మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటిపూరణలో ‘..నాడుదాననను విషయ మాదమరచి’ అనండి. ‘ఆడె, పలికె’ అని పునరుక్తి. రెండవపూరణలో ‘మొగుడు’ సాధువు. ‘మగనిని’ అనండి.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటిపూరణ నిర్దోషం! రెండవపూరణలో ‘చక్కన్ దాను సంసిద్ధుడై’ అనండి. ‘తయారగుట’ అన్యదేశ్యం. ‘ఉత్తేజిత+ఐ’ అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. ‘...నిద్వేగియై’ అనండి.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పరధ్యానముగా సమస్యను జూసి చంపకమాల యని భ్రమ పడి పూరించిన తరువాత చూస్తే మత్తేభ సమస్య! పద్యము పూర్తియయ్యింది కదా యని సమస్యను కొంచెము మార్చి వ్రాసిన పూరణ తిలకించ గోర్తాను.
పరాకుగా వ్రాసిన చంపకమాల పూరణతో సహా మీ అన్ని పూరణలు బాగున్నవి. ముఖ్యంగా తేటగీతి పూరణలో పదవిభాగం ఆశ్చర్యకరం, అభినందన పాత్రం, ఔత్సాహిక కవులకు మార్గదర్శకం.
అన్నా! అవాల్మీక ఘట్టములు కొన్ని రామాయణము లందు మిక్కిలి ప్రాచుర్యం పొందినవి. సీతా మహాసాధ్వి కాలి అందెలు తప్ప ఇతరము తెలియదను చెప్పు కంబ రామాయణము నందలి ఘట్టము అవాల్మీక మందురు. కాని ఎంతో ప్రాముఖ్యతను పొందినది. కాని మీరు చెప్పిన భావన సీతమ్మను పౌరుషరూపము చూపిన ఘనత మీదే. శ్రీ కామేశ్వర రావు గారు చెప్పిన పదం పరిశీలింప దగినదే. మీ ఇద్దరకూ అభినందనలు.
శ్యామల గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ ప్రయత్నం ప్రశంసనీయం. కొన్ని లోపాలు... ‘అడలుకొనుచు’ అనండి. రెండవపాదంలో గణదోషం, యతిదోషం. సవరించండి. మూడవపాదాన్ని ‘నీదు భర్తను నుండ కన్నీరు వలదు’ అనండి. నిరుత్సాహపడకండి. కొద్దిగా అభ్యాసం చేస్తే చక్కని పద్యాలు వ్రాయగలరు.
పురుష పాత్రను ధరియించి పౌరు షముగ
రిప్లయితొలగించండివనిత మీసమ్ము నంటి తాఁ బలికె నిట్లు
నటన మందున తనుచాల పటిమ యనుచు
రాజ ఠీవిని కనబరచి రమ్యము గను
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటిపాదంలో యతి తప్పింది. ‘వలలు/వాలి పాత్రను ధరియించి పౌరుషముగ’ అనండి.
సురభి వారి “కపట జూదము” నాటక ప్రదర్శనమున
రిప్లయితొలగించండిభీమ పాత్రను దాల్చుచు భీమముగను
వనిత మీసమ్మునంటి తా బలికె నిట్లు
మద్గ దాదండ ప్రహరణ మాత్ర మూరు
భంగ మత్తరి నారణ రంగ మందు
జేతు నోరి సుయోధనా! శివుని యాన.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఘనమౌ నేటియు గంబునందు నిలలోకాంతా మణుల్ చోద్యముల్
రిప్లయితొలగించండివినుమీ సాహస కృత్యముల్ మిగుల ప్రావీణ్యం బుగాజేయు చున్
వనితా రత్నము మీస మంటి పలికెన్ వాల్లభ్య మొప్పారగన్
కనమే నేతగ రాజ్యమే లినతరిన్ గాలించి సౌఖ్యం బిడన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివేసెను జిలేబి మగరాయ వేష మోయి
రిప్లయితొలగించండిభళిర ! చూడముచ్చటగ సెభాషు యనగ
వనిత మీసమ్ము నంటి తాఁ బలికె నిట్లు
పూరణ నిదియే కవిరాయ పూర్తి గాను !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘సెభాషు+అనగ’ అన్నపుడు యడాగమం రాదు. ‘సెభా షనంగ’ అనండి.
మనసు దోచిన యందాల మగువ బెండ్లి
రిప్లయితొలగించండియాడగ వలదంచును పెద్దలనగ నేడ్వ
వనిత, మీసమ్ము నంటి తా బలికె నిట్లు
వదల బోనిక నీచేయి వలదు చింత
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితన చారిత్రము లోకమెల్ల వెలగన్ త్రైలోక్య విఖ్యాతిగా
రిప్లయితొలగించండితనువున్ మార్చిన యంబవచ్చి నిలిచెన్ తానే కురుక్షేత్రమున్
వనితారత్నము మీస మంటి పలికెన్ వాల్లభ్య మొప్పారఁగన్
నినునే జంపెద నిక్కమింక నిలుమా నిచ్చోట గంగాసుతా
శిఖండి ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్షమించాలి చివరి పాదం " రాజ ఠీవిని జూపించి రమ్యము గను " అని ఉండాలి
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి[5/31, 8:35 AM] NVNChary: డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
తొలగించండిSk2031అకస
1భర్త మోమును తిలకించి బాధతోడ
వనిత, మీనమ్ము నంటి తాఁబలికె నిట్లు
' గడ్డమును జేయ తెగినది కలత వలదు
వలదు వలదన్న పెరుగు నదియు నెపుడు'
2.పేడి మూతితో యున్నట్టి పెనిమిటి గని
వనిత, మీసమ్ము నంటి తాఁ బలికె నిట్లు
పా ర్థ!మీసము లేకున్న పడతి కన్న
నందగించిన నిను గూడ వత్తురంత'
[5/31, 8:55 AM] NVNChary: డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
Sk2031అకస
1 పురుష వేషము ధరియించి పురము తిరుగు
రుద్ర మాంబకు చిక్కిన క్షుద్రు జూచి
వనిత మీనమ్ము నంటి తాఁబలికె నిట్లు
శిక్ష వేసెద చేసిన చెడ్డ పనులు
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటిపూరణ చివరిపాదంలో యతి తప్పింది.
రెండవపూరణ చివరిపాదంలో యతి తప్పింది.
మూడవపూరణలో ‘చేసిన చెడుగులకును’ అంటే అన్వయం కుదురుతుంది.
సింహ బలుని పీడన మరి చిక్కులన్ని
రిప్లయితొలగించండితేలిపోవును నేటితొ దిగులు పడకు!
వనిత! మీసమ్ము నంటితాఁ బలికె నిట్లు
"అమిత భీకర రీతిగ నతడు గూలు"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘తాఁ బలికె వలలుఁ| డమిత...’ అంటే బాగుంటుందేమో?
రిప్లయితొలగించండివనితమీసమ్మునంటితాపలికెనిట్లు మీసముండినమగవారుమీరయైన రండినాతోడదలపడరండివేగ తేల్చుకొనెదముమనయొక్కతెగువలిపుడ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘మీరె యైన/ మీర లైన’ అనండి.
(శంకరయ్య గారూ...మా బావగారు శ్రీ తంగిరాల తిరుపతి శర్మ గాru రాసిన పద్యం)
రిప్లయితొలగించండిఅపర దుర్యో్ధనుని వోలె అబ్బురముగ
నటనజేయుచు అంజలి నాటకాన
అయిదుఊళ్ళైన నిమ్మను హరిని జూచి
వనితమీసమ్మునంటి తాబలికెనిట్లు
శ్రీ తంగిరాల తిరుపతి శర్మ గారి పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివనిత మీసమ్మునంటి తా బలికెనిట్లు
తొలగించండి"వీర రుద్రమ్మ మాంచాల వారసులము
బేలతనమేల మనకిట్లు బిడియమేల?
కత్తి బట్టుడు కామాంధు కరమునఱుక"
************************
వనితారత్నము మీసమంటి పలికెన్ వాల్లభ్యమొప్పారగా
"ధన గర్వాంధత దౌష్ట్యముల్ సలుపుచున్ ధర్మంబు బోనాడి -శో
ధనచే గన్నెల మానముల్ చిదుమ పంతంబూను నో కీచకా!
కనుమా నాదు పరాక్రమంబిపుడు నిన్గైవల్యముంజేర్చెదన్."
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి[10:18AM, 5/31/2016] అంబటి భానుప్రకాశ్.: 🌺🌻🌺
రిప్లయితొలగించండితే**
అతివ వేషము నేసిన యాటగాడు,
నాడు దాననె విషయము, ఆటమరచి,
యాడె రోషము మీరగ తోడునున్న,
వనిత మీసమ్ము నంటి తా బలికె నిట్లు,
🙏 🌹🙏
అంబటి. . . ,
[10:33AM, 5/31/2016] అంబటి భానుప్రకాశ్.: 🙏 🌻🙏
తే**
చేత గానట్టి మొగుడిని చేరనీక,
యత్త మామల పీడించి,విత్తమీక
తాను పెద్దను నడుపుచు, తగవుబూని,
వనిత మీసమ్ము నంటి తా బలికె నిట్లు,
అంబటి. . . ,
🌺🙏 🌺
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటిపూరణలో ‘..నాడుదాననను విషయ మాదమరచి’ అనండి. ‘ఆడె, పలికె’ అని పునరుక్తి.
రెండవపూరణలో ‘మొగుడు’ సాధువు. ‘మగనిని’ అనండి.
సవరణ
తొలగించండితే**
అతివ వేషము నేసిన యాటగాడు,
నాడు దాననె విషయము, ఆదమరచి,
యాడె రోషము మీరగ తోడునున్న,
వనిత మీసమ్ము నంటి తా బలికె నిట్లు,
తే**
చేత గానట్టి మగనిని చేరనీక,
యత్త మామల పీడించి,విత్తమీక
తాను పెద్దను నడుపుచు, తగవుబూని,
వనిత మీసమ్ము నంటి తా బలికె నిట్లు,
అంబటి. . . ,
కీచులాటలు మొలకెత్త కాపురమున
రిప్లయితొలగించండినిస్సహాయురాలిగకంట నీరు కార్చ
వనిత, మీసమ్మునంటి తా బలికెనిట్లు
నీదు నెత్తురు కండ్లలో నెరుగ జూతు
మీ పూరణ బాగున్నది.
తొలగించండిమొదటిపాదంలో గణదోషం. ‘కలత లెన్నియొ మొలకెత్త కాపురమున’ అనండి.
వనిత మీసమ్ము నంటి తాపలికె నిట్లు
రిప్లయితొలగించండి“ నిమ్మకాయ మీసమ్ముపై నిలుపునట్టి
మగడుదొరికెను నాకిప్డు, జగతిలోన
తిరుగు లేదంచు” త్రుళ్ళుచుఁదృప్తిఁబడుచు
ఘనుడౌ భీముడు కీచకున్ దునుమ చక్కంగా తయారవ్వగన్
రిప్లయితొలగించండికనుచున్ దెందము సంతసం బడర నక్కౌంతేయు, నుత్తేజితై
వనితారత్నముమీసమంటి పలికెన్ వాల్లభ్య మొప్పారగన్
రణమందున్ వెస దుష్టునిన్ మడచి శూరత్వంబుతో రమ్మికన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటిపూరణ నిర్దోషం!
రెండవపూరణలో ‘చక్కన్ దాను సంసిద్ధుడై’ అనండి. ‘తయారగుట’ అన్యదేశ్యం. ‘ఉత్తేజిత+ఐ’ అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. ‘...నిద్వేగియై’ అనండి.
కదన రంగంబునందున కత్తి దాల్చి
రిప్లయితొలగించండిపురుష శ్రేష్టుని వోలె తాపుడమి యందు
నిలిచి వీరోచితంబుగ నిర్భయముగ
వనిత మీసమ్ము నంటి తా పలికె నిట్లు
వెన్ను జూపుచు పారుట వేడుకౌనె
చేవగల్గిన వాడైన చేత జూపు
మనుచు యువనేత వోలె తా నవని యందు
వనిత మీసమ్ము నంటి తా పలికె నిట్లు.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండికనియా భీష్ముని నుగ్రయుద్ధమున మేఁ గంపింప భీభత్సుడు
రిప్లయితొలగించండిన్ననివార్యంబుగఁ గష్ట కాలమున నయ్యంబన్ శిఖండిన్ వడిం
దన సాహాయ్యము సేయ గోరి యరదం బందుంచ రోషంబునన్
వనితారత్నము మీస మంటి పలికెన్ వాల్లభ్య మొప్పారఁగన్
ఆవుని చంపబోవు నొక కటిక వాని యాయుధము (బాణము) పట్టుకొని యొక మానవతా వాది వలదని చెప్పు సందర్భము:
కటిక వాని నొకని గాంచి కరుణ మీర
వాని యత్నమాపగ నొక మానవుండు
వినుము తెలియదె వధియింపగను నిట పశు
వనిత మీసమ్ము నంటి తాఁ బలికె నిట్లు
[పశువు +అనితము+ఈస+అమ్ము;
అనితము =పొందబడనిది; ఈస = అల్పము; అమ్ము = బాణము]
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పరధ్యానముగా సమస్యను జూసి చంపకమాల యని భ్రమ పడి పూరించిన తరువాత చూస్తే మత్తేభ సమస్య! పద్యము పూర్తియయ్యింది కదా యని సమస్యను కొంచెము మార్చి వ్రాసిన పూరణ తిలకించ గోర్తాను.
తొలగించండిఅనితర సాధ్యు డంచు నత డాలము నందు నరుండు భీష్మునిం
దునుముగ నెంచి ధర్మమును దూరము జేసి శిఖండిఁ బేడినిం
దన రధ మందు నుంచగను దర్పము మీర పరాక్ర మింపగన్
వనితయె మీసమంటి తగఁ బల్కెను పంతము దీరు నిత్తరిన్
పరాకుగా వ్రాసిన చంపకమాల పూరణతో సహా మీ అన్ని పూరణలు బాగున్నవి. ముఖ్యంగా తేటగీతి పూరణలో పదవిభాగం ఆశ్చర్యకరం, అభినందన పాత్రం, ఔత్సాహిక కవులకు మార్గదర్శకం.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీప్రశంస మిక్కిలి యుత్సాహమునిచ్చినది నాకు. ధన్యవాదములు.
తొలగించండిగురుదేవులకు ధన్యవాదములతో...
రిప్లయితొలగించండి==========*=========*========
అపరిచిత యను నాటక మందునొక్క
వనిత,మీసమ్ము నంటి తాఁ బలికె నిట్లు
"మీసమొక్కటే జాలదు మేనకనెది
రింప సపరివారమునను పంపమనెను"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివినుమానాయదిపల్కులన్గమల!యేవేళావిశేషంబహో వనితారత్నముమీసమంటిపలికెన్వాల్లభ్యమొప్పారగన్ దనదైనన్దగుశైలిలోతాదాత్మ్మంఙేబునొందన్మదిన్
వినగానొప్పునెనామెమాటలిలదావేసారునట్లేయగున్
3వపాదము.....తాదాత్మ్మంబునొందన్మదిన్
తొలగించండిమీ పూరణ బాగున్నది.
తొలగించండిమూడవపాదంలో గణదోషం. ‘తనదైన న్దగు శైలిలో బలికె తాదాత్మ్యంబు నొంద న్మదిన్’ అందామా?
పనితో వేసరి వాలి సోలి జనె సంవాసంబు, భార్యామణిన్
రిప్లయితొలగించండిక్షణమేయాగక కౌగిలించుకొని, “నే కార్యార్థినై వచ్చితి”
న్నన నా మోమును వ్రేలి తోటి తడుమన్, “నా వెంట రమ్మంచు” నా
వనతా రత్నము మీసమంటి పలికెన్, వాల్లభ్య మొప్పారగన్॥
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన హీనుండని కన్నెనివ్వగను నిర్దాక్షిణ్యుడై మామయే
రిప్లయితొలగించండిదనమేనల్లుని త్రోసిపుచ్చ చెలి యే తానింక జీవింపలే
ననుచున్ యేడ్చుచు నాత్మహత్యయె శరణ్యమ్మంచు భావించెనా
వనితారత్నము, మీసమంటి పలికెన్ వాల్లభ్య మొప్పారగన్
మనసుందోచిన యింతినే సతిగ సన్మార్గమ్మునన్ పొందెదన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘అనుచున్+ఏడ్చుచు’ అన్నపుడు యడాగమం రాదు.‘జీవింపలే| నని తా నేడ్చుచు..’ అనండి.
వనిలో రక్కసి మూక లన్న భయమా వైదేహి కో రాఘవా
రిప్లయితొలగించండికని కోదండము గుండె జారి చనవే కంగారుగా నేను నీ
వెనుకన్నిల్తును ముప్పు లేదనుచు నిర్బీతిన్ పతిన్ జానకీ
వనితారత్నము మీసమంటి పలికెన్ వాల్లభ్య మొప్పారగన్.
చక్కటి పూరణ మిస్సన్న గారు. "కంపమ్మునన్" అంటే యింకా బాగుంటుందేమో
తొలగించండిఅన్నా! అవాల్మీక ఘట్టములు కొన్ని రామాయణము లందు మిక్కిలి ప్రాచుర్యం పొందినవి. సీతా మహాసాధ్వి కాలి అందెలు తప్ప ఇతరము తెలియదను చెప్పు కంబ రామాయణము నందలి ఘట్టము అవాల్మీక మందురు. కాని ఎంతో ప్రాముఖ్యతను పొందినది. కాని మీరు చెప్పిన భావన సీతమ్మను పౌరుషరూపము చూపిన ఘనత మీదే. శ్రీ కామేశ్వర రావు గారు చెప్పిన పదం పరిశీలింప దగినదే. మీ ఇద్దరకూ అభినందనలు.
తొలగించండిశర్మ గారు జనకాత్మజ నూపురములు తప్ప యితరములనెరుగనని లక్ష్మణుడు చెప్పుట వాల్మీకి రామాయణ ఘట్టమే.
తొలగించండినాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే
నూపురేత్వభిజానామి నిత్యం పాదాభి వందనాత్
అవును కామేశ్వరరావు గారూ మీ సూచన చాల బాగంది. ధన్యవాదాలు.
తొలగించండిమిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి. వనికే ఓబమ చిత్రదుర్గ చరితన్ ప్రాశస్తమౌ గాథగా
రిప్లయితొలగించండివనితా రత్నము మీసమంటిపలికెన్ వాల్లభ్య మొప్పారగన్
“తనువుల్ వీడగరండు రంద్రమున నత్యాసన్ పరీక్షింపగా
యనుచున్ శత్రువు లందరిన్ దునిమెశైన్యంబంత తానొక్కతే.”| {చిత్రదుర్గ కోటప్రవేశానికిచిన్నిరంద్రము ద్వారా శత్రువులప్రవేశాన్ని గమనించిన వనిత=ఓబమ్మ రోకలిబండ=వనికె-నుపయోగించిచంపినవీరవనితపూరణకర్త}
2.పిల్లలాడుచు నుండకోపిల్లి నొకతె
వనిత మీసమ్ము నంటి తాబలికె నిట్లు
రండి కబాడీకి యెవరైన మొండిగాక
గెలువగలిగిన సయ్యని బిలుతు ననెను.{పిల్లలాడుఆటలోసయ్యాట}
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటిపూరణలో ‘..నత్యాశన్ పరీక్షింపగా| ననుచున్ శత్రువు లందరన్ దునిమె సైన్యంబంత తా నొంటిగాన్’ అనండి.
కనులన్ లోకము జూడ నొల్ల ననుచున్ గంతల్ నియోగించి,నిన్
రిప్లయితొలగించండిజనకున్ జేసెను వంద పుత్రులకు వంశమ్మున్ ప్రకాశింప నీ
వనితారత్నము .మీసమంటి పలికెన్ వాల్లభ్యమొప్పారగన్
జనుషాంధు౦డగు యాంబికేయుడు సతిన్ శ్లాఘించి దీవించుచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘జనుషాంధుండగు నాంబికేయుడు...’ అనండి.
పతిని సేవించు టొక్కటే పనిగ బూని
రిప్లయితొలగించండివనిత మీసమ్ము నంటితా బలికె నిట్లు
తెల్ల బడినట్టిమీసాల నల్ల రంగు
నొక్క టొకటిగ వేతును చక్క గానుౌౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘చక్కగాను’ అన్నచోట టైపాటు. (కారు కుదుపుల వల్ల అయి ఉంటుంది)
వినుమా! నీతి విహీను లెల్లరును నిర్భీతాత్ములై నేతలై
రిప్లయితొలగించండిధనమార్జించుచు గొప్ప వారయిరి, యీ దారిద్ర్య బాధేల నా
మనవిన్ జే కొని వారి మార్గమున మామా! నడ్వుమా యంచు నా
వనితారత్నము మీస మంటి పలికెన్ వాల్లభ్య మొప్పారఁగన్”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివనిత మీసమ్ము నంటిi తా పలికె నిట్లు
రిప్లయితొలగించండి"రోసముకుగుర్తు లవిగావు మీసలిపుడు
కుత్సితమ్ము కుతంత్రముల్ కొలువుదీర
మీసలున్నను లేకున్న మేటి యతడె "
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘రోసముకు’ అనరాదు. ‘రోసమునకు గుర్తులు గావు మీస లిపుడు’ అనండి.
శ్యామలగడ్డం...31మే 2016 6pm
రిప్లయితొలగించండిఅత్త మామల ఆరళ్ళ అడలుకొంటు
బేలయగుచు కుందుచు కంట నీరు
నీది భర్తను నేనుండుట నీరువలదు
వనిత! మీసమ్మునంటి తా బలికెనిట్లు...
నేను మొదటిసారి శంకరాభరణము బ్లాగ్ లో సమస్యా పూర్ణంలో రాస్తున్నాను..తప్పుంటే తెలియచేయగలరు...
శ్యామల గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ ప్రయత్నం ప్రశంసనీయం. కొన్ని లోపాలు... ‘అడలుకొనుచు’ అనండి. రెండవపాదంలో గణదోషం, యతిదోషం. సవరించండి. మూడవపాదాన్ని ‘నీదు భర్తను నుండ కన్నీరు వలదు’ అనండి.
నిరుత్సాహపడకండి. కొద్దిగా అభ్యాసం చేస్తే చక్కని పద్యాలు వ్రాయగలరు.
సతి సావిత్రిగ , మల్ల మాంబయనగా , సౌమిత్రికిన్ పత్ని గా
రిప్లయితొలగించండిసుతునిన్ భర్తను వీడు చంద్రమతి గా శోకమ్ముచిందించ, నీ
క్షితిలో వేంగళరాయు పాత్ర మెరుగై చిప్పిల్లగా నొక్కచో
వనితారత్నము మీస మంటి పలికెన్ వాల్లభ్య మొప్పారఁగన్
జన్మ మొందియు వనితగ జగతి లోన
భూరి శస్త్రచికిత్స చే పురుషుడయ్యె ;
మూతి పై మీసములు పలు మొలిచినంత
వనిత మీసమ్ము నంటి తాఁ బలికె నిట్లు
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిగురువుగారికి ధన్యవాదములు
రిప్లయితొలగించండినినుజూడన్ మనసాయరా! విజయ! నన్నేలంగ రావేలనో?
రిప్లయితొలగించండికనుగీటన్ బిగువేలరా? సరస సంగ్రామంపు వేళాయరా!
కనవే యూర్వశి వన్నెలన్! మగసిరుల్ కవ్వించ లేవేల?నన్
వనితా రత్నము మీసమంటి పలికెన్ వాల్లభ్యమొప్పారగన్!
(ఊర్వశి అర్జునుని రెచ్చగొట్టటకు అతని మీసమంటి మగవాడివి కావా యన్నట్లు )
దుర్మదాంధుడు పాంచాలికి తొడ చూపె
రిప్లయితొలగించండికూరుచుండుమనుచు, అంత భీముడు తొడ
గొట్టి రోసముతోడన్ పలికె అతివతొ
వనిత! మీసమ్మునంటి తా బలికెనిట్లు
మరొకసారి ప్రయత్నము గురువు గారూ...యతిమాత్రం సరిగా కుదరలేదనిపించిందినాకు తే. గీ. కాబట్టి ప్రాస ఉండదు కదా...
డా. శ్యామలగడ్డం....31-05-2016--
కొడుకు వేషమ్ము వేయగా కోయవాని
రిప్లయితొలగించండిగాను బడిలోన, వెడలెను కన్నతల్లి
"నటన నందరుమెచ్చాలి నాన్న వినుము "
వనిత మీసమ్మునంటి తాబలికెనిట్లు.
కనరే కాంగ్రెసు నందునన్ బలురు నీకన్నన్ పరీక్షించగా?
రిప్లయితొలగించండికొనుమా నీవిక పీఠమున్ మురియుచున్ కోదండరామున్ వలెన్
చనుమా మోడిని గెల్వగా విరివి వాచాలత్వమందంచుచున్
వనితారత్నము మీస మంటి పలికెన్ వాల్లభ్య మొప్పారఁగన్