23, ఏప్రిల్ 2011, శనివారం

దత్త పది - 10 (అతి, గతి, చితి, పతి)

కవి మిత్రులారా,
అతి, గతి, చితి, పతి.
పై పదాలను ఉపయోగించి మీకు నచ్చిన ఛందస్సులో మహాభారతార్థంలో పద్యం వ్రాయండి.

38 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    01)
    ___________________________________

    పతికి గలిగిన గతి జూచి - పడతి యంత
    అక్క కుంతికి పిల్లల - నప్ప జెప్పి
    మగువ మాద్రియె, సాగగ - మగని త్రోవ
    అతివ చేరెను చితియందు ! - అమల చరిత !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  2. 02)
    ___________________________________

    అతివ మాద్రియె పతితోడ - చితిని జేరె !
    పిల్ల వాండ్రను నేనెట్లు - పెంచ గలను !
    అతియు గతియును శ్రీపతే - ననుచు దలచి
    వెన్న దొంగను మనసార - వేడె నపుడు !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  3. సంధికి రాయబారానికి వెళ్ళిన కృష్ణుడు ధృతరాష్ట్రునితో...

    గతి నే సంధికి వచియిం
    చితి నిటు కురురాజ నీవు చేయుము, లేదో!
    పతితులు నీశత సుతుల
    య్యతివ నెడ సలిపినపాప మంతము జేయున్!

    రిప్లయితొలగించండి
  4. పతితను గాను నే నకట బంధులు పెద్దలు చూచు చుండ దు-
    ర్గతిఁ గురిఁ జేసి నారచట కౌరవ ధూర్తులు నంద నందనా!
    చితికెను నా మనంబు దయ సేయవె శాంతిని యార్త రక్షకా!
    అతివల కీ భువిన్ గలుగు నాపదలన్ కడ తేర్చి బ్రోవవే!

    రిప్లయితొలగించండి
  5. శ్రీకృష్ణుని రాక కోసం ఎదురు చూస్తున్న రుక్మిణి :

    03)
    ______________________________________________

    *అతివను గావుమయ్య ! నిను - నాత్మ దలం*చితి భక్తితోడ ! నా
    *గతి గనుమయ్య ! మాధవ ! ఎ- కాయెకి నన్ గొనిపోవ రమ్ము ! నా
    కతి గతి వీవె ! నా *పతియు - కాగల వాడవు , నీవె యంచు , నా
    స్మృతులను , నెల్ల వేళలను - మిక్కిలి మక్కువ గొల్చుదాననే !
    ______________________________________________

    రిప్లయితొలగించండి
  6. ఏమిటి సార్లూ ఈ స్పీడు! నేనొక సినిమా చూసి వచ్చేసరికి, రెండు చంపక మాలలు, ఒక కందం, రెండు తేటగీతులు వర్షించాయి. నాకొచ్చిన రెండు ఐడియాలూ కొట్టేశారు. ఇంకేదయినా వెతకాలి. అందుకే అమెరికా ఇండియాకి వెనకే యెప్పుడూ, (టైం జోనులో).

    రిప్లయితొలగించండి
  7. శాస్త్రిగారూ !
    శ్రీకృష్ణరాయ బారము
    సొంపుగా నున్నది !

    మిస్సన్న మహాశయా
    ద్రౌపదీ యాక్రందన మిక్కిలి
    దొడదొడగా నున్నది !

    రిప్లయితొలగించండి
  8. అతివనయోనిజన్నిను,దయారహితాత్ములధర్మపాలురీ
    గతియవమానమున్సలిపికౌరవవంశపుకీర్తి నిట్టులన్
    పతితముఁజేసిఁదామిక,నభాసులపాలయిరంతవారలున్
    చితినికకాయమున్విడిచిఁజేరకముందరధర్మ వర్తులై

    రిప్లయితొలగించండి
  9. అతి పావనమౌ గీతయు
    గతియగు హరిహరుల నామ గానములిచ్చెన్
    చితికిన ధర్మమునెత్తే
    పతియగు మాధవునిఁ గాథ భారతమయ్యా!

    (ప్రపంచ పుస్తకదినోత్సవ సందర్భంగా)

    రిప్లయితొలగించండి
  10. అతివ నాశ్రితనుఁ జెలగి గతిని తప్పి
    కరమడుగుదువో యరి కీచకాధమ! చితి
    కంపగ వెస వచ్చిన వాఁడ కాలుఁడ! పతి
    భీముఁడ! యడఁచెదనిపుడు భీషణమ్ము.

    రిప్లయితొలగించండి
  11. పాంచాలీ!పరమాత్ముడాసభను,నీ పాలిం;దయాళుండుగా
    వేంచేసెన్నినుగాచెలక్ష్మి*పతియావేళన్ ;యదేరీతిపా
    లించంటున్* గతినీవెయంచు *నతివల్ లీలన్మముంగావ,ర
    మ్మంచున్వే డగరాడు,పి*ల్చితికదమ్మట్లేనువేనేర్పుమా !

    రిప్లయితొలగించండి
  12. అతి గర్వమ్మున నీ సుతుండు ధృతరాష్ట్రా ! వంశ విఖ్యాతి దు
    ర్గతి పాలై జను రీతి వర్తిలు - యదార్థంబైన ధర్మం బని
    శ్చితికిన్ లోనయి క్రుంగుచున్నది ; యుపేక్షింపంగ కౌరవ్య రా
    ట్పతి నీకొప్పునె ? సంధి సేయుటకు సంభావించుచో మేలగున్ !!!

    రిప్లయితొలగించండి
  13. వృత్తిగతమైన , వ్యక్తిగతమైన పరిశ్రమ వలన ఇన్ని దినాలుగా వ్యవధానము దొరకలేదు. తిరిగి వచ్చి ఈ వేదిక సందర్శించిన తరువాత నిజంగా ఆశ్చర్యం , ఆనందం కలుగుతూన్నాయి. శంకరయ్య గారి నిర్దేశకత్వంలో ఎందరో తమ ప్రతిభకు సాన పెట్టుకోవడం ముదావహం . కొత్త కవులూ , కవయిత్రుల చేరిక , ముందటి కవుల కవిత్వ రచనలో అద్భుతమైన పురోభివృద్ధి నిజంగా అభినందనీయం . ఇన్ని కవికోకిలలు తమ గళాలు సవరించుకోవడానికి ఆస్కారమిచ్చిన కల్పవృక్ష శాఖోపమమైన శంకరయ్యగారికి ధన్యవాదాలు !!!

    రిప్లయితొలగించండి
  14. అతివ జూచి నవ్వె నా మయ సభ లోన
    ఛీఛి!చావ దగును చితిని పేర్చి!
    ఐదు మంది పతుల యాపతివ్రత దు
    ర్గతిని చూడక కురు పతిని గాను!

    రిప్లయితొలగించండి
  15. కిశోర్ గారూ!ధన్యవాదములు.తేటగీతులు,చంపకము అదిరాయి.
    మిస్సన్నగారూ!' పతితులు గారు ' పద్యాన్ని గుర్తుకు తెచ్చారు.
    మందాకిని గారూ! చంపక మాల బాగా అల్లారు.శార్దూలాన్ని బాగా నడిపించారు.
    ప్రసన్న కుమార్ గారూ!భారతాన్ని నాలుగు పాదాల్లో చెప్పారు.
    రవి గారూ!భీముడి రౌద్రాన్నిదర్శింపజేశారు.
    విష్ణు నందన్ గారూ!చాలా రోజుల తరువాత కృష్ణ రాయబారంతో కలసి మాకు ఆనందాన్ని కలిగించారు.
    అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. మిస్సన్న గారు, మీ పూరణ అథ్యద్భుతంగా ఉందండీ

    రిప్లయితొలగించండి
  17. కురుక్షేత్రములో కర్ణుడు అర్జునునితో పలికిన పలుకులు:-

    అతివకు వెన్కగా నిలిచి యాపగ సూనుని చంపినట్టి సం
    గతి వలె కాదు, నీ బలము కయ్యముఁ లోపల జూపుమోయి, వ
    చ్చితినిక నేను కర్ణుడను, చెల్లవు మాయలు, నేడు నీదు పా
    ప తిమిరముల్ నశించునిక బాణపు ధాటికిఁ జూడుమర్జునా!!

    రిప్లయితొలగించండి
  18. విష్ణునందన్ గారూ చాలా కాలానికి మీ మనోహరమైన పూరణను చూడగలిగాము.

    మిత్రులందరి పూరణలూ కవితా సౌరభాలను గుబాళిస్తున్నాయి.
    వసంత మహోదయా, హనుమచ్చాస్త్రి గారూ ధన్యవాదాలు.
    గిరిగారూ కడుంగడు ధన్యవాదాలు.

    సత్యనారాయణగారూ మీ పూరణ అద్భుతంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  19. మహాభారతంలో నన్ను కలచివేసిన సంఘటన-ధృతరాష్ట్రుడి దుస్థితి-పుత్రప్రేమకు లోనై, చివరకు కొడుకుని చంపిన భీముడి చేతి ముద్ద తినవలసి రావటం.
    అనియుఁ గొడుకులు చచ్చిరి, అతియు గతియు
    లేక ధర్మజు పంచకున్ లిఖితమీడ్వ,
    కడకు చితికి భీముఁడిడిన కబళముఁ దిని
    సౌబలిపతి దౌర్భాగ్యపు సంకెల బడె
    విది నెదుర్కొనలేమది విష్ణు మాయ!
    మనవి: సౌబలిపతి=గాంధారి భర్త = ధృతరాష్ట్రుడు
    ఐదవపాదం విడిచి చదువుకొన్నా పద్యం పూర్తి అర్థాన్నిస్తుంది.

    రిప్లయితొలగించండి
  20. పాఠక లోకానికి సవినయ మనవి: సమస్య మహాభారతం మీద ఇచ్చారు గాబట్టి రెండు మాటలు. ఇటీవలే, శ్రీ తిప్పాభొట్ల రామకృష్ణ గారి మహాభారతం పుస్తకాల సెట్ విడుదలైనది. వ్యాస భారతానికి తెలుగు వచనం. వారి ప్రతిభ తెలిసిన వారు చెప్పగలరు వారి పాండిత్య గాంభీర్యము. నేను ఆపుస్తకావిష్కరణకి హాజరయ్యాను, వారితో మాట్లాడాను. వారి మాటలలో చెప్పాలంటే, "మహాభారతం మనకి తెలుసునను కొంటాము. కానీ తెలిసినది తక్కువ, తెలుసుకొన వలసినది ఎక్కువ. దయచేసి మహాభారతం ఆసాంతం చదవండి."

    ఇది అడ్వర్టైజ్మెంట్ అనుకోవద్దు. మెత్తం ఇరవై పుస్తకాలు చౌకగా Rs.700 రూపాయలకే దొరుకుతున్నాయి. అందరికి అందుబాటులో వుండాలని, దాతల సహాయంతో ప్రింటింగ్ ఖర్చు కంటే తక్కువకే ఇవ్వటం జరుగుతోంది. ఇది నిజం.

    రిప్లయితొలగించండి
  21. మంచి పుస్తక పఠన, రచనలు తగ్గిపోతూ, (సంస్కారాన్ని, మానవజీవిత పరమార్థాన్ని తెలిపే) బోధన మృగ్యమైన రోజుల్లో
    విరివిగా పబ్లిసిటీ లేని పఠనా రంగం గురించి ఆసక్తి గలవారు కూడా చర్చించుకోవటానికి , కొత్త విషయాల గురించి ఒకరికొకరు తెలుపుకోవటానికి జంకవలసిన పని లేదు. అడ్వర్టైజ్మెంట్, రికమెండేషన్ అనుకునేవారల గురించి మీరు పట్టించుకోకుండా మంచి విషయాలు ఎవరైనా తప్పక చెప్పండి. ఏమంటారు చంద్రశేఖర్ గారూ ?

    శాస్త్రి గారూ! ధన్యవాదాలు.
    అందరి పూరణలూ కూడా చాలాబాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  22. చంద్రశేఖర్ గారు,
    మీరు చెప్పిన ఈ శ్రీ తిప్పాభొట్ల రామకృష్ణ గారు, నాగార్జున సాగరు APRDCలొ తెలుగు ఉపన్యాసకులుగా పని చేసిన వారేనా?

    రిప్లయితొలగించండి
  23. మిసన్న గారు,
    మీ అభినందనలకు ధన్యవాదములు.
    కవి మిత్రుల పూరణలు భారతములోని వివిధ ఘట్టాలతో మనోహరముగా ఉన్నవి

    రిప్లయితొలగించండి
  24. సత్యనారాయణ గారూ, వారు ప్రస్తుతం విజయవాడ వాస్తవ్యులు. కానీ కృష్ణా గుంటూరు జిల్లాలలో చాలా చోట్ల పనిచేసినట్లు తెలుసు. ప్రత్యేకించి నాగార్జున సాగర్ గురించి తెలియదు. కనుక్కొని చెప్పగలను.

    రిప్లయితొలగించండి
  25. పతితను గాను నే నకట బంధులు పెద్దలు చూచు చుండ దు-
    ర్గతిఁ గురిఁ జేసి నారచట కౌరవ ధూర్తులు నంద నందనా!
    చితికెను నా మనంబు దయ సేయవె శాంతిని యార్త రక్షకా!
    అతివల కీ భువిన్ గలుగు నాపదలన్ కడ తేర్చి బ్రోవవే!
    ---------
    మిస్సన్న గారూ సున్నితంగా సుతారంగా పూరణని నడిపారు. బాగుంది. కాదు బ్రహ్మాండంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  26. మందాకిని గారూ, మంచి మాట.

    రిప్లయితొలగించండి
  27. జీ యస్ యన్ గారూ!పద్యం నడక బాగుంది.అభినందనలు.కాని పాప తిమిరములు నశించుట ఔచిత్యముగా లేదేమో అలొచించండి.

    రిప్లయితొలగించండి
  28. ప్రియమైన సోదులకు , సోదరీ మణి మందాకిని గారికి , పేరు పేరునా అందరికి ధన్య వాదములు. . నాకు ఎవరి మీదా అలక లేదు తమ్ముళ్ళూ ! . అనారోగ్య కారణం గా ఒక వారం రోజులు ఆస్పత్రిలో ఉన్నాను. అందుకని మీ అందరి ఆదరాభి మానాలకు దూర మయ్యాను. .అమ్మలూ ,అక్కలు , పిల్లల మీద ఎప్పుడు అలగరు . మళ్ళీ వచ్చేసాను గా ? అదే తప్పులు తడకలు రాయడానికి .

    రిప్లయితొలగించండి
  29. హనుమచ్ఛాస్త్రి గారు,
    మీరు చెప్పింది నిజమే. పోస్టు చేసేటప్పుడే సంశయాత్మకముగా పోస్టు చేసా. ఆ తొందరలో మరో పదము స్పురించ లేదు. ఏదో పద్యము పూర్తి చేసాననిపించ.
    "పాప తిమిరముల్ ఫలించునిక" అంటే సరిపోతుంది కదా!! (నీ పాపము పండింది అనే అర్థములో)

    అతివకు వెన్కగా నిలిచి యాపగ సూనుని చంపినట్టి సం
    గతి వలె కాదు, నీ బలము కయ్యముఁ లోపల జూపుమోయి, వ
    చ్చితినిక నేను కర్ణుడను, చెల్లవు మాయలు, నేడు నీదు పా
    ప తిమిరముల్ ఫలించునిక బాణపు ధాటికిఁ జూడుమర్జునా!!

    రిప్లయితొలగించండి
  30. వసంత్ కిశోర్ గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నాయి. అభినందనలు. ముఖ్యంగా "భాగవత" (?) ఘట్టంతో వ్రాసిన వృత్తం సూపర్!
    "శ్రీపతే - ననుచు" అనేది "శ్రీపతే యనుచు" అని ఉండాలనుకుంటా.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీరు పూరణలుగా వ్రాసిన కందం, ఆటవెలది బాగున్నాయి. అభినందనలు.
    కవి మిత్రుల పూరణలను విశ్లేషిస్తూ మీ సహృదయతను చాటుకుంటున్నారు. ధన్యవాదాలు.

    మిస్సన్న గారూ,
    మనోహరమైన పూరణ మీది. బాగుంది. అభినందనలు.
    సాటి కవుల పూరణలను ప్రశంసించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  31. చంద్రశేఖర్ గారూ,
    మీరేం తిన్నారు? బుర్రలో ఐడియాలకు లోపమా? కరణరసం ప్రధానంగా పూరణ చెప్పి అందరినీ మెప్పించారు. అభినందనలు.
    తిప్పాభొట్ల వారి పుస్తకాలు "విశాలాంధ్ర"లో లభిస్తాయా? ఆ పుస్తకాల ప్రాప్తిస్థానం కూడ చెప్పి ఫుణ్యం కట్టుకోండి.

    మందాకిని గారూ,
    ఉదాత్తంగా ఉన్నాయి మీ పూరణ, వృత్తరచనలు. అభినందనలు.

    ఫణి ప్రసన్న కుమార్ గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రవి గారూ,
    "నర్తనశాల" ఘట్టానికి చక్కని పద్యరూపం ఇచ్చారు. బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో గణం తప్పింది. "యరి" తొలగిస్తే సరి!

    రిప్లయితొలగించండి
  32. డా. విష్ణు నందన్ గారూ,
    అద్భుతమైన పూరణతో మీ పునఃప్రవేశం మాకందరికీ ఆనందదాయకమయింది.. ధన్యవాదాలు.

    గిరి గారూ,
    ధన్యవాదాలు.

    జిగురు సత్యనారాయణ గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు, ధ్యన్యవాదాలు.
    నాకైతే "నశించు నిక" అంటేనే బాగుంటుం దనిపిస్తున్నది.

    శివరామకృష్ణారావు గారూ,
    ధన్యవాదాలు.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    స్వాగతం ..... !

    రిప్లయితొలగించండి
  33. ధన్యవాదాలు, మాస్టారూ. ఏమీ తినలేదు సార్, మాఆవిడ చేసిన ఉప్మా మినహాయించి (నవ్వుతూ). The Green Mile అనే మూవీ చూసి పద్యం వ్రాద్దామని కూర్చొన్నాను. చాలా మంచి మూవీ, మానవత్వం, సూపర్ నాచురల్ పవర్స్ ఆధారంగా తీసిన మూవీ. అందరూ చూడదగ్గ ఆంగ్ల సినిమా.
    తిప్పాభొట్ల వారి పుస్తకాలు హైదరాబాదులో దొరికే షాపు కనుక్కొని చెబుతాను. విశాలాంధ్రలో దొరకవని అనుకొంటున్నాను.

    రిప్లయితొలగించండి
  34. శంకరార్యా !
    ధన్యవాదములు !
    మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !
    విష్ణునందనుల వారి పునరాగమనం
    ఆనంద దాయకం !
    రాజేశ్వరక్కాయ్ రాక కూడా సంతోషంగా ఉన్నది !

    రిప్లయితొలగించండి
  35. అతిగ తినగ రాదు,నాడితప్పగ రాదు,
    ప్రజల ముంచి తిరుగ పాడిగాదు,
    దేశ పరువు నిలుప తిరుపమెత్తగరాదు,
    ఓటు నమ్మ రాదు నోటు కొఱకు!

    రిప్లయితొలగించండి
  36. మంద పీతాంబర్ గారూ,
    మీరు పద్యాన్ని భారతార్థంలో చెప్పకున్నా పదాలను చొప్పించిన విధానం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  37. గురువుగారు మీరిచ్చిన దత్తపదిలో కేవలం పదాలనే చూసాను క్రింద సూచించన నిబంధన గమనించలేదు ,పోగా అందరు భారతార్థంలో పూరించారు కనుక వేరే విధంగా పూరించ ప్రయత్నించాను .పొరపాటు నాదే.

    రిప్లయితొలగించండి