26, డిసెంబర్ 2023, మంగళవారం

సమస్య - 4627

27-12-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కోరనిది దక్కు దక్కదు కోరి కొలువ”
(లేదా...)
“కోరిన దేది దక్కదఁటఁ గోరనిదే లభియించుఁ గొల్చినన్”
(శిష్ట్లా వేంకట లక్ష్మీ నరసింహ శర్మ గారికి ధన్యవాదాలతో...)

39 కామెంట్‌లు:

  1. విష్ణుసాన్నిధ్య మెన్నడువీడకుండ
    జనులు విజయమందు కోరగా జన్మ వదిలి
    కోరనిదిదక్కు, దక్కదుకోరి కొలువ
    మాయ వలనను యోగికి మర్మమిదియ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది
      రెండవ పాదంలో గణభంగం. విజయము గోరగా/జయమంద గోరగా... అనండి

      తొలగించండి
    2. జయుడువిజయుడుకోరగజన్మదగిలె
      అనవలసియుండగా, తప్పుగాటైపుపడినది, ఇది తప్పు, నేనుచూసుకోలేదు

      తొలగించండి
  2. దుర్యోధనునితో శకుని:

    తేటగీతి
    కృష్ణమూర్తి సాయమునకుఁ దృష్ణతోడ
    నడుగఁ బోవు రారాజ! నిన్నాపనయ్య!
    భిక్షననినెంచఁ బాండవ పక్షపాతిఁ
    గోరనిది దక్కు! దక్కదు కోరికొలువ!!

    ఉత్పలమాల
    నీరజ నేత్రునిన్ హరిని నీవరుదెంచియు రాజరాజ! యా
    పోరున సాయమున్ మిగులఁబొందగనెంచిన నాపనయ్య! మీ
    తీరును నచ్చబోడనెడు దేవునిఁ బాండవపక్షపాతినిన్
    గోరిన దేది దక్కదఁటఁ! గోరనిదే లభియించుఁ గొల్చినన్!!

    రిప్లయితొలగించండి
  3. కోరిన విధముగ జరుగ క్రొవ్వు పెరిగి
    మనుజుడదుపు తప్పినపుడు మార్గ మొకటె
    కోరనిది దక్కు దక్కదు కోరి కొలువ
    వింతగ ననిపించును గాని విషయమదియె

    రిప్లయితొలగించండి

  4. పాపములనొనర్చి కొలువ భానుమతిని
    నిష్ప్రయోజన మదియన్న నిజము సుమ్ము
    తప్పబోదు కర్మఫలమీ ధరణి యందు
    కోరనిది దక్కు, దక్కదు కోరి కొలువ.



    చేరడు మందిరమ్మునకు సేవము కూడిననాడు మానవుం
    డారడి వేళ క్లేశమున నాపద తీర్చమటంచు స్వార్థమున్
    జేరుచు కోవెలందు శశిశేఖరు వేడిన నేమిరా నిరా
    కారుడెఱుంగడే నరుని కల్కము కర్మఫలాను సారమే
    కోరిన దేది దక్కదఁటఁ గోరనిదే లభియించుఁ గొల్చినన్.

    రిప్లయితొలగించండి
  5. ఉ.

    నారద రూపమయ్యె హరి, నవ్వుచు శ్రీమతి, విష్ణునెంచెడిన్
    గోరి సుకన్య గేస్తు ససిఁ గ్రొత్తగ జేసిరి యశ్వినీసుతుల్
    కోరిన యూర్వశిన్ విడువ గోత్రభిదుండిడెఁ బేడి రూపమున్
    *గోరిన దేది దక్కదఁటఁ గోరనిదే లభియించుఁ గొల్చినన్.*

    రిప్లయితొలగించండి
  6. ఫలము నాశించకనె కర్మ సలుపతగును
    కష్ట సుఖములు మనుజుల కర్మఫలమె
    జరగ వలసినది జరుగు తరచి చూడ
    కోరనిది దక్కు దక్కదు కోరి కొలువ

    రిప్లయితొలగించండి
  7. భవిత గూర్చియు కలగంద్రు బాల్య మందు
    నన్ని ఫలియించ వందులో కొన్ని జరుగు
    కోరనిది దక్కు దక్కదు కోరి కొలువ
    జీవితంబు న నగు పిం చు చిత్ర మిదియ

    రిప్లయితొలగించండి
  8. దేవదేవుని మెప్పింప దీక్షబూని
    చేయు తపమును భగ్నము సేయ దేవ
    కాంతలను మౌని కడకంపు గట్టుదాయ
    కోరనిది దక్కు దక్కదు కోరి కొలువ

    రిప్లయితొలగించండి
  9. భూరి వరంబులన్ బడయ ముజ్జగముల్ వణకంగ మౌనులై
    ఘోర తపంబొనర్చు తఱి కోరకనే విబుధేంద్రుడంపగా
    చేరునుగాదె యప్సరలు ఛిద్రమొనర్ప తపంబు, మాయురే!
    కోరిన దేది దక్కదఁటఁ గోరనిదే లభియించుఁ గొల్చినన్

    రిప్లయితొలగించండి
  10. తే॥ ఆత్మ లింగముఁ బడయఁగ నహరహమును
    దపముఁ జేసి రావణుఁడట్లు తగని మాయ
    క్రమ్మ శివుని సన్నిధియందు గతిని తప్పె
    కోరనిది దక్కు దక్కదు కోరి కొలువ

    ఉ॥ కోరఁగ నాత్మలింగమును గోరికఁ దీర్తునటంచుఁ దల్లికిన్
    ఘోర తపమ్ము రావణుఁడు గొప్పగఁ జేసిన దైవ సన్నిధిన్
    జోరుగ మాయ క్రమ్మఁగను జూచిన దేదియొ కోరె మూర్ఖుఁడై
    కోరిన దేది దక్కదఁటఁ గోరనిదే లభియించుఁ గొల్చినన్

    రిప్లయితొలగించండి
  11. తే.గీ:కొబ్బరిని కోరి చేయుము కూర యనుచు
    నెంత భార్యను వేడిన సుంత వినదు
    కోర నట్టి కాకరకాయ  కూర జేయు
    కోరనిది దక్కు దక్కదు కోరి కొలువ

    రిప్లయితొలగించండి
  12. ఉ:క్యారెటు దెచ్చియున్,మరల కమ్మని కొబ్బరి చిప్ప దెచ్చియున్
    కోరియె చేయ మందు నది కూరయొ,పచ్చడియో మరేదియో
    కోరుట చేత కా దనుచు కోరని వేవియొ వండు భార్య,నే
    కోరిన దేది దక్క దట కోరనిదే లభియించు గొల్చినన్

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. దైవ లీలల నెఱుఁగంగఁ దరమె కోర
      కుండ సమకూరు విత్తము మెండుగాను
      వింత మంద భాగ్యున కిల సంతతమ్ము
      కోరనిది దక్కు దక్కదు కోరి కొలువ

      పోరున గెల్త్రు శత్రువుల మూరు సమంచిత భోగ భాగ్యముల్
      దూరము లౌను రోగములు దుఃఖము లింపుగ నెందు నెన్నఁడే
      నారయఁ బద్మనాభ శర ణాగత కోటికి దుర్లభం బిలం
      గోరిన దేది? దక్కదఁటఁ గోరనిదే, లభియించుఁ గొల్చినన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి

      తొలగించండి
  14. జగతి యందున చూడంగ జనుల కెల్ల
    తలచినది జరుగదనుట తథ్య మండ్రు
    కర్మ ననుసరించి యెసాగు కాని మనము
    కోరనిది దక్కు దక్కుదుకోరి కొలువ



    వైరము లోననింపుకొనిపైనన టించిన ప్రేమ మెచ్చరె
    వ్వారలటంచునీవెరిగిభద్రముకూర్చుమటంచువేడినన్
    *“కోరిన దేది దక్కదఁటఁ గోరనిదే లభియించుఁ గొల్చినన్”*
    భారముతీరిమోదమగు భక్తినిపూనిసతంబునున్నచో

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    తలచిన దొకటి, జరిగినదది మరొకటి
    దైవ నిర్ణయమది, యర్హతలను బట్టి
    రావలసినది యిచ్చు నా దేవుడెపుడు
    కోరనిది దక్కు, దక్కదు కోరి కొలువ.

    రిప్లయితొలగించండి
  16. నేరమయంపు జీవితము నీతిని వీడి చరించుచున్ సదా
    దారకు గౌరవమ్మిడక, త్రాగుచు మత్తు నొసంగు మద్యమున్
    శౌరికి పూజనమ్ములను సల్పక పృథ్వి చరించు చున్నచో
    కోరిన దేది దక్క దట కోరనిదే లభియించు గొల్చినన్

    రిప్లయితొలగించండి