20, జూన్ 2016, సోమవారం

సమస్య - 2065 (పిల్లినిఁ జంపె సద్ద్విజుఁడు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“పిల్లినిఁ జంపె సద్ద్విజుఁడు వేదమతమ్ముగ యజ్ఞవాటికన్”
(ఒకానొక అవధానంలో గరికిపాటివారు పూరించిన సమస్య)
లేదా...
“పిల్లిని సద్ద్విజుఁడు చంపె వేదోక్తముగన్”

42 కామెంట్‌లు:


  1. అల్లెను జిలేబి కథలన్
    కల్ల కపట మాటలు విని కరవాలంబున్
    అల్లన తీసెను బొమ్మల
    పిల్లిని సద్ద్విజుఁడు చంపె వేదోక్తముగన్

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. గురువు గారికి నమస్సులు. నా పరిఙ్ఞానానికి అందలేదు. అందిన భావప్రేరణతో పూరించినాను....

    అల్లన దాను చేయు వ్రత మందున వర్తిలు చిత్తవేగమం
    దల్లెడి వేదమంత్ర ఘన మావహ మంది జరించు దారులం
    దుల్లమునందు సాధన సమున్నత భావము నింపి దీక్ష దా
    పిల్లి; ని జంపె సద్విజుడు వేదమతమ్ముగ యజ్ఞవాటికన్!

    ఇల్లి=ఉపవసించి
    ని=మత్సరము
    దాపు+ఇల్లి=దాపిల్లి

    రిప్లయితొలగించండి
  4. భిల్లుడల గూల్చె నిర్దయ
    బిల్లిని-సద్ద్విజుడు చంపె వేదోక్తముగ
    న్నుల్లమున గల్గు క్రోధము
    నెల్లరు సంతోషమంద నీమముతోడన్.

    రిప్లయితొలగించండి
  5. మిత్రులందఱకు నమస్సులు!

    [ఒకానొక బ్రాహ్మణుఁడు యజ్ఞముం జేయఁబూని, తగు పదార్థములఁ దేఁ జనుచుండఁ బలుమాఱు లొక పిల్లి శకునముగ వచ్చుచుండ నాగ్రహించి, దానినిఁ జంపినఁ బాపమని యెంచి, దాని పైఁ దనకుం గల కోపమునుం దొలఁగించుకొనుటకై, మట్టితో దాని బొమ్మనుం జేసి, చంపెనని చమత్కరించుట]

    పిల్లి యొకండుఁ బల్మఱును వీవధినిన్ శకునమ్ము నౌచు వ
    ర్తిల్లుచునుండ, బ్రాహ్మణుఁడు త్రెక్కొన దానినిఁ బాప మంచుఁ గో
    పిల్లుచు, మృత్తికా ప్రతిమఁ బెల్లగు రీతి రచించి, వేగ నా

    పిల్లినిఁ జంపె సద్ద్విజుఁడు వేదమతమ్ముగ యజ్ఞవాటికన్!

    రిప్లయితొలగించండి
  6. పెల్లుగ ఫలితముపొందగ
    నెల్లరు చేరిరి ముదమున నీశుని గుడిలో
    చెల్ల హవము సిద్ధిని జూ
    పిల్లిని సద్ద్విజుఁడు చంపె వేదోక్తముగా

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. చల్లగ సర్వ లోకములు సౌఖ్యము నొందగఁ గోరి సన్మతిన్
      రల్లక వేష్టి తాంగియు నలంకరణోచిత యజ్ఞ జంతువుం,
      దల్లడిలంగఁ జిత్తమునఁ దా శకునమ్మునుఁ జూచి తోలె నా
      పిల్లినిఁ, జంపె సద్ద్విజుఁడు వేదమతమ్ముగ యజ్ఞవాటికన్

      జల్లు కురిపింప జగతినిఁ
      గల్లకపట మెరుగని మఖ కారక పశువున్
      మల్లెల హార మునిచి, మా
      పిల్లిని, సద్ద్విజుఁడు చంపె వేదోక్తముగన్

      [మాపు+ఇల్లిని=మాపిల్లిని; మాపు = రాత్రి; ఇల్లిని= ఉపవాసమున]

      తొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. అల్లరి పిల్లవాడొకడ యాటల నాడుచు దాగియుండు నో
    పిల్లిని జంపె ,సద్విజుడు వేదమతమ్ము గ యజ్ఞ వాటిక
    న్ను ల్లము సంతసిల్ల గను నోర్పున నేర్పున యాగమున్ద గ
    న్నల్లదె చేసెనే గదర హర్ష కుమారుడ !చూచితే మరి న్

    రిప్లయితొలగించండి
  10. అల్లన వేటగాడు పరమాద్భుత బాణవిశేషఘాతముం
    బిల్లినిజంపె--సద్విజుడు వేదమతమ్ముగ యజ్ఞవాటిక
    న్నెల్లర శాంతిగోరుచును నీమనిబద్ధత సోమహోమము
    న్నుల్లము రంజిలన్నెరపె నూర్గురు యాజసుపండితాళిచేన్.

    రిప్లయితొలగించండి
  11. నా పూరణము

    ఎల్లరు గాంచుచుండ నొక యింటను ఘోరము సంభవించె, నో
    యల్లరి పిల్లవాడచట నాటల నాడుచు చేతిగఱ్ఱతో
    పిల్లిని జంపె, సద్విజుడు వేద మతమ్ముగ యజ్ఞవాటికన్
    న్నల్లన జేరు పాపపరి హారము జేయ జపమ్ము జేసెనే

    చెల్లెలి భర్తయె చంపగ పిల్లిని, సద్విజుడు చంపె వేదోక్తముగన్
    పిల్లిని జంపిన దోశము
    లెల్లను జప తప హవనము లేజేసియు తాన్

    రిప్లయితొలగించండి
  12. పెల్లుగఁబొంద సౌఖ్యములు పెద్ద వితానము పూర్తిచేయగా
    చల్లగ వచ్చిచేరెను త్రిశంకువు, చెచ్చెర వెళ్ళగొట్టి యా
    పిల్లినిఁ, జంపె సర్వజుఁడు వేదమతమ్ముగ యజ్ఞవాటిక
    న్నిల్లిని, పొందగా ఫలము యింపుగ నిర్ణయ కాలమందునన్

    రిప్లయితొలగించండి
  13. స మ స్య
    * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { పిల్లి = మట్టి బొరియ లో ను౦డు ఒకా నొక
    పు రు గు . హోమాగ్నిలో
    నొక పిల్లి అనగా మట్టి పురుగు మృతి చె౦దగా
    పాప మ౦టిన దని పెలుచన మాటలాడ తగునే ?
    బృహత్కార్యముల నాచరి౦చు నపుడు
    అల్ప దోషములు లెక్కిడ రాదు సుమా ! }


    పిల్లిని జ౦పె సద్ద్విజుడు వేద మతమ్ముగ
    యఙ్ఞ వాటి న౦

    చల్లరి పెట్ట మీ కిటుల న్యాయమె ? యచ్చటి
    మృత్ బిలమ్మునన్

    దల్లడ మ౦ది , క౦దు వడి , ధగ్ధము జె౦దెను
    హోమ కీల లో

    పిల్లి | యి క౦టె పాప మని పెల్చన నాడుచు యాగ మాపగా

    చెల్లునె ? సత్ బృహత్కృతిని సేయ
    కన౦బడ వల్ప దోషముల్ ! !

    { మృత్తిక = మృత్తు = మృత్ = మట్టి ;
    తల్లడమ౦దు = కలత పడు ; క౦దువడు = సెగ సోకు ; }
    ి

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. చెల్లికి రాత్రియందు “కల”చింతనుబెంచగ|యేమిటన్న?నా
    పిల్లిని జంపె సద్ద్విజుడు వేదమతమ్ముగ యజ్ఞ వాటికన్.
    “పిల్లికి పిల్లలున్ గలవు ప్రీతిగ బెంచితి నావుపాలతో
    తల్లియు చావగా మనసు దానిని జూడక నుండ లేదనెన్”
    2.కల్లా కపటము చేతను
    పిల్లిని సద్ద్విజుడు చంపె వేదోక్తముగన్
    అల్లెడిమోసంబందున
    చెల్లెడి రూపాన నిధులు చేదించుటకై.

    రిప్లయితొలగించండి
  16. లల్లీ!చంంపకుసుమ్మాా
    పిల్లిని,సద్ద్విజుడుచంంపెవేదోక్తముగన్
    దెల్లటిచాారలచింంబును
    నల్లనయాాగంంబుకొరకునంందరుమెచ్చన్

    రిప్లయితొలగించండి
  17. కల్లలు పలుకకు సుమ్మా!
    అల్లికగా గరికి పాటి యవధానమునన్
    చెల్లగు నేమో! యిల నే
    పిల్లిని సద్విజుడు చంపె వేదోక్తముగన్!

    వేరే మార్గం దొరకక సరదాగా అనిపించేలా పూరించడానికి సాహసించాను.తప్పులుంటే మన్నించండీ.

    రిప్లయితొలగించండి
  18. పిల్ల వివాహ మెప్పుడని? పెత్తన మేదని? చింతలేలరా
    చల్లగఁ జూచు దుర్గ! యొక చక్కని యజ్ఙముఁ జేయుమన్నఁ దా
    నుల్లముఁ జిక్క బట్టుకొన నూగిస లాడెడు నంతరంగమన్
    పిల్లినిఁ జంపె సద్విజుడు వేదమతమ్ముగ యజ్ఙవాటికన్!
    (మనసు కాలుగాలిన పిల్లిలా చంచలముగా నుండగ, నిష్టతో యజ్ఙము చేయుటకు నట్టి మనసును చంపినాడను అన్వయము)

    రిప్లయితొలగించండి
  19. కల్లలు పలుకకు సుమ్మా!
    అల్లికగా గరికి పాటి యవధానమునన్
    చెల్లగు నేమో! యిల నే
    పిల్లిని సద్విజుడు చంపె వేదోక్తముగన్?

    రిప్లయితొలగించండి
  20. శిష్ట్లాశర్మ గారు దాపిల్లి అని మాటను సాధించుకొని పూరించారు. వారిచ్చిన అర్థాలు అప్రసిధ్దం. పూరణల్లో దోషం కాదు లెండి. పస్తిల్లి అన్న ప్రయోగం చూపుతున్నవి నిఘంటువులు. కాని పస్తు అన్నా ఉపవాసమే ఐనప్పుడు పస్తిల్లి అన్నచోట ఇల్లి అన్నది కూడా ఉపవాసం ఎలాగు? ఆలోచించాలి. 'వేదమంత్ర ఘన మావహ మంది' అన్నచోట ఘనాపాటిలో ఘన అని అనుకున్నారా? ఆవహమందటం ఏమిటి? కొంచెం విచిత్రప్రయోగం. కొంచెం పదాడబరంతో పద్యం ధారాయుతంగా బాగున్నా చివరికి చంపె అన్నదానికి అన్వయం కనబడలేదు నాకు.

    పొన్నెకంటి వారొక చక్కటి కందంలో పూరించారు. నీమముతోడన్ అన్న పాదపూరణం ఆమోదయోగ్యమే కాని ఎల్లరును నీమముతో సంతోషించటం అన్నది అతకలేదు. నాల్గవపాదంలో ప్రథమాక్షరం నె అన్నది ఉన్నా ద్రుతం ముందటి మాట క్రోధమున్ అన్నదానికి చెందుతుంది. ఎల్లరున్ అనే గణనకు వస్తుంది. కాబట్టి నె-నీ అని యతిమైత్రి చేయకూడదు మనం. చివరి పాదం (ద్రుతం విడచి) ఎల్లరు సంతోషమంది హెచ్చుగ బొగడన్ అంటే సరిగా ఉంటుంది.

    గుండువారి చమత్కారపూరణ బాగుంది. పాపపుణ్యాలకు ఆశ్రయం మనస్సు. కాబట్టి పిల్లిని చంపిన పాపం పిల్లిప్రతిమను చంపినట్లు చేస్తే రాదా అంటే వస్తుంది. సంకల్పంలో ఉన్నదోషమే పాపం కలిగిస్తున్నది. ఐతే సమస్యాపూరణాల్లో ఇలా రంధ్రాన్వేషణ అవసరం కాదు. మంచి పద్యం.

    అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డిగారు లక్షణయుతమైన కందం చెప్పారు. కాని అన్వయం రావటం‌లేదు నాకు. అసలు చంపె అన్నదానికి ఏది సమర్థింపు?

    పోచిరాజు కామేశ్వరరావు గారు పంపిన వృత్తంలో అన్వయ క్లిష్టత ఉంది. ఉన్నది ఉన్నట్లుగా అన్వయించబోతే చంపె అన్నది సరిగా అతకటం లేదు కదా. కొంచెం‌మార్చి చూస్తాను.

    చల్లగ సర్వ లోకములు సౌఖ్యము నొందగఁ దెచ్చి సన్మతిన్
    రల్లక వేష్టి తాంగియు నలంకరణోచిత యజ్ఞ జంతువుం,
    దల్లడమంది జిత్తమునఁ దా శకునమ్మునుఁ జూచి తోలి యా
    పిల్లినిఁ, జంపె సద్ద్విజుఁడు వేదమతమ్ముగ యజ్ఞవాటికన్

    ఇప్పుడు అన్వయం చక్కగా ఉంది కదా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామల రావు గారు మీసవరణ బాగుందండి. ధన్యవాదములు.

      తొలగించండి
    2. సుకవి మిత్రులు శ్యామలరావు గారికి ధన్యవాదములు!

      మట్టితోఁ జేసిన పిల్లినిఁ జంపిన పాపము వచ్చునో లేదో తెలియదు కాని, పిల్లిపైఁ దనకుఁ గల్గిన కోపమును మాత్రము పోఁగొట్టుకొనె నా ద్విజుఁడు. యజ్ఞకర్త మనమున నరిషడ్వర్గములు ప్రవేశించినచో యజ్ఞఫలితము దక్కదు. అందుకని యతఁడు తన కోపమునుం బోగొట్టుకొని, యరిషడ్వర్గములందుఁ గల క్రోధమునుఁ దన మనస్సులో నుండి తొలఁగించుకొనినాఁడు.

      నా పద్యమును విశ్లేషించి మీ యభిప్రాయమునుం బ్రకటించినందులకుఁ కృతజ్ఞుఁడను తాడిగడపవారూ!

      తొలగించండి
    3. నా అభిప్రాయం చెప్పానండీ. మీరు పంపిన పాఠానికీ నేను సవరించిన పాఠానికీ దయచేసి దండాన్వయం వ్రాసుకొని సరిగా వస్తున్నదా అన్నది పరికించ ప్రార్థన. కేవలం సందర్భం వచ్చింది కాబట్టి ఒక ముక్క చెప్పటానికి సాహసిస్తాను, మన్నించాలి. పద్యానికి దండాన్వయం చేసిప్పుడు ప్రతిమాటకూ సరియైన స్థానాన్ని మొత్తంమీద పద్యానికి కాలలింగపురుషవచనస్థలసందద్భాది ప్రాథమిక సంగతులనూ కూడా సమన్వయం చేసుకొని పరిశీలించవలసిందిగా అందరు కవిమిత్రులకూ నా విన్నపం. అలా తృప్తిగా వచ్చేట్లు ప్రయత్నిస్తే కొన్ని దోషాలు మొదటనే పరిహరింపబడతాయి.

      తొలగించండి
  21. అలాగే జల్లు కురిపింప... అంటూ వారు చెప్పిన లక్షణయుతమైన కందంలో, 'మఖ కారక పశువున్' అన్నది సరైన సమర్థన కాదు. యఙ్ఞపశువు మఖకారకం కాదు కదా. అలాగే‌ చివరన మాపిల్లిని అన్నది కూడా అతకదు ఉపవాసంలో యఙ్ఞపశువును చంపటం ఏమిటి?

    సుబ్బారావు గారు 'ఓ పిల్లిని' అన్నారు. ఒకపిల్లిని అని వారి భావం. ఒకను ఓ అని క్లుప్తీకరించటం గ్రామ్యం కాని కావ్యభాష కాదు. చివరి ఒకటిన్నర పాదం నిడివీ కేవలం పూరణార్థం ప్రయాస మాత్రమే -జిలేబీగారి శైలిలోకి వెళ్ళిపోయారు అక్షరాలు పేర్చుతూ! వారి పూరణావిధానం బాగుంది పద్యలక్షణం ప్రక్కన పెడితే. ఒకపిల్లవాడు పిల్లిని చంపెను. ఒక సద్విజుడు యాగం చేసి పాపపరిహారం చేసెను అని వారి భావం. ప్రయత్నించితే చాలా మంచిపద్యం వస్తుందిక్కడ!

    పొన్నెకంటి వారు దాన్ని పట్టుకొన్నట్లే ఉంది. మొదటి పాదం 'అల్లన వేటగాని పరమాద్భుత బాణవిశేషమక్కటా' అని మార్చటం సముచితం. మూడవపాదంలో 'న్నెల్లరి శాంతిగోరుచును'అని ఉండాలి. కాని ఆ పాదంలో నె-నీ అంటూ యధాప్రాకారం యతిమైత్రి వద్ద పొరబడ్దారు, మార్చాలి.

    విరించి గారు కూడా 'ఓ' అన్నారు ఒకకు మారుగా. సరికాదు కదా. చేతికఱ్ఱ అన్నదే సాధువనుకుంటాను. చివరి పాదం‌మార్చాలి 'న్నల్లన జేరి పాపపరి హారము జేసె జపాదికంబులన్' అని. లేకుంటే పద్యం అంతా ఒక పధ్దతిగా ఉండదు. వారి కందప్రయత్నాన్ని కూడా కొంచెం సరిచేయాలి. ముఖ్యంగా వారి చివరిపాదాన్ని జిలేబీశైలినుండి బాగుచేయాలి. సరైన పాఠంగా ఇలా అందామా?

    చెల్లెలి భర్తయె చంపగ
    పిల్లిని, సద్విజుడు చంపె వేదోక్తముగన్
    పిల్లిని జంపిన పాపం
    బెల్లను జపహోమ క్రియల నెంతయు దీక్షన్


    మరలా అన్నపురెడ్డి వారు పెల్లుగఁబొంద సౌఖ్యములు ... అంటూ చేసిన పూరణలో ప్రథమపాదం చివరన పూర్తిచేయుచో‌ అనాలి. వెళ్ళగొట్టి యా
    పిల్లినిఁకి బదులు గా పారద్రోలి యాపిల్లినిఁ అంటే మరింత సొగసుగా ఉంటుందేమో. ఈ‌పద్యంలో కూడా ఇల్లిని...చంపె అన్నదే అన్వయం! ఉపవాసాన్ని చంపటమేమిటీ అని? 'ఫలము యింపుగ' కాక 'ఫలము నింపుగ' అనవలసి ఉంది. నిర్ణయకాలం ? దీన్ని మార్చి యఙ్ఞవిధాన దీక్షచే అనండి.

    గురుమూర్తిగారూ (మీరు పూర్ణానుస్వారానికి తెలుగులిపినుండి బయటికి వచ్చి Capital O ఎందుకు వ్రాస్తున్నారో తెలియదు!) మీ‌పద్యధార బాగుంది. 'ధగ్ధము జెందెను' కా 'దగ్ధత జెందెను' అనండి. పిల్లి అన్న మాట పునరుక్తి. వీలైతే పరిహరించండి. అలాగే పద్యం టపాలో సరిగా అచ్చు కాలేదు గమనించండి. మీరు కావ్యాల్లో పద్యాలను ఇలా చూడరు కదా? ఆలోచించండి.

    ఈశ్వరప్పగారూ మీ వృత్తం భావం ఉచితంగా ఉంది.కాని కొంచెం చిత్రిక పట్టాలి. చెల్లికి రాత్రియందు “కల”చింతనుబెంచగ| అన్నది తీసివేసి చెల్లెలు స్వప్న మొండుగని చింతిల నన్న అని ఉంచండి. అలాగే చివరి పాదంలో మొదట తల్లియు బదులు తల్లియె అని ఉంచండి. బాగుంది పద్యం. మీరు కందం వ్రాస్తూ మొదట్లోనే‌ కల్లాకపట అన్నారు కాని నిజానికి కల్లయు కపటము అనాలి కావ్యభాషలో. మహామహుడు ధూర్జటి అంతామిధ్య అనలేదా అంటే ఆయనంతవాళ్ళం కాదు కదా మరి. దోక్తముగన్।అల్లెడి అనకండి వేదోక్తముగా నల్లెడి అనండి. ము

    సుబ్బారావుగారి లల్లీ!చంంపకు... పద్యం నిండా లిపిదోషాలు. పద్యం సంగతి తరువాత కదా.

    శ్రీధరరావుగారి సరదాపూరణ సలక్షణంగా అక్షరాలా సరదాగా ఉంది. కాని రెండు సార్లు ఎందుకు పంపారో. పొరబడ్డా రనుకుందాం.

    సహదేవుడి గారి పిల్ల వివాహ మెప్పుడని? పెత్తన మేదని?... పద్యం బాగుంది మొత్తం మీద అంతరంగాన్ని పిల్లిని చేసారు. నయం తల్లిని చేయలేదు!

    రిప్లయితొలగించండి
  22. పద్యం చివరన ప్రశ్నార్ధకం పెట్టలేదని రెండవ సారి పంపాను - అంతే. మాన్యులు శ్యామలీయం గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  23. గురువుగారికి శ్రమతగ్గించి, అన్ని పూరణలను విశ్లేషించిన శ్యామలీయం గారికి ధన్యవాదములు. నాపూరణలో " పిల్లిని పారద్రోలి" అంటే "ర" గురువువై గణభంగం అవుతుందిగదా? తెలియజేయ ప్రార్ధన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ. పారద్రోలి అనికాక పారదోలి అంటే సరిపోతుంది.

      తొలగించండి
    2. తోలు, త్రోలు రెండూ రూపాంతరాలు. పాఱన్+త్రోలు=పాఱఁద్రోలు; పాఱన్+తోలు=పాఱఁదోలు అవుతాయి. రెండింటా ఇవి తెలుగు పదాలు కనుక ద్రో వల్ల ఱ గురువు కాదు. గమనించ మనవి.

      తొలగించండి
  24. హమ్మయ్య !

    పట్టు బట్టించి శ్యామలీయం వారిని రంగం లోన దింపించేసా :)

    జిలేబి ని తలవకుండునొకో :)



    సుబ్బారావుల పదముల
    యిబ్బడి యిష్ట సఖి దోచె యిచ్చెను డోసూ
    అబ్బ! నను తలవకుండో :)
    జబ్బలు జరిచెను గదోయి జగణ జిలేబీ !


    తాడిగడప వారికి జేజేలు

    జిలేబి

    రిప్లయితొలగించండి
  25. పిల్లిని సోమయాజొకడు ప్రీతిని పెంచగ ముద్దుముద్దుగా
    నల్లరి జేయుచున్నదియె యజ్ఞపు శాలకు వెంబడించగా...
    నల్లని మేకనున్ పలికి నాలుగు ఋక్కులు; ...లెస్స కాచుచున్
    పిల్లినిఁ;...జంపె సద్ద్విజుఁడు వేదమతమ్ముగ యజ్ఞవాటికన్!

    రిప్లయితొలగించండి

  26. చల్లగ టైపు దోషమును చక్కగ దిద్దుచు కైపదమ్మునన్:
    "పిల్లినిఁ జంపె సద్ద్విజుఁడు వేదమతమ్ముగ యజ్ఞవాటికన్”...
    మెల్లగ పల్కి మంత్రమును మెచ్చగ చంద్రుడు తెచ్చి మేక దౌ
    పిల్లనుఁ జంపె సద్ద్విజుఁడు వేదమతమ్ముగ యజ్ఞవాటికన్

    రిప్లయితొలగించండి