2, ఏప్రిల్ 2011, శనివారం

సమస్యా పూరణం - 274 (మకరము పట్టంగ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
మకరము పట్టంగ నాకు మరులు గలిగెరా.

26 కామెంట్‌లు:

  1. సుకరము గల నాడొకపరి
    మకరముఁ జంపిన దయాళుఁ మదిలో నేమా
    రక పూజలుఁ జే సెడు మా
    మ,కరము పట్టంగ నాకు మరులు గలిగెరా

    రిప్లయితొలగించండి
  2. మకరము మా రాశులు! క్షే
    మకరము మా జాతకంబు! మనువే కుదిరెన్!
    మకరము లగ్నములో వా
    మ,కరము పట్టంగ నాకు మరులు గలిగె రా!

    రిప్లయితొలగించండి
  3. సకలము నీవే ననె, నా
    ముకుళితమౌ మోముగాంచి, ముదమున ప్రేమన్
    బ్రకటించ,మనోహరు ,వా
    మ,కరము పట్టంగ నాకు మరులు గలిగెరా!

    రిప్లయితొలగించండి
  4. నవనిధుల పేర్లు:పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, కచ్ఛపము, ముకుందము, కుందము, నీలము, వరము: వచ్చేట్లుగా సమస్యా పూరణ:

    ఒక పద్మ,మహా పద్మముఁ
    నిక, కచ్ఛప, వర, ముకుంద, నీలము, కుందా
    దిక, శంఖ, నవని ధియునా
    మకరము పట్టంగ నాకు మరులు గలిగెరా!

    రిప్లయితొలగించండి
  5. వికలముఁజెందినకరిరా
    జు,కరుణఁజూపుమనివేడఁ, జోరున, ననుజూ
    డకఁజని,కరిగాచియనువుఁ
    మకరము పట్టంగ నాకు మరులు గలిగెరా.

    గజేంద్రుని రక్షణ పూర్తి అయినాక, శ్రీమన్నారాయణుడు "నేనిలా వచ్చేసినందుకు నీవేమనుకున్నావు" అని శ్రీమహాలక్ష్మి ని అడుగుతాడు.
    భక్తులనిలా కాపాడిన భగవంతుని చూచి ఆ తల్లి మరులుఁగొందని నా యూహ.
    కొడుకుని పడిపోకుండా భర్త పట్టుకొని కాపాడినపుడు భార్య అతన్ని ఆరాధనగా చూడదా?
    పై పద్యంలో సుకరముగ+అల అని భావన.

    రిప్లయితొలగించండి
  6. మకరందమంటి పల్కులు
    మకరధ్వజునమ్ముఁబోలు మైసోయగముల్
    మకరారినడక గల భా
    మ కరము పట్టంగ నాకు మరులు గలిగెరా!

    రిప్లయితొలగించండి
  7. క : మకరందము రుచికై గో
    ధిక, తుమ్మెద పాట్లు జూడ నికరం గానే
    మకరందం పై మిక్కిలి
    మకరము పట్టంగ నాకు మరులు గలిగెరా!

    రిప్లయితొలగించండి
  8. మందాకిని గారూ,
    మీ రెండు పూరణలూ చాలా బాగున్నాయి. అభినందనలు.

    హనుమచ్ఛాస్త్రి గారూ,
    ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    పీతాంబర్ గారు,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    "ముకుళితమౌ మోము" .... ?

    చంద్రశేఖర్ గారూ,
    మీ నవనిధుల పూరణ బాగుంది. అభినందనలు.

    ఫణి ప్రసన్న కుమార్ గారూ,
    అత్యుత్తమమైన పూరణ. అభినందనలు.
    "మకరందమంటి పల్కులు" అనేదాన్ని "మకరందము వంటి నుడులు" అందాం.

    వరప్రసాద్ గారూ,
    పద్యం బాగుంది. కాని చిన్న వివరణ ఇస్తే బాగుండేది.
    రెండవ పాదంలో "ధి-ని"లకు యతి చెల్లదు.

    రిప్లయితొలగించండి
  9. ఒకపరి కరి గావవె బో,
    మకరము పట్టంగ!నాకు మరులు గలిగె రా
    ర! కనికరమునను నను నీ
    మకరి జరా సంధు నుండి మనిపేల్కొనగన్!

    మనిపి+యేల్కొనగన్

    రిప్లయితొలగించండి
  10. మిత్రుల పూరణలు చాలా బాగున్నాయి.

    శుక పికముల రావమ్ముల
    నికరములౌ మధుకరముల నిస్వన మెలరన్
    సుకరముగా సుమబాణుని
    మకరము పట్టంగ నాకు మరులు గలిగెరా !

    రిప్లయితొలగించండి
  11. మిస్సన్న గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    "మనిపి యేలుకొనన్" అని యడాగమ రూపమే వస్తుంది. అక్కడ సంధి లేదు.
    "మనుపుచు నేలన్" అనిగాని, "మనిపియు నేలన్" అంటే సరి.

    నరసింహ మూర్తి గారూ,
    మనోహరమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !


    విశ్వ విజేతలుగా నిల్చిన టీమిండియాను
    మెచ్చుకుంటూ భారతీయుడు :
    01)
    ___________________________________________

    సుకృతుల జేసిరి సర్వుల
    శకలము గాకుండ నిలిపి - సచినుని కలనే
    సుకరముగ క్రికెటు కప్పు , త
    మ , కరము పట్టంగ నాకు - మరులు గలిగెరా !
    ___________________________________________
    సుకృతి = ధన్యుడు

    రిప్లయితొలగించండి
  13. Congratulations, India. Happy World Cup Winning Moments.
    ధోని సేన దోచుకొనెగ దుర్లభ ప్ర
    పంచ కప్పు, భరతదేశ బావుటాలు
    యెగిరె నోయి సుజనసీమ లెల్ల మెచ్చె
    భారతీయుడా,నీకిదె భళి భళి భళి !
    కొసమెరుపు: పంచ్ కోసం ఇంగ్లీషులో కూడా విష్చేశాను, వరల్డ్ కప్ కదా!

    రిప్లయితొలగించండి
  14. మకరందపు పలుకులు విని
    మకరాంకుని గాంచినంత మాటలు కరువై !
    కకవికల మవగ మదిలొ
    మకరము పట్టంగ నాకు మరులు గలిగెరా !

    మకరాంకుడు = మన్మధుడు

    రిప్లయితొలగించండి
  15. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంఆదివారం, ఏప్రిల్ 03, 2011 8:04:00 AM

    కోట్లాది భారతీయుల కలని నిజం చేసిన 'టీం ఇండియా' కి శుభాకాంక్షలు
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  16. ప్రపంచ క్రికెట్ కప్పును సాధించిన భారత జట్టుకు శుబాకాంక్షలు.

    మొదట సెహ్వాగు వెనుదిర్గ మొక్కవోక!
    సచిను యువరాజు కొహ్లీలు సాహసింప!
    ధోని గంభీరు నిలబడి తోడు నిలువ!
    కప్పు దెచ్చిరి భారత కలలు పండ!

    రిప్లయితొలగించండి
  17. గురువుగారూ దిద్దుబాటుకు ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  18. క్రికెటు కప్పు మనదె! క్రీడ లీడర్ మనమె!
    జగతి కప్పు మనదె! జాణ మనమె!
    కలసి కట్టు జట్టు! కరచు మట్టిని వైరి!
    ఐక మత్య మొకటె ఆదు కొనును!

    రిప్లయితొలగించండి
  19. గురువుగారు ఈ సమస్యను పరిశీలించ వచ్చును.

    కప్పు గెలిచినారు కలత వడగ !

    రిప్లయితొలగించండి
  20. వసంత్ కిశోర్ గారూ,
    సమయానుకూలమైన చక్కని పూరణ. అభినందనలు.

    రాజేశ్వరి గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.

    చంద్రశేఖర్ గారూ,
    మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
    హనుమచ్ఛాస్త్రి గారూ,
    మిస్సన్న గారూ,
    ............................ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. "సకల సుఖమ్ములు వీడియు
    నకిలీ వేటలను వలచి నందము తోడన్
    సుకరముగ నాట లాడుచు
    మకరము పట్టంగ నాకు మరులు గలిగెరా!"


    ...as spoken by a girl watching Steve Irwin, the famous "crocodile hunter"...

    రిప్లయితొలగించండి
  22. నికటపు చెరువున మున్గుచు
    వికటపు కేకలను యువతి విరివిగ నిడగా
    చకచక నీదుచునా భా
    మ కరము పట్టంగ నాకు మరులు గలిగెరా

    రిప్లయితొలగించండి