23, జూన్ 2016, గురువారం

సమస్య - 2068 (తరుణుల వాలుచూపులను...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“తరుణుల వాలుచూపులను దాటఁగ ధాతకునైన శక్యమే” 
ఈసమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.
లేదా...
“తరుణుల చూపులను దాట ధాతకు వశమే”

66 కామెంట్‌లు:

  1. స్థిరముగ సృష్టి కార్యమునఁ జేసెను బ్రహ్మ శుభాంగినొక్కతిన్
    వరసయు వావి లేక మరి వారిజనేత్రిని కోరి, పిమ్మటన్
    మరియొక దేహమున్ దొడిగి మానినిఁ బెండిలి యాడెనక్కటా
    తరుణుల వాలుచూపులను దాటఁగ ధాతకునైన శక్యమే!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బ్రహ్మకైనను పుట్టు.....బాగా చెప్పరండీ!

      తొలగించండి
    2. కూతుర్ని పెళ్ళాడాడన్న అపప్రథ పొందిన బ్రహ్మను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. సిరిసిరి నగవుల, వాల్జడ
    గిరగిర, పయ్యెద సొబగుల, కిలకిల పలుకుల్,
    సరస సమజోదు చెణుకుల
    తరుణుల చూపులను దాట ధాతకు వశమే !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘సమజోదు’ అనడం దుష్టసమాసం. సరసోక్తులు గల చెణుకుల... అందామా?

      తొలగించండి
  3. సరి సృష్టికార్యమేమో
    మరిమూలన బడకజేయ మాతను వాణిన్
    సరసన రసనను దాచెను
    తరుణుల చూపులను దాట ధాతకు వశమే !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘...బడకజేయ..’?

      తొలగించండి
    2. మాస్టరుగారూ! ధన్యవాదములు.
      అది మూలనన్+పడకన్+చేయ...సృష్టి కార్యము మూలనబడకుండా చేయడానికి...అని నాభావం.

      తొలగించండి
  4. విరులను దలలో దాల్చియు
    నరవిందపు మోముగలిగి యాహ్లాదముతో
    న్గరము న్ సొగసులు గలయా
    తరుణుల చూపులను దాట ధాతకు వశమే

    రిప్లయితొలగించండి
  5. పరువము చిత్రమైనది ప్రభావము గొప్పది తప్పులెంచగన్
    తరుణము యొప్పి రానిది విధానము లేనిది
    వింతవింతగా
    హరువిడి సాగుచుండి పరిహాసము లెంచదు
    మానసమ్మునన్
    తరుణుల వాలు చూపులను దాటగ ధాతకునైన శక్యమే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘తరుణము+ఒప్పి’ అన్నపుడు యడాగమం రాదు. ‘తరుణమె యొప్పి..’ అందామా?

      తొలగించండి
  6. బండకాడి అంజయ్య గౌడ్ గారి పూరణ....

    సురపతి భంగము నొందెను
    హరి మోహినిగాగ నాడు హరుడే కూడెన్
    మెరయుచు నగుపించెడి ఘన
    తరుణుల చూపులను దాట ధాతకు వశమే !!

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. శ్యామలీయమ !తవ సవరణ లనుశిర
    సా వహించి యింక భావి నెపుడు
    దప్పు జేయ కుండ నొప్పువి ధమ్ముగ
    నుండు నటుల జేతు నోక వివర !

    రిప్లయితొలగించండి
  9. ధరలో పతియే దైవము,
    పరము,నిహమటంచు తలచు పత్నిని యెవడో
    పరపురుషుడు గోరిన యా
    తరుణుల చూపులను దాట,ధాతకు వశమే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పత్నినెవండో అంటే మరింత బాగుంటుందండి. పద్యం బాగుంది.

      తొలగించండి
    2. శ్రశ్యామల్రావుగారూ,మీసూచన మేరకు పద్యమును సవరించితిని
      ధరలో పతియే దైవము,
      పరము,నిహమటంచు తలచు పత్నినెవండో
      పరపురుషుడు గోరిన యా
      తరుణుల చూపులను దాట,ధాతకు వశమే?

      తొలగించండి
  10. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    తరుణుల ముఖపద్మములే

    మరుని నిశితసాయకములు మరులను కొలుపున్

    తరుణము న౦దున భాసిలు ,

    తరుణుల చూపులను దాట ధాతకు వశమే ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బేనర్ అవసరం కాదనుకుంటానండి. కొలపన్ అంటే మరింత బాగుంటుందేమో. పద్యం బాగుంది.

      తొలగించండి
  11. తరుణుల వాలు చూపులను దాటగ ధాతకు నైన శక్యమే
    తరమును గాదు గా నెపుడు ధాతకు కూడను దాట నీ భువి
    న్నిరవుగ నొక్కయీ శ్వరునకే యది సాధ్యమ యీ యుగంబున
    న్నెరవుగ మీరలందఱును నేర్పున నీ విషయంబు నేర్వుడీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. ఉపదేశం బాగుంది కాని పద్యం బాగా కుదరలేదండి. శక్యమే అన్న పదం ప్రక్కన తరమును గాదు అనటంలో ఔచిత్యభంగం. ధాతకు కూడ అన్న పదసముదాయం పునరుక్తి ఒప్పదు. మరలా చివరన నేర్పున అనీ నేర్వుడీ అని దగ్గరసంబంధంగా ఉన్నమాటలు.

      తొలగించండి
  12. అరయగవిశ్వామిత్రుడు
    హరువగు మేనకను జూడ యజ్ఞానముతో
    మురియుచు తపమును వదలెను
    తరుణుల చూపులను దాట ధాతకు వశమే!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జూడ నజ్ఞానముతో అనాలండీ యడాగమం లేదక్కడ. (చూడన్ అని కదా. దృతాన్ని గమనించండి.)

      తొలగించండి
  13. మరువపు ప్రాయమందుగల మానస పుత్రిక సంధ్య యందమున్
    సిరికిని బుట్టినట్టి సరసీరుహ నేత్రుని బాణ ఘాతమున్
    హరిణముగా బరంగుచును హాటక గర్భుడు మోహమందెగా
    తరుణుల వాలుచూపులను దాటఁగ ధాతకునైన శక్యమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంధ్యయందమున్ అంటే continuity రావటం లేదు కదా సోయగంబుచే అనండి.
      సిరిసుతుడైన యట్టి అంటె ఉచితం. సిరికిని అంటే సిరికి కూడా అన్నట్లు ద్వనిస్తుంది. సిరికిం బుట్టిన యట్టి... అని మత్తేభంలో రావటం వేరు. మన్మథుడికి సరసీరుహ నేత్రుడన్న ప్రసిధ్ధి లేదు. సరసీరుహసాయకు దెబ్బ కోపకన్ అందామా?

      తొలగించండి
  14. భరతుని జన్మ మూల మట పావన కౌశికు పారవశ్యమే
    వరుణుని కామ తాపమున వర్ధిలె కుంభ భవుం డగస్త్యుడున్
    కరమరు దాపరాశరు వికారము మూలము వ్యాస జన్మకున్
    తరుణుల వాలుచూపులను దాటఁగ ధాతకునైన శక్యమే

    సుర యక్ష రాక్షసులకు
    న్నరివీర భయంకర సుగుణాఢ్య రణోద్దం
    డ రఘు వరుల, మది నేదల
    తరుణుల, చూపులను దాట ధాతకు వశమే
    [సూర్యులుగా వారిని నే దలతును, లేక కోపముచే ఎర్రబడిన వారు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం బాగుంది. కాని, ఔచితి మీరకూడదు. పరాశరు వికారం అనటం అపచారం.

      తొలగించండి
    2. "కరమరుదా పరాశరుని కామము మూలము" అనిన నౌచిత్యమునకు భంగము వాటిల్లదనుకుంటాను.

      తొలగించండి
  15. 'మురిపము ' లనియెడు పాఠాం
    తరములు చేర్చి విధుడు వనితను సృజియించెన్!
    పురుషుల కట్టడి చేసెడు
    తరుణుల చూపులను దాట ధాతకు వశమే!

    చిన్న మార్పుతో మరొక పద్యం.

    'మురిపము ' లనియెడు పాఠాం
    తరములు చేర్చి విధుడు వనితను సృజియించెన్!
    పురుషుల నాకట్టు కొనెడు
    తరుణుల చూపులను దాట ధాతకు వశమే!

    రిప్లయితొలగించండి
  16. సమస్య
    "తరుణుల చూపులను దాట ధాతకు వశమే "

    చిరుదరహాసము లొలుకుచు
    పరువపు సిరులను గలిగియు పంకజ నేత్రా
    లరమోడ్పుల జేసి విసురు
    తరుణుల చూపులను దాట ధాతకు వశమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేత్రా లరమోడ్పుల జేసి అనరాదండీ. నేత్రాలు అన్నది బాగోద్య్ గ్రంథభాషలో. చిరుదరహాసం కూడా పొరపాటే చిరు తెలుగుపదం కదా.'పొరి దరహాసము చిలుకుచు పరువపు సిరులొలకు కనుల బాగొప్పగ నట్లరమోడ్పు జేసి చూచెడు' అంటే బాగుంటుంది.

      తొలగించండి
  17. భరతుని గన్న తల్లియగు భామశకుంతల జన్మమే విధిన్
    ధరణిన గల్గె , వ్యాసుడను తాపసి పుట్టుక దెల్పెనేమనన్
    సురుచిర సుందరాంగనల జూచిముముక్షువులైన నేమి యా
    తరుణుల వాలు చూపు లను దాటగ ధాతకు నైన శక్యమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధరణిని గల్గె అనండి.పద్యం బాగుంది. వ్యాసజననాన్ని ఆక్షేపించటం ఉచితం కాదు.

      తొలగించండి
    2. ధన్యవాదాలండీ
      రెండో పాదము

      ధరణిని గల్గె, నప్సరస తాపసి దీక్షను భంగపర్చగన్

      అని సరిచేస్తే సరిపోతుందంటారా గురువు గారు

      తొలగించండి
  18. నాగమంజరి గుమ్మా గారి పూరణ....

    కరిగమనలౌ రమణులన్
    హరిమధ్యల ఘన నితంబ లసితేక్షణలన్
    విరితూపుల చిరునవ్వుల
    తరుణుల చూపులను దాట ధాతకు వశమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కరిగమనలైన రమణులు అని మొదటి పాదాన్ని మార్చండి. రెండవపాదంలో యతిభంగం. పాదాన్ని హరిమధ్యలు ఘననితంబ లల్లన నగుచో అని మార్చండి. మూడవపాదాన్ని విరితూపుల బోలెడు నా అని మార్చండి. ఇంక పద్యం బ్రహ్మాండం. పద్యం వ్రాసినప్పుడు అన్వయం విషయంలో అన్ని సంగతులూ పరిశీలించండి.

      తొలగించండి
  19. సురుచిర సుందర మూర్తిని
    సరసము గాతా సృజించె చక్కనిరూపున్
    మురిపెముతో జవ్వని గన
    తరుణుల చూపులను దాట ధాతకు వశమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్కదనములన్ అనండి. తరుణుల అంటున్నాం కదా అందుకని వచనం తప్పకుండా ఉండేందుకు మూర్తుల అనండి. జవ్వని, తరుణి అని రెండు మాటలూ ఎలా వాడుతాం ఇక్కడ. అందుకని, మురిపెంబుల నల్లన గన అని మారుధ్దాం. అన్వయం ఎలాగుందో పరిశీలించుకోవటం మరువకండి.

      తొలగించండి
  20. సురుచిర సుందర మూర్తిని
    సరసము గాతా సృజించె చక్కనిరూపున్
    మురిపెముతో జవ్వని గన
    తరుణుల చూపులను దాట ధాతకు వశమే

    రిప్లయితొలగించండి

  21. అరమరికలు లేకుండగ
    చిరునగవులతో జనముల చెంపలునిమరన్
    మరిమరి కవ్వించెడి యా
    తరుణుల చూపులను దాట ధాతకు వశమే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండవపాదాన్ని 'చిరునగవుల హొహలు చిలికి చెంప నిమురుచో' అనండి. పద్యం బాగుంది.

      తొలగించండి

  22. అరమరికలు లేకుండగ
    చిరునగవులతో జనముల చెంపలునిమరన్
    మరిమరి కవ్వించెడి యా
    తరుణుల చూపులను దాట ధాతకు వశమే.

    రిప్లయితొలగించండి
  23. అరయగ చూపులె తూపులు
    పరువంంబుననున్నయట్టి పడతులకెపుడున్
    గురిజూచి నవ్విరువ్వగ
    తరుణుల చూపులనుదాట ధాతకు వశమే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పడతుల కనగా అంటే బాగుంటుంది. పద్యం బాగుంది. నవ్వురువ్వగ అనాలి . Typo?

      తొలగించండి
  24. అరయగ చూపులె తూపులు
    పరువంంబుననున్నయట్టి పడతులకెపుడున్
    గురిజూచి నవ్విరువ్వగ
    తరుణుల చూపులనుదాట ధాతకు వశమే?

    రిప్లయితొలగించండి
  25. . తరుణులవాలు చూపులను దాటగ ధాతకు నైన శక్యమే?
    అరుదుగ గానుపించు|మరియాదకులోబడి దానవత్వమున్
    సరియగు మార్గమా?యనెడి సందియ మందగ మానసాన యే
    మరువక యవ్వనంబునకు మంచిని దెల్పగ సాధ్యమే గదా.
    2.అరుదుగనందినయందపు
    .తరుణుల చూపులను దాట ధాతకు వశమే?
    నరులను సృష్టించెడి యా
    తరుణము నందెవ్వ రైన తలచిన ఫలమా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటిపద్యంలో, సమస్యాపాదంలో ఉన్న ధార పద్యంలో మిగిలిన పాదాల్లో కొనసాగ లేదు కదా. ఆలోచించండి. ధారవిషయంలో బాగా కృషి చేయండి. కందంలో మొదటిపాదాఅన్ని తరచుగ నందియు నందని అంటే సొగసుగా ఉంటుందేమో. అందపుతరుణి అన్నది తప్పుసమాసం కదా. ద్వితీయార్థం బాగోలేదు - అన్వయమూ కావటంలేదు పద్యంలో.

      తొలగించండి
  26. వరమో! శుభకరమో! శ్రీ
    కరమో! రసబంధురమగు కావ్యాంతరమో!
    యరులై దొరికెడి ఫలమో!
    తరుణుల చూపులను దాట ధాతకు వశమే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అరులు అన్నది ఒప్పదు వాత్సల్యం అని కదా దాని అర్థం. అరుదైన మంచి ఫలమో అనవచ్చును, కాని వచనం చూసుకోవాలి. తరుణులు బహువచనం కదా, మిగిలిన సరంజామా అంతా ఏకవచనం ఐతే ఎలా?

      తొలగించండి
  27. స్థిరమగు సౌష్టవమ్మునిడి తీరగు రూపమునిచ్చి బ్రహ్మయే
    ధరణికి బంప యంగనలు ధారణ జేసిన భూషణమ్ములున్
    మెరుపులు చిందు వస్త్రములు మేని తళుక్కును బెంపుచేయ నా
    తరుణుల వాలుచూపులను దాటగ ధాతకు నైన శక్యమే!

    రిప్లయితొలగించండి
  28. పరిణయమున తలవంచును
    వరుని గృహము చేరగానె పతిపనులుడుగున్
    స్థిరముగ సూచన లిచ్చెడు
    తరుణులచూపులను దాట ధాతకు వశమే!

    రిప్లయితొలగించండి
  29. చరితను జూడ కాంచనగు చక్కని సామ్యము లెన్నియోభువిన్
    కరమగు యిచ్చతోడుతను కాంచగశక్తి తపమ్ముఁజేయుచున్
    పరిచితమైన కాంతల ప్రభావమ్ముతోడుతఁగ్రుంగరేమునుల్
    తరుణుల వాలుచూపులను దాట ధాతకునైన శక్యమే!

    రిప్లయితొలగించండి
  30. పరమ కులీన విప్రుడొక భామకు బానిస యయ్యె దాసుడై
    స్థిరమతి యయ్యు సజ్జనుడు చేరెను సానిని పాము చేమిరిన్
    మరుని శరమ్ము తాక పరమాత్ముడె మోమును బాసె శాపమై
    తరుణుల వాలుచూపులను దాటఁగ ధాతకునైన శక్యమే

    కురులు విరబోసి కులుకుచు
    మరు మల్లెలు సిగను దాల్చి మన్మధ బాణం
    బురుకంగ ఘన జఘనముల
    తరుణుల చూపులను దాట ధాతకు వశమే

    రిప్లయితొలగించండి
  31. పరువము జూపుచున్ తనదు పైయెద కొంగును జారవేయుచున్
    మరులను బెంచు మల్లెలను మానిని కొప్పున జుట్టి చక్కగా
    పిరుదులు ద్రిప్పుచున్ నడచు ప్రేమ పిపాసుల సుందరాంగమౌ
    తరుణుల వాలుచూపులను దాటఁగ ధాతకునైన శక్యమే!

    రిప్లయితొలగించండి
  32. భరియించరాని కష్టము
    సరగున తొలగించ వాని సరసన తనకున్
    సరిజోడని దరిజేరెడు
    తరుణుల చూపులను దాట ధాతకు వశమే?
    (ధాత = రక్షించువాడు)

    రిప్లయితొలగించండి
  33. తాడిగడప శ్యామలరావు గారూ,
    పద్యకవిత్వాభిమానంతో శ్రమకోర్చి మిత్రుల పద్యాలను సమీక్షిస్తూ తగిన సూచనలిస్తూ ప్రోత్సహింస్తున్న మీకు కృతజ్ఞతాపూర్వక నమస్కృతులు.

    రిప్లయితొలగించండి
  34. అరుపులు లేక భార్యలను హాయిగ నేలుట బ్రహ్మ శక్యమే?
    పరుగులు లేని పద్యములు పాడుట కింపుగనుండ సాధ్యమే?
    మెరుపులు లేక గర్జనలు మేలుగ జేసెడి మేఘముండునే?
    తిరిపెము లేక నెన్నికలు తీరుగ గెల్చెడి పార్టియుండునే?
    తరుణుల వాలుచూపులను దాటఁగ ధాతకునైన శక్యమే?

    రిప్లయితొలగించండి