31, మార్చి 2011, గురువారం

సమస్యా పూరణం - 272 (యముని మహిషము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
యముని మహిషము యమహా యయినది.

10 కామెంట్‌లు:

  1. నేఁటి వేగ మిదియె నీకుహా నికరము
    గమన రీతి గాంచఁ గలుఁగు భయము
    రాజ మార్గ మందు,రాఁక పో కలవేళ
    యముని మహిషము యమహా యయినది

    రిప్లయితొలగించండి
  2. యముని లోక మంత యవనిఁలో గనవచ్చు,
    యముని మహిషము యమహాయయినది!
    నరక ప్రాయ మేను నడకమా ర్గములందు,
    కనఁగ మరణ భయము,కనుల యందు!

    రిప్లయితొలగించండి
  3. సైకత ముల యందు సాగిపోవలెనన్న
    ఆంజనేయ గుఱ్ఱ మదియె హాయి
    దుక్కి రైతు తాను దున్నగా వలెనన్న
    యముని మహిషము, యమ హాయయినది.

    ఆంజనేయుని (గుఱ్ఱం)వాహనం = ఒంటె
    యముని(మహిషం) వాహనం = దున్న

    రిప్లయితొలగించండి
  4. మందాకినిగారూ!స్పీడుగా వెళ్తే యమహా యమ హాని కరం అని చక్కగా చెప్పారు.అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !
    01)
    _______________________________________

    సురలు జేరి నారు - సొంపార తిలకింప
    నంద రొక్క చోట - ఆకశమున !
    క్రికెటు జూడ గోరి - కీనాశు డేనిన్న
    మోజు తీర మొహలి - ముందు జేరె !
    మహిష వాహనుండు - మనిషిగా మారిన
    యముని మహిషము యమ - హా యయినది !


    మరల వత్తు ! చివరి - మ్యాచునూ జూచెద
    కప్పు మీకె వచ్చు - తప్ప దనుచు
    ముద్దు తీర మ్యాచి - ముదముగా వీక్షించి
    మరలి నాడు జముడు - నరక పురికి !
    _______________________________________

    కీనాశుడు = యముడు
    మహిషవాహనుడు = యముడు
    మొహలి = మొహాలీ స్టేడియం
    యమహా = మోటారు సైకిలు

    రిప్లయితొలగించండి
  6. మందాకిని గారూ,
    మీ రండు పూరణలూ వైవిధ్యంగా ఉన్నాయి.
    "స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్" అన్న విషయాన్ని మొదటి పూరణలో చక్కగా చెప్పారు.
    రెండవ పూరణలో "నరక ప్రాయ" మన్నప్పుడు "క" గురువు అవుతుంది.
    ఆ పాదాన్ని "నరక తుల్య మగును నడచు మార్గము లన్ని" అందాం.
    మరొక్క విషయం ... మీరు పద్యం వ్రాసే సమయంలో గణాల వారిగా వ్రాసుకోండి. కాని పోస్ట్ చేసే సమయంలో మాత్రం పదాల వారిగా పంపండి. "నీకుహా నికరము, రాఁక పో కలవేళ" అని కాక " నీకు హానికరము, రాఁక పోకలవేళ" అని టైపు చేయండి.

    హనుమచ్ఛాస్త్రి గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    "ఆంజజేయ గుఱ్ఱము" ను "ఆంజనేయు గుఱ్ఱము" అందాం.

    వసంత్ కిశోర్ గారూ,
    క్రికెట్టుకు ముడిపెట్టిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. తలపు లోన నెద్ది తత్తర పెట్టును?
    యువత నేడు కోరు యొక్క వరము?
    బదులుఁ జెప్ప లేవు భావమె ఱుకఁ గాక!
    యముని మహిషము, యమహా, యయినది.

    గురువు గారు,
    ధన్యవాదములు. మీ సూచన పాటిస్తాను.
    మిత్రులిద్దరి పూరణలూ విభిన్నంగా బాగున్నాయి. వసంత్ కిశోర్ గారు ఒక కథ, జోస్యము కూడ కలిపి చెప్పేశారు.

    రిప్లయితొలగించండి
  8. మాస్టరు గారూ! ధన్యవాదములు.
    కిశోర్ గారూ!యముడినే యమహా మీద క్రికెట్టుకి రప్పించారు. యమ (బా)హా ఉందండీ.అబినందనలు.

    రిప్లయితొలగించండి
  9. శంకరార్యా ! ధన్యవాదములు !
    మందాకిని గారూ ! ధన్యవాదములు !
    మీ పూరణలు నెమ్మది నెమ్మదిగా
    పదును దేరుతున్నవి
    శాస్త్రిగారూ ! ధన్యవాదములు !
    మీరు యమ హాయి చేస్తే
    మరి నాకు "యమహా" తప్పలేదు !

    రిప్లయితొలగించండి
  10. శాస్త్రిగారికి, వసంత్ కిశోర్ గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి