4, జూన్ 2016, శనివారం

సమస్య - 2054 (మంచుంగొండలు మండుచున్న...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“మంచుంగొండలు మండుచున్న వవిగో మాహేంద్రనీలద్యుతిన్”
లేదా...
“మంచుమల యింద్రనీలమై మండుచుండె”

83 కామెంట్‌లు:

  1. పూర్ణ చంద్ర కిరణముల పూర్తిగాను
    వెండి దుప్పటి పఱచుచు వెలుగులీన
    మంచుమల యింద్రనీలమై మండుచుండె
    చేరి కైలాస గిరినున్న శివుని గొలువ.

    రిప్లయితొలగించండి


  2. చెపుమ గంగా నదికి నేది జీవ ధార?
    యదియు నెట్టుల భాసించు నుదయ మందు?
    నేటి హిమగిరి పరిసర మెటుల నుండె?
    మంచుకొండ; యింద్రనీలమై; మండుచుండె!






    రిప్లయితొలగించండి

  3. షురోదయం :)

    భామయే కోరగ కవి కాదనగలడా :)

    కొంచెం ఇష్టము కొంత కష్టమని తా కోరంగ భార్యామణీ
    మంచుంగొండలు మండుచున్న వవిగో మాహేంద్రనీలద్యుతిన్
    అంచున్ కావ్యపు మాటలన్ హిమ సమూహాలందు కాంతామణిన్
    సంచారంబుల జూపెనా కవియె, ఆషామాషి గాదే యనన్


    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కొంచెం బిష్టము... తాఁ గోరంగ భార్యామణీ! (సంబోధనగా మార్చాలి)...’ అనండి.

      తొలగించండి
  4. వెండి కొండను శివుడంట బండ బారె
    తరుల గిరులంటి హిమములు కరుడు గట్టె
    సూర్య కాంతుని దృక్కులు చురుకు మనగ
    మంచుమల యింద్రనీలమై మండు చుండె

    రిప్లయితొలగించండి
  5. నా రెండవ పూరణము

    మంచుం గప్పుక‌ జీవగంగ నిడి యా
    మంచిం దివిన్ సాగుచున్
    పంచుంగాదె సుశీతలాత్మ గిరు లా
    ప్రాకార సుశ్రేణుల
    న్నెంచంగా గలబోసి కొన్నవవిగో
    యెన్నెల్లు గాన్పట్టగన్
    మంచుం గొండలు మండుచున్న వవిగో
    మాహేంద్రనీలద్యుతిన్!


    రిప్లయితొలగించండి
  6. యామినీపతివెలుగులో నందగించి
    మంచుమల యింద్రనీలమైమండుచుండె
    కాలకాలుని వాసముఁగాంచగానె
    కలిగె హృదయమునందున కరము తృప్తి

    రిప్లయితొలగించండి
  7. సతి వియోగము సహియింప సాధ్యమవక
    దక్ష మదమును అణచగ దక్షుడాయె!
    వీర భద్రుని రావించి వేగ పంప
    మంచుమల యింద్ర నీలమై మండుచుండె!

    రిప్లయితొలగించండి
  8. తాపమధిక మగుట చేసి తల్లి ధరణి
    భీతి నొందగ నొడలు కంపించు చుండె,
    మంచు మల యింద్ర నీలమై మండుచుండె!
    చెట్టు చేమ తోడ యవని సేద తీర్చు!

    రిప్లయితొలగించండి
  9. పెనముపైనట్లు కొలిమిని పెట్టినట్లు
    మండుటెండలు మేనుల మాడ్చుచుండె
    వినుడు మనమంత యొకనెల వెడలవలెను
    మంచుమల, యింద్ర! నీల! మై మండుచుండె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సెహబాసో సెహబాసు! అద్భుతమైన విరుపుతో కడు చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. మీ నైపుణ్యం చూస్తే అసూయతో నాకే ఒళ్ళు మండుతున్నది సుమా!

      తొలగించండి
    3. మాస్టరుగారూ! ధన్యవాదాలో ధన్యవాదాలు....మీ ప్రోత్స్సహం చూస్తే నాకు మరింత ఉత్సాహం కలుగుతుంది సుమా!

      తొలగించండి
    4. ఇంద్ర నీలము లను నామధేయములుగా మార్చి శారీరిక వేడిమిపోవ వేసవిలో మంచుకొండకు వెళ్ళవలెనన్న మీ పూరణ అత్యద్భుతము. గోళీ దెబ్బ మరొకసారి చూపించిన హనుమఛ్చాస్త్రిగార్కి శుభాభినందన శతమ్. గురువుగారి కామెంట్ తో నేనూ ఏకీభవిస్తున్నాను.

      తొలగించండి
    5. చాలా అందంగా విరిచి మంచి పద్యంగా మలిచారు...అభినందనలు..

      తొలగించండి
    6. కవిమిత్రులు శ్రీయుతులు సహదేవుడుగారు, మిస్సన్న గారు, శర్మగారికి శ్రీమతి శైలజ గారికి కడుంగడు ధన్యవాదములు.

      తొలగించండి
  10. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    1.శివుని దర్శింప విష్ణుండు చేరు కతన
    మేఘ సంకాశ మైనట్టి మేని కాంతి
    వెండి కొండపై ప్రసరించి వేడి నింప
    మంచుమల యింద్ర నీలమై మండుచుండె
    2. శివుని యావాస మేది యో చెప్పగలవె?
    రాముఁ దలపైన తలఁబ్రాల రంగు మారె?
    ధరల తీరేది చెప్పుమీ ధరణి పైన
    మంచుమల,యింద్ర నీలమై మండు చుండె

    రిప్లయితొలగించండి
  11. పాలసంద్రమ్మువలెనుండిపరిఢవిల్లు
    మంచుమల యింద్రనీలమై మండుచుండె
    మండుటెండలవేడికి మంచుగరిగి
    బాతి గలిగించు జూడగ శీతనగము !!!

    రిప్లయితొలగించండి


  12. నా నిన్నటి పూరణ...
    పుడమి బాధ దీర్ప పోరుకై వెడలగ
    మరణమందజేయ నరకునకును
    వెంట బడుచు వచ్చె నంటగా సత్యభా
    మ, రణమందు తోడు మాధవునకు.

    రిప్లయితొలగించండి
  13. సూర్య కిరణాల కాంతికి సొగసు గలుగు
    మంచుమల ,యింద్ర నీ లమై మండు చుండె
    నబ్బ యేమి యుష్ణ మ ,యెండ యదిరి పోయె
    నెప్పు డైనను జూచితె యింత వింత

    రిప్లయితొలగించండి


  14. మొన్నటి సమస్యకు నా పూరణ.....

    ఆకాననమున గోపక
    మూకాభినయమ్ము "రామమూర్తీ సీతల్"
    మ్రాకునచాటుకు రమ్మను
    శ్రీకృష్ణుని జూచి సీత సిగ్గిలి పాఱెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘రామమూర్తియు సీతల్’ అనండి.

      తొలగించండి
    2. మాస్టరుగారూ! హన్యవాదములు....సవరణతో....
      ఆకాననమున గోపక
      మూకాభినయమ్ము "రామమూర్తియు సీతల్"
      మ్రాకునచాటుకు రమ్మను
      శ్రీకృష్ణుని జూచి సీత సిగ్గిలి పాఱెన్.

      తొలగించండి
  15. కంచన్జంగను పర్వతమ్ము యదిగో కళ్లార వీక్షించుడీ
    మంచున్ కప్పెనొ పిండియారు విధమున్ రంజిల్లు సూర్యోదయం
    కొంచెం కొంచెముగా మయూఖ ప్రసరం కొండంత దృశ్యంబహో!
    మంచుంగొండలు మండుచున్న వవిగో మాహేంద్రనీలద్యుతిన్||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నిన్నటి పొరపాటు మళ్ళీ చేశారు. ‘పర్వతమ్ము+ అదిగో’ అన్నపుడు యడాగమం రాదు. ‘పర్వత మ్మదికదా కళ్లార...’ అనండి. ‘సూర్యోదయం, కొంచెం, ప్రసరం’ అని వ్యావహారికాలను ప్రయోగించారు. సవరించండి.

      తొలగించండి
    2. గురువుగారూ, నిన్నటి పొరపాటు చూసేసరికి ఇవాల్టిది జరిగిపోయింది. యదాగమం గురించి నేను కొంత పునశ్చరణ చేసుకోవాలి. సరే, సవరణలతో మరల నా పద్యము, మీ అభిప్రాయం తెలియజేయండి.

      కంచన్జంగను పర్వతమ్మదికదా కళ్లార వీక్షించుడీ
      మంచున్ కప్పెనొ పిండియారు విధమున్; బంగారమై వెల్గెనే
      కంచారుం డుదయించ దాపుదరులున్, గంభీర దృశ్యంబహో!
      మంచుంగొండలు మండుచున్న వవిగో మాహేంద్రనీలద్యుతిన్||

      తొలగించండి
    3. సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. మన్మధుడు పుష్పబాణుడై మరులు రేప
    శివుని పై బాణములు వేయ భవుడు యపుడు
    భస్మ మొనరించె యతనిని విస్మయముగ
    మంచుమల యింద్రనీలమై మండుచుండె
    (శ్రీ తంగిరాల తిరుపతి శర్మ, నెల్లూరు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిరుపతి శర్మ గారి పూరణ బాగున్నది.
      ‘భవుడు+అపుడు, ఒనరించె+అతనిని’ అన్నపుడు యడాగమం రాదు. ‘భవుడు నపుడు| భస్మ మొనరించె నతనిని...’ అనండి.

      తొలగించండి
  17. ఈ సమస్య ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర
    నిర్వహణ ,కవన విజయం, సమస్యాపూరణం
    కార్యక్రమంలో తే 26-1-2004 దీన
    ప్రసారం చేయబడినది .అప్పటి నా పూరణ

    కాంచన్గంగను బోలు పర్వత శిఖిన్ కాంతారమందోక్కచో
    కించిన్మాత్రము రేగి యగ్ని , గజముల్ ఘీంకారముల్ సల్పగా
    పెంచెన్ చిచ్చును నాల్గుదిక్కులను , తో పించెన్న శించున్ జగ
    మంచుం,గొండలు మండుచున్న వవిగో మాహేంద్రనీలద్యుతిన్

    దక్షయజ్ఞము చూడగా తానె యేగి
    కనలి సతి దగ్ధమై పోవగా కపర్ది
    వీరభద్రుని సృష్టించి వెడలు మనగ
    మంచుమల యింద్రనీలమై మండుచుండె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటిపూరణలో ‘జగ మ్మంచుం..’ అని ఉండాలి కదా!

      తొలగించండి
  18. దక్షయజ్ఞవాటిక తండ్రి తనపతిని చు
    లకన జేయగ సతీ సహించకను వహ్ని
    దగ్ధమై పోవ శివుని నేత్రమ్మదరగ
    మంచుమల యింద్రనీలమై మండుచుండె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘సతి’ అనవలసింది ‘సతీ’ అన్నారు.

      తొలగించండి
  19. మంచున్గొండలు మండుచున్న వవిగో మాహేంద్ర నీ లద్యుతి
    న్నంచు న్మా రవిచంద్రు పల్కె నిపుడే యార్యా !కనున్గొంటివే
    మంచున్గొండ లు మండు టె క్కడన లేమా !చూచితే నీవుగా
    మంచున్గొండల నె క్కుచో బదము లేమాత్రంబు గాన్పించవే

    రిప్లయితొలగించండి
  20. ముంచన్ శుద్ధ విశాలమౌ ప్రకృతినిన్ మూఢాత్ములున్ ముష్కరుల్
    పంచం జేరి దురాశఁ జిక్కియు సదా భంజింప వృక్షంబులన్
    కాంచన్ నిక్కము దైవ కల్పితములే కల్పాంతమున్ వేగ ర
    మ్మంచుం గొండలు మండుచున్న వవిగో మాహేంద్రనీలద్యుతిన్

    ఘన ఘనావృత మైన గగనముఁ దాకు
    కొండ శిఖరమ్ముల మెరయ మెండు గాను
    చారు శంపా లతిక లంత జ్వాల లనగ
    మంచు మల యింద్రనీలమై మండుచుండె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటిపూరణలో మంచుకొండలు కల్పాంతాన్ని ఆహ్వానిస్తున్నాయా? అద్భుతమైన భావన..
      రెండవ పూరణలోని ఉత్ప్రేక్ష అలరింపజేసింది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. యీ రోజు మీ వ్యాఖ్య నాకు మహదానందము నిచ్చినది. ధన్యవాదములు.

      తొలగించండి
  21. సంచారంబున నేగుచుండ నిలలో చంద్రార్ధ మౌళీశుడే
    వేంచేయున్ శశిశేఖరేశు జటలో విభ్రాజమానంబగున్
    ఆచంద్రార్కపు బింబకాంతి పడుచున్ కైలాస శైలాగ్రమున్
    మంచుంగొండలు మండుచున్న వవిగో మాహేంద్రనీలద్యుతిన్

    రిప్లయితొలగించండి
  22. సతికి యజ్ఙగుండమ్మట చితిగ మార,
    నీలకంఠుని కాయమ్ము నీలమగుచు
    వీరభద్రుని సృష్టించ వేడి పొగల
    మంచుమల యింద్రనీలమై మండుచుండె!

    రిప్లయితొలగించండి
  23. రజత గిరులను జేరిన ప్రవరు డచట
    గాంచె వింతల నెన్నియో కన్నులార
    గగన మధ్యమమున జేరి కర్మసాక్షి
    ప్రజ్వలింపగ గిరణాల ప్రాభవమున
    మంచు మలయింద్ర నీలమై మండు చుండె

    రిప్లయితొలగించండి
  24. కొంచెంబైనను జాలిలేక సతి తా కోరంగ శ్లేషమ్ము పొ
    మ్మంచున్ దొబ్బిన బ్రాహ్మణ బ్రువునిపై మానమ్ము పెంపొంద భో
    రంచున్ బోటి వరూధినీ విరహ కీలల్ విస్తృతం బౌచు నా
    మంచుంగొండలు మండుచున్న వవిగో మాహేంద్రనీలద్యుతిన్||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారు నమస్కారములు. మీ పూరణమలంకారయుతముగా నున్నది. బాగుంది.
      ప్రవరుడు నిత్యాగ్నిహోత్రుడు నిరతాధ్యయనుడు సద్బ్రాహ్మణుడే గాని “బ్రాహ్మణబ్రువుడు” గాడు. “బ్రాహ్మణోత్తముని పై” అంటే సమంజసము గా నుండునని నాయభిప్రాయము.
      “విస్తృతం బైన” అంటే యన్వయము బాగుంటుందనుకుంటాను.

      తొలగించండి
    2. మంచి భావంతో పూరణ చేశారు. అభినందనలు.
      కామేశ్వర రావు గారి సవరణలను స్వీకరించండి.
      *****
      కామేశ్వర రావు గారూ,
      ధన్యవాదాలు.

      తొలగించండి
  25. ప్రవరుడెచటికేగ దలచె పట్టుబట్టి
    నక్షతలెటుల భాసించె నవనిసుతకు
    యినుడు మధ్యాహ్న వేళల యెట్టు లుండు
    మంచుమల,యింద్ర నీలమై మండుచుండు.

    పరమశివుడెట వసియించు వసుధయందు
    రతనములయందు మేటియౌ రత్నమెద్ది
    యెట్ట లుండును సూర్యుడు యెండ వేళ
    మంచుమల,యింద్రనీలమై మండుచుండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రమాలంకారంలో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటిపూరణలో ‘పట్టుబట్టి| యక్షతలు... నవనిసుతకు| నినుడు...’ అనండి.
      రెండవపూరణలో ‘సూర్యుడు+ఎండ’ అన్నపుడు యడాగమం రాదు. ‘దినకరుం డెండవేళ’ అనండి. ‘రత్నమెద్ది?’కి ‘ఇంద్రనీలమై’ అన్న సమాధానం కుదరదు కదా!

      తొలగించండి

  26. హిమముతో కప్పబడె పర్వతములు; వెనుక

    నస్తమిస్తున్న సూర్యుని యరుణకాంతి

    నీలి యాకస మావెన్క నలదియున్న

    చిత్రమును గాంచి కవులిట్లు చిత్తగించె

    "మంచుమల యింద్రనీలమై మండుచుండె"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కవి యిట్లు చిత్తగించె’ లేదా ‘కవు లిట్లు చెప్పినారు’ అనండి.

      తొలగించండి
  27. . శివునితపమునుమాన్పి పార్వతిని గలుపుట కొరకైమన్మధుని ప్రయత్నముమంచుకొండలలోజరుప?గుర్తించిన శివుడుకంటిమంటతో గాల్చుసన్నివేశము
    పంచన్ ప్రాయపు రాయభారమును సొంపారంగ పుష్ప ద్వాజున్
    డంచల్ గాంచెడి సాంభ మూర్తి కడనా డంబంబు?నూహించకే
    కొంచంబైనను లెక్కజేయకను నాక్రోశాన గాల్చెన్ ?గనన్
    మంచున్ గొండలు మండుచున్న వవిగో మాహేంద్రనీలద్యుతిన్.
    2.మంచు బడచుండచీకటి నంచు నుండ
    ఎర్రచందన దుంగలు కర్రలన్ని
    గొట్టిదొంగలు భయపెట్ట”చుట్టుగాల్చ?
    మంచుమల యింద్ర నీలమై మండుచుండె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      టైపు దోషాలు ఎక్కువగా ఉన్నవి.

      తొలగించండి
  28. కాంచెన్ పార్వతి నిష్టతోడ తపమున్ గావించు కాలాంతకున్
    పంచన్ జేరి కరమ్ము మక్కువడరన్ ప్రార్థించె సంప్రీతితో
    పంచాస్యున్ కదిలించగన్ మదను పూభాణమ్ము క్రోధాగ్నిలో
    కాంచెన్ ముక్తి రతీ ప్రియుండు కడు వే, కంజాక్షి శోకింపగన్
    మంచు కొండలు మండుచున్న వవిగో మాహేంద్ర నీలద్యుతిన్
    (ఏదోవిధిగా కిట్టించాను).

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెడ్డి గారూ, కిట్టించే స్థాయి దాటిపోయారు. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కదిలించ మన్మథుని పూబాణమ్ము...’ అంటే బాగుంటుం దనుకుంటున్నాను.

      తొలగించండి
  29. పారమార్థిక తత్త్వంంబు తీరుగనగ
    యోగిపుంంగవు లేగెడా యుచితభూమి
    "మంంచుమల" యింంద్రనీలమైై మంండుచుంండె
    భాను మధ్యాహ్న కాలంంపు మేనువోలె!
    """""""""""""""""""""""""""
    పంంచన్ సౌౌఖ్యము పంంచబాణుడపుడున్ భద్రంంబు తాజూడక
    న్నుంంచెన్సాయకమొక్కటిన్హృృదిని శంంభో!యంంచుబ్రార్థింంచినన్
    మింంచన్రాగము'నిప్పుకంంటగనె భూతేశుంండు తానగ్నియైై
    మంంచుంంగొంండలు మంండుచున్నవవిగో మాహేంంద్రనీలద్యుతిన్ .

    రిప్లయితొలగించండి
  30. ఎచట తపసుల్ తపసింత్రు నెప్పు డైన?
    పుష్యమీవారలరతనమెయ్యది పుడమి లోన?
    మహిని రావణ కాష్టంపు మాట యేమి?
    మంచుమల, యింద్ర నీలమై మండు చుండె


    పుష్యమి వారు జాతకరీత్య యింద్రనీలముధరించాలి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. కాకుంటే కొన్ని దోషాలు... రెండవపాదంలో గణదోషం.
      ఎట మునుల్ దపస్సును జేతు రెప్పుడైన?
      పుష్యమీతార వారల పూస యేది? (పూస = రత్నం)... అనండి.

      తొలగించండి
  31. చిరంజీవి కామేశ్వరరావు ,శ్రీయుతులు గురువు గారికి, నేను వరూధినిదృక్పథమునుంచి బ్రాహ్మణ బ్రువుడని వ్రాసినాను.అయిననూ మీసూచన మేరకు పద్యమును సవరించుచున్నాను
    కొంచెంబైనను జాలిలేక సతి తా కోరంగ శ్లేషమ్ము, పొ
    మ్మంచున్ దొబ్బిన బ్బ్రాహ్మణోత్తమునిపై మానమ్ము పెంపొంద భో
    రంచున్ బోటి వరూధినీ విరహ కీలల్ విస్తృతం బైన నా
    మంచుంగొండలు మండుచున్న వవిగో మాహేంద్రనీలద్యుతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీరావుగారూ, స్వారోచిషమనుసంభవంలో ప్రవరాఖ్యుడు ఉత్తమబ్రాహ్మణుడు. మీరు బ్రాహ్మణబ్రువుడని ఎందుకు వ్రాసారో తెలియదు.బ్రాహ్మణబ్రువుడు అంటే అర్థం - పేరుకు మాత్రమే‌ బ్రాహ్మణుడు అని. అంటే బ్రాహ్మణజన్మం ఐతే ఎత్తాడు కాని ఏమాత్రమూ‌ ఒక మంచి బ్రాహ్మణుడికి ఉండవలసిన లక్షణాలు ఏమీ లేని వాడూ అని. బ్రహ్మణధర్మాలు ఆరు. అవి యజన యాజనాలూ. అధ్యయన, అధ్యాపనాలు, దాన ప్రతిగ్రహణాలు అనేవి అల్లసానివారి ప్రవరుడిని కొంచెం అధ్యయనం చేయండి ఆ మహానుభావుడు ఎటువంతి వాడైనదీ అవగతం అవుతుంది. అగ్నిదేవుణ్ణి ప్రార్థించి క్షేమంగా తిరిగి వెళ్ళగల ప్రభావం ఆయన బ్రాహ్మణత్వానిది. అంతకంటే ఏం చెప్పగలను? అలాగే పండితబ్రువుడు అని మరొక మాట ఉంది అంటే పండితుళ్ళా నటిస్తూ ఉన్నా ఏమీ‌ చెప్పుగోదగిన పాండిత్యం లేనివాడూ అని అర్థం. ఇలా బ్రువ ఉపసర్గను చేర్చితే నిందార్థం వస్తుంది. మాటల అర్థాలు తెలిసి లేదా తెలుసుకొని ప్రయోగించటం‌ కవుల బాధ్యత. ఇలా అన్నందుకు దయచేసి మన్నించడి - మీ ప్రయోగం నన్ను బాధించింది. ఇటువంటి పొరపాట్లు జరగటం దురదృష్టం. మీరు ఉద్దేశపూర్వకంగా వ్రాసారని నేను అనుకోవటం లేదు. కాని ఒక చెడ్డమాట విన్నప్పుడు గ్లాని ఐతే కలుగక మానదు కదా. అదటుంచి వరూధిని దృక్పధం నుండి అలా అన్నానన్న సమర్థింపు న్యాయంగానే తోస్తున్నది, కాని అలా సమర్ధనీయంగా ఉండాలంటే పద్యం వరూధినీముఖః వచ్చినట్లు ఉండాలి. కవి చెబుతున్నట్లుగా ఉంటే సమర్థనీయంగా అనిపించదు. అదే ఘట్టంలో సాక్షాత్తూ ప్రవరుడే 'బుధ్ధిజాద్యజనితోన్మాదుల్ కదా శ్రోత్రియుల్' అంటాడు. ఆ మాటను ఆ పాత్ర స్వయంగా అనటంలో సందర్భోచితమైన ఔచితి పుష్కలంగా ఉంది. అదే ప్రయోగం స్వయంగా పెద్దనగారే కథకుడిగా తనమాటగా చేసి ఉంటే అది ఆక్షేపణీయం అయ్యే అవకాశం‌ మెండు. ఇలాంటివి మనం పద్యరచనలో జాగరూకతతో యోచించి పదప్రయోగాలు చేయాలి కవులుగా ఐనా సరే ఔత్సాహికులుగా ఐనా సరే.

      తొలగించండి
  32. కాంచన్ శీతనగాంతరావృత పృథక్కాంతార మధ్యంబునన్
    పంచారించిన జీర్ణవృక్ష కషణోత్పన్నాగ్ని వ్యాపింపగన్
    మంచుంగొండలు మండుచున్న వవిగో మాహేంద్రనీలద్యు తిన్.
    సంచారింప నసాధ్యమయ్యె ద్విజముల్ స్వస్థానమున్ జేరగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారు మీ పూరణ అత్యద్భుతముగా నున్నది. అభినందనలు. చిన్న సవరణ యవసర మనిపించు చున్నది. “కషణోత్పన్నాగ్ని వ్యాపింపగన్” లో “గ్ని” గురువవుతుంది. “అగ్ని” “ఇ” కారాంత పుంలింగ పదము గదా!
      అదీగాక “పంచారించిన” “వ్యాపింపగన్” పునరుక్తి. “దీపింపగన్” అంటే బాగుంటుంది.

      తొలగించండి
    2. కామేశ్వరాయనమః మీ ధృవపత్రం నా మనస్సుకు ఎంతో హాయినిచ్చినది. కడుంగడు ధన్యవాదములు. గమనించలేదు పునరుక్తి వచ్చినది. మీ సూచన చాల బాగున్నది. నిత్యవిమర్శనము చేయగోర్తాను.

      తొలగించండి
  33. హిమగిరిని దర్శించు ప్రవరుడు బడలికతొ
    ప్రేమలోని ప్రకృతిని కాంచి సంతసముగ
    ఆకసము చూడగాను తాపమున వేగ
    మంచుమల ఇంద్రనీలమై మండుచుండె

    రిప్లయితొలగించండి
  34. హిమగిరిని దర్శించు ప్రవరుడు బడలికతొ
    ప్రేమలోని ప్రకృతిని కాంచి సంతసముగ
    ఆకసము చూడగాను తాపమున వేగ
    మంచుమల ఇంద్రనీలమై మండుచుండె

    రిప్లయితొలగించండి
  35. పాత కాలం అమ్మలక్కల కబుర్లు:

    సంచుల్ నిండుగ బ్లౌసు పావడలతో సారీలు కుక్కించుచున్
    కొంచెమ్ రోజులు పుట్టినింటికని నే కోడూరు పొయ్ రావగా
    దంచే టెండలలో హిటాచి ఫ్రిజి మూతన్ దీసి చూడంగ హా
    మంచుంగొండలు మండుచున్న వవిగో మాహేంద్రనీలద్యుతిన్!

    రిప్లయితొలగించండి