

    ఉత్పలమాల
    తెంపరి నర్జునిన్ వలచి దివ్యమనోహర రూపుఁడంచుఁ దా
    దింపియు నాగలోకమునఁ దీర్చె నులూపియె పెళ్లితంతుకున్
    సొంపుల వేదిపై నిలిచి చొప్పడువారన పెళ్లి పెద్దలై
    దంపతు లొక్కటైన తఱి దాపున నుండును కాలసర్పముల్

    రిప్లయితొలగించండి
  2. కొత్తగ వివాహహము జేసు కొనినవారి
    మంచముపయి చందమునిడ మలచుటకయి
    ఒకటికొకటిగ పెనవేసుకుండినట్టి
    ఉరగములు దంపతుల సెజ్జ నొప్పుచుండు

    రిప్లయితొలగించండి

  3. (శివునకు తన కూతురునిచ్చి పెండ్లిచేయమని అభ్యర్థింప వచ్చిన మునులతో మేనక మాటలు)

    సౌభగమునందు బుట్టిన స్వజను, నేను
    మీవచనముల మీరక మిత్తి గొంగ
    కిచ్చి యుద్వాహమొనరించ నేమి జరుగు?
    ఉరగములు దంపతుల సెజ్జ నొప్పుచుండు.



    సంపద లోనపుట్టెనని సంగడి యందున పెంచుకుంటిమే
    మింపుగ, నాదిభిక్షువతడేనుగు తోలుధరించు గాంచగన్
    గంపర మెత్తు రూపమది కల్మషకంఠుని భూషణమ్ములౌ
    దంపతు లొక్కటైన తఱి దాపున నుండును కాలసర్పముల్.

    రిప్లయితొలగించండి
  4. పతికి పత్నికి నడుమన పగలురేయి
    కలహములు కాపురము సేయ గనరు శాంతి
    యోర్మి యన్నది లేకున్న నొండొరులకు
    నురగములు దంపతుల సెజ్జనొప్పుచుండు

    రిప్లయితొలగించండి
  5. ఉ.

    కొంపల నైకమత్యమునుఁ గోరని యత్తలు బాధపెట్టెడిన్
    సొంపుగఁ గాపురమ్ము దుగఁ జూడక దోషములెంచు గీమునన్
    *దంపతు లొక్కటైన తఱి దాపున నుండును కాలసర్పముల్*
    చంపుదు రెల్లవేళలను సంపదలిమ్మని దెప్పు పెద్దలే.

    రిప్లయితొలగించండి
  6. ప్రేమమీరగ నిర్వురు పెండ్లియాడి
    శోభనమునకై చక్కగ చూచు జంట
    పరవశింపగ చెక్కిన వైన శిల్ప
    నురగములు దంపతుల సెజ్జ నొప్పుచుండు

    ఇంపగు నాగలోకమది యెక్కడ గాంచిన నాగకన్యలే
    గుంపులుగుంపులై తరలి క్రొత్తగ బెండ్లికి సిద్ధమైరటన్
    జెంపకు చెంపచేర్చి నవ జీవన సౌఖ్యతఁ బొందగోరుచున్
    దంపతు లొక్కటైన తఱి దాపున నుండును కాలసర్పముల్

    రిప్లయితొలగించండి
  7. నిమిష మైనను‌ సఖ్యత‌ నిలువకుండ‌
    కలహ‌ కొలిమినందున‌ కాలుజంట‌
    వట్టి‌ నరకమై‌ కనిపించు‌ వారి‌ కొంప
    ఉరగములు‌ దంపతుల‌ సెజ్జ‌ నొప్పుచుండు‌


    రిప్లయితొలగించండి
  8. దంపతులన్న నొండొరులు దక్షతతో తమ కాపురమ్మునన్
    తంపులులేక నెక్కువలు తక్కువలెంచక నొక్క త్రాటిపై
    యింపుగ నున్న సంపదలు యింతలుగానగు, ద్వేష బుద్ధితో
    దంపతు లొక్కటైన తఱి దాపున నుండును కాలసర్పముల్

    రిప్లయితొలగించండి
  9. తే॥ మనసులు కలసి దంపతుల్ మనుచు నుండ
    నోర్వ రెందరో కనుఁగొన నుర్వి పైన
    హితుల మనుచుఁ దంపులు వెట్ట మితము లేక
    నురగములు దంపతుల సెజ్జ నొప్పుచుండు

    ఉ॥ ఇంపుగ దంపతుల్ చనఁగ నిష్టము తోడను దోడునీడగన్
    దంపులు వెట్టఁ జూడఁగను దప్పక యుందురు బంధు వర్గమై
    ముంపును దప్పు దెవ్వరికి ముద్దుగ వారలఁ జేరదీసినన్
    దంపతు లొక్కటైన తఱి దాపున నుండును కాలసర్పముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండవ పాదమలో దప్పక యుందురు ను దప్పక నుందురు అని సవరించానండి (తప్పకను+ఉందురు)

      తొలగించండి
  10. తే.గీ:తెలుగు పడక టిండ్లకు నొక వెలు గనంగ
    రకరకమ్ముల శైలుల రసికపతుల
    జవము రెచ్చగ జేయు వాల్జడ లనబడు
    నురగములు దంపతుల సెజ్జ నొప్పుచుండు

    రిప్లయితొలగించండి
  11. ఉ:ఎంపిక జేసి జంట నొక టెట్టులొ చూడగ పెండ్లి చేయ నా
    దుంపను దెంచుకొంచు,కుజదోషము కన్ పడు ,దాని వీడి నా
    లెంపలు వేసుకొంచు సరి లెమ్మని వేరొకటిన్ గ్రహించగా
    దంపతు లొక్క టైన తరి దాపున నుండును కాల సర్పముల్.
    (ఇతను పెండ్లి సంబంధాలు కుదురుస్తాడు.ఏవో సంబంధాలు చూస్తే వాటిలో కుజదోషా లుంటాయి.ఎందు కొచ్చిందని వేరే చూస్తే తీరా పెళ్లయ్యాక కాలసర్పదోషాలు కనిపిస్తుంటాయి.ఇతని జాతకం ఇలాంటిది మరి!)

    రిప్లయితొలగించండి
  12. కొత్తజంటల కనుచును కొనిరి పక్క
    బట్టలు మరియు దుప్పట్లు, వాటి పైన
    సర్పములచిత్రములునిండచక్కగనట
    నురగములుదంపతులసెజ్జనొప్పుచుండు

    కొంపయులేదునుండగనుకూరిమిపంచెడువారులేరుగా
    వంపులతోచరించుపలు పాములు నాభరణమ్ములేకదా
    నింపుగశంభుతోనచట నెవ్విధి నుండగసాధ్యమౌనొమీ
    *“దంపతు లొక్కటైన తఱి దాపున నుండును కాలసర్పముల్”*


    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    పడక మీదకు దుప్పటి పరచగాను
    క్రయము చేయగ నేగి దుకాణమందు
    పాము బొమ్మలున్నట్టి దుప్పటిని కొనగ
    నురగములు దంపతుల సెజ్జ నొప్పుచుండు.

    రిప్లయితొలగించండి