28, ఏప్రిల్ 2024, ఆదివారం

సమస్య - 4749

29-4-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శివుని తలపైనఁ బార్వతి చేరి నిలిచె”
(లేదా...)
“శివ వామార్ధము వీడి శీర్షమున నిల్చెన్ గౌరి గంగమ్మతో”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

26 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
సగమునేనౌట హరుడయ్యె సాంబుడనఁగఁ,
గలగి గంగాధరుడటంచు గంగ రెచ్చె
సవతి పోరును తాళక సాగనంప
శివుని తలపైనఁ బార్వతి చేరి నిలిచె

మత్తేభవిక్రీడితము
"భవునిన్ మేని సగమ్ముగన్ బడయనొప్పన్ సాంబుఁడాతండనన్"
గవికన్ వేయఁగ గంగరెచ్చి, "సిగనై గంగాధరుండం"చనన్
సవతిన్ శీఘ్రమె సాగనంపు తలపై సాధించు సంకల్పమై
శివ వామార్ధము వీడి శీర్షమున నిల్చెన్ గౌరి గంగమ్మతో!

Sitharamayya Solasa చెప్పారు...

సురనది తన నెలవుగ జేసుకొని యుండె
శివుని తలపైనఁ : బార్వతి చేరి నిలిచె
నతని యందున సగభాగ మాక్రమించి
తలపయి నొకరు , మరొకరు తనువు లోన

విరించి చెప్పారు...


తనను భరియించు వాడంచు దలచి గంగ
నింగి నుండితా దిగివచ్చి నిలిచె కాదె
శివుని తలపైనఁ, బార్వతి చేరి నిలిచె
ఫాలలోచనునకు వామ భాగమందు.



లవణాంభస్సు మదింప బుట్టినది హాలాహాలమున్ గాంచుచున్
భవ! నీవే శరణంబటంచు సురలే ప్రార్థింప భీతిల్ఞుచున్
ధవునిన్ గ్రోలి జగమ్ము కాచుమనుచున్ దాక్షాయణీ కోరుచున్
శివ వామార్ధము వీడి శీర్షమున నిల్చెన్ గౌరి గంగమ్మతో.

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ వాన కొరకు తపించెడి ప్రజల బాధఁ
దెలిపి గంగకు నడుగఁగఁ దీర్చ ప్రజల
సంకటము త్వరితము గాను సహృదినిఁ గని
శివుని తలపైనఁ బార్వతి చేరి నిలచె

మ॥ భువిలో వానలు మృగ్యమై జనులు సంపూర్ణంబునౌ వేదనన్
భవ బాధార్తిని లోకమాత దయకై ప్రార్థించఁగన్ శ్రద్ధతో
సవతిన్ గాంచుచుఁ దెల్ప వర్షమునకై సందేశమున్ జక్కఁగన్
శివ వామార్ధము వీడి శీర్షమున నిల్చెన్ గౌరి గంగమ్మతో

ఇక్కడ బెంగుళూరులో నీటి కొరత భయంకరంగా ఉన్నదండి. ఇంత గ్రీష్మ తాపము కూడ నేను ఎప్పుడు చూడలేదండి.

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

అలకనందయు నిల్పెమహాద్భుతముగ
శివుని తలపైనఁ ,బార్వతి చేరి నిలచె
శంకరుని వామభాగాన ,జనులు భవుని
యర్ధ నారీశ్వరుండని యంద్రు కూడ.

M.B.G.TILAK చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఎవరో మౌనివరుండు కోరుకొనగా నేతెంచి వేళమ్ముగా
శివునిన్ శీర్షమునందు కేశములలో జేరంగ నా గంగనున్
భవనాశంకరు శంకరున్ విడచిపోవంగోరఁగా చెచ్చెరన్
శివ వామార్ధము వీడి శీర్షమున నిల్చెన్ గౌరి గంగమ్మతో

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

మౌని కోరిక మన్నించి మరలి భువికి
వచ్చు గంగను జటలలోఁ బట్ట శివుఁడు
వీడి వైళమ బొమ్మని వేడుకొనఁగ
శివుని తలపైనఁ బార్వతి చేరి నిలిచె

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:ఆ గణాచారి భక్తుల యర్చనమున
నమిత పరవశమునుబొందె,నద్భుతముగ
బూనకము వచ్చె దలచుచున్ భూతనాథు
శివుని, తలపైనఁ బార్వతి చేరి నిలిచె
(గణాచారులు, పూనకాలు అందరికీ అనుభవమే కదా!ఆ గణాచారికి పార్వతీ దేవి శిరస్సు పై నిలచింది.వచ్చింది పార్వతీ దేవి ,లేక దుర్గ కనుక భర్త ఐన శివుణ్ని తలుచుకొన్నది.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

మ:స్తవనీయమ్ముగ నింద్రకీలగిరిపై దాక్షిణ్య మొప్పార శా
త్రవ విధ్వంసక రూపి యై,స్వయముగా, దర్పమ్ము నిండారగా
శివ వామార్ధము వీడి శీర్షమున నిల్చెన్ గౌరి గంగమ్మతో
భవుతో సంగము లేని శక్తి వలె దా భాసించగా నెంచె నో !
(కనకదుర్గ ఇంద్రకీలాద్రి యొక్క శీర్షం పై తానే ప్రథాన దేవత గా నిలచింది. శివుని భార్య అనే గుర్తింపు తో కాక.)

Yajnesh చెప్పారు...

అవనీఖండమునందుభారతమునందత్యంత శిష్టాత్ముడై
భవబంధమ్ముల ప్రక్కనెట్టి మదిలో ప్రజ్ఞావిశేశుండునై
శివగంగన్ పరిశుద్ధిఁ చేన్ ప్రగడయే, శీఘ్రాతి శీగ్రమ్ముగా
*శివ వామార్ధము వీడి శీర్షమున నిల్చెన్ గౌరి గంగమ్మతో.*

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా!🙏

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తేటగీతిలో 'నడుమను' అనండి.
వృత్తంలో 'సతమున్ + ఉత్సాహ' అన్నపుడు యడాగమం రాదు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ప్రక్కనెట్టి' అనడం సాధువు కాదు. "ప్రక్కనుంచి" అనండి.

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

గగనము న నుండి దూకిన గంగ దాల్చి
సహనమున నున్న పతికి దా సాయ పడుచు
మంద లించగ గంగను మరులు తోడ
శివుని తల పైన పార్వతి చేరి నిలిచె

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

ప్రాపు సేరఁ జూడక యున్నఁ గోప మూని
నెలఁత లుందు రన మగల నెత్తి పైన
నిజము సేయంగ నానుడి నీరజాక్షి
శివుని తలపైనఁ బార్వతి చేరి నిలిచె


సవతుల్ జేరిరి యొక్క చోటునకు నాశ్చర్యంబు వాటిల్లగన్
శివ మూర్ధమ్మును వీడి గంగయు వెసం జేరంగఁ బుట్టింటికే
భువి శీతాద్రికి నేఁగి సంబరమునం బుట్టింటి కెన్నాళ్లకో
శివ వామార్ధము వీడి శీర్షమున నిల్చెన్ గౌరి గంగమ్మతో

M.B.G.TILAK చెప్పారు...

సవరణలతో..

తరుణు లొకచోట చేరిన దొరలుచుందు
వారి నడుమను విషయాలు వందలాది
సత్వరము గంగ తోడ ముచ్చట్ల కొరకు
శివుని తలపైనఁ బార్వతి చేరి నిలిచె

ఉవిదల్ పల్కుచు నుందురోయి సతతంబుత్సాహముప్పొంగగా
భవబంధాదుల పై కబుర్ల రహితో ప్రాపంచి కాంశాలనే
వివరంబుల్ పొడచూపు రీతి నెనగా వింతైన ముచ్చట్లకై
శివ వామార్ధము వీడి శీర్షమున నిల్చెన్ గౌరి గంగమ్మతో